
సమంత కెరీర్ పెళ్లికి ముందు పెళ్లి తరువాత అన్నట్టుగా సాగుతుంది. గతంలో గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసిన సామ్ పెళ్లి తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది. యు టర్న్, రంగస్థలం లాంటి సినిమాలు నటిగా సమంత రేంజ్‌ను పెంచాయి. తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ ‘మిస్ గ్య్రానీ’ చిత్రాన్ని సమంతతో రీమేక్ చేయనున్నారట. ఈసినిమాలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా, 20 ఏళ్ల అమ్మాయిగా రెండు వేరియేషన్స్‌లో కనిపించనుంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటిస్తున్న సామ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే నందిని రెడ్డి సినిమాలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈసినిమాకు ‘ఓ బేబీ.. ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment