స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.పాన్ ఇండియా మూవీ ఖుషితో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోని సామ్ తను తర్వాత చేయబోయే సినిమాలై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ తర్వాత సమంత ఓ యంగ్ హీరోతో జతకట్టనుందట.
ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరున్న ఆ హీరోతో సామ్ ఓ మూవీ చేయబోతుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు సిద్దు. డీజే టిల్లులో సిద్దు యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వన్ మ్యాన్ షోలా డీజే టిల్లు మూవీని ఒంటి చేత్తో హిట్ చేయించాడు సిద్దు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. చదవండి: Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక ఈ క్రేజీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాత రామ్ తళ్లూరి ప్లాన్ చేస్తున్నాడ. ఈ ప్రాజెక్ట్‌కి నందినీరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందినిరెడ్డి-సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ మూవీ నుంచి నందిని రెడ్డి, సమంతలు మంచి స్నేహితులయ్యారు. సోషల్ మీడియాలో వారిద్దరు ఎప్పుడూ సరదాగా చిట్‌చాట్ చేసుకుంటుంటారు.
దాంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడంతో సమంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్టు టాక్. ఇక స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్దూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే త్వరలోనే తెరపైకి సమంత-సిద్దు కాంబినేషన్ రానుందని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. చదవండి: వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment