
సుశీల్, కేటీఆర్, సుజోయ్, అభిషేక్ నామా
‘‘సుజోయ్ నాకు 15 ఏళ్లుగా తెలుసు. అతని రచనలు, ఆలోచనా విధానం వైవిధ్యంగా ఉంటాయి. ‘ప్రెషర్ కుక్కర్’ సినిమాలో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అని ‘ప్రెషర్ కుక్కర్’ బృందాన్ని అభినందించారు తెలంగాణ ‡రాష్ట్ర మంత్రి, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సాయి రోనక్, ప్రీతీ అస్రానీ జంటగా సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘పరిమిత వనరులతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. డాలర్ డ్రీమ్స్, అమెరికా కోసం పరిగెత్తడం వంటి విషయాలను సహజత్వానికి దగ్గరగా చూపించారు. సుజోయ్, సుశీల్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment