ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా! | Lucky Baskhar Movie OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

Lucky Baskhar OTT:‍ దుల్కర్ హ్యాట్రిక్ హిట్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?

Published Sun, Nov 24 2024 9:48 AM | Last Updated on Sun, Nov 24 2024 10:25 AM

Lucky Baskhar Movie OTT Release Date Latest

దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‪‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో పలుచోట్ల ఆడుతోంది. ఇదలా ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: సుకుమార్ ఇంట్లో పనిమనిషికి ప్రభుత్వం ఉద్యోగం)

దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన 'లక్కీ భాస్కర్'. 1990ల్లో జరిగిన బ్యాంక్ స్కామ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. 'సార్' చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి బ్యాంక్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.

ఇకపోతే 'లక్కీ భాస్కర్' ఓటీటీ డీల్‌ని నెట్‌ఫ్లిక్స్ నాలుగు వారాల కోసమని మాట్లాడుకుందట. అలా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దాదాపు ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనితో పాటే థియేటర్లలో రిలీజైన 'క', 'అమరన్' కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement