
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది.
Nandini Reddy On Samantha Personal Life Issues: స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఎవరి దారులు వారు చూసుకుంటూ కెరీర్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు సామ్, చై ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఎవరో ఒకరు వీరిద్దరి గురించి వారి సన్నిహితుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమంతకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ', 'జబర్దస్త్' సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'నా కెరీర్, సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. జబర్దస్త్ సినిమా చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాలేకపోవడం, అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో నేను ఆమె పక్కన ఉన్నాను. ఆ సమయంలోనే మేము మరింత సన్నిహితులుగా మారిపోయాం. కానీ ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది.' అని తెలిపింది నందినీ రెడ్డి.
చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో
సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో?