'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్‌టైన్ చేయడం మరింత అదనం!
అందరి కడుపు నింపింది
తన ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల బిగ్‌బాస్ పలుమార్లు కిచెన్‌లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్‌మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు.
రోడ్డు యాక్సిడెంట్‌లో గాయాలు
అతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్‌నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్‌ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది.
రెండుసార్లు ఆపరేషన్
గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది.
'హీరో'హిణి
ఆ కుండ గేమ్‌లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్‌కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment