అప్పుడు మంచి సినిమా బతుకుతుంది | Nandini reddy speech at pressure cooker movie prerelease | Sakshi
Sakshi News home page

అప్పుడు మంచి సినిమా బతుకుతుంది

Published Thu, Feb 20 2020 2:36 AM | Last Updated on Thu, Feb 20 2020 2:36 AM

Nandini reddy speech at pressure cooker movie prerelease - Sakshi

సుశీల్, సాయి రోనక్, ప్రీతి, నందినీరెడ్డి, తనికెళ్ల భరణి, సంగీత, క్రిష్, సుజోయ్‌

‘‘మూడు నెలల క్రితం ‘ప్రెజర్‌ కుక్కర్‌’ చూసి, నచ్చింది కానీ చిన్న కరెక్షన్స్‌ చేయాలని చెప్పాను. 3 వారాల క్రితం మళ్లీ చూశాను. సుజోయ్, సుశీల్‌ మంచి సినిమా తీశారనిపించింది. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది హెల్ప్‌ చేయడం వల్ల నేనిప్పుడీ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఈ డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్‌.

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రెజర్‌ కుక్కర్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘బాగున్న సినిమాను చూసినవారు మరో పదిమందికి చూడమని చెబితే మంచి సినిమా బతుకుతుంది. ఈ టీజర్‌ చూసినప్పుడు నా ప్రెజర్‌ కుక్కర్‌ జర్నీ గుర్తుకు వచ్చింది’’ అన్నారు. ‘‘డైరెక్టర్‌ క్రిష్‌ మాకు ఎంతో సహాయం చేశారు.

భవిష్యత్‌లో కొత్తవారికి మేం కూడా ఇలానే చేయాలని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాం. తరుణ్‌ భాస్కర్, ‘మధుర’ శ్రీధర్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకులు. ‘‘అమెరికా వెళ్లిన చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నటి సంగీత, హీరోలు సాయి రోనక్, విశ్వక్‌ సేన్, నిర్మాతలు రాజ్‌ కుందుకూరి, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement