Nandini reddy
-
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట్లో విషాదం
తెలుగులో పలు సినిమాలతో లేడీ డైరక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి తీవ్ర విషాదంలో ముగిగిపోయింది. తన సోదరి చనిపోవడంతో ఎమోషనల్ అవుతోంది. ఇన్ స్టాలో ఈ మేరకు సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు యాక్టర్స్ ఈమెకు సానుభూతి తెలియజేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'మన దగ్గర వాళ్లని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్లలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొదటిసారి అక్క అని పిలిచింది శాంతినే. నాకు తెలిసినంత వరకు చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో ఓ పెద్ద యుద్ధంలో ఆమె పాల్గొంది. గత నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈ రోజు ఆమె టైమ్ వచ్చేసింది. ఆమె ఓ ఉత్తమ కుమార్తె, సోదరి, వైఫ్, తల్లి, బెస్ట్ ఫ్రెండ్. నా డార్లింగ్ చెల్లెలా, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. మరోవైపు మనం కలుసుకునే వరకు' అని నందిని రెడ్డి భావోద్వేగ పోస్ట్ పెట్టింది.అయితే డైరెక్టర్ నందిని రెడ్డి చెబుతున్న దాని ప్రకారం.. ఈమె చెల్లి శాంతి గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఉందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది నందిని రెడ్డి క్లారిటీ ఇస్తే తప్పితే తెలియదు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) View this post on Instagram A post shared by Nandini Reddy (@nandureddyy) -
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘అన్నీ మంచి శకునములే’
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 18న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. (చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!) జూన్17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న అన్ని చిత్రాల్లో తమ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో నిచిలినట్లు చిత్రబృందం పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌లో రికార్డు అవర్స్ స్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా అన్నీ మంచి శకునములే నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 'అన్నీ మంచి శకునములే' కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మే 18న విడుదలై తొలి రోజు నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్స్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది. జూన్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ప్రైమ్ వీడియో ఓ ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ‘అన్ని మంచి శకునములే’ కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. an intense tale of love that challenges a longstanding family rivalry! 🔥#AnniManchiSakunamule, June 17 pic.twitter.com/KGUYq4ZuwO — prime video IN (@PrimeVideoIN) June 15, 2023 -
సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.పాన్ ఇండియా మూవీ ఖుషితో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోని సామ్ తను తర్వాత చేయబోయే సినిమాలై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ తర్వాత సమంత ఓ యంగ్ హీరోతో జతకట్టనుందట. ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరున్న ఆ హీరోతో సామ్ ఓ మూవీ చేయబోతుందని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు సిద్దు. డీజే టిల్లులో సిద్దు యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వన్ మ్యాన్ షోలా డీజే టిల్లు మూవీని ఒంటి చేత్తో హిట్ చేయించాడు సిద్దు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. చదవండి: Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ క్రేజీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాత రామ్ తళ్లూరి ప్లాన్ చేస్తున్నాడ. ఈ ప్రాజెక్ట్‌కి నందినీరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందినిరెడ్డి-సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ మూవీ నుంచి నందిని రెడ్డి, సమంతలు మంచి స్నేహితులయ్యారు. సోషల్ మీడియాలో వారిద్దరు ఎప్పుడూ సరదాగా చిట్‌చాట్ చేసుకుంటుంటారు. దాంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడంతో సమంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్టు టాక్. ఇక స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్దూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే త్వరలోనే తెరపైకి సమంత-సిద్దు కాంబినేషన్ రానుందని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. చదవండి: వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా? -
DJ టిల్లుతో సమంత రొమాన్స్..?
-
‘అన్నీ మంచి శకునములే’మూవీ రివ్యూ
టైటిల్: అన్నీ మంచి శకునములే నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి, గౌతమి, వాసుకి, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ నిర్మాతలు: స్వప్నాదత్, ప్రియాంకా దత్ దర్శకత్వం: నందినీ రెడ్డి సంగీతం: మిక్కీ జే.మేయర్ సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ ఎడిటర్: జునైద్ విడుదల తేది: మే 18, 2023 టాలీవుడ్లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన కళ్యాణం కమనీయం చిత్రం కూడా సంతోష్‌కి సూపర్ హిట్‌ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’అనే చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందల లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాడ్గా నిర్వహించడంలో ‘అన్నీ మంచి శకునములే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు నందినీ రెడ్డి. ఈమె సినిమాల్లో అందరూ మంచి వాళ్లే ఉంటారు. ఓ పెళ్లి సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ని ఎమోషనల్ చేసేందుకు కొన్ని సన్నివేశాలు పక్కా ఉంటాయి. అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రతీ సీన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. పైగా స్లో నెరేషన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో నందినీ రెడ్డి..‘ఈ సినిమాలో అవసరం లేని సీన్స్ ఒక్కటి కూడా ఉండదు’అని చెప్పారు. కానీ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓల్డ్ మూవీస్ పాటలకు పెళ్లిలో ఫ్యామిలీ మెంబర్స్ స్టెప్పులేయడం.. షావుకారు జానకీకి చెందిన సీన్స్.. డాక్టర్ మద్యం సేవించే సీన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ సీరియస్‌గా చేసే కామెడీ, వెన్నెల కిశోర్ ఫన్ సీన్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం రోటీన్‌గా సాగడమే కాదు.. చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా సరిగా పండలేదు. సినిమా చివరి 25 నిమిషాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. ఆరిస్టుల నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు వందశాతం సఫలం అయింది. కానీ కథ,కథనం విషయంలో జాగ్రత్తగా తీసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. ఎలాంటి గోల్స్ లేకుండా.. తండ్రి చేతిలో తిట్లు తింటూ.. ఫ్యామిలీ కోసం మంచి చేసే క్యారెక్టర్ తనది. ఇక అనుకున్నది సాధించే అమ్మాయి ఆర్య పాత్రకు మాళవిక నాయర్ న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేశ్ తమ అనుభవాన్ని తెరపై మరోసారి నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్ పెద్దమ్మగా షావుకారు జానకి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో సోదరిగా నటించిన వాసుకికి గుర్తిండిపోయే సన్నివేశాలేవి లేవు. గౌతమి, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే.మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మినహా మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో బెస్ట్ క్లైమాక్స్: డైరెక్టర్
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. మే 18న విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేశారు. అవి ఆమె మాటల్లోనే.. ⇒ సంతోష్, మాళవికతో పాటు మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యత ఉన్న కథ ఇది. విక్టోరియా పురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏమిటి? లవ్ స్టోరీకి ఏమిటి సంబంధం? ఇలా అన్ని లింక్‌తో ఉంటాయి. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్. ⇒ ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ లో ఉన్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడ చెఫ్ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్ అయింది. కాఫీ ఎస్టేట్, రెండు కుటుంబాలు, నాలుగు జనరేషన్స్, కోర్టు కేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది. ⇒ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాకు రాశాను అనుకుంటున్నా. చివరి 20 నిమిషాలపై నా కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 30 మందికిపైగా బయటివారు, సెన్సార్ వారూ చూశాక ది బెస్ట్ అన్నారు. మీరు సినిమా చూశాక హీరో పాత్రను ప్రేమిస్తారు. ⇒ రచయిత లక్ష్మీ భూపాల్ నా బ్రదర్ లాంటివాడు. ఎమోషనల్ సీన్స్ బాగా రాయగలడు. నా సినిమాకు భూపాల్ ప్రేమతో రాస్తాడు. కథ చర్చించుకున్నప్పుడు అంచనా వేయగలడు. అంత ముందు చూపు ఉంది తనకి. ⇒ విక్టోరియాపురం ఐడియా రైటర్ షేక్ దావూద్‌ది. కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించాలని క్రియేట్ చేశాడు. అలా వచ్చిన కథే ఇది. విక్టోరియాపురం ప్యాలెస్ కునూర్ లో షూట్ చేశాం. ⇒ ఈ సినిమాకు సంగీత దర్శకుడు మిక్కీనే సోల్. ఈ కథ చెప్పినప్పుడు నువ్వే సూపర్ స్టార్ అని చెప్పాను. క్లైమాక్స్ రాసేటప్పుడు ఆ ఫీల్ కు అనుగుణంగా నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో చివరిలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. కానీ భూపాల్ నాలుగు పేజీల డైలాగ్స్ రాశాడు. కథ డిమాండ్ మేరకు ఉంచాం. ⇒ నా నెక్స్ట్ మూవీలో హీరోగా సిద్దు ఫిక్స్. సమంత అనుకోలేదు. ⇒ నాకు స్క్రిప్ట్ ను పూరీ గారిలా స్పీడ్ గా రాయడం కుదరదు. సోలో రచయితగా రాస్తున్నప్పుడు టైం పడుతుంది. అందుకే ఇప్పుడే రచయితల టీమ్‌ను పెట్టుకున్నాను. ఈ సినిమాకు నాకు మంచి స్లాట్ దొరికింది. నాకు పెద్దగా గ్యాప్ అనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యాప్‌లో కథలు రాసుకున్నా. ⇒ ఏ సినిమాకూ మార్నింగ్ షోకు ప్రేక్షకులు రావడంలేదు. నా మొదటి సినిమా అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు మార్నింగ్ షోకు పెద్దగా ప్రేక్షకులు లేరు. తర్వాత మౌత్ టాక్ తో విపరీతంగా వచ్చి చూశారు. ⇒ నా నెక్ట్స్ చిత్రం ఊహించని కథతో రాబోతున్నా. వినూత్నంగా ఉంటుంది. చదవండి: మరోసారి ఆస్పత్రిపాలైన రోహిణి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కంటతడి -
హీరోయిన్ తో డాన్స్ చేసిన సీతారామం హీరో
-
నటి గౌతమి తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
నా లైఫ్ లో ఇంత పెద్ద సినిమా చేయలేదు
-
హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాని
-
అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్
-
‘అన్నీ మంచి శకునములే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మరో మాస్ కాంబినేషన్
-
‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆర్టిస్టులు నటిస్తారు. కానీ మనుషులుగా మనందరం నిత్యం విభిన్నమైన సందర్భాలు, పరిస్థితుల్లో నటిస్తుంటాం. సో.. మనందరం నటులమే. ఇరవయ్యేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను భయపడలేదు. సెట్స్‌లో ఎక్కువగా టేక్స్ తీసుకోకుండానే యాక్ట్ చేశాను. అయినా నా భర్త ఆనంద సాయి (ఆర్ట్ డైరెక్టర్)తో నిత్యం సినిమాలు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నాను’’ అన్నారు వాసుకి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాసుకి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలే ప్రాధాన్యంగా అనిపించాయి. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ప్రస్తుతం ఫారిన్లో మా అమ్మాయి మెడిసిన్ ఫోర్త్ ఇయర్, అబ్బాయి ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దాంతో నాకు ఖాళీ దొరికింది. నేను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. ఇటు నటిగా నాకు నచ్చే, నప్పే పాత్రలు చేస్తాను. ‘అన్నీ మంచి శకునములే’లో సంతోష్ శోభన్‌కు అక్కగా నటించాను. తమ్ముడ్ని సపోర్ట్ చేసే అక్క పాత్ర ఇది. కథ బాగుంటే తల్లిగా చేయడానికి కూడా రెడీ’’ అన్నారు. -
‘అన్నీ మంచి శకునములే’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ సినిమా విలువ నాకు తర్వాత తెలిసొచ్చింది: హీరోయిన్
‘‘ఓ నటిగా నేను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాను. రొటీన్ రోల్స్ అయితే కొత్తగా నేను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతుంటాను’’ అని అన్నారు హీరోయిన్ మాళవికా నాయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా నాయర్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘అన్నీ మంచి..’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రలు చేశాను. కానీ ఈ చిత్రంలో కాస్త కోపంగా, ధైర్యంగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్ర చేశాను. కాస్త హ్యూమర్ కూడా ఉంటుంది. నందినీ రెడ్డిగారు నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నటీనటుల నుంచి ఆమెకు కావాల్సింది రాబట్టుకుంటారు. ‘కల్యాణ వైభోగమే’ తర్వాత నందినీ గారితో మళ్ళీ సినిమా చేయాలని వుండేది. అది వైజయంతీ ఫిల్మ్స్‌తో నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వీకే నరేశ్, వాసుకీగార్ల వంటి అనుభవజ్ఞులైన వారితో నటించడం కొత్త ఎక్స్పీరియన్స్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు అన్నీ మంచి శకునములే అనిపించాయి. ఈ పాత్ బ్రేకింగ్ సినిమా విలువ ఏంటో నాకు తర్వాత తెలిసొచ్చింది. ప్రియాంక, స్వప్నగార్లు నాకు పరిచయం అయ్యింది కూడా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే. ఇండస్ట్రీలో వారు నాకు మెంటర్స్లా ఉంటున్నారు. ఓ నటిగా నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం డెవిల్ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
Anni Manchi Sakunamule: అందమైన బంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న టీజర్
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్‌తో కలిసి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రియాంకా దత్ నిర్మించారు. మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. మార్చి 4న నందినీ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘‘కొండ ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది. అందమైన బంధాలు, భావోద్వేగాలతో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నువ్వు లేకుండా నేనేం చేయగలను?: సమంత
ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి బర్త్‌డే నేడు (మార్చి 4). ఈ సందర్భంగా హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఎంత బాధ ఉన్నా సరే దాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయని నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. బాధగా ఉండాల్సిన సందర్భంలోనూ నవ్విస్తావు. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావు. నువ్వు లేకుండా నేనేం చేయగలను? లవ్ యూ.. హ్యాపీ బర్త్‌డే అంటూ నందినీతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. దీనికి నందిని బిగ్ హగ్స్.. లవ్ యూ సామ్ అంటూ రిప్లై ఇచ్చింది. కాగా సమంత, నందినీ రెడ్డి.. జబర్దస్త్, ఓ బేబీ చిత్రాలకు కలిసి పని చేశారు. సమంత కష్టాలతో సావాసం చేస్తున్న సమయంలో నందిని ఆమెకు అండగా నిలబడిందట! తను ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ మహిళా డైరెక్టర్ సాయం చేసిందని అంటుంటారు. ఇదిలా ఉంటే సామ్ ప్రస్తుతం సిటాడెట్, ఖుషి సినిమాలతో బిజీగా ఉంది. -
Samantha: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఫిటినెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. సమయం దొరికితే గంటలు గంటలు ఆమె జిమ్‌లోనే గడుపుతారు. అంతేకాదు జిమ్ హేవీ వర్క్అవుట్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేసేది. అయితే ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ప్రస్తుతం కోలుకుంటోంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన ఆమె జిమ్‌లో వర్క్ అవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఫిటినెస్ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో పుల్ అప్స్ చేస్తోన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: మాస్ మహారాజా బర్త్‌డే సర్ప్రైజ్.. రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది దీనికి ఆమె.. ‘‘కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన ‘హూ ఈజ్ గ్రావిటీ’ బ్యాండ్‌కు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ కఠినతరమైన డైట్స్‌లో మనం తినే ఆహారం వల్ల బలం రాదని.. మన ఆలోచనా విధానం పైనా అది ఆధారపడి ఉంటుందన్నది నా అభిప్రాయం’’ అని సమంత రాసుకొచ్చింది. ఇక ఈ తాజా వీడియోపై పలువురు సినీ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అంతేకాదు వెంకటేశ్ కూతురు అశ్రిత కూడా సామ్ పోస్ట్‌పై స్పందించింది. ఆమెకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ ఎమోజీలతో కామెంట్స్ చేసింది. చదవండి: కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ అలాగే సుశాంత్ కూడా కామెంట్స్ చేశాడు. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నువ్వు రెండు చేతులా చేస్తుంది.. నేను ఒక్క చేతితో చేస్తున్నాను. నువ్వు ఫీల్ అవుతానే ఆ వీడియో షేర్ చేయలేదు’ అంటూ చమత్కిరంచింది. కాగా సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
నందిని రెడ్డి చేతుల మీదుగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్‌లుక్
నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. -
సమంత పర్సనల్ లైఫ్‌పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Nandini Reddy On Samantha Personal Life Issues: స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఎవరి దారులు వారు చూసుకుంటూ కెరీర్లో అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు సామ్, చై ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఎవరో ఒకరు వీరిద్దరి గురించి వారి సన్నిహితుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమంతకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ', 'జబర్దస్త్' సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కెరీర్, సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. జబర్దస్త్ సినిమా చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాలేకపోవడం, అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో నేను ఆమె పక్కన ఉన్నాను. ఆ సమయంలోనే మేము మరింత సన్నిహితులుగా మారిపోయాం. కానీ ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది.' అని తెలిపింది నందినీ రెడ్డి. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1061263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చై-సామ్ బ్రేకప్.. హీరోయిన్ను వెతికే పనిలో పడ్డ డైరెక్టర్!
టాలీవుడ్ సూపర్ హిట్ పెయిర్స్ లో నాగ చైతన్య, సమంత జోడి ఒకటి. ఏమాయ చేసావే మొదలు వీరిద్దరు నటించిన ప్రతి సినిమా టాలీవుడ్ కు సమ్ థింగ్ స్పెషల్. మనం క్లాసిక్ స్టేటస్ ను అందుకుంది. మజిలీ సూపర్ హిట్ అయింది. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో చాలా కథలు రాసుకున్నారు దర్శకులు. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఓ స్టోరీ రాసుకుందట.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించాల్సిన సమయంలో విడిపోవడంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టుని నాగ చైతన్య తో పట్టాలెక్కించేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో చై, సామ్ కోసం రెడీ చేసిన స్టోరీని తెరకెక్కించనుందట. అయితే సమంత స్థానంలో మరో హీరోయిన్ కు అవకాశం ఇవ్వనుందట.ప్రస్తుతం నందినిరెడ్డి ఆ హీరోయిన్ ను వెతికే పనిలో ఉందని సమాచారం. హీరోయిన్ కన్ఫామ్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్టుని అఫియల్‌గా ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య త్వరలో థ్యాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం దూత పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ పూర్తైన తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించే సినిమా పై చై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. -
సమంత బెస్ట్‌ఫ్రెండ్‌కు ఓకే చెప్పిన నాగ చైతన్య?
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన 'థాంక్యూ', బాలీవుడ్ ఫస్ట్ మూవీ 'లాల్ సింగ్ చద్దా' విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా నాగ చైతన్యకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చై తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సమంత బెస్ట్‌ఫ్రెండ్, డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారట. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నిజానికి ఈ సినిమాను నాగ చైతన్య, సమంతలతో తీయాలని గతంలో నందినీ రెడ్డి ప్లాన్ చేశారట. కానీ వీరి విడాకుల వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌కి కాస్త బ్రేకులు పడ్డాయి. తాజాగా నాగ చైతన్య నందినీ రెడ్డి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. మరి ఇదే నిజమైతే ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. -
నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత
స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పరిశ్రమలో వారిద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అందుకే వారిద్దరు ఎప్పుడు చాలా సరదాగా ఉంటారు. ఇదిలా ఉంటే ఈ రోజు(మార్చి 5) నందిని రెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా సామ్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియ మిత్రమా. నీ మంచితమే నీ గొప్పతనం. నువ్వు నాకు స్ఫూర్తి. నాకింకా గుర్తుంది. అది 2012వ సంవత్సరం. అప్పుడు నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నా. నా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇక నటించనని అనుకున్న సమయంలో నువ్వు నా పక్కనే నిలిచావు.. ప్రతి రోజు నన్ను కలుస్తు నాలో ధైర్యం నింపేదానివి. నీ బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం టైం కేటాయించావు. క్లిష్టపరిస్థితుల్లో నా వెన్నంటే ఉన్నావు. నువ్వు నన్ను చాలా నమ్మావు. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నీకు రాబోయే సంవత్సరాలలో మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సమంత నటించిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలకు నందిని రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహించారు. అంతేగాక ఆహాలో సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ షోకి కూడా నందినినే డైరెక్టర్. సమంత నటించిన పలు యాడ్స్‌కు సైతం నందిని రెడ్డినే డైరెక్ట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు
టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్‌గా అందరి మనసును దోచుకుంది చై-సామ్ జంట. గతేడాది వారు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్న నాగ చైతన్య, సమంత విడాకులు టాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. అందుకు కారణం నాగ చైతన్య, సమంత డివోర్స్‌కు సరైనా కారణం తెలీకపోవడమే. అయితే ఇటీవల వారి ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చై చెప్పుకొచ్చాడు. వీరి విడాకులు వాళ్ల పర్సనల్ అయినా.. చై-సామ్ నిర్ణయంతో ఒక ప్రముఖ డైరెక్టర్ నష్ట పోయినట్లు తెలుస్తోంది. ఆమె ఇంకేవరో కాదు 'ఓ బేబీ' సినిమాతో సామ్‌కు మంచి హిట్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోకముందు, 'ఓ బేబీ సినిమా' సమయంలోనే వీరిద్దరితో ఒక మూవీ తెరకెక్కించాలని నందినీ రెడ్డి ప్లాన్ చేశారట. కథ కూడా అనుకున్నట్లు సమాచారం. ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి కూడా తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారని భోగట్టా. ఇక్కడే ఆమె ప్లాన్‌కు బ్రేకులు పడ్డాయి. సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న నందినీ రెడ్డికి చై-సామ్ విడాకులు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత నాగ చైతన్య, సమంత ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీగా ఉండిపోయారు. ఇప్పటివరకూ వారు కలిసి మాట్లాడుకున్న సంఘటన ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇదంతా చూస్తుంటే చై-సామ్‌తో నందినీ రెడ్డి సినిమా ఆగిపోయినట్లే అని టాలీవుడ్ టాక్. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్‌తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్‌కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా!
'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఓ బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్, గీతా అర్ట్స్ బ్యానర్‌లోనూ సినిమాలు చేసేందుకు నందినీరెడ్డి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’, లాల్ సింగ్ చద్దా సినిమాలతో సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇవి పూర్తయ్యాకే నందినీ రెడ్డితో మూవీ ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో హీరో సంతోష్ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు సమాచారం. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్గా 'ఏక్ మినీ కథ'తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోతోనే నందినీ రెడ్డి తర్వాతి సినిమా ఉండనుందని, త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి : ‘ఏక్ మినీ కథ’ హీరోకు లక్కీ ఛాన్స్.. అదే బ్యానర్లో మరో 3 సినిమాలు -
'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
చాలెంజ్‌గా తీసుకుని చేశాను
‘‘సామ్‌జామ్ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘సామ్‌జామ్’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్‌జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నేను బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేయటం నాగ్‌మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్‌లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఈ ప్లాట్‌ఫామ్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్ కరణ్’, ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలు చేసిన టీమ్‌తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. -
బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్‌గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్‌గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్‌గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్‌లైన్స్‌తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్‌గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్‌కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్‌గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
బుట్టబొమ్మ సారీ చెప్తుందా?
టాలీవుడ్ ప్రముఖ కథానాయుకలు సమంత అక్కినేని, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వివాదం మరింత ముదిరింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గురువారం పూజా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు తన టెక్నికల్ టీం సాయంతో ఖాతాను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సందర్భంలో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ఈమె (సమంత )నాకు పెద్దగా అందంగా కనిపించదు అంటూ కామెంట్ చేశారు హ్యాకర్స్ . ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. (సమంతకు సారీ చెప్పాలి ) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. వెంటనే సమంతకు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద..పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది అంటూ నందనీ కామెంట్ పెడితే, ప్లీజ్ లవ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు అంటూ చిన్మయి వరుస కామెంట్లు పెడుతూ సమంతకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తూ.. ఫెమినిస్ట్ అని చెప్పుకునే తిరిగే చిన్మయి ఇంకో అమ్మాయిపై ఎలా నిందలు వేయగలుగుతుంది అంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందనీరెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు సమంత ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ వరుస ఆరోపణలు చేస్తూ ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వి సపోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. Without knowing the real reason,how could u guys form a group and pass sarcasm on one.Ok...now what this doesn't come under ur so called "feminism" #WeSupportPoojaHegde pic.twitter.com/J4uh7nmQBw — Harshi✨ (@hd_2207) May 28, 2020 -
రీమేక్ కాదు.. కొత్త కథతో...
‘‘ఈ దర్శకుడు ఆ నటుడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట, ఆ కాంబినేషన్ మళ్లీ కలవబోతోందట’’ అనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి నిజమవుతాయి. కొన్నిసార్లు పుకార్లగానే ఉండిపోతాయి. తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత కలసి మళ్లీ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ ఆధారంగా ‘ఓ బేబీ’ తెరకెక్కింది. తాజాగా మరో రీమేక్ కోసం ఇద్దరూ కలిశారనేది ప్రచారంలో ఉన్న వార్త సారాంశం. ఈ వార్తలకు స్పందిస్తూ ట్వీట్ చేశారు నందినీ రెడ్డి. ‘‘నా తదుపరి చిత్రం రీమేక్ కాదు. కొత్త కథతో స్వప్నా సినిమాస్ బ్యానర్లో చేయబోతున్నాను. ఒకవేళ నేను, సమంత కలసి సినిమా చేయాలనుకుంటే చాలా సంతోషంగా, గర్వంగా ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు నందినీ రెడ్డి. -
‘వేట’ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
డల్లాస్/ఫోర్ట్ వర్త్: ‘తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చి.. మీ సినిమా నా జీవితాన్ని మార్చింది అన్నప్పుడు అంతకేంటే ఆనందం, విజయం ఇంకొకటి ఉండదు’అని అలా మొదలైంది, ఓబేబీ, కల్యాణ వైభోగం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నమహిళా దర్శకురాలు నందినిరెడ్డి అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోషియేషన్ (వేట) ఆధ్వర్యంలో డల్హాస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. ‘పవర్ ఆఫ్ ఉమెన్’పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అవకాశం కల్పించిన వేట సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు స్విమ్మింగ్, క్రికెట్ అంటే ఇష్టమని తెలిపారు. అన్య సంస్కృతుల గురించి తెలుసుకోవడం, ప్రయాణాలు చెయ్యడమంటే ఆసక్తి అని పేర్కొన్నారు. ప్రేరణ, శిక్షణ అందించేందుకే.. మహిళల సమతుల్య జీవనానికి, సాధికారతకు కావాల్సిన ప్రోత్సాహం, శిక్షణ, ప్రేరణ అందించడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయురాలు ఝాన్సీరెడ్డి ‘వేట’ జాతీయ తెలుగు సంస్థను 2019 సెప్టెంబర్‌లో స్థాపించారు. వేట ఏ సంస్థకు పోటీ కాదని, ఇది మహిళా సాధికారత కోసం స్థాపించిన సంస్థ అని ఝాన్సీరెడ్డి అన్నారు. ఆధునిక మహిళల జీవితంలో నిత్యం ప్రతిబింబిస్తున్నబహుముఖ ప్రజ్ఞలు ఈ సంస్థ చిహ్నం (లోగో) ద్వారా సుస్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మనందరం ఒక్కటై అవసరమైన ప్రేరణ, శిక్షణ అందించి మహిళా సాధికారతకు పాటుపడాలని ఆకాక్షించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణిరెడ్డి శీలం ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తమ స్వాగతోపన్యాసంలో వివరిస్తూ ఆటా, టాంటెక్స్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్య గవ్వ.. ‘మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ వికాసం అవసరం. మనందరికీ ఎన్నో పనులు చేయగల సామర్థ్యం, అనుకున్నది సాధించాలనే బలమైన కోరిక ఉన్నాయి. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు’అని అన్నారు. 500పైగా హాజరైన ఈ కార్యక్రమానికి అను బెనకట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్నికల్లో భాగస్వాములు కావాలి.. ► ‘పవర్ ఆఫ్ ఉమెన్’పై చర్చ సందర్భంగా టెక్సాస్‌లో ప్రముఖ న్యాయవాది, యూఎస్ఐసీఓసీ అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి అవగాహన పెంచుకొని మహిళలు ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలని అన్నారు. మన నిత్య జీవితంలో ప్రజా ప్రతినిధులు ప్రభావితం చేయగలరని, అందుకే అడుగు అడుగునా ఎన్నికల సమయంలో మీ వంతు కృషి చెయ్యాలని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉద్యోగరీత్యా లింగభేదం లేకుండా కావాలిసిన సలహాలను తీసుకోవాలని సూచించారు. ► రాజకీయాల్లోకి ప్రవేశించడం తన జీవితంలో చాలా కష్టమైన నిర్ణయమని డాలస్ కౌంటీకి చెందిన షెరీఫ్ మెరియన్ బ్రౌన్ అన్నారు. ఎప్పుడూ బలంగా, దృఢంగా, అప్రమత్తంగా ఉంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ‘నా నిర్ణయాల ఫలితాలను నేను స్వీకరించాను, అనుభవిస్తున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను’అని ఆమె పేర్కొన్నారు. అమెరికా రాజకీయాల్లో ఉన్న అతికొద్ది మంది నల్ల జాతీయులలో మెరియన్ బ్రౌన్ ఒకరు. ► ఏఏపీఐ ఉపాధ్యక్షులు, ప్రముఖ పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అనుపమ గోటిముకుల తన చిన్నతనంలో మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ.. ‘తెలియని అంశాల వలన కలిగే భయం పోగొట్టుకోవడం విజయానికి శ్రేయస్కరం’అన్నారు. ► అలనాటి బాలీవుడ్ తార మీనాక్షి శేషాద్రి తన జీవిత అనుభవాలను పంచుకుంటూ.. ‘1981లో మిస్ ఇండియా కైవసం చేసుకుని, 15 ఏళ్ల వ్యవధిలో ఎనభై సినిమాల్లో నటించి, వివాహం అనంతరం అమెరికాలో అడుగుపెట్టినప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మహిళ తన బహుముఖ ప్రజ్ఞ ద్వారా వేసిన పునాది ఎన్నో కుటుంబాలకు, సంబంద బాంధవ్యాలకు మూల స్తంభం కాగలదు’అని అన్నారు. ఓపిక జీవితంలో చాలా అవసరమైన ఆయుధమని, మాతృత్వం మనుగడకు ఇది ప్రధానం అని మీనాక్షి శేషాద్రి చెప్పారు. సన్మానం.. సమన్వకర్త కృష్ణవేణి రెడ్డి శీలం అతిథులు నందినిరెడ్డి, నీల్ గోనుగుంట్ల, షెరీఫ్ మేరియన్ బ్రౌన్, మీనాక్షి శేషాద్రి, డాక్టర్ అనుపమ గోటిముకులను సంప్రదాయ బద్ధంగా పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమం విజయానికి కృషి చేసిన సేవకులు అను బెనకట్టి, లక్ష్మీ పాలేటీ, ఇందు మాందాడి, సురేష్ పఠానేని, మల్లిక్‌రెడ్డి కొండ, అభితేజ్ రెడ్డి, ప్రసన్న దొంగూర్, శ్రీలక్ష్మీ మండిగ, కల్పన గనపురం, మాధవిరెడ్డి, లతా గద్దె, వాణి ద్రోణవల్లి, రాధా బండార్‌ను గుర్తించి సత్కరించారు. మహిళ-2020 సంచిక ఆవిష్కరణ సమన్వయకర్త కృష్ణవేణి రెడ్డి శీలం ప్రముఖ మహిళా సేవకులు, నాయకులు డాక్టర్ సంధ్య గవ్వ, డాక్టర్ కస్తూరి ఇనగంటి, డాక్టర్ కిరణ్ కంచెర్ల, డాక్టర్ శ్రీదేవి జువ్వాడి, డాక్టర్ సుధారెడ్డి, ఇందు మందాడి, గీతా దమ్మన్న సమక్షంలో మహిళ-2020 ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు. ఇటీవలే డల్లాస్ మహానగర ప్రాంతంలో క్యాన్సర్ బారినపడి పునర్జన్మ పొందిన ఒక బాలుడికి బోన్ మ్యారో అందించిన స్థానిక తెలుగు వైద్యులు డాక్టర్ ప్రశాంతి గణేశ్‌ను వారు అభినందించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. తీప్తి నీరజ నేడూరి సమర్పించిన పుష్పాంజలి శాస్త్రీయ నృత్యం, కూచిపూడి కళాక్షేత్ర అధినేత్రి పద్మ శొంఠి దర్శకత్వంలో అందించిన ‘తిరు తిరు జవరాల’ జానపద శాస్త్రీయ నృత్యం, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య దర్శకులు స్వప్న గుడిమెట్ల అందించిన ‘అలిగిరి నందిని’ శాస్త్రీయ మిశ్రమ నృత్యం, సాయి నృత్య అకాడెమీ డీఎఫ్‌డబ్ల్యూ నుంచి శ్రీదేవీ యడ్లపాటి దర్శకత్వంలో అందించిన ‘లార్డ్ శివ’ శాస్త్రీయ నృత్యం, కీర్తి చంకూర పాడిన మహిళా దేశభక్తి గేయం, వీణ యలమంచిలి, పూజిత కడ్మి శెట్టి, ప్రభాకర కోట పాడిన ‘మధుర గీతాలు’, ఝాన్సీ చంకూర సమర్పించిన ‘మూవీ మెడ్లీ సాంగ్స్, తీప్తి నీరజ నేడూరి దర్శకత్వంలో అందించిన ‘అల వైకుంఠపురం పాటలు’, సుధారెడ్డి సమర్పించిన ‘మూవీ సాంగ్స్ ఫ్రం ఓ బేబీ’ అందరినీ ఆకట్టుకున్నాయి. శాంతి నూతి నేతృత్వంలో నిర్వహించిన ‘టాలీవుడ్: తారలు దిగి వచ్చిన వేళ’, నహీద్ రాముల్ దుస్తులతో, లెచిక్ బొటిక్ సహకారంతో మీనాక్షి శేషాద్రి అందమైన వస్త్రాభరణాలతో అత్యంత సుందరంగా ప్రదర్శించిన ‘ఫ్యాషన్ షో’ కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. మీడియా మిత్రులకు, చక్కని ఆడియో, వీడియో, లైటింగ్ అందించిన ఫుల్ హౌజ్ మీడియా సురేష్ పఠానేనికి, సభా ప్రాంగణాన్ని, వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించిన లిటిల్ జెమ్స్ ప్రత్యూషకు, ఫోర్ పాయింట్స్ పెరటాన్కు చెందిన సారా, అరుణ్ విట్టకు, జాతీయ/ప్రాంతీయ తెలుగు సంస్థలైన ఆటా, నాటా, నాట్స్, డాటా, దారా, ఐఏఎన్టీ, టాంటెక్స్వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పుడు మంచి సినిమా బతుకుతుంది
‘‘మూడు నెలల క్రితం ‘ప్రెజర్ కుక్కర్’ చూసి, నచ్చింది కానీ చిన్న కరెక్షన్స్ చేయాలని చెప్పాను. 3 వారాల క్రితం మళ్లీ చూశాను. సుజోయ్, సుశీల్ మంచి సినిమా తీశారనిపించింది. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది హెల్ప్ చేయడం వల్ల నేనిప్పుడీ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఈ డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘బాగున్న సినిమాను చూసినవారు మరో పదిమందికి చూడమని చెబితే మంచి సినిమా బతుకుతుంది. ఈ టీజర్ చూసినప్పుడు నా ప్రెజర్ కుక్కర్ జర్నీ గుర్తుకు వచ్చింది’’ అన్నారు. ‘‘డైరెక్టర్ క్రిష్ మాకు ఎంతో సహాయం చేశారు. భవిష్యత్‌లో కొత్తవారికి మేం కూడా ఇలానే చేయాలని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాం. తరుణ్ భాస్కర్, ‘మధుర’ శ్రీధర్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు. ‘‘అమెరికా వెళ్లిన చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నటి సంగీత, హీరోలు సాయి రోనక్, విశ్వక్ సేన్, నిర్మాతలు రాజ్ కుందుకూరి, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు మాట్లాడారు. -
వెబ్‌లో అడుగేశారు
నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్ స్టోరీస్’. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చే స్తారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్ నటిస్తున్నారు. -
‘ఓ బేబీ’ని సీక్రెట్‌గా చూసిన సమంత
సెలబ్రెటీలు బయట కనిపిస్తే అభిమానులు చేసే హంగామా గురించి తెలిసిందే. అలాంటిది ఓ పెద్ద సినిమా రిలీజైతే అక్కడి థియేటర్‌కు హీరో, హీరోయిన్లు వెళ్లే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా విడుదలైన ఓ బేబీ చిత్రం పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ సమయంలో ఓ థియేటర్‌కు సీక్రెట్‌గా వెళ్లి సినిమాను వీక్షించినట్లు సమంత ట్వీట్ చేశారు. తాను ఎవరకీ తెలియకుండా సినిమాను చూశానని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘ దేవీ థియేటర్లో ఓ బేబీ చిత్రాన్ని ఎవరికీ తెలియకుండా చూశాను. సినిమా చేస్తున్న ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూడాలంటే ఆ మాత్రం చేయాలి. ఇదే నా స్ఫూర్తి. థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, నాగశౌర్య ప్రధాన పాత్రల్లో నటించారు. #OhBaby Visited #Devi today without anyone knowing . The sound of laughter from the audience makes everything worth it .. this is everything .. my inspiration . Thankyou ❤️ #singlescreen #euphoria — Baby Akkineni (@Samanthaprabhu2) July 6, 2019 -
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
-
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓ బేబీ జానర్ : ఫాంటసీ కామెడీ డ్రామా తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్, తేజ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : నందినీ రెడ్డి నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యూన్వూ థామస్ కిమ్ పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్టైనింగ్ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బేబీ పాత్రలో సమంత మెప్పించారా? కథ : సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి తరువాత సక్సెస్ వేటలో వెనుకపడ్డారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత సమంత ప్రధాన పాత్రలో కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్ లేడీ ఓరియంటెడ్ సినిమాల తరహాలో కాకుండా ఓ ఫన్ రైడ్‌లా సినిమాను తెరకెక్కించిన నందిని సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సూపర్బ్‌గా వర్క్ అవుట్ అయ్యింది. తొలి భాగాన్ని ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకురాలు ద్వితీయార్థం ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో నడిపించారు. ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గటం, కథనం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సాగడంతో సెకండ్ హాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. సినిమాకు మరో ప్రధాన బలం లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు. డైలాగ్స్ నవ్వులు పూయిస్తూనే, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడనే చెప్పాలి. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కపాట కూడా లేకపోవటం నిరాశపరిచే అంశమే. నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్ఫుల్గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌కు కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత పర్ఫామెన్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాప్ లెంగ్త్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
కటౌట్ పెట్టి అంచనాలు పెంచేశారు
‘‘ఓ బేబీ’ చిత్రం కోసం హైదరాబాద్‌లో నా కటౌట్ పెట్టడం సంతోషంగా ఉన్నా టెన్షన్‌గానూ ఉంది. నేను నటించిన ‘యు టర్న్’ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ, కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ముఖ్యం. ఇందాక ఇంటి నుంచి వస్తున్నప్పుడు చైతూతో (నాగచైతన్య) ఇలా చెప్పా.. ‘కటౌట్లు పెట్టి అంచనాలు పెంచేస్తున్నారు, ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే నేను పారిపోతా అని చెప్పాను (నవ్వుతూ)’’ అన్నారు సమంత. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత పంచుకున్న విశేషాలు. ► నా కెరీర్లో ‘ఓ బేబీ’కి చేసినంత ప్రమోషన్ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎక్కువ మంది చూడాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్ చేస్తున్నా. నా గత సినిమా ‘మజిలీ’ ప్రమోషన్ కూడా నా బాధ్యతగా అనిపించింది. పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి చేశా. ‘ఓ బేబీ’ పూర్తి బాధ్యత నాపై ఉండటం కొంచెం భయంగా ఉంది. అయితే సినిమాపై నమ్మకం ఉంది. ► సాధారణంగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రమే నేను తిరుమలకి వెళ్లేదాన్ని. కానీ, తొలిసారి నా సినిమా కోసం యూనిట్‌తో కలిసి తిరుమల వెళ్లొచ్చాను. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఎంతవరకూ ఉంటాయన్నది తెలియదు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలకైతే ప్రేక్షకులే థియేటర్‌కి వచ్చేస్తారు. కానీ, ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం చిన్న విషయం కాదు. థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ► ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామాలకు ఉన్న రిథమ్ నాకు బాగా తెలుసు. కానీ, కామెడీ రిథమ్ తెలియదు. కామెడీ చూడటం, నవ్వడం తేలికే. కానీ చేయడం చాలా కష్టం. ‘అఆ’ చిత్రంలో కొంచెం ట్రై చేశా. కానీ, ఈ సినిమాలో వినోదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్‌గారు నాకు చాలా బాగా నేర్పించారు. నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. ఈ సినిమాలో బామ్మగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలు ఎలా ఉంటారని పరిశీలించాను. ► నందినీరెడ్డి ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. సామర ్థ్యం ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. మేల్ డైరెక్టరా? ఫిమేల్ డైరెక్టరా? అన్నది ముఖ్యం కాదు. జండర్ తేడాలు భవిష్యత్తులోనైనా రావనే అనుకుంటున్నా. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదని, ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ► ‘ఓ బేబీ’ క్లైమాక్స్ సీన్‌ని చాలా కష్టపడి చేశా. ఎమోషనల్ సీన్స్ ఈజీగా చేసేదాన్ని. కానీ, రావు రమేశ్‌గారు నా కొడుకు పాత్ర చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదు. నా కెరీర్ మొత్తంలో ఒక ఏడుపు సీన్ కోసం రెండు గంటలు బ్రేక్ తీసుకుని, ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఇది. ► ప్రెగ్నెన్సీ విషయం గురించి అడగడంలో తప్పు లేదు? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల, నా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఈ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేది కాదేమో? ఇలాంటి ఎన్నో విషయాలను ఆలోచింపజేసే సినిమా ఇది. ► శేఖర్ కమ్ములగారు హీరోయిన్లను చూపించే తీరు బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. మణిరత్నం సార్ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. నాకు దర్శకత్వం ఆలోచనలు మాత్రం లేవుగానీ, మహిళాప్రాధాన్యం ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తా. ప్రస్తుతం ‘96’ సినిమా సెట్స్ మీద ఉంది. ‘మన్మథుడు 2’ లో చిన్న పాత్ర చేశాను. -
మా ఇద్దరి ఒప్పందం అదే
‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్‌ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. ► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్‌గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్‌తో కవర్ చేసేశారు. ► ఆర్టిస్ట్‌కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం. ► రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను. ► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్‌గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ). ► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్‌కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం. ► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ని కూడా ట్రై చేస్తానేమో? ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం. -
‘బేబీ ముసల్ది కాదు.. పడుచు పిల్ల’
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ ఓ బేబీ. 70 ఏళ్ల మనిషి తిరిగి 23 ఏళ్ల యువతిగా మారితే తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కతున్న ఈసినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు కామెడీ ఎంటర్టైనర్గా మాత్రమే ఓ బేబీని ప్రమోట్ చేశారు. కానీ తాజా ట్రైలర్లో సినిమాలోని ఎమోషనల్, రొమాంటిక్ కంటెంట్‌ను కూడా చూపించారు. సమంత నటన సినిమాగా హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. సినిమాలో అడవి శేష్, జగపతి బాబు కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న విషయాన్ని ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు’
పెళ్లి తరువాత డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సమంత, మరో చాలెంజింగ్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రంగస్థలం, యూటర్న్, మజిలి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సామ్, ఓ బేబి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సీనియర్ లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!
పెళ్లి తరువాత రూట్ మార్చిన సమంత ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మజిలిలో నటిస్తున్న ఈ బ్యూటీ నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రానికి ఓకె చెప్పింది. ఈ సినిమా సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనుందన్న టాక్ గట్టిగా వినిపించింది. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ముందుగా ఈ సినిమాలో వృద్ధ మహిళ పాత్రను కూడా తానే చేయాలని భావించిన సమంత ఇప్పుడు నో చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే ఏజ్డ్లుక్లో కనిపిస్తే కెరీర్ పరంగా నష్టం జరుగుతుందన్న ఆలోచనతో కేవలం యంగ్ లుక్ లో మాత్రం నటించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఏజ్డ్ రోల్ కోసం సీనియర్ నటి లక్ష్మీని తీసుకున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో యువ కథానాయకుడు నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడు. -
‘ఓ బేబీ.. ఎంత సక్కగున్నవే’
సమంత కెరీర్ పెళ్లికి ముందు పెళ్లి తరువాత అన్నట్టుగా సాగుతుంది. గతంలో గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసిన సామ్ పెళ్లి తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది. యు టర్న్, రంగస్థలం లాంటి సినిమాలు నటిగా సమంత రేంజ్‌ను పెంచాయి. తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ ‘మిస్ గ్య్రానీ’ చిత్రాన్ని సమంతతో రీమేక్ చేయనున్నారట. ఈసినిమాలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా, 20 ఏళ్ల అమ్మాయిగా రెండు వేరియేషన్స్‌లో కనిపించనుంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటిస్తున్న సామ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే నందిని రెడ్డి సినిమాలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈసినిమాకు ‘ఓ బేబీ.. ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సరికొత్త సవాల్!
‘‘చాలా ఆసక్తికరమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాను. ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడుతున్నానని నా మనసుకి అర్థమవుతోంది. చాలా చాలా నెర్వస్‌గా కూడా అనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఏ సవాల్‌నూ నేను స్వీకరించకుండా ఉండలేదు. చాలాసార్లు మీ గురించి మీరు ఆలోచించినదాని కంటే మీరు బలవంతులు. కొత్త ప్రయాణం మొదలైంది’’ అని తానెంత స్ట్రాంగ్ హింట్ ఇస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు సమంత. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె కథానాయికగా రూపొందనున్న ఓ లేడీ ఒరియేంటెడ్ సినిమా కోసమే పై మాటలను సమంత చెప్పారని తెలుస్తోంది. ఇది కొరియన్ మూవీ మిస్.గ్రానీకి రీమేక్. ఈ చిత్రం కోసం సమంత కరాటే నేర్చుకుంటున్నారట. ఇంతకుముందు తమిళ చిత్రం ‘సీమరాజా’ కోసం ఆమె కర్ర సాము నేర్చుకున్నారు. -
9 మంది ప్రముఖుల చేతుల మీదుగా..!
తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ మూవీ ‘హవా’. ఇటీవల రానా చేతుల మీదుగా విడుదల చేసిన ఈసినిమా మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి 9 మంది సినీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిని రెడ్డి, బీవీయస్ రవి, మధురా శ్రీధర్, వేణు ఊడుగుల, రాజ్ కందుకూరి, జానీ మాస్టర్లు కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. -
భామనే.. బామ్మనే!
సమంత.. అందాల భామ. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అయిపోతారు. ‘ఎంత సక్కగున్నవే..’ అంటూ పాట పాడేసుకుంటారు. ఇప్పుడు ఈ అందాల భామ.. బామ్మగా మారబోతున్నారట. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో కొరియన్ మూవీ ‘మిస్ గ్య్రానీ’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అనూహ్య సంఘటనలతో 70 ఏళ్ల బామ్మ 20 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారింది? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, భామగా ఆ బామ్మ పడ్డ కష్టాలు ఏంటి? అన్న కథాంశమే ఈ చిత్రకథ. ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించే సాహసం చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
సమంత సినిమాలో నాగశౌర్య
ఛలో సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత మరోసారి తడబడ్డాడు. వరుసగా అమ్మగారిళ్లు, కణం, నర్తనశాల సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడట. నందినీ రెడ్డి చివరి సినిమా కళ్యాణ వైభోగమేలోనూ నాగశౌర్యే హీరోగా నటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత నందిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లేడీ డైరెక్టర్‌తో సమంత!?
సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే సమంత ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూ టర్న్ చిత్రాలతో హిట్ కొట్టిన సమంత.. నెక్ట్స్ భర్త చైతో కలిసి ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చైతూ, సమంతల పెళ్లి రోజు (అక్టోబర్ 6)న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే సమంత మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సామ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందినీ రెడ్డి స్క్రిప్టుకు ఇంప్రెస్ అయిన సామ్.. ఈ చిత్రంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. కాగా 2013లో నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘జబర్దస్త్’ సినిమాలో సామ్ నటించిన సంగతి తెలిసిందే. -
బామ్మగా సమంత..?
పెళ్లి తరువాత సమంత సినిమాల ఎంపికలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాగచైతన్యతో వివాహం తరువాత రంగస్థలం, అభిమన్యుడు సినిమాలతో ఘన విజయం అందుకున్న సామ్, ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఓకె చెపుతున్నారు. ఇప్పటికే కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న యు టర్న్ లో నటిస్తున్న సామ్, మరో డిఫరెంట్ మూవీ కి ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నారట. 2014లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షాంటసీ జానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం యు టర్న్, సీమరాజా, సూపర్ డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత త్వరలో నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారు. -
‘గ్యాంగ్ స్టార్స్’లో జగ్గుభాయ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ నటుడు జగపతిబాబు డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రానా లాంటి ఫాంలో ఉన్న యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా జగపతిబాబు కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టార్స్ వెబ్ సిరీస్‌లో జగపతిబాబు గూండా కృష్ణదాస్ పాత్రలో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ‘దడ’ ఫేం అజయ్ భుయాన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్, నవదీప్, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జూన్ 1న తొలి ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. -
వెబ్ సిరీస్‌లలో యంగ్ హీరోలు
-
ఇప్పుడు హీరోగా!
విజయ్ దేవరకొండ కెరీర్ దూసుకెళ్తోంది. ఆల్రెడీ హీరోగా రెండు ప్రాజెక్ట్స్ (నోటా, డియర్ కామ్రేడ్)తో బిజీగా ఉన్న విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘అలా మొదలైంది’ ఫేమ్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుందట. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లో చేసిన ఇంపార్టెంట్ రోల్ విజయ్ దేవర కొండను బాగా పాపులర్ చేసింది. అదే బేనర్లో ఇటీవల విడుదలైన ‘మహానటి’ సినిమాలో కీలక పాత్ర చేశారు విజయ్. ఇప్పుడీ బేనర్లో హీరోగా నటించనుండటం విశేషం. విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. -
ఇక కెమెరా సాక్షిగా ఆడిషన్స్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమాల్లో వివిధ శాఖలకు సంబధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. పరిశ్రమలోని అన్ని శాఖలూ ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలను అమలుపరచాలనుకుంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత పి. కిరణ్, నిర్మాత ముత్యాల రాందాస్, దర్శకులు ఎన్. శంకర్, నందినీరెడ్డి పాల్గొని, తాము తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ► సెక్సువల్ హెరాస్మెంట్ నియంత్రించడానికి ఏర్పాటు చేస్తున్న ‘క్యాష్’ కమిటిలో 50 శాతం చిత్రపరిశ్రమవారు, 50 శాతం ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండాలి. డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు అందులో మెంబర్లుగా ఉంటారు. ► ప్యానల్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధల రూపకల్పనకు న్యాయ సలహాలు తీసుకుంటాం. ► మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమ వివిధ సంస్థలకి గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి. ఓ మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి. సమాచార సాధనాల్లో భాషను సక్రమంగా వాడేలా చూడాలి. ► 24 క్రాఫ్ట్స్‌లోని మహిళల సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించేందుకు మహిళలందర్ని ఒక చోట కలిపి వర్క్ షాప్ ఏర్పాటు చేయబోతున్నాం. ► లైంగిక వేధింపుల పై ఏర్పాటు చేయనున్న ప్యానల్లో ‘షీ’ టీమ్‌లో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుంది. దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ► ఈ–మెయిల్/పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్లు ఛాంబర్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ► మోడలింగ్ కో–ఆర్డినేటర్స్‌కు సరైన లైసెన్సింగ్/అర్హతలు ఉండేలా చూస్తాం. ► కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించాలనే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకునే వీలుంటుందని సమావేశంలో ప్రముఖులు తెలిపారు. -
వెబ్ సిరీస్‌లో మరో యంగ్ హీరో
ప్రవీణ్‌సత్తారు డైరెక్షన్లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన సీనియర్ నరేశ్, సిద్ధు జొన్నలగడ్డల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందినిరెడ్డి అందించిన కథతో ‘దడ’ డైరెక్టర్ అజయ్ భుయాన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ కథను ముందుగా పూర్తి స్థాయి సినిమాగా తీయాలనుకున్నా...నిడివి ఎక్కువ అవుతుందని వెబ్ సిరీస్ ఆలోచన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు సెలబ్రెటీలకు మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడనీ, సిరీస్ మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందనీ, పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, హరితేజ (బిగ్‌బాస్ ఫేం) నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో దర్శకుడిగా సక్సెస్ సాధిస్తానని అజయ్ భుయాన్ నమ్మకంగా ఉన్నాడు. -
స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సీరీస్ల హవా నడుస్తుంది. మెగా వారసురాలు నిహారిక స్టార్ట్ చేసిన వెబ్ సీరీస్ ట్రెండ్‌ను ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఫాలో అవుతున్నారు. వెండితెర మీద సక్సెస్ కావాలనుకునే వారితో పాటు సక్సెస్ కాలేకపోయిన వారు కూడా వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక కళాకారులు వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకోగా ఇప్పుడు స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. అలామొదలైంది, కళ్యాణ వైభోగమే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి కథతో నటుడు శశాంక్ దర్శకత్వంలో ఓ వెబ్ సీరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సీరీస్‌ను దాదాపు 25 ఎపిసోడ్స్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్‌లో హీరో రాహుల్ రవీంద్రన్, ఆదిత్ ఈశ్వరన్‌లతో పాటు హీరోయిన్ తేజస్వీ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు
మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాలను వరుసగా నిర్మిస్తున్న హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రమ్ భాగస్వామి అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే త్వరలోనే త్రివిక్రమ్ తన సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ నిర్మాతగా నందినీ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా ఓ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య డైరెక్షన్లో నితిన్ హీరోగా సినిమాను నిర్మిస్తున్నాడు. అదే సమయంలో అవసరాల శ్రీనివాస్తోనూ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. -
మాటల మాంత్రికుడి మరో అవతారం
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు గా ఉన్నవారందరూ నిర్మాణ రంగంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూరి జగన్నాథ్, సుకుమార్ లాంటి దర్శకులు నిర్మాతలుగా మారి వరుస సినిమాలు ప్లాన్ చేస్తుండటంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల 'అ..ఆ..' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అదే సమయంలో నిర్మాతగా మారీ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా కథను ముందుగా నిర్మాత రాధాకృష్ణకు వినిపించారు. అదే సమయంలో అక్కడ ఉన్న త్రివిక్రమ్‌కు కథ బాగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఆ రెండు సినిమాలు పూర్తవ్వగానే నందినీ రెడ్డి దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మించబోయే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. -
విజయ్ మరో ఛాన్స్ కొట్టేశాడు
లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, తరువాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పెళ్లిచూపులు సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న విజయ్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ఆఫర్ విజయ్‌ని వెతుక్కుంటూ వచ్చింది. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రెడ్డి, తరువాత కాస్త తడబడినా ఇటీవల కళ్యాణ వైభోగమే సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కూడా కళ్యాణ్ వైభోగమే ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తవ్వగానే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మొదలు పెడతాడు విజయ్. -
‘కళ్యాణ వైభోగమే’ చిత్ర యూనిట్ సందడి
విజయవాడ(గాంధీనగర్) : ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర విజయం...ప్రేక్షకుల విజయమని చిత్ర కథానాయకుడు నాగశౌర్య అన్నారు. శ్రీరంజిత మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన కళ్యాణ వైభోగమే చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ సభ్యులు బుధవారం శకుంతల థియేటర్‌కు విచ్చేశారు. ప్రేక్షకులను కలిసి చిత్ర విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగశౌర్య మాట్లాడుతూ తాను విజయవాడ నగర వాసినేనన్నారు. తాను ఇదే థియేటర్లో తన అభిమాన నటుల సినిమాలు చూసేవాడినన్నారు. హీరోగా ఇక్కడికి రావడం, తనను ప్రేక్షకులు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రదర్శకులు బి.వి.నందినిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమన్నారు. చిత్ర విజయానికి కారకులైన ప్రేక్షకులను అభినందించారు. ప్రేక్షకుల ఆదరణే తమకు ఉత్సహాన్నిస్తుందన్నారు. చిత్రం తాము ఆశించినదానికంటే విజయవంతమైందన్నారు. రాబోయే చిత్రాలను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా చిత్రపంపిణీదారులు మిక్కిలినేని సుధాకర్, థియేటర్ ఎఎల్ఎస్ఆర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక
ప్రముఖ హోమియో వైద్య సంస్థ ‘హోమియోకేర్ ఇంటర్నేషనల్’ సోమవారం హైదరాబాద్‌లో ‘బేబీ షో’ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటి మందికి పైగా జీవితాల్లో ఆరోగ్యం, ఆనందాలను నింపినందుకు ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో హోమియోకేర్ సంస్థ ‘1 క్రోర్ స్మైల్స్.. అండ్ స్టిల్ కౌంటింగ్’ పేరుతో ఒక అధికార లోగోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ సంతానలేమి లోపాలకు సంబంధించిన వైద్య చికిత్సలపై 30% డిస్కౌంట్‌ను ప్రకటించింది. చిత్రంలో లోగోను ఆవిష్కరిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, కథానాయకుడు నాగశౌర్య తదితరులు. -
జెండర్‌ని బట్టి అంచనా వేయడం తప్పు!
ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్స్ ఉంటాయి. అయితే, లేడీ డెరైక్టర్ని కావడం నాకు ఎడ్వాంటేజ్, డిజ్ ఎడ్వాంటేజ్ - రెండూ అయింది. నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ ఉండకపోవడం’ ఒక ఎడ్వాంటేజ్. అమ్మాయిని కాబట్టి, ఏ డాక్యుమెంటరీ కథో, లేడీ ఓరియంటెడ్ కథో చెబుతాననుకొంటారు. అయితే, కొంచెం మంచి కథ చెప్పినా, భలే చెప్పిందనుకుంటారు. అది ప్లస్ పాయిం టని సురేశ్‌బాబు అన్నారు. ఏది ఎలా ఉన్నా, కొండ ఎక్కాలి తప్పదు అనుకుంటే అందులో వచ్చే కష్టనష్టాల గురించి ఆలో చిస్తూ కూర్చోకూడదు. నేను ట్రెక్కింగ్‌కు వె ళ్లినప్పుడు ఫస్ట్ రోజు కొండ ఎలా ఎక్కాలా అని భయపడ్డా. కానీ ‘ఎక్కాలి, తప్పదు’ అనుకున్నాక, ఎప్పుడూ తరువాత వేసే నాలుగు అడుగుల మీదే దృష్టి పెట్టేదాన్ని. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులు అనుకుంటూ ముందుకెళ్ళేదాన్ని. అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు పడని కష్టం లేదు. చుక్కలు చూశా. నా మొదటి సినిమా ‘అలా మొదలైంది’ (2011) నిర్మాణం, రిలీజ్‌కి కూడా అంతే! ఆ సినిమా రిలీజయ్యాక ఊహించని సక్సెస్ అవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఇప్పుడు మూడో సినిమా ‘కళ్యాణ వైభోగమే’ సక్సెస్ అయింది. ఏ ఫీల్డ్ అయినా టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. జెండర్‌తో ముడిపడిన వ్యవహారం కాదు. ప్రతిభను స్త్రీనా, పురుషుడా అనే జెండర్‌ను బట్టి అంచనా వేయడం తప్పు. ఒక వ్యక్తి ఓ స్థాయికి రీచ్ అయ్యాడంటే అతను పడిన కష్టాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మానేసి మనం జెండర్ ఒకటే చూస్తాం! జెండర్ బట్టి మహా అయితే టెంపర్మెంట్ డిసైడ్ అవుతుంది. అంతే! ‘వాళ్లు అమ్మాయిలు కాబట్టి సాఫ్ట్’ అని అంటూ ఉంటారు. కానీ, బేసిగ్గా మనస్తత్వానికీ, జెండర్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు. ఇంటిని మొత్తం మేనేజ్ చేసే ఆడవాళ్లకి సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్లూ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాంప్లికేషన్స్ అనేవి నువ్వు ఎలా వాటిని ఫేస్ చేయగలుగుతున్నావనేది పాయింట్ గానీ అక్కడ జెండర్ ఉండదు. నా మటుకు నేను -కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే -ఒక పని జరగాలీ అంటే, అందరినీ గట్టిగా పిలుస్తూ, అరుస్తూ, హుషారెత్తిస్తూ నేనూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తా. ఇతరుల మీద ఆధారపడను. పని జరగడం ముఖ్యమే తప్ప, ఎవరు చేశారన్నది కాదు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేసేస్తా! నన్నడిగితే, ఇంకొన్నేళ్లలో ‘లేడీ డెరైక్టర్స్’ అనే మాటే ఉండదు. కేవలం ‘డెరైక్టర్’ అనేదే ఉంటుంది. ఇప్పటికే ఆ మార్పు వచ్చేస్తోంది. ఇవాళ ఇండియాలో అగ్రశ్రేణి డెరైక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో గౌరీ షిండే, అంజలీ మీనన్, జోయా అఖ్తర్ లాంటి మహిళల పేర్లు ఉన్నాయి. - నందినీ రెడ్డి, సినీ దర్శకురాలు (‘అలా మొదలైంది’, ‘కళ్యాణ వైభోగమే’ ఫేమ్) -
ఈ కళ్యాణం... కమనీయం
కొత్త సినిమా గురూ! పెళ్లనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధుర ఘట్టం. పైగా భారతీయ వివాహ వ్యవస్థకో విశిష్ఠత కూడా ఉంది. ఈ వ్యవస్థ గొప్పదనాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి. ‘సీతారామకల్యాణం’, ‘పెళ్లిపుస్తకం’, ‘మురారి’... ఇలా ఎన్నో సినిమాల్లో వివాహం అనేది జీవితంలో ఎంత అద్భుతమైన ఘట్టమో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా నందినీ రెడ్డి కూడా కళ్యాణ వైభోగాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘కళ్యాణ వైభోగమే’. కథేంటంటే... 23 ఏళ్ల శౌర్య (నాగశౌర్య) గేమింగ్ డిజైనర్. మిలియన్ డాలర్ కంపెనీ పెట్టి యూఎస్‌లో సెటిలైపోవాలన్నది డ్రీమ్. పెళ్లంటే నూరేళ్ల మంట అని అతని అభిప్రాయం. అందుకే అమ్మ (ఐశ్వర్య), నాన్న(రాజ్ మాదిరాజు)లు పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటాడు. అయినా ఓ రోజు తప్పక పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ దివ్య (మాళవికా నాయర్)ను చూస్తాడు. ఇద్దరికీ విడిగా మాట్లాడుకునే అవకాశం ఇస్తారు పెద్దలు. నాకీ పెళ్లి ఇష్టంలేదని ఆమె మొహం మీదే చెప్పేస్తాడు. దివ్వకు కూడా అదే అభిప్రాయం. పెళ్లికి ముందు తల్లిదండ్రుల మాట... పెళ్లయ్యాక భర్త మాట వింటూ ఉండే భార్యలా.. తన కళ్ల ముందు కనిపించే అమ్మ (రాశి)లా ఉండకూడదు, ఇంకా ఏదో సాధించాలని తన ఫీలింగ్. ఇష్టం లేని పెళ్లిని ఆపడానికి శౌర్య, దివ్య తమ పెద్దలకు ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పి, ఎలాగోలా పెళ్లి సంబంధాన్ని తప్పిస్తారు. అది తప్పిపోయినా పెద్దలు మాత్రం ఇద్దరికీ పెళ్లి సంబంధాల వేటలో ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో శౌర్య, దివ్యలు ఓ రెస్టారెంట్లో కలుస్తారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌తో విడిపోవచ్చని వారి ప్లాన్. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అక్కడనుంచి మొదలవుతుంది అసలు కథ. వాళ్ల ఉద్దేశం. వాళ్లు అనుకున్నట్లే విడిపోయారా? లేక కలిసే ఉన్నారా? అనేది మిగతా కథ. బలవంతంగా పెళ్లి చేసేద్దామనే ధోరణిలో ఉన్న పెద్దవాళ్లు, వాళ్లకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని, అందులోంచి బయటపడటానికి ప్లాన్ వేసిన ఓ యువ జంట ఎన్ని కష్టాలు ఎదుర్కొందో నందినీ రె డ్డి ఆసక్తికరంగా చూపించారు. ఆడవాళ్లంటే ఇంటికి పరిమితం కావాలనే ఆలోచనతో ఉన్న హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ఆనంద్, అతని భార్యగా రాశి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో ఎప్పుడూ భార్యలే భర్తలకు వడ్డించాలా అని శౌర్య పట్టుబట్టి తన మావయ్య (ఆనంద్)తో అత్తయ్య(రాశి)కు వడ్డించేలా చేస్తాడు. పెళ్లయిన ఇన్నేళ్లలో ‘ఎప్పుడూ తనను తిన్నావా’ అని అడగని భర్త అలా వడ్డించడంతో చెమర్చిన కళ్లు, తర్వాత శౌర్య ‘తినండి అత్తయ్యా’ అంటూ వడ్డిస్తుంటే రాలిన ఆనందబాష్పాలతో ‘చాలు బాబు...’ అంటూ రాశి కనబర్చిన నటన టచింగ్‌గా ఉంటుంది. తండ్రికి భయపడే అమ్మాయిగా, జీవితంపట్ల స్పష్టమైన ఆలోచన గల యువతిగా మాళవిక, లైఫ్ అంటే జాలీ రైడ్ అనుకునే శౌర్యగా నాగశౌర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించే ప్రగతి ఈ సినిమాలో ఐపాడ్ అమ్మక్కగా నవ్వులు పూయించారు. పతాక సన్నివేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తాగుబోతు రమేశ్, జీహెచ్ఎంసి వ్యాన్ డ్రైవర్‌గా ఆశిష్ విద్యార్థి నవ్వించడం కొసమెరుపు. ‘అలా మొదలైంది’ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపించినా, తనదైన టేకింగ్‌తో వాటిని ప్రేక్షకుల మనసుల్లోంచి తుడిచేసే ప్రయత్నం చేశారు దర్శకురాలు. కళ్యాణి కోడూరి స్వరపరిచిన పాటల్లో పెళ్లి పాట గుర్తుండిపోతుంది. డబుల్ మీనింగ్ కామెడీ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో హృదయానికి హత్తుకునేలా, సకుటుంబ సపరివారాన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టని ఈ కల్యాణ వైభోగం నవరసభరితం. -
రిస్క్ చేస్తున్న యంగ్ హీరో
చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య, తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన ఈ చాక్లెట్ బాయ్, రూట్ మార్చి చేసిన ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. మాస్ ఇమేజ్ కోసం చేసిన యాక్షన్ సినిమా జాదూగాడు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మరోసారి రొమాంటిక్ మూవీస్ మీద దృష్టి పెట్టాడు నాగశౌర్య. ప్రస్తుతం అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న నాగశౌర్య, ఆ సినిమా తరువాత మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న నెక్ట్స్ సినిమాలో హీరోగా, విలన్‌గా డ్యూయల్ రోల్లో నటించడానికి అంగీకరించాడు. మాస్ క్యారెక్టర్‌తో మెప్పించలేకపోయిన నాగశౌర్య, నెగెటివ్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!
‘అలా మొదలైంది’తో డెరైక్టర్ నందినీరెడ్డి పరిచయం చేసిన మలయాళీ నిత్యామీనన్ తెలుగులో ఫుల్ బిజీ. ఇప్పుడు మరో మలయాళీ మాళవికతో శ్రీరంజిత్ మూవీస్ వారికి ‘కళ్యాణవైభోగమే’ తీశారు నందిని. మా మాళవికలో శోభనని చూసుకుంటూ తీశానని నందిని, మా డెరైక్టర్ లవబుల్ ఫిల్మ్ తీశారని మాళవిక అంటున్నారు. వాళ్లిద్దరితో స్పెషల్ చాట్ నందినీరెడ్డిగారూ! ‘కళ్యాణ వైభోగమే’ కథానాయిక కోసం వందలకొద్ది ఫొటోలు చూశారట. అందులో మాళవిక ఫొటోని కూడా చూసి తిరస్కరించారట? నందినీరెడ్డి: మాళవికా నాయర్ ఫొటోని చూశానా లేదా అనేది నాకు డౌటేనండీ. నాయిక పాత్ర కోసం 400 మంది అమ్మాయిల ఫొటోలు చూసింది నిజమే. ఎవరూ నచ్చలేదు. చివరికి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియో ఫంక్షన్లో మాళవిక ఎక్స్ప్రెషన్స్, ఫేస్‌లో అమాయకత్వం చూసి, ఎంచుకున్నా. మాళవికా! ఇదంతా మీరు నమ్ముతారా? మాళవిక: హాహాహా... దర్శకురాలు చెబుతున్నప్పుడు నమ్మాలి కదండీ. తనకి నేను నచ్చినా నేను ఈ సినిమా చేయకూడదనుకున్నా. ట్వల్త్ చదువు తున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వద్దనుకున్నా. కానీ నందిని కథ చెప్పాక నో చెప్పాలనిపించలేదు. నందినీగారూ! అందరూ మాళవికని చూసి నిత్యామీనన్‌లా ఉన్నారని చెబుతున్నారు? నందినీరెడ్డి: నిత్యకీ, మాళవికకీ మధ్య నాకైతే పోలికలేమీ కనిపించవు. మాళవికను చూసినప్పుడు నాకు శోభన గారు గుర్తుకొస్తారు. అయినా నిత్యలా ఉండాలనో, శోభనలా ఉందనో నేను మాళవికని ఎంపిక చేసుకోలేదండీ. ఒక యాక్టర్‌కి ముఖ్యమైనవి కళ్లు. తర్వాత నవ్వు చూస్తా. మాళవికలో ఆ రెండూ నచ్చాయి. అందుకే ఎంచుకున్నా. మాళవికగారూ! శోభనలాగా ఉన్నానని మీకెప్పుడైనా అనిపించిందా? మాళవిక: నన్నడిగితే నేనేం చెబుతానండీ(నవ్వుతూ). నేనైతే మా అమ్మానాన్నల పోలికలతో ఉంటాననుకుంటా. నందినీగారూ! ‘అలా మొదలైంది’ కీ,‘కళ్యాణ వైభోగమే’ కీ మధ్య పోలికలేమైనా? ఆ మేజిక్ మరోసారి రిపీటవుతుందా? నందినీరెడ్డి: స్టైల్ ఆఫ్ మేకింగ్ దగ్గరగానే ఉంటుంది. ‘కళ్యాణ వైభోగమే’లో అదనంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడవుతాయి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి సీన్ మన ఇంట్లో జరుగుతున్న ఫీల్ కలిగిస్తుంటుంది. మాళవికా! మీరు ‘అలా మొదలైంది’ చూశారా? మాళవిక: ‘ఎవడే సుబ్రమణ్యం’ చేస్తున్నప్పుడే నాని చూడమని తన సినిమాలన్నీ ఇచ్చాడు. ‘అలా మొదలైంది’ అందులో ఉంది. మంచి సినిమా. కానీ ఆ సినిమా చూసినప్పుడైతే నేను నందినితో కలిసి పనిచేస్తానని అనుకోలేదు. నందినీగారూ! ‘జబర్దస్త్’ లాంటి ప్లాప్ తర్వాత తదుపరి మళ్లీ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనుకున్నారు? నందినీరెడ్డి: కొన్నాళ్లపాటు మైండ్ పనిచేయలేదు. బన్నీ ఒకరోజు ఫోన్ చేశాడు. ‘ఒకసారొచ్చి కలువు’ అన్నాడు. వెళ్లాక ‘ఏం చేస్తున్నావు’ అని అడిగాడు. ‘ఆర్నెల్లుగా ఇంట్లోనే ఉన్నా’ అన్నా. అప్పుడు క్లాస్ పీకాడు. అప్పుడే ‘జబర్ దస్త్’ ప్లేస్‌లో చేయాలనుకున్న కథ ఇదని ‘కళ్యాణ వైభోగమే’ కథ చెప్పా. బాగుందని ప్రోత్సహించాడు. స్వప్నాదత్కి కథ చెప్పా. నిర్మిస్తానంది. నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ గారు శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్లో చేద్దామన్నారు. మాళవికా! మీరు ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చూశారా? మాళవిక: చూశా. సినిమా చూస్తున్నప్పుడు కథ చెప్పినప్పటికంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఎక్జైట్ అయ్యా. బోలెడంత ప్రేమ, బోలెడంత ఫన్ కనిపిస్తుంది. ఇదివరకు నా కథలన్నీ మా నాన్నగారే వినేవారు, ఆయనే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇది నేను సెలక్ట్ చేసుకున్న తొలి కథ. ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నందుకు గర్విస్తున్నా. సినిమా షూటింగ్‌లోని సందడికి సంబంధించిన విషయాలేమైనా చెబుతారా? మాళవిక: షూటింగ్ కూడా వైభోగంగానే జరిగింది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంతమంది ఒకచోట కలిసేసరికి పెద్ద ఫ్యామిలీలాగా అయిపోయాం. పెళ్లి పాట సమయంలో బాగా ఎంజాయ్ చేశాం. ట్రైలర్లో నాగశౌర్య కోడికాళ్లు చూసి సెక్సీ లెగ్స్ అంటున్నాడు. ఏంటా కథ? మాళవిక: అది మీరు సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. నందిని: మా సినిమాలో హీరోయిన్ మాళవిక మాత్రమే కాదండీ. కామాక్షి కూడా ఉంది. కామాక్షి ఓ కోడి పేరు. కామాక్షి, మాళవిక, నాగశౌర్యల మధ్య సాగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నమాట. అప్పటిదాకా వెజిటేరియన్ అయిన మాళవిక, కామాక్షిని చూసి ఏం చేసిందనేది సినిమాలోనే చూడాలి. -
భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి
పెళ్లి విషయంలో ఈ తరం ఆలోచనా విధానం ఎలా ఉంటోంది? వైవాహిక జీవితం పట్ల వారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయి? అని చెప్పే సినిమా ‘కల్యాణ వైభోగమే’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీ రంజిత్ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్. దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నందినీరెడ్డి మాట్లాడుతూ- ‘‘ ‘అలా మొదలైంది’ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత వెంటనే ‘జబర్దస్త్’ లాంటి ఫెయిల్యూర్ చూశాను. అయినా ఈ చిత్రాన్ని మాత్రం ఎలాంటి భయాలూ, టెన్షన్లు లేకుండా తీశా. ప్రతి నిమిషం ఈ స్క్రిప్ట్, షూటింగ్ కోసం నేను, నా టీమ్ మెంబర్స్ ఎంతో ఇష్టపడి పనిచేశాం. మామూలుగా ఒక షెడ్యూల్ అయిపోయాక, ఏమైనా సరిగ్గా రాలేదంటే రీ-షూట్స్ చేసేవాళ్లం. కానీ వేసవిలో మాళవికకు పరీక్షలు ఉండడంతో వరుసగా 45 రోజులు షూటింగ్ చేశాం. ఈ సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్‌లో మా ఎడిటర్ జునైద్‌గారు చూసి మెచ్చుకున్నారు. అప్పుడింకా నమ్మకం పెరిగింది. అందుకే, సినిమా రిజల్ట్ గురించి బెంగ లేదు. ‘అలా మొద లైంది’ సక్సెస్‌తో నాకు సక్సెస్ మీద ప్రేమ, కోరిక రెండూ పోయాయి. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. తీవ్ర భావోద్వే గాలున్న ఓ లవ్‌స్టోరీ రాశాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దానికి సంబంధించిన పనులు మొదలుపెడతా’’ అన్నారు. -
నందినీ వైభోగమే
► సాక్షి ఫ్యామిలీ కోసం ► జర్నలిస్ట్‌ల అవతారమెత్తి, ► ఒకరిపై మరొకరు ప్రశ్నలు సంధిస్తూ... ► సరదా ‘స్టార్ టాక్’ సాగిస్తూ... ► ‘కల్యాణ వైభోగమే’ దర్శకురాలు నందినీరెడ్డి, ► యువ హీరో నాగశౌర్య మార్చి 4 నందినీరెడ్డి పుట్టినరోజు. అదే రోజు ఆమె కల్యాణవైభోగం! బ్రేకింగ్ న్యూస్ కదా! బ్రేకింగే కానీ, అది ఆమె కల్యాణం కాదు.. ఆమె తీస్తున్న కల్యాణం, ఆ కల్యాణ వైభోగం. ఇందులో బ్రేకింగ్ ఏమిటి? మూడేళ్ల బ్రేక్ తర్వాత నందిని చేస్తున్న సినిమా ఇది. హీరో... నాగశౌర్య. ఈ కాంబినేషన్ ఏమిటి? కష్టపడి పైకొచ్చిన వీళ్ల క్యాలిక్యులేషన్స్ ఏమిటి? సరదాగా సాగే ఈ ‘స్టార్ టాక్’ చదవండి. నవ్వుల నందినీ వైభోగం తిలకించండి! నందిని: శౌర్యా! నా ముందు సినిమా ‘జబర్దస్త్’ పెద్ద ఫ్లాప్. కానీ ‘కల్యాణ వైభోగమే’ ఒప్పుకొనిచేశావు. నీ నమ్మకమేంటి? నాగశౌర్య: డౌట్లకి రీజన్స్ ఉంటాయి కానీ, నమ్మకానికి రీజన్ ఉండదు. ఆ మాటకొస్తే నా 6 సినిమాల్లో ఒకటి సూపర్‌సక్సెస్, 5 ఫెయిల్యూర్స్ (నవ్వులు). మనకు కథచెప్పేటప్పుడు బాగున్నా, సెట్స్‌లో తీయడం మారిపోయిన ఫిల్మ్స్ చేశా. కానీ మీరు చెప్పినదానికన్నా బాగా తీశారు. నందిని: సినీ రంగంలో ఫెయిల్యూరంటే, పబ్లిక్‌లో చెంపదెబ్బ కొట్టినట్లు! మరి బాగా అవమానంగా అనిపిస్తుంటుందా? నాగశౌర్య: నా సినిమా హిట్టా, ఫట్టా అన్నది మీరు, దర్శకులు అవసరాల గారు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మిగతా ప్రపంచాన్ని పట్టించుకోను. నన్ను హీరోగా నిలబెట్టిన సాయి కొర్రపాటి ముందుకెళ్ళాలంటే మాత్రం సిగ్గు. నందిని: బయట సినిమాల్లో రిజర్వ్డ్గా ఉంటావట! మన సెట్స్‌లో సరదాగున్నావు. అక్కడ లేనిదీ, ఇక్కడున్నదీ ఏంటి? నాగశౌర్య: (నవ్వేస్తూ) నాకు పొగరు పెరిగిందనీ, ఎవరితో మాట్లాడననీ అనుకుంటారు. కానీ, అదేమీ లేదు. మొదట అందరితో సరదాగానే ఉంటాను. కానీ, అలా ఉండడం వల్ల కొందరు ఎడ్వాంటేజ్ తీసుకొని, ఏవో అంటారు. ఆ బాధ భరించలేక రిజర్వ్డైపోతా. కానీ మన సెట్లో మీరు, నేను, హీరోయిన్ - అంతా పిల్లలమే! సో ప్రాబ్లమ్ లేదు. నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) బేసిగ్గా శౌర్య చాలా సెన్సిటివ్. పైకలా కనిపిస్తాడు కానీ, లోపల పసిపిల్లాడున్నాడు. చాలా ఎమోషనల్! కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. గ్లిజరిన్ లేకుండానే అతను ఎమోషనల్ సీన్స్ చేసేశాడు. ఐశ్వర్య లాంటి ఆర్టిస్టులు అది చూసి, ఆశ్చర్యపోయారు. నాగశౌర్య: నన్ను చూడగానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్? నందిని: హమ్మయ్య ఇప్పటికైనా వచ్చాడనుకున్నా (నవ్వు). నాగశౌర్య: (నవ్వేస్తూ) అది కథ వినడానికొస్తానన్న రోజు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ షూటింగ్లో ఉన్నా. లేటైంది. నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) నా అదృష్టం ఏంటంటే, ఆ రోజు తర్వాత ఎప్పుడూ షూటింగ్‌కు లేట్‌గా రాలేదు. కానీ, డబ్బింగంటే దాగుడుమూతల దండాకోర్ ఆడేస్తాడు. నాగశౌర్య: (నవ్వేస్తూ) ఏమీ లేదండీ! ఒక పట్టాన డబ్బింగ్ చెప్పనని ఆరోపణ. డబ్బింగ్ ఏదోలా చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే టైప్ కాదు నేను. టైవ్‌ు ఎక్కువైనా ఫరవాలేదని బాగా డబ్బింగ్ చెప్పడానికి యత్నిస్తా. నందిని: నిజమే! మంచి ఆర్టిస్టులెప్పుడూ డబ్బింగ్ అంటే చిరాకు పడతారు. ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్, శౌర్య ఇద్దరూ సేమ్ కేటగిరీ కిందకు వస్తారు (నవ్వులు...). నాగశౌర్య: ఈ సినిమాలో నన్నే ఎంచుకోవడానికి కారణం? నందిని: నా సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. డ్రమాటిక్ డైలాగుల్లాంటివి పట్టుకొని యాక్ట్ చేయడానికి వీలైన డెకరేషన్ ఉండదు. అందుకే, నా కథల్లో నటించాలంటే, బై డిమాండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ నీడ్ గుడ్ యాక్టర్స్. కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు లాంటివాళ్ళు నటుల్ని తీసుకొని, శిలల్ని శిల్పాలుగా చెక్కుతారు. కానీ నాకు శిల్పమే కావాలి. దాన్ని అందంగా అలంకరించి చూపిస్తా. ‘చందమామ కథలు’ చూసినప్పుడే నీలో మంచి యాక్టర్ కనిపించాడు. ఇప్పటికి నీతో చేయడం కుదిరింది. నాగశౌర్య: మొదటనుకున్న హీరోకు ఫ్లాపొస్తే లెక్కలు... నందిని: నేను లెక్కలేయలేను. నా బలం, యాటిట్యూడ్ అది కాదు. స్క్రిప్ట్‌కు తగ్గ యాక్టర్స్ ఎంపికలో నాది, నిర్మాత దామూ గారిది ఒకటే దృష్టి, అభిరుచి. ఆ యాక్టర్లను బట్టి, కథను బట్టి బడ్జెట్నెలా తగ్గించుకోవాలో ఆలోచిస్తాం తప్ప హీరో హిట్స్‌లో ఉన్నాడో, లేడో చూడం. నాగశౌర్య: మీ రెండో సినిమా ‘జబర్దస్త్’ ఫ్లాప్. ‘బ్యాండ్ బాజా బారాత్’కి కాపీ అని యశ్‌రాజ్ ఫిల్మ్స్ కేసు! అసలేమైంది? నందిని: అసలు నా రెండో సినిమాకి చేయాల్సింది ‘కల్యాణ వైభోగమే’ కథే. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ సమంత విన్న కథా ఇదే. కానీ నిర్మాతల ఒత్తిడితో ‘జబర్దస్త్’ చేయాల్సి వచ్చింది. అప్పుడే సమంతకు ఆరోగ్యసమస్య, నిర్మాతకూ- హీరోయిన్‌కూ వివాదం వచ్చాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు వేసిన కేసింకా నడుస్తోంది. అది నేను చేయకూడదనుకున్న సినిమా. కానీ చేయాల్సొచ్చిన సినిమా! (నవ్వు) నా తప్పేమిటంటే అంతరాత్మను నమ్ముకోకపోవడం! ఆ పాఠం నేర్పింది గనకే, ‘జబర్దస్త్’ నాకు ఇష్టమైన సినిమా. నాగశౌర్య: మీకూ, నాకూ పోలికలున్నాయి. ఇద్దరి తొలి సినిమా 2011లోనే! అయిదారేళ్ళు కష్టపడి మీరైనా నేనైనా డెరైక్టర్, హీరో అయ్యాం. లేడీడెరైక్టర్గా ఎంత కష్టమైంది? నందిని: ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్సుంటాయి. లేడీ డెరైక్టర్ని కావడం వల్ల నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ లేకపోవడం’ ఎడ్వాంటేజ్. ట్రెక్కింగ్లోలా ఎప్పుడూ తర్వాత వేసే నాలుగడుగుల మీదే దృష్టి. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులను కుంటూ ముందుకెళ్ళేదాన్ని. అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు చుక్కలు చూశా. నా ఫస్ట్ ఫిల్మ్ ‘అలా మొదలైంది’(2011) నిర్మాణం, రిలీజ్‌కీ అంతే! ఆర్థిక సమస్యలు, 4 నెలల గ్యాప్! రిలీజ్‌కి ముందు అంతా పెదవి విరిచినా, రిలీజయ్యాక అంత సక్సెసవడం మర్చిపోలేను. నాగశౌర్య: ఆరేళ్ళలో మూడే ఫిల్మ్స్! నిదానమే ప్రధానమా? నందిని: అదేమీ లేదు. రెండో సినిమా దెబ్బ నుంచి కోలుకోవడానికి టైమ్ పట్టింది. కానీ, ఇప్పుడీ మూడో సినిమా రిలీజవగానే, ఫాస్ట్‌గా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నందిని: నువ్వూ, హీరోయిన్ రాశీఖన్నా బాగా క్లోజట! నాగశౌర్య: (నవ్వుతూ) అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదు బాబూ! తొలి సినిమా కలసి చేశాం కాబట్టి, కష్టసుఖాలు తెలుసు. నేనంటూ పలకరించి, మాట్లాడే హీరోయిన్ రాశీఖన్నానే! దానికేవేవో రంగులు పూసేయకండి. నాగశౌర్య: అవునూ! మీ తొలి 2 సినిమాల్లో నిత్యా మీనన్‌ని పెట్టారు. (బుంగమూతితో) నా దగ్గరకొచ్చేసరికి పెట్టలేదేం? నందిని: ఈ సినిమాలో పాత్రకు తను పెద్దదైపోతుంది. అందుకే, పెట్టలేదు. అయినా, నువ్వు గత సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ పోస్టర్స్‌లో హీరోయిన్ పలక్ లల్వానీతో క్లోజ్‌గా కనిపించావు. ఈ సినిమాలో అమ్మాయిని పట్టుకోమంటే పట్టుకోలేదు. అమ్మాయిలంటే భయమా? నాగశౌర్య: (నవ్వేస్తూ) మాళవికా నాయర్ మీద గౌరవం! నందిని: అంటే పలక్‌పై గౌరవం లేదన్న మాట! (నవ్వులు) నాగశౌర్య: అబ్బ! అది కాదు మేడమ్! ఆ సినిమా కథంతా ముద్దు సీన్ మీద నడుస్తుంది. మా డెరైక్టర్ రమేశ్‌వర్మ మంచి పోస్టర్ డిజైనర్ కూడా! మేము కొద్దిగా దూరంగా నిలబడినా, ఆయన పోస్టర్స్‌లో బాగా మేనేజ్ చేసేశారు. నందిని: (ఆటపట్టిస్తూ) డెరైక్టర్ని బట్టి రొమాన్సన్న మాట! నాగశౌర్య: అమ్మా! నన్ను వదిలేయండి! (నవ్వులు...) నందిని: చూడు! త్వరలో నీ బెండు తీసే లవ్‌స్టోరీ చేస్తా! (నవ్వు) ఏమైనా, నీకు హీరోయిన్స్‌ని పట్టుకోవడం రాదు. నాకేమో హీరోల్నీ, నిర్మాతల్నీ పట్టుకోడం రాదు. (నవ్వు) నందినీ రెడ్డి: శౌర్యా! అందరూ టెక్నాలజీతో ముందుకెళ్తుంటే, నువ్వు చేతిలో సెల్ లేకుండా గడిపేస్తున్నావేం? నాగశౌర్య: (నవ్వేస్తూ) ఒకరకంగా, డిజిటల్ డీ-టాక్సింగ్ కోసం సెల్‌ఫోన్ వాడడం లేదనుకోండి! నందిని: (ఆటపట్టిస్తూ...) గాడిదగుడ్డేం కాదూ! నిజం చెప్పు. ఎవరో, ఏదో పందెం కాసి ఉంటారు! నాగశౌర్య: (నవ్వుతూ) పందెం కాసిందెవరో మీకు తెలియదా? మీరే! (‘సాక్షి’ వైపు తిరిగి...) రెండు, మూడురోజులు సెల్‌కు దూరంగా ఉందామనుకున్నా. ఇంతలో మేడమ్ 2016 డిసెంబర్ 31 దాకా సెల్‌కు దూరంగా ఉంటే, ఇంకో సినిమాలోనూ హీరో ఛాన్సిస్తానని పందెం కాశారు. అందుకే, ఈ దీక్ష. (నవ్వు) నందిని: మార్చి 4న వచ్చే ‘కల్యాణ వైభోగమే’ తరువాతి సినిమాకు ఎలాగూ శౌర్యే హీరో. డిసెంబర్ 31 దాకా ఇలా ‘దీక్ష’లో ఉంటే, ఆ నెక్స్ట్ సినిమా కూడా ఇస్తానన్నమాట! నాగశౌర్య: చూస్తూవుండండి. దీక్షలో గెలిచి, ఛాన్స్ కొట్టేస్తా! నందిని: స్టార్ పేరు మీద సినిమా అమ్ముడవుతుంది కాబట్టి, మార్కెట్లో వాళ్ళకే శాలరీ ఎక్కువ! అది కరెక్టా, కాదా అన్నది పక్కనపెడితే, అది మార్కెట్ సూత్రం. నాగశౌర్య: నాకు తెలిసి ఆడవాళ్ళు చేసేంతపని మగవాళ్ళు చేయలేరు. ఒంటిచేత్తో కుటుంబమంతా చక్కదిద్దేవాళ్ళకు సినిమా డెరైక్షన్ చాలా ఈజీ అంటాను. నాగశౌర్య: అవును మేడమ్! ఇంతకీ నిజజీవితంలో మీరు ఎవరినైనా కట్టుకొనే సంగతేంటి? పెళ్ళి ప్లాన్ లేదా? నందిని: పెళ్ళి కంపల్సరీ కాదేమో! అలాగని నేను పెళ్ళికి వ్యతిరేకమూ కాదు. అనుకూలమూ కాదు. మన వృత్తికీ, ప్రవృత్తికీ సరిపోయేవాళ్ళు దొరకాలి. లెక్కలు కుదరాలి! సాక్షి: మీరన్నీ లవ్‌స్టోరీస్ తీశారు. మీ జీవితంలో లవ్‌స్టోరీ...? నందిని: ఓ కాలేజీ లవ్‌స్టోరీ ఉంది. ఢిల్లీలో జేఎన్టీయూలో చదువుతున్నప్పుడో అబ్బాయి నచ్చాడు. అతనికి తెలీదు. హాస్టల్‌కు వెళ్లి ఏం చదువుకుంటున్నాడు? ఏంటి అని ఆరా తీశాం. హాస్టల్ ముందు లాన్లో కింద దొర్లుతూ షర్ట్ పైకి తీసి, గోక్కుంటున్నాడు. అంతే ప్రేమాగీమా పోయాయి. నాగశౌర్య: మీకు అవతలి వ్యక్తిలో నచ్చే విషయం ఏమిటి? నందిని: నిజాయతీ. అబద్ధాలు చెబుతూ, మోసం చేసే వ్యక్తుల్ని నేను సహించలేను. నేను అబద్ధం చెప్పలేను. సినిమా మీద అభిప్రాయమైనా అలాగే చెప్పేస్తా! అందుకే, నేను ప్రివ్యూలకు పిలిస్తే వెళ్ళను. రానని కూడా చెప్పేస్తా. నందిని: నిన్నో విషయం అడగాలి! లేడీ డెరైక్టర్‌తో పనిచేయడం తొలిసారి కదా! పురుష దర్శకులకూ, నాకూ తేడా? నాగశౌర్య: మీరు మగవాళ్ళ కన్నా ఎక్కువ పనిచేస్తారు. కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే ఒక పని జరగాలీ అంటే, మీరూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తారు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేస్తారు. నందిని: ఆ మాటకొస్తే ఈ సినిమాకి నువ్వు కూడా కెమేరా అసిస్టెంట్‌లా పనిచేశావు. ఫోకల్లెన్త్లూ చూసేవాడివి. నాగశౌర్య: (నవ్వేస్తూ) 2007లో మొదలైందే అసిస్టెంట్ డెరైక్టర్‌గా! అప్పుడే హీరోని కావాలని బుర్రలో పడింది. నాగశౌర్య: మీరూ బాగా ఫుడీగా! ఆ సంగతులూ చెప్పండి! నందిని: మీరు... కాదు మనం (నవ్వులు)! నాగశౌర్య: ఆ.. మనం తిండిపోతులం! మీరిష్టపడి తినేది? నందిని: ఎవరు ఏం చేసినా తింటాను. పాస్తా నుంచి పప్పుచారు దాకా అన్నీ చేస్తా. ఇంటి వంటే ఇష్టం. షూటింగ్ లేక ఆఫీస్కొస్తుంటే, నేనే వండుకొని క్యారెజీ తెచ్చుకుంటా. (‘సాక్షి’తో) శౌర్యలో నాకు నచ్చిందే.. హీరోయిన్ సమంతకు వండిపెట్టి, ఇప్పుడితని దగ్గరున్న పండుగాడు. నాగశౌర్య: ఔట్డోర్కెళ్లినా పండు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. నేనూ పొద్దుట్నించి తింటూనే ఉంటా. నందిని: మా యూనిట్లో అందరూ ఫుడీ సే. లంచ్ బ్రేకంటే అందరూ కలిసి కూర్చొని తినడమే. అంతా ఓ ఫ్యామిలీ. నాగశౌర్య: ‘రాయలసీమ రుచులు’ అంటే ఏం గుర్తొస్తుంది? నందిని: ఇంకెవరు! మా తమ్ముడు! అది వాడి రెస్టారెంట్! మా నాన్న గారిది రాయలసీమ, మా అమ్మది తెలంగాణ. నేను పనిచేస్తున్నది ఆంధ్రాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన హీరోతో! మేరా భారత్ మహాన్! ప్రాంతాలు, భాషల తేడా లేకుండా అందరినీ కలిపే సినిమాకు జోహార్! - రెంటాల జయదేవ -
ఆ జంట కన్నులపంట
ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో పెళ్లికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సకుటుంబ వినోదకథా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘అలా మొదలైంది’ వంటి చిత్రాలను మించి ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కథాకథనాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం హైలైట్’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై యువతరంలో ఉన్న ఆలోచనలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. సున్నిత భావోద్వేగాలను సమపాళ్ళలో మేళవించి చిత్రం రూపొందించాం’’ అని నందినీరెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జీవీఎస్ రాజు, సహ-నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహనరెడ్డి. వి. -
వైభవంగా ఉంటుంది!
నందినీరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో తయారైన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని విధాలుగా వైభవంగా ఉంటుందని దర్శక-నిర్మాతలు నందినీరెడ్డి, దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దామోదర్ ప్రసాద్ మాట్లాడు తూ - ‘‘యువతలో ప్రేమ, పెళ్లి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపించాం. కల్యాణి కోడూరి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రంపై మరిన్ని అంచనాలు పెరగడానికి ఆడియో విజయం ఓ కారణమైంది. ఈ చిత్రం హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసు కుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి.వి. -
ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి
‘‘దామోదర్‌రెడ్డిగారు మంచి అభిరుచి గల నిర్మాత. స్క్రిప్ట్‌ను నమ్మి సినిమా తీసే నిర్మాతల్లో ఆయనొకరు. ‘అలా మొదలైంది’ హిట్ మళ్లీ ఈ సినిమాతో రిపీట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కేఎల్ రామోదర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని హీరో రామ్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘దామోదర్‌రెడ్డిగారు కథను నమ్ముకుని ధైర్యంగా సినిమా తీసే నిర్మాత. నా నెక్ట్స్ సినిమా కూడా నందినీ రెడ్డిగారితోనే చేస్తాను. కల్యాణి కోడూరిగారితో నాకిది రెండో సినిమా. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ‘‘కల్యాణి ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘కల్యాణం...’ సాంగ్ అయితే అద్భుతం. దానికి సరిపడే విజువల్ ఇస్తానా? లేదా అనే డౌట్ వచ్చింది. ఆ పాట మాత్రం భయపడుతూ చేశాను. నాగశౌర్య, మాళవిక వయసులో చిన్నవాళ్లయినా యాక్టింగ్‌లోనూ, బిహేవియర్‌లోనూ చాలా మెచ్యూరిటీ, డెడికేషన్ చూపించారు. అందరం ప్రేమించి చేసిన సినిమా ఇది’’ అని నందినీ రెడ్డి తెలిపారు. కేఎల్ దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పనిచేశాం. ఈ చిత్రం ద్వారా రాజు అనే సినిమాటోగ్రఫర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాగశౌర్య, మాళవిక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో హీరోలు రాజ్‌తరుణ్, సుమంత్ అశ్విన్, సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి, రచయిత లక్ష్మీ భూపాల్, దర్శకులు దశరథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హిందీలో ‘అలా మొదలైంది’
చిన్న సినిమాగా రూపొంది, 2011లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘అలా మొదలైంది’. హీరోహీరోయిన్లు నాని, నిత్యామీనన్‌లకే కాక చాలామందికి జీవితాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు ‘అలా మొదలైంది’ టాపిక్ దేనికంటే... త్వరలో ఈ కథ బాలీవుడ్ తెరపై మెరవనుంది. తెలుగులో ఈ సినిమా నిర్మించిన కె.ఎల్. దామోదరప్రసాదే హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా పరిచయమైన నందినీరెడ్డి... ఈ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుందని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన ఓ యువ కథానాయకుడు ఇందులో నటించనున్నారట. -
నందినీరెడ్డి దర్శకత్వంలో నితిన్
‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు నితిన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ‘హార్ట్ ఎటాక్’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కూడా మరో పక్క సిద్ధమవుతోంది. ‘అలా మొదలైంది’ ఫేమ్ నిందినీ రెడ్డి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా కమిట్ అయినట్టుగా సమాచారం. ‘అలా మొదలైంది’ తీసిన దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
తొలియత్నం: మొదటి టైటిల్ ప్రేమ తొక్క తోలు
కలలు కనేవాళ్లు.. ఒక ఆశయాన్ని నమ్మేవాళ్లు భవిష్యత్తును బలంగా విశ్వసించేవాళ్లు అందుకోసం ధైర్యంగా ముందడుగు వేసేవాళ్లు... ఎక్కడో ఏ మూలో సంచరిస్తున్నా చేయవలసిన మహత్కార్యమేదో వారందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది. ఒక సామాజిక సృజనకు అగ్గి రాజేస్తుంది. అలా వెండితెరపై ఒక అందమైన ప్రేమకథను వెలిగించిన క్షణాలు ఎలా మొదలయ్యాయో దర్శకురాలు నందినీరెడ్డి మాటల్లో... నాకు మొదటి నుంచీ రొమాంటిక్ కామెడీలంటే చాలా ఇష్టం. ఒక ప్రేమికురాలిగా నేను రొమాంటిక్ కామెడీలను చాలా ఎంజాయ్ చేస్తాను. అవి ఒత్తిడి నుంచి బయటపడేసి, మనసును ఆహ్లాదపరుస్తాయి. నేను చేసే సినిమా కూడా అలాగే ఉండాలనుకునేదాన్ని. అలా ఆలోచిస్తున్నప్పుడు, మనసులో ఒక ఐడియా తళుక్కుమంది. ఒక సంక్లిష్ట సన్నివేశంలో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తారసపడతారు. ఒకమ్మాయి, అబ్బాయి రొటీన్‌గా కలుసుకునే పరిస్థితుల కన్నా ఇది చాలా భిన్నంగా ఉందని భావించాను. ఈ ఆలోచనల క్రమం నన్ను వెంటాడుతున్నప్పుడు నా ఫ్రెండ్, తమిళ సినిమా ‘వెప్పమ్’ డెరైక్టర్ అంజనా అలీఖాన్‌తో తరచూ మాట్లాడేదాన్ని. మా ఇద్దరి చర్చా ఫలితమే ‘అలా మొదలైంది’ మూలకథ. కథపై ఒక స్పష్టత వచ్చాక, ఓ పది నిమిషాల పాటు నానికి న్యారేషన్ ఇచ్చాను. వింటున్నప్పుడు తను చాలా ఉద్వేగానికి లోనయ్యారు. సినిమాకు ప్రేమ తొక్క తోలు అనే టైటిల్ అనుకున్నాం. తరువాత నాకున్న బద్దకం కారణంగా, స్క్రిప్ట్ రాయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంజన స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాకు పది రోజుల గడువు పెట్టింది. దాంతో ఇక రాయక తప్పలేదు. కాగితాలు ముందు పెట్టుకొని కూర్చున్నప్పుడు, నా అనుభవంలోకి వచ్చిన మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు కథలోకి అందంగా ఒదిగిపోయాయి. అదే సమయంలో వెన్ హ్యారీ మెట్ సాల్లీ, ఎ లాట్ లైక్ లవ్ సినిమాలు అదే పనిగా చూశాను. అన్ని ఆలోచనలు, ఊహలు కలబోసి అరవై సీన్లతో కూడిన స్క్రిప్ట్ రెడీ చేశాను. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్లు మళ్లీ ఒక పెళ్లిలో కలవడం, ఒక అందమైన సంభాషణతో సినిమాను ముగించడం బావుంటుందనుకున్నాను. అయితే ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ప్రియదర్శన్ తరహా కన్ఫ్యూజన్ క్లైమాక్స్‌కు బాగుంటుందని మార్పులు చేశాను. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత ఇంకేదో అసంతృప్తి నన్ను వేధించడం మొదలుపెట్టింది. ఒక విభిన్నమైన పాత్రను సృష్టించి, కథకు మరింత బలం తీసుకురావాలనిపించింది. ‘ఇన్ జులై’ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు ఒకదానికొకటి తప్పుగా అన్వయించుకునే పరిస్థితులు ఫన్ క్రియేట్ చేస్తాయి. ఆ స్ఫూర్తితో ‘జాన్ అబ్రహామ్’ పాత్రను క్రియేట్ చేశాను. జాన్ అబ్రహామ్ ప్రొఫెషనల్ కిడ్నాపర్ అయినా, అతనిలోని హ్యూమర్ యాంగిల్‌తో హ్యూమర్‌ను పండించాలనుకున్నాను. ప్రేక్షకుల మనసులో చెలరేగే ప్రశ్నలను వాళ్ల తరపున నానిని అడగటానికి జాన్ అబ్రహామ్ పాత్రను వాడుకున్నాను. ఈ పాత్రను నేను చాలా ప్రేమించాను. కానీ మా టీమ్ మాత్రం ఈ పాత్ర పట్ల కన్విన్స్ అవలేదు. దాంతో ఆ పాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టేశాను. సినిమా మూడు షెడ్యూల్స్ అయ్యాక, నా ఫ్రెండ్, సినిమాల్లో కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ సెట్స్‌కు వచ్చాడు. నేను అతనికి జాన్ అబ్రహామ్ పాత్ర గురించి చెప్తున్నప్పుడు, కన్విన్స్ అయి, ప్రొడ్యూసర్‌ను ఒప్పించాడు. ఈ క్యారెక్టర్ ఆశిష్ విద్యార్థి చేస్తే బాగుంటుందని అనుకున్నా. అయితే ప్రకాశ్‌రాజ్‌తో నాకున్న పరిచయం వల్ల, ఈ పాత్ర గురించి చెప్పా. ఆయనకు బాగా నచ్చింది కానీ, తను దాదాపు అలాంటి పాత్రే ‘ఆరెంజ్’ సినిమాలో చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆశిష్ విద్యార్థికి తన క్యారెక్టర్ న్యారేట్ చేశాను. అతనికి బాగా నచ్చి, తన రెమ్యూనరేషన్ చెప్పాడు. కానీ అది మా బడ్జెట్‌కు మించిన వ్యవహారం. కొన్ని రోజుల తరువాత ఆశిష్ విద్యార్థి మాకు ఫోన్ చేసి, మా కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పాడు. ‘ఐస్ ఏజ్’ సినిమాలో ఫ్క్రాట్ పాత్ర నాకు చాలా నచ్చింది. అది కథలో భాగం కాకపోయినా, పరిస్థితుల్ని అయోమయంలోకి నెట్టేసి, విపరీతమైన హాస్యాన్ని కురిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఈ కథలో రాయాలనుకున్నాను. అదే సమయంలో ఈ కథలో రెసిషన్‌లో ఉద్యోగం కోల్పోయిన పాత్ర ఉండాలన్నారు. రచయిత భూపాల్ కథలో ఒక తాగుబోతు పాత్ర ఉండాలన్నారు. ఆ పాత్రకు రమేశ్ బాగుంటాడని చెప్పాడు. క్లైమాక్స్‌లో జాన్ అబ్రహామ్కు భార్య నుంచి ఫోన్ వస్తుంది. ఆ భార్య పేరు చాలా ఫన్నీగా ఉండాలని అందుకోసం వెతుకుతున్నాం. అప్పుడు ఆశిష్ విద్యార్థి కపిలేశ్వరమ్మ అని పేరు చెప్పారు. సినిమా విడుదలయ్యాక, ఫేస్బుక్లో ఒకరు తమ కుక్కకు కపిలేశ్వరమ్మ అని పేరు పెట్టామని నాకు పోస్ట్ చేశారు. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆశిష్‌తో కొంత షూట్ బ్యాలన్స్ ఉంది. తనతో షూట్ చేయాల్సిన రోజు ముందు రాత్రి నుంచీ విపరీతంగా వర్షం. మరుసటిరోజు తను యూఎస్ వెళ్లాలి. దాదాపు రెండు నెలల వరకు తను తిరిగి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నాలుగున్నరకు లేచి చూస్తే వర్షం ఏమాత్రం తగ్గలేదు. ఏడున్నర సమయంలో పెట్రోల్ బంక్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసే సీన్ షూట్ చేశాను. ఆ సీన్ అవగానే, వర్షం తగ్గిపోయింది. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. కానీ అంతలోనే మరో టెన్షన్. నాని, ఆశిష్ విద్యార్థిల సీన్ తీస్తున్నప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నెగెటివ్ ఒక క్లాన్ మాత్రమే ఉందని చెప్పాడు. అంటే నాలుగు వందల ఫీట్ ఫిలింతో ఆ సీన్ పూర్తి చేయాలి. ఇద్దరి డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలి. కానీ ఫిలిం సరిపోయేలా లేదు. ముందు ఆశిష్ విద్యార్థి డైలాగ్స్ ఫినిష్ చేద్దామనుకున్నాం. అప్పుడు నాని, ఆశిష్ విద్యార్థి మొత్తం డైలాగ్స్ అవసరం లేదు, తను మధ్యమధ్యలో మాట్లాడితే చాలు. నేను ఒకేసారి డైలాగ్స్ చెప్పేస్తానని అన్నాడు. కంటిన్యూస్‌గా కెమెరా రోల్ అవుతూనే ఉంది. నాని డైలాగ్స్ చెబుతుండగా, సడన్‌గా రీల్ అయిపోయింది. నేననుకున్నది మొత్తం వచ్చిందో లేదోనని ఎడిట్ రూమ్‌కు వెళ్లేవరకు ఒకటే టెన్షన్. అలా ఎన్నో ఒడిదుడుకులతో షూటింగ్ పూర్తయింది. నిత్యామీనన్, రోహిణి, స్నేహ ఉల్లాల్... ఆర్టిస్టులందరూ ఇది మాది అనుకుని సహకరించారు కాబట్టే, సినిమా సజావుగా జరిగింది. నాని అందించిన సహకారం స్నేహితురాలిగా ఎప్పటికీ మరిచిపోలేను. క్లైమాక్స్‌లో నాని నిత్యకు తన ప్రేమను చెప్పేటప్పుడు రాసిన డైలాగ్‌లు తనవే. చాలా న్యాచురల్‌గా వచ్చాయి. అసలు క్లైమాక్స్ సీన్లో అన్ని పాత్రలను హ్యాండిల్ చేయడానికి నేను ఇబ్బంది పడినప్పుడు రచయిత అనిల్ రావిపూడి నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణం పాత్రల సహజత్వమే. నాని ముందుగానే తెలుసు కాబట్టి తన బాడీ ల్యాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రను డిజైన్ చేశాను. నిత్య పరిచయమైన తరువాత తన ఆలోచనలు, హావభావాలు దృష్టిలో ఉంచుకుని పాత్రలో ముప్ఫై శాతం మార్పులు చేశాను. నాని, నిత్యల మధ్య వాదనలు జరిగినప్పుడు వాళ్ల నిజ జీవితంలో ఎదురైన పరిస్థితులకు దగ్గరగా ప్రవర్తించారు. అలా సినిమా అంతా పాత్రలు తమ అసలు స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. అది కూడా సినిమాను బలోపేతం చేయడంలో తోడ్పడింది. ఈ సినిమాకు సంబంధించి, చివరగా మొదటగా చెప్పుకోవలసింది ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గురించి. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఫైనాన్షియర్స్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆయన వెనక్కు తగ్గలేదు. ‘అలా మొదలైంది’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు, టైటిల్ క్యాచీగా లేదని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఒత్తిడి చేసినా, అంతిమంగా ఆయన నా అభిప్రాయానికే విలువిచ్చారు. టైటిల్ సజెస్ట్ చేసినందుకు సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్‌కు థ్యాంక్స్ చెప్పాలి. తరానికీ తరానికీ విలువలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ విలువల్లో వచ్చిన మార్పులు, సంబంధాల్లో వచ్చిన తేడాల్ని ఈ చిత్రంలో చెప్పాలనుకున్నాను. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. ఈ విజయం ఆ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిదీ. -కె.క్రాంతికుమార్‌రెడ్డి -
మనోగళం: నాకు చావంటే భయం లేదు!
ఇలా చేయాలి అలా చేయాలి అంటూ పని గట్టుకుని ఏదీ ప్లాన్ చేసుకునే అలవాటు లేదు నాకు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసెయ్యడమే. - నందినీరెడ్డి, దర్శకురాలు ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది అబద్ధాలు చెప్పడం. మీలో మీకు నచ్చేది? నేనెప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోను. అంతా మన మంచికే అనుకుంటాను. మీలో మీకు నచ్చనిది? బద్దకం. కాస్త ఎక్కువే ఉంది. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఎంత పెద్ద సమస్య అయినా, అందులోంచి పాజిటివ్ ఫలితాన్ని ఎలా రాబట్టాలా అని చూసేది. షి ఈజ్ మై ఇన్స్పిరేషన్! ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? ఎందుకుండవ్! అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కదా! నేను కూడా చేశాను. కానీ వాటిని తలచుకుని బాధపడే తత్వం కాదు నాది. తప్పు చేస్తే దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫీలవుతూ కూర్చోవడం నాకు నచ్చదు. అత్యంత సంతోషపడిన సందర్భం? చాలామంది అనుకుంటారు... ‘అలా మొదలైంది’ రిలీజైన రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనదని చెబుతానేమో అని. కానీ చెప్పను. ఎందుకంటే, అది నా జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భం తప్ప, అన్నిటికంటే సంతోషకరమైనదేమీ కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో అంతకన్నా ఆనందాన్ని పంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ హృదయం గాయపడిన సందర్భం? నన్ను అంత త్వరగా ఎవరూ హర్ట్ చేయలేరు. ఎందుకంటే, చిన్న వాటికే ఫీలైపోయే తత్వం కాదు నాది. కాకపోతే బాగా దగ్గరనుకున్నవాళ్లు నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. చెప్పను కానీ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకరకంగా అది మంచిదే. ఎందుకంటే, అప్పుడే మనవాళ్లెవరో బయటివాళ్లెవరో తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆ పరిస్థితి నాకెప్పుడూ లేదు. అదేంటో కానీ... ఎక్కడ ఎవరింట్లో ఉన్నా నాకు భోజనం క్షణాల్లో వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్లు ఎవరో ఒకరు భోజనం తెచ్చి పెట్టేసేవారు. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద కోపమొచ్చినా దాన్ని ఇంటికొచ్చాక అమ్మ మీదనే చూపిస్తాను. పాపం మౌనంగా భరిస్తుంది. అందుకే తనకు క్షమాపణ చెప్పి తీరాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నాకు ఎవరైనా వంట చేస్తుంటే చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం ఇష్టం ఉండదు. తీరిక దొరికితే కుకరీ షోలు తెగ చూస్తుంటాను! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...? చిన్నప్పుడు దెయ్యాలంటే భయపడేదాన్ని. తర్వాత అది పోయింది. ఇప్పుడు పెద్దవాళ్లెవరికైనా ఒంట్లో బాగోకపోతే భయపడుతుంటాను... వాళ్లెక్కడ దూరమవుతారోనని! అబద్ధాలు చెబుతారా? భేషుగ్గా! ఇబ్బంది పెట్టే అబద్ధాలు కాదు, తప్పించుకునే అబద్ధాలు. ఫలానా టైముకి వస్తానని చెప్తాను. మావాళ్లు చూసి చూసి ఫోన్ చేస్తారు. వచ్చేశాను, మీ వీధి చివరే ఉన్నాను అంటాను. నిజానికి ఎక్కడో ఉంటాను. ఇలాంటివి బోలెడన్ని చెబుతాను. కానీ వాళ్లు కనిపెట్టేస్తారు. నా ఫ్రెండ్స్ అంటారు... అబద్ధం చెబితే నా ముక్కు ఎరుపెక్కుతుందని! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? నువ్వేంటో తెలుసుకో. నీ తప్పులు, ఒప్పులు ముందు బేరీజు వేసుకో. వాటిని సరిచేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపో. నిన్నెవరూ ఆపలేరు. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. అది ఎలాగైనా చేయాలి. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నాకు ఏ రోజైనా ఒకటే. ఇప్పుడెలా నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నానో ఆ రోజూ అలాగే గడుపుతాను. మరణానికి భయపడతారా? రెండుసార్లు చావు ముఖంలో ముఖంపెట్టి చూసొచ్చాను. చావంటే భయం లేదు నాకు! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? నందిని కొన్ని చిరునవ్వులు పంచి వెళ్లిపోయిందని నా గురించి అందరూ చెప్పుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? డాల్ఫిన్‌గా పుడతాను. నాకు నీళ్లంటే ఇష్టం. నీటిలో ఉండే డాల్ఫిన్లంటే మరీ ఇష్టం. అవి చాలా సరదా జంతువులు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి. అందుకే నేనూ అలా పుడతా! - సమీర నేలపూడి