బిగ్‌బాస్‌: యష్మి ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 8: Yashmi Gowda Eliminated for 12th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: పృథ్వీ సేఫ్‌.. యష్మి ఎలిమినేట్‌

Published Sat, Nov 23 2024 8:06 PM | Last Updated on Sun, Nov 24 2024 10:10 AM

Bigg Boss Telugu 8: Yashmi Gowda Eliminated for 12th Week

బిగ్‌బాస్‌ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్‌, నబీల్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్‌ ఎప్పటిలాగే ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్‌ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్‌ నడిచింది. 

అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్‌ అయిందట! సండే ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తవగా యష్మిని ఎలిమినేట్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్‌గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. 

సంచాలక్‌ అంటే అంపైర్‌ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్‌లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్‌ చేసింది. ఈ టాస్క్‌ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్‌ బయటకు రాక తప్పలేదన్నమాట!

చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్‌.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement