మూడేళ్లుగా ఇబ్బందులు.. మళ్లీ రాకూడదని కోరుకుంటున్నా: సమంత | Samantha Ruth Prabhu Comments On Life After Divorce From Naga Chaitanya, Deets Inside | Sakshi
Sakshi News home page

Samantha On Divorce: 'మునుపటి కంటే బలంగా ఉన్నా'.. చైతూతో విడాకులపై సామ్ కామెంట్స్!

Jul 16 2024 3:10 PM | Updated on Jul 16 2024 3:50 PM

Samantha Ruth Prabhu On Divorce From Naga Chaitanya

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సామ్.. మెల్లమెల్లగా సినిమాల్లోకి వచ్చేస్తోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో కనిపించింది. మయోసైటిస్‌ కారణంగా కొన్నాళ్లు నటనకు దూరమైన సమంత ఇటీవల ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం పేరుతో కొత్త సినిమాని ప్రకటించారు. అంతే కాకుండా వరుణ్ ధావన్‌తో కలిసి సిటడెల్‌: హనీ- బన్నీతో అలరించేందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్యతో విడాకుల విషయంపై కూడా నోరు విప్పారు.  

ఈ ప్రతి ఒక్కరు తమ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారని సమంత తెలిపారు. విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమని అ‍న్నారు. గతం వెనక్కి తిరిగి చూస్తే.. నాకు ఎలాంటి మార్గం కనిపించలేదని.. నా స్నేహితులతో ఇదే విషయంపై చాలాసార్లు చర్చించినట్లు వివరించారు. గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. మునుపటి కంటే బలంగా తయారయ్యానని సమంత వెల్లడించారు. ఆ చీకటి రోజుల నుంచి బయటపడితేనే జీవితంలో విజయం సాధిస్తామని అన్నారు. ఆధ్యాత్మికత చింతన నాలో మంచి మార్పు తీసుకొచ్చిందని తెలిపింది.

కాగా.. నాగచైతన్య, సమంత 2021లో తమ వివాహ బంధానికి గుడ్‌బై చెప్పారు.  ఏ మాయ చేసావే మూవీతో జంటగా కనిపించిన వీరిద్దరు 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్‌తో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement