
వైభవంగా ఉంటుంది!
నందినీరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో తయారైన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని విధాలుగా వైభవంగా ఉంటుందని దర్శక-నిర్మాతలు నందినీరెడ్డి, దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దామోదర్ ప్రసాద్ మాట్లాడు తూ - ‘‘యువతలో ప్రేమ, పెళ్లి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపించాం.
కల్యాణి కోడూరి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రంపై మరిన్ని అంచనాలు పెరగడానికి ఆడియో విజయం ఓ కారణమైంది. ఈ చిత్రం హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసు కుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్‌మోహన్ రెడ్డి.వి.