Naga Chaitanya and Samantha Divorce Effected To Nandini Reddy Upcoming Movie - Sakshi
Sakshi News home page

Naga Chaitanya Samantha: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు

Published Fri, Jan 14 2022 8:02 PM | Last Updated on Fri, Jan 14 2022 8:30 PM

Naga Chaitanya Samantha Divorce Effected To  Nandini Reddy - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌గా అందరి మనసును దోచుకుంది చై-సామ్‌  జంట. గతేడాది వారు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్న నాగ చైతన్య, సమంత విడాకులు టాలీవుడ్‌లో ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గానే ఉంది. అందుకు కారణం నాగ చైతన్య, సమంత డివోర్స్‌కు సరైనా కారణం తెలీకపోవడమే. అయితే ఇటీవల వారి ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చై చెప్పుకొచ్చాడు. వీరి విడాకులు వాళ్ల పర్సనల్‌ అయినా.. చై-సామ్‌ నిర్ణయంతో ఒక ప్రముఖ డైరెక్టర్‌ నష్ట పోయినట్లు తెలుస్తోంది. ఆమె ఇంకేవరో కాదు 'ఓ బేబీ' సినిమాతో సామ్‌కు మంచి హిట్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి. 

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోకముందు, 'ఓ బేబీ సినిమా' సమయంలోనే వీరిద్దరితో ఒక మూవీ తెరకెక్కించాలని నందినీ రెడ్డి ప్లాన్‌ చేశారట. కథ కూడా అనుకున్నట్లు సమాచారం. ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి కూడా తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారని భోగట్టా. ఇక్కడే ఆమె ప్లాన్‌కు బ్రేకులు పడ్డాయి. సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న నందినీ రెడ్డికి చై-సామ్‌ విడాకులు ప్రకటించి పెద్ద షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత నాగ చైతన్య, సమంత ఎవరి పనుల్లో వారు ఫుల్‌ బిజీగా ఉండిపోయారు. ఇ‍ప్పటివరకూ వారు కలిసి మాట్లాడుకున్న సంఘటన ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇదంతా చూస్తుంటే చై-సామ్‌తో నందినీ రెడ్డి సినిమా ఆగిపోయినట్లే అని టాలీవుడ్‌ టాక్‌. 

ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement