
సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ పలు సందర్భాల్లో నాగచైతన్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. డిసెంబరు తొలివారం పెళ్లి జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్స్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. 'మయోసైటిస్' వ్యాధి బారిన తను పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అలా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకోవడంతో సరిపోయింది. దీంతో సినిమాలు పెద్దగా చేయలేదు. తెలుగులో చివరగా 'ఖుషి' చేసింది. ఇది వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈమె చాన్నాళ్ల క్రితం చేసిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'.. ఈ నెల ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపించాయి.
ఆ సిరీస్ గురించి అందరూ చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ ధావన్-సమంత ర్యాపిడ్ ఫైర్ ఆడిన ఓ వీడియోని అమెజాన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ గురించి పరోక్షంగా సామ్ మాట్లాడింది. 'దేనికోసమైనా ఖర్చు చేసిన డబ్బు పనికిరాకుండా పోయిందా?' అని వరుణ్ ధావన్ అడగ్గా.. 'నా ఎక్స్ (మాజీ భర్త) ఖరీదైన గిఫ్ట్స్ కోసం' అని సమంత సమాధానమిచ్చింది. సరిగ్గా చైతూ రెండో పెళ్లికి కొన్నిరోజుల ముందు సామ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం)
When spies get spy-cy, it's very rapid, very fiery!🔥#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/dNXZx5D55g
— prime video IN (@PrimeVideoIN) November 23, 2024