నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్ | Vaishnavi Chaitanya Birthday Wishes To His Brother | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: బర్త్ డే విషెస్.. 'బేబి' హీరోయిన్ పోస్ట్ వైరల్

Published Sun, Nov 24 2024 7:22 AM | Last Updated on Sun, Nov 24 2024 9:59 AM

Vaishnavi Chaitanya Birthday Wishes To His Brother

'బేబి' సినిమాతో హీరోయిన్‌గా ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్‌పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: యష్మి ఎలిమినేట్‌!)

'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్‌తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.

వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement