
సాక్షి, అమరావతి : ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చాలా బావుందని.. అందులో మంచి మెసేజ్ ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. శనివారం ఆయన రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ డైరెక్టర్ సుజయ్ నాకు మంచి మిత్రుడు. తెలంగాణ ఏర్పడిన తరువాత సుజయ్ బెంగుళూరులో ఉంటే కలిసి పనిచేద్దామని నేను ఇక్కడకు రమ్మని చెప్పాను. ఫ్రెష్ ఎనర్జీతో, మంచి మెసేజ్ ఉన్న చిత్రం. ప్రస్తుతం ఇప్పుడు అందరూ డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికాకి పరుగులు పెడుతున్నారు. అదే కథని సినిమాగా తీశాడు సుజయ్. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్థం అయ్యేలా ఉంది. హీరో, హీరోయిన్స్ నటన బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది’ అని అన్నారు.
(చదవండి : ‘ప్రెజర్ కుక్కర్’ మూవీ రివ్యూ)
సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి ('జార్జిరెడ్డి' ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment