వెబ్ సిరీస్‌లో మరో యంగ్ హీరో | Guntur Talkies fame Siddhu in Nandini Reddy web Series | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 5 2018 3:56 PM | Last Updated on Fri, Jan 5 2018 3:56 PM

Guntur Talkies fame Siddhu in Nandini Reddy web Series - Sakshi

ప్రవీణ్‌సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన గుంటూరు టాకీస్‌ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలో లీడ్‌ రోల్స్‌ చేసిన సీనియర్‌ నరేశ్‌,  సిద్ధు జొన్నలగడ్డల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందినిరెడ్డి అందించిన కథతో ‘దడ’ డైరెక్టర్‌ అజయ్‌ భుయాన్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. 

ఈ కథను ముందుగా పూర్తి స్థాయి సినిమాగా తీయాలనుకున్నా...నిడివి ఎక్కువ అవుతుందని ​వెబ్‌ సిరీస్‌ ఆలోచన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు సెలబ్రెటీలకు మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడనీ, సిరీస్‌ మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందనీ, పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్లో ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, హరితేజ (బిగ్‌బాస్‌ ఫేం) నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో దర్శకుడిగా సక్సెస్ సాధిస్తానని అజయ్ భుయాన్ నమ్మకంగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement