భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి | Nandini Reddy's 'Kalyana Vaibhogame' to hit screens on March 4 | Sakshi
Sakshi News home page

భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి

Published Sat, Feb 27 2016 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి

భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి

పెళ్లి విషయంలో ఈ తరం ఆలోచనా విధానం ఎలా ఉంటోంది? వైవాహిక జీవితం పట్ల వారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయి? అని చెప్పే సినిమా ‘కల్యాణ వైభోగమే’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీ రంజిత్ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్. దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నందినీరెడ్డి మాట్లాడుతూ- ‘‘ ‘అలా మొదలైంది’ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత వెంటనే ‘జబర్దస్త్’ లాంటి ఫెయిల్యూర్ చూశాను.
 
  అయినా ఈ చిత్రాన్ని మాత్రం ఎలాంటి భయాలూ, టెన్షన్లు లేకుండా తీశా. ప్రతి నిమిషం ఈ స్క్రిప్ట్, షూటింగ్ కోసం నేను, నా టీమ్ మెంబర్స్ ఎంతో ఇష్టపడి పనిచేశాం. మామూలుగా ఒక షెడ్యూల్ అయిపోయాక, ఏమైనా సరిగ్గా రాలేదంటే రీ-షూట్స్ చేసేవాళ్లం. కానీ వేసవిలో మాళవికకు పరీక్షలు ఉండడంతో వరుసగా 45 రోజులు షూటింగ్ చేశాం. ఈ సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్‌లో మా ఎడిటర్ జునైద్‌గారు చూసి మెచ్చుకున్నారు.
 
 అప్పుడింకా నమ్మకం పెరిగింది. అందుకే, సినిమా రిజల్ట్ గురించి బెంగ లేదు. ‘అలా మొద లైంది’ సక్సెస్‌తో నాకు సక్సెస్ మీద ప్రేమ, కోరిక రెండూ పోయాయి. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. తీవ్ర భావోద్వే గాలున్న ఓ లవ్‌స్టోరీ రాశాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దానికి సంబంధించిన పనులు మొదలుపెడతా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement