ఆ జంట కన్నులపంట | Abhishek Pictures bags Kalyana Vaibhogame | Sakshi
Sakshi News home page

ఆ జంట కన్నులపంట

Published Tue, Feb 16 2016 10:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

ఆ జంట కన్నులపంట

ఆ జంట కన్నులపంట

ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో పెళ్లికి ముందు, ఆ  తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సకుటుంబ వినోదకథా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘అలా మొదలైంది’ వంటి చిత్రాలను మించి ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

కథాకథనాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం హైలైట్’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై యువతరంలో ఉన్న ఆలోచనలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. సున్నిత భావోద్వేగాలను సమపాళ్ళలో మేళవించి చిత్రం రూపొందించాం’’ అని నందినీరెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జీవీఎస్ రాజు, సహ-నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్‌మోహనరెడ్డి. వి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement