'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్‌కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.
'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్‌తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్‌పుట్ సరిగా రాలేదని మరో టీమ్‌తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')
ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.
దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం)
Comments
Please login to add a commentAdd a comment