ప్రెషర్‌ కుక్కర్‌ రెడీ | Abhishek Pictures acquires Pressure Cooker rights | Sakshi
Sakshi News home page

ప్రెషర్‌ కుక్కర్‌ రెడీ

Published Fri, Nov 1 2019 5:35 AM | Last Updated on Fri, Nov 1 2019 5:35 AM

Abhishek Pictures acquires Pressure Cooker rights - Sakshi

ప్రీతి, సాయి రోనక్‌

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్‌ కుక్కర్‌’. సుజోయ్, సుశీల్‌ దర్శకత్వం వహించారు. సునీల్, సుజోయ్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్‌ నామా దక్కించుకున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాన్సెప్ట్‌ నచ్చడంతో డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ మా సినిమా టీజర్‌ను కట్‌ చేశారు.

ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇస్మార్ట్‌ శంకర్, రాక్షసుడు’ వంటి హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన అభిషేక్‌ పిక్చర్స్‌ తాజాగా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు’’ అన్నారు. రాహుల్‌ రామకృష్ణ, రజయ్‌ రోవాన్, తనికెళ్ల, సీవీఎల్‌ నరసింహారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బానెల్, అనిత్‌ మడాడి, సంగీతం: సునీల్‌ కశ్యప్, రాహుల్‌ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement