interesting comments
-
వైజాగ్‌కి వైన్ కోసం వస్తారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్‌కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్‌కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్‌లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్‌ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. టూరిస్ట్‌కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్‌లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు. -
విడాకుల వార్తల వేళ అభిషేక్ సంచలన కామెంట్స్
-
పాక్ మనతో స్నేహంగా ఉంటే..
పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశీ్మర్లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘జమ్మూకశీ్మర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది. ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ’’ అన్నారు. ‘‘పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం’’ అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దురి్వనియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి’’ అని విమర్శించారు. – శ్రీనగర్ -
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే గాంధీ వ్యవహారం
-
జగన్ నాకు దేవుడితో సమానం.. బొత్సకు ఆ పదవి ఇవ్వమని నేనే చెప్పా..
-
హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. నిందితుడిగా ఉన్న సీఎం చంద్రబాబు కేసులను తారుమారు చేసే అవకాశం..!
-
రాజకీయాల కన్నా.. ఉద్యోగమే మిన్న
సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్‌సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకో సమస్య.. తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది కనిపెట్టేయవచ్చ అని అన్నారు. చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
దేవుడు, విశ్వరూపి... ఆ తర్వాతేమిటి?
గుమ్లా (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సునిశిత విమర్శలు గుప్పిస్తున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు. ఆనక అతీత శక్తులున్న సూపర్‌మ్యాన్ కావాలని ఆశపడతాడు. తర్వాత దేవుడు, భగవంతుడు కావాలనుకుంటాడు. ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు. దాన్నీ దాటితే? ఆపైన ఏముందో ఎవరికీ తెలియదు. అంతర్గత, బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు’’ అన్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటమే మన బాధ్యతన్నారు.మోదీపై ఆరెస్సెస్ అగ్ని క్షిపణి: కాంగ్రెస్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ పేర్కొంది. ‘‘అవి లోక్ కల్యాణ్ మార్గ్ (ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం)పైకి నాగ్‌పూర్ (ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం) ప్రయోగించిన అగ్ని క్షిపణి’ అంఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందరిలా తాను తల్లి కడుపు నుంచి పుట్టలేదని చెప్పుకున్న ప్రధానికి ఆరెస్సెస్ తాజా సందేశం విన్పించే ఉంటుందంటూ వాగ్బాణాలు విసిరారు. -
పవన్ గెలుపుపై వంగా గీత సంచలన వ్యాఖ్యలు
-
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్‌గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. -
ఏపీ రాజకీయాలపై హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
గవర్నర్‌గా హ్యాండిల్ చేయలేననుకున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్ అర్బన్: ‘నన్ను గవర్నర్‌గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్ బేబీ) హ్యాండిల్ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్‌గా ట్విన్స్ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్‌లో క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు. గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్‌లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్ వర్క్‌షాప్ భవనాన్ని. రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్‌లోని ‘మనూ’పాలిటెక్నిక్ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కేవీ నూతన భవనం నిజామాబాద్‌లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భర్త, మెగా ఫ్యామిలీపై మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్
-
రష్మికపై మాజీ లవర్ సంచలన కామెంట్స్ వైరల్
-
ఆ సత్తా ఎన్టీఆర్ కే ఉంది..
-
చిరంజీవిపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: చిరంజీవిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు. ‘‘రాజకీయాలకు సరిపోననుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజల్ని అలరించడం మంచి పరిణామం. సినిమాల్లోనే చిరంజీవికి సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! మరోవైపు చిరంజీవిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! -
మీరిప్పుడున్నది సముచిత స్థానం కానీ..
పుణే: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు ఆదివారం పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మీరిప్పుడు సరైన స్థానంలో ఉన్నారు. కానీ, చాలా ఆలస్యమైంది’అని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్‌తో కలిసి నేను పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమమిది. ఈ సందర్భంగా ఆయనకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు సముచిత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఎప్పుడూ ఇదే స్థానంలోనే ఉండటం సబబు. కానీ, ఈ స్థానంలోకి ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. నెల క్రితం ఎన్సీపీనీ చీల్చిన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు ఆయన వర్గానికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
షరతులకు అంగీకరిస్తే సంకీర్ణానికి సిద్ధం
శివాజీనగర: ఈసారి కూడా ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవటంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తమ షరతులకు ఆమోదిస్తే సంకీర్ణానికి సిద్ధమనే సందేశాన్ని పంపినట్లు తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారస్వామి...తమకు 50 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము విధించే షరతులకు అంగీకరించే పార్టీలతో పొత్తు సిద్ధమని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి..పలు పర్యాయాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో ఈసారి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలకు జలవనరుల, విద్యుత్, ప్రభుత్వ పనుల శాఖలు ఇవ్వాలి. జేడీఎస్ ప్రణాళికా అంశాలను అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఇవ్వాలని తదితర షరతులు పెట్టనున్నట్లు తెలిసింది. -
భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ, సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టిని ఆయన అభినందించారు. జీఎంఆర్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. అందరికీ నమస్కారం.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రపంచంలో చాలా ఎయిర్‌పోర్ట్‌లు కట్టాను. కానీ మా సొంత ఊరు రాజాం. వైజాగ్ రెండో ఊరు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫౌండేషన్ వేశారు. ఆయనే సీఎంగా ఉండగానే ప్రారంభించారు.. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇనాగ్యురేషన్కి కూడా వైఎస్సార్ వచ్చారు.. ఈ రోజున భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ ఆయన తనయుడు జగన్ తన అమృత హస్తాలతో శంకుస్ధాపన చేయడం, వారే మళ్లీ ఇనాగ్యురేట్ చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. చదవండి: అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ, సీ పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల కనెక్టివిటీపై చేసిన పాలసీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం గారికి నా అభినందనలు. ఆ సమావేశం ఒక అద్భుతం. నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. ప్రపంచంలో మాకిది 12వ ఎయిర్పోర్ట్.. హైదరాబాద్, గోవా తర్వాత మేం నిర్మిస్తున్న మూడో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ప్రపంచస్ధాయి ప్రమాణాలతో మేం నిర్మిస్తాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన కొత్తలో 1999–2000 లో 7 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా, ఇప్పుడు 500కు చేరాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఎకానమీనే మారిపోయింది. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కూడా కడతాం.. ఇక్కడ కార్గో కూడా ఉండడం వల్ల రైతులకు, మత్స్యకారులకు, ఫార్మా ఇండస్ట్రీకి ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుంది.. ఇక్కడి సంస్కృతిని చూసి ఈ ఎయిర్పోర్ట్ డిజైన్ చేశాం. మేం ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు అధ్వానంగా ఉండేది.. దానిని నెంబర్ వన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాం.. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చేస్తాం, భగవంతుడు కూడా వర్షం రూపంలో మనల్ని దీవించారు.. నేను జీఎంఆర్ తరపున 36 నెలల్లో నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కడతానని హామీ ఇస్తున్నాను, మీరే మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిరకాల వాంఛ నెరవేరింది: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందరికీ నమస్కారం, భోగాపురం ఎయిర్పోర్ట్ చిరకాల వాంఛ. గత ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ కావాలని ప్రజలందరినీ ఇబ్బంది పెడితే నాడు సీఎం జగన్ మన ప్రాంతానికి వచ్చి మన పక్షాన పోరాడి.. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని, 3 నుంచి 5 వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టవచ్చని మన తరుపున పోరాడారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగారి చొరవతో అందరికీ నష్టపరిహారం ఇచ్చి, కేసులు ఎత్తివేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తున్నారు. సీఎం మాట తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ ఆవశ్యకత చెప్పగానే ఆయన మంజూరు చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా శంకుస్ధాపన చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రకటించాలని.. మా ప్రాంత ప్రముఖులు కొమ్మూరు అప్పడుదొర, పెనుమత్స సాంబశివరాజు గారి పేర్లు పెట్టేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కోరుతున్నాను. చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? పాలకులు మంచి వారు అయితే ప్రజలు బాగుంటారు, ఆర్ధిక సమస్యలు ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్, సీఎంగా చిరకాలం సీఎంగా ఉంటే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. మల్లికార్జునరావు మన ప్రాంత వాసి. ఆయన సొంత ఊరు రాజాం కూడా విజయనగరం జిల్లాలో ఉంది. జీఎంఆర్ గారు కూడా ఇప్పుడు మా జిల్లా వాసే, ధన్యవాదాలు. -
డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. చలపతిరావు వల్లే బతికి బయటపడ్డాను: నటి
సినీ, టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా వెండితెరపై మెప్పించిన ఆమె నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత జంబలకిడి పంబా, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశారు. అందాల తారగానూ గుర్తింపు పొందిన ఆమె స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగుల వేశారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ అయితే ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన వారం రోజులకే భర్త నిజస్వరూపం భయపడింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకున్నట్లు గతంలో ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. తాజాగా ఆమె పాత వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఓ మూవీ సమయంలో వినోద్‌తో పరిచయం ఏర్పడింది. ఓ సంఘటనలో ఆయన నన్ను సేవ్ చేశాడు. దీంతో అతడికి కనెక్ట్ అయ్యాను. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. కానీ ఆయనను పెళ్లి చేసుకోవద్దని సీనియర్ నటుడు చలపతి రావు, ప్రొడ్యూసర్ జయకృష్ణగారు నన్ను హెచ్చరించారు. ఇక పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే చచ్చిపోతానంటూ ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానన్నాడు. దాంతో నా మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో వాళ్లు ఆయనతో పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. దీంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న. ఇష్టం లేకపోయిన మా వాళ్లు ఆ పెళ్లికి వచ్చారు. అయితే కట్నం ఇవ్వడానికి నా పుట్టింట వాళ్లు ఓ అగ్రిమెంట్ రాయించుకున్నారు. పిల్లలు పుట్టాకే నాకు చెందాల్సిన ఆస్తి ఇస్తామంటూ బాండ్ పేపర్‌పై నాతో సంతకం చేయించుకున్నారు. పెళ్లయిన వారం రోజులకు ఇది ఆయనకు తెలిసింది. దీంతో నువ్వు ఎందుకు సంతకం చేశాడు.. ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకోమంటూ నన్ను వేధించాడు. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు ఇక అప్పుడే అర్థమైంది ఆస్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. అలా మూడు నెలలు పంటికింద బాధలను భరించాను. ఆ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక నీకు నాకు సెట్ అవ్వదు విడిపోదామని చెప్పా. ఏడాది కాకముందే విడిపోయాం. చివరి రోజుల్లో ఆయన నన్ను ఇంట్లో బంధించాడు. యాసిడ్ పోస్తా, చంపేస్తానంటూ చాలా వేధించాడు. నన్ను హౌజ్ అరెస్ట్ చేస్తే చలపతి రావు గారు, గోపాలకృష్ణ నన్ను ఆ ఇంటి నుంచి విడిపించారు. వారే లేకపోతే ఆ ఇంటిలోనే నేను ఏమైపోయేదాన్నో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో జయలలిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
మంచు విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నాడంటే..
మంచు వారసుల వివాదం ఇటీవల ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తన అన్న, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన అనుచరులతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను, బంధువులను.. ఇది సిచ్యువేషన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కాసేపటికే ఆ వీడియోను మనోజ్ డిలిట్ చేయడం గమనార్హం. తండ్రి మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో మనోజ్ ఆ వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వివాదంపై మనోజ్ స్పందించాడు. ఓ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మనోజ్‌కు అన్న మంచు విష్ణు వీడియోపై స్పందించాల్సిందిగా విలేకర్లు ప్రశ్నించారు. దీనికి మనోజ్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇది నన్ను అడగకండి. నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసు. వారినే అడగండి. నన్ను అడగోద్దు’ అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు సినిమానే లైఫ్, మీరే నా జీవితం. సినిమా లేకపోతే నాకు ఏం లేదు. మళ్లీ వస్తున్నా. వాట్ ద ఫిష్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి, ఇటివలె కొత్త జీవితం ప్రారంభించాను. మీ అందరు ఆశీర్వాదించి మాకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నా’ అంటూ ముగించాడు. చదవండి: మంచు బ్రదర్స్ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది.. గర్వంగా ఉంది నాన్న.. తనయుడికి చిరు స్పెషల్ విషెస్ -
అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా రక్షిత్‌కి క్రెడిట్..
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. కన్నడ నటి అయిన రష్మిక తెలుగులో చక్రం తిప్పుతొంది. ఇక ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాజాగా ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గతంలో తనకు నటిగా తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ పేరు చేప్పేందుకు ఆసక్తి చూపని ఆమె ఏకంగా తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టికి క్రెడిట్ ఇచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ దక్షిణాన చర్చనీయాంశమయ్యాయి. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ఈ మేరకు తాజా ఇంటర్య్వూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను నటిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలని కొన్ని సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. నిరాశతో వెనక్కి వచ్చేదాన్ని. నటన అనేది నాకు సెట్ కాదని, అది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొన్నా. ఈ పోటీలో గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దానిని చూసి పరంవా స్టూడియోస్ (రక్షిత్ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ) నుంచి కాల్ వచ్చింది. వాళ్లు తెరకెక్కిస్తోన్న ‘కిరిక్ పార్టీ’లో నాకు లీడ్ రోల్ ఆఫర్ చేశామని దర్శక- నిర్మాతలు చెప్పారు. అలా, నటిగా నా తొలి అడుగు పడింది’’ అని రష్మిక చెప్పుకొచ్చింది. చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్ కన్నుమూత కాగా కాంతార మూవీ సమయంలో రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో నటిగా తనకు కెరీర్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ చెప్పకుండ సో కాల్డ్ ప్రొడక్షన్ అని వ్యాఖ్యానించింది. దీంతో కన్నడ నాట ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. శాండల్‌వుడ్ సినీప్రముఖులు సైతం రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పడంతో ఎట్టకేలకు రష్మిక దిగొచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కిరిక్ పార్టీ సమయంలో ప్రేమలో పడిని రక్షిత్ శెట్టి-రష్మికలు ఎంగేజ్మెంట్ చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. -
తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్‌పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఆయనతో పని చేసిన ప్రతి నటీనటులు తారక్ డాన్స్, నటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్‌లో చెప్పేస్తుంటాడంటూ సర్ప్రైజ్ అవుతుంటారు. అలాగే సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ కూడా తారక్ నటన, డైలాగ్ డెలివరి గురించి చెబుతూ వండర్ కిడ్ అని కొనియాడారు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో ఆయన స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్‌పై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఈ మూవీ సమయంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన పాత వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ నటన గురించి ఏం చెప్పిన తక్కువే. ఆయన ఎప్పుడు డైలాగ్ చదువుతాడో తెలియదు. టేక్ అనగానే మూడు, నాలుగు పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్‌లో చెబుతాడు. సెట్లో ఎప్పుడు సరదగా ఉండే తారక్.. డైలాగ్ పేపర్ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఆయన కెమెరా కోసమే పుట్టారనిపిస్తుంది. ఇదంతా సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, కృషి వల్లేనేమో. చెప్పాలంటే తారక్ వండర్ కిడ్’ అంటూ ఎన్టీఆర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. చదవండి: నాటు నాటు సాంగ్ పెడితేనే నా కొడుకు తింటున్నాడు, అది కూడా తెలుగులోనే: కరీనా కపూర్ -
ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ఈ సందర్భంగా దసరాలోని ఓ సన్నివేశం తనని చాలా ఇబ్బంది పెట్టిందని, దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదంటూ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. దీనిక సంబంధించిన సీన్లో నేను ఆ డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్‌తో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్లో నేను ఆ డంపర్‌లో నుంచి క్రింద పడిపోయాను. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు సింథటిక్ కోల్స్ కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు డంప్‌లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. అది గుర్తోచ్చినప్పుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేస్తుండేవాడిని. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. దీనివల్ల రెండు నెలల పాటు సరిగా నిద్రపట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. -
ఈ ఏడాది చరణ్ దే: భర్తపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
తన భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో సైతం ఆమె యాక్టివ్‌గా ఉంటారు. తన సంబంధించిన విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పంచుకుంటారు. త్వరలోనే తల్లికాబోతున్న ఆమె తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె హీరోగా చరణ్ సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న అవార్డుల గురించి చెబుతూ మురిసిపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ నాకు మద్దతు ఇస్తుంటాడు. అలాగే నేను కూడా ప్రతి విషయంలో తనకి సపోర్ట్‌గా ఉంటాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ నేను చర్రి వెన్నంటే ఉంటాను. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి సందర్భంలోనైనా వీలైనంత వరకు తనకి సాయం చేస్తూంటా. ఇక ఈ ఏడాది చరణ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన వర్క్ పరంగానూ, వ్యక్తిగతంగానూ 2023 ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన అందుకుంటున్న అవార్డులు, ప్రశంసలతో చరణ్ చాలా ఆనందంగా ఉన్నాడు. ముఖ్యంగా తన వర్క్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాడు. మీరే చూస్తున్నారు ఆయనకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం తను ఎన్నోప్రశంసలు అందుకున్నాడు. చూస్తుంటే ఈ ఏడాది చరణ్‌దే అనిపిస్తోంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఈ మూవీ టీంతో పాటు ఉపాసన కూడా అమెరికాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. -
ఈ రాజకీయాలు టార్చర్ అనిపిస్తున్నాయి: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నేతలెవరైనా సరే ప్రజాదరణ ఉన్నంత వరకే రాజకీయాల్లో ఉంటామంటూ పేర్కొన్నారాయన. మెదక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఛత్రపతి శివాజీలా బతకాలని.. శంభాజీ చనిపోవాలన్నదే తన కల అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ రాజకీయాలు టార్చర్లా అనిపిస్తున్నాయని పేర్కొన్నారాయన. -
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన ప్రస్తుతం విలన్‌గా మెప్పిస్తున్నారు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశంపైన అయిన స్ట్రేట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జగపతి బాబు తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పిల్లలు, వారి పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి పేరు మేఘన.. అమెరికన్‌ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను అమెరికాలో సెటిల్ అయ్యింది. చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. తనకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పా. ఒకవేళ తను చేసుకుంటానంటే మాత్రం కాబోయే భర్తను తానే వెతుక్కోమని చెప్పాను. నేను మాత్రం అబ్బాయిని చూడనని చెప్పాను. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్నా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అనంతరం మాట్లాడుతూ.. ‘నా పిల్లలు అంటూ మన ఆశలను వారిపై రుద్దడం తప్పు. వారికంటూ ఓ జీవితం, స్వతంత్య్రం ఉంటుంది. మన స్వార్థం కోసం పిల్లలను పెళ్లి చేసుకోమనడం, పిల్లలను కను అనడం స్వార్థం అవుతుంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని అనడం నా దృష్టిలో తప్పు. అది స్వార్థం అవుతుంది. నీ ఇష్టం.. నీకు నచ్చినంటూ నువ్వు ఉండు అని చెప్పడం ప్రేమ’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అదే విధంగా తన పెద్ద అమ్మాయి పిల్లలను కనని చెప్పిందని, కుక్కలు, పిల్లులను పెంచుకుంటానందని చెప్పిందన్నారు. తను అలా చెప్పడంతో వెంటనే సరే.. నీ ఇష్టమని చెప్పానని జగపతి బాబు పేర్కొన్నారు. -
ప్రేమ దేశం చిత్రంలో నటించడం నా అదృష్టం: నటి మధుబాల
‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం. -
అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమారంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస విజయాల బాటలో కొనసాగుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈమె హవా కొనసాగిస్తోంది. కోలీవుడ్‌లో తాజాగా రష్మిక నటించిన తమిళ-తెలుగు చిత్రం వారిసులో నటుడు విజయ్‌తో రొమాన్స్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా రష్మిక తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లు అయిందని, ఎంతోమంది ప్రతిభావంతమైన, అందమైన నటీమణులు ఉన్నా కూడా తనకు అన్ని భాషల్లోనూ అవకాశాలు లభించడం తన అదృష్టమని చెప్పింది. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. తన శ్రమకు తోడు దర్శక నిర్మాతల సహకారం, ప్రేక్షకుల అభిమానం, అన్నిటికీ మించి భగవంతుని ఆశీస్సులతోనే ఇన్ని విజయాలు వరించాయనంటోంది. తాను ఇతరుల సమయాన్ని, ప్రయత్నాలను గౌరవిస్తాను అని, ఒక నటిగా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని తెలిపింది. సాధ్యమైనంత వరకు అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పింది. నటుడు విజయ్‌కి తాను వీరాభిమానిననీ, అలా నచ్చిన నటుడితో వారిసు చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిందని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. -
‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, మూవీ చూసి సెన్సార్ బోర్డు ఏమన్నదంటే..!
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నాడు. ఆయన నటించి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య జవవరి 13న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ప్రచార పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎక్కడ చూసిన వాల్తేరు వీరయ్య హావానే కనిపిస్తుంది. దీంతో ఈ పండగా చిరు ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్గా విడుదలైన పూనకాలు లోడింగ్ సాంగ్ చూస్తుంటే థియేటర్లో ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించడం కాయం అనిపిస్తోంది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మాస్ మసాలా మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు.. యూ/ఏసర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈసారి చిరు వాల్తేరు వీరయ్యతో థియేటర్లో రచ్చ చేయబోతున్నాడంటూ కొనియాడారని తెలుస్తోంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ‘బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రికార్డు బ్రేక్ చేయడం ఖాయం. రీఎంట్రీ తర్వాత చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో ఈ మూవీ అలా ఉండబోతోంది. ఎమోషనల్, యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. చిరంజీవి-రవితేజ కాంబినేషన్లో ఉండే సన్నివేశాలు అయితే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా డైరెక్టర్ డిజైన్ చేశారు’ అంటూ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట. ఇక చిరంజీవి మాస్ స్టెప్పులకు వారు ఫిదా అయినట్లు తెలుస్తోంది. కాగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. Its a U/A for #WaltairVeerayya 💥🤘🏾 Sankranthi ki ROUGH AADINCHESTADU 🔥❤️🔥#POONAKAALULOADING 🔥💣#WaltairVeerayyaOnJan13th Mega ⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/qeLc5q2hMr — Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023 -
‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. చదవండి: సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం తొలుత కన్నడ చిత్రం విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రతి ప్రేక్షకులు ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా కాంతార మూవీ బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ కానీ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన కాంతార మూవీ కలెక్షన్లతో మ్యాజిక్ చేసింది. దీంతో సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది ఈ సినిమా. నా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఆలోచలనలో పడేసింది కాంతార. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది. ఇక నుంచి మేం సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్‌ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కాంతార సినిమా తెలిపింది’ అని రాజమౌళి పేర్కొన్నారు. -
ఆ మూడు చెంప దెబ్బల వల్ల బాలీవుడ్ వదిలేద్దామనుకున్నా: శక్తి కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80, 90లలో ఆయన హింది చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వారసురాలిగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా బి-టౌన్లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తనదైన నటన, కామెడీతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన శక్తి కపూర్ ఒకానోక సమయంలో పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న లెజెండరి కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా షోకు శక్తి కపూర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో హాస్యనటులు అస్రానీ, పెంటల్, టీకు తల్సానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను మూడు చెంప దెబ్బలు తిన్నానని, దానివల్ల తాను పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నా మొదటి కామెడీ చిత్రం సత్తె పే సత్తా. ఇందులో పెంటల్‌తో కలిసి పని చేశాను. అది చాలా మంచి చిత్రం. అందులో నటించాలని ఓ కామెడీ పాత్ర కోసం రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మావాలి అనే సినిమా చేశాను. సినిమాలో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్‌ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేను నేలపై పడ్డాను. రెండో షాట్లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది. దాంతో నా కెరీర్ ముగిసింది అనుకున్నా’ అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడుసార్లు చెంప దెబ్బలకు నెలపై పడ్డ నేను.. నా కెరీర్ ముగిసిపోయిందని ఆందోళన పడ్డాను. ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించారు. అందులో ఖాదర్ ఖాన్ కూడా నటించారు. ఇక షూటింగ్ గ్యాప్‌లో ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. మీకు దండం పెడతా(కాళ్లు మొక్కుతా అని బతిమాలను). నాకు సాయంత్రం టిక్కెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. ఈ సినిమా నేను చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇంకా పెళ్లి కూడా కాదు’ అని అన్నాను. అయితే అదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ నా దగ్గరకి వచ్చి.. ‘ఈ చెంప దెబ్బ మీకు మరింత పాపులారిటిని తెచ్చి పెడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచించకుండ ఈ సినిమా చేయండి’ అని సలహా ఇచ్చారు. ఆయన అడ్వైస్తో నేను ఇండస్ట్రీలో కొనసాగను’’ అంటూ శక్తి కపూర్ చెప్పుకొచ్చారు. చదవండి: ఆసక్తిగా సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష టైటిల్ గ్లింప్స్, ఎన్టీఆర్ వాయిస్ అదుర్స్ అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
తెలంగాణ: మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి సంస్థల అధినేత, తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు. ఐడీ రైడ్ చేశారు. నేను భయపడలేదు. నాలుగు వందల మంది వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేసుకున్నారు. నేనేం క్యాసినో నడిపించడం లేదు. కాలేజీలు నడిపిస్తున్నా. అయినా కొందరు బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారు అని కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అంతేకాదు.. మెడకిల్ కాలేజీల్లో డొనేషన్లు లేవు. ఆన్లైన్ అడ్మిషన్లే. నా కొడుకు సీటు కావాలన్న నేను ఇవ్వలేదు. భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేయించా. కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. ప్రేమ దోమ పక్కనపెట్టి కష్టపడి చదవాలి. ప్రేమ, ఫ్రెండ్షిప్ అన్నింటికీ దూరంగా ఉంటేనే సక్సెస్ అంటూ హితబోధ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారని విద్యార్థులకు మల్లారెడ్డి తెలిపారు. కల కన్నాను దాన్ని నిజం చేసుకున్నాను నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని మల్లారెడ్డి అన్నారు. ఆపై.. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేది. అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు నా మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యింది. మీరు కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
ఎమ్మెల్సీగా నాకు తృప్తి లేదు: కౌశిక్ రెడ్డి
-
నాతో నటించేందుకు చాలా మంది వెనకాడుతున్నారు: ప్రకాశ్ రాజ్
తనతో కలిసి నటించేందుకు వెనకాడుతున్నారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య ప్రకాశ్ రాజు సినిమాల కంటే రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని, మోదీ సర్కార్ టారెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. 2019లో ఆయన బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అదే ఆసక్తి తన సినీ కెరీర్‌ను దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల ఓ ఇంగ్లీష్ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినీ కెరీర్‌పై రాజకీయ ప్రభావం పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొందరు నాతో కలసి పనిచేయడం లేదు. నాతో కలసి నటించొద్దని వారికి చెప్పడం వల్ల కాదు. నాతో పనిచేస్తే వారిని యాక్సప్ట్ చేయరేమోనన్న భయం పట్టుకుంది. అలాంటి వారందరినీ కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భయం మరొకరికి శక్తిగా కాకూడదనుకుంటాను. అందుకే ఎలాంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళతాను. చదవండి: కృష్ణ చనిపోయారని బాధపడకండి, స్వర్గంలో ఆమెతో కలిసి..: వర్మ ట్వీట్ వాటిని స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘నేను వీటి విషయంలో కొంచెం కూడా విచారించడం లేదు. నటపైనే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు మరింత స్వేచ్ఛగా భావిస్తున్నాను. ఎందుకంటే, నేను నా స్వరాన్ని వినిపించకపోతే కేవలం ఓ మంచి నటుడిగానే చనిపోతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారని, అందుకు తాను వారిని నిందించాలని అనుకోవడం లేదన్నారు. ఎందుకుంటే మాట్లాడడం వల్ల వచ్చే పరిణామాలను వారు తట్టుకోలేరంటూ ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. -
తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
తన స్థానంలో సౌమ్య రావు అనే కొత్త యాంకర్‌ను తీసుకురావడంపై రష్మీ గౌతమ్ స్పందించింది. కాగా గతంలో జబర్దస్థ్‌కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్స్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీగా కారణంగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చంది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీ యాంకర్‌గా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సడెన్‌గా షో సౌమ్య రావు కనిపించడంతో రష్మీని తీసేశారని, ఈ కామెడీ షో నుంచి రష్మీ జౌట్ అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. చదవండి: బిగ్‌బాస్ 6: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! అంతేకాదు ఈ విషయంలో రష్మీ సీరియస్‌గా ఉందంటూ వదంతులు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై రష్మీ స్పష్టత ఇచ్చింది. ఆమె నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రం రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మీకి దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని స్వాగతిస్తున్నా. ఆమె వస్తుందని మల్లెమాల వారు ముందుగానే నాకు చెప్పారు. చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో కొద్ది రోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే వారు నాకు చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది’ అని చెప్పింది. అయితే ఒకవేళ సౌమ్య వేరే షోస్‌తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని రష్మీ పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బందేం లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్ధమేనని రష్మీ చెప్పుకొచ్చింది. -
భారతరత్న నాకు అవసరం లేదు: పి సుశీల ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళ సినిమా: గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఈమె 70వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌బుక్ రికార్డు, ఏ షియన్ బుక్‌లో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పత్రికా సంఘం శనివారం సాయంత్రం నిర్వహించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.సుశీల, ని ర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు మోహన్‌రాజా, నటుడు సతీష్ తదితరులు దీపావళి సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేది పాత్రికేయులేనన్నారు. అప్పట్లో సినిమా సమాచారం ఆల్ ఇండియా రేడియో కంటే ముందే పత్రికల్లో వచ్చేవన్నారు. తాను పెద్ద గాయని కావాలన్నది తన తండ్రి కోరికని, అది తాను నెరవేర్చాననే అనుకుంటున్నానన్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే గాయనిగా భిక్ష పెట్టింది సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథ్ అని పేర్కొన్నారు. జనరేషన్ మారుతున్న సంగీతం ఎప్పటికీ మరవలేనిదన్నారు. అయితే తమ కాలంలో పరిశుద్ధంగా ఉండేదని, ఈ జనరేషన్లో ...అంటూ నవ్వేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేసింది అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అని తెలిపారు. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఇక భారతరత్న అంటారా? అది తనకు అవసరం లేదని, గాయనిగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయానన్న సంతృప్తి చాలన్నారు. తాను పి.సుశీల పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా పేద సంగీత కళాకారులకు నెలనెలా పింఛన్ అందిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ట్రస్టు ద్వారా ఏటా ఒక ఉత్తమ సంగీత కళాకారులను ఎంపిక చేసి అవార్డు, రూ.లక్ష నగదును అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తన పాటలకు రాయల్టీ రావడం లేదని, అది వస్తే మరికొందరికీ సాయం చేసే అవకాశం ఉంటుందని గాయని పి.సుశీల అన్నారు. కాగా ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నటుడు బోండామణికి పత్రికల సంఘం కార్యవర్గం ఆర్థిక సాయం అందజేసింది. -
అందుకే గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తున్నా: ‘జెర్సీ’ మూవీ హీరోయిన్
తన అందాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని నాని జెర్సి మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బ్యూటీ విక్రం వేదా చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయమైందిఈ బెంగళూరు బ్యూటీ. ఆ మూవీ విజయంతో ఆమెకు ఇక్కడ అనేక అవకాశాలు వచ్చాయి. అలా ఆమె అజిత్ కథానాయకుడుగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదేవిధంగా మాధవన్‌కు జంటగా మారా అనే చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. జెర్సీ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకుంది. అదేవిధంగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. చదవండి: ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పిన అల్లు అరవింద్ అయితే 2015లో నటిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇంకా స్టార్ ఇమేజ్ను మాత్రం పొందలేదనే చెప్పాలి. అదేవిధంగా చేతిలో ప్రస్తుతం పెద్దగా చిత్రాలు కూడా లేవు. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామర్ మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఫొటో షూట్ ఏర్పాటు చేసుకుని తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలను దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది. దీంతో వారు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల మాట్లాడుతూ తన అందమైన ముఖాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని అందుకే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. -
మా టార్గెట్ అదే.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలే తమ టార్గెట్ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఈ దేశానికి గుదిబండ. 2024 తర్వాత కాంగ్రెస్ కనుమరుగయ్యే ఛాన్స్. ప్రధాని అసమర్థుడు, చేతకాని వారు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చెప్పినవి ఏమీ ప్రధాని చేయలేదు. ఈడీ, సీబీఐ, ఐటీలను వేటకుక్కలుగా బీజేపీ వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
‘పొన్నియన్ సెల్వన్’ వివాదం, కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో పాన్ చిత్రం రూపొందిన ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే తమిళనాట తప్ప ఈ సినిమా మరే భాషల్లో పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో విడుదల అనంతరం ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్ సెల్వన్‌కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు. చదవండి: ‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా? దీంతో తమిళనాట దీనిపై పెద్ద వివాదమే రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ‘‘సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం ‘శంకరాభరణం’ ఆదరిస్తే వాళ్ళు మన ‘మరో చరిత్ర’ను ఆదరించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక తమిళ చారిత్రక కథ, దానిని ఇతర భాష వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి పోయి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే.. అనంతరం అసలు చోళరాజులు హిందువులు కాదంటూ కమల హాసన్ కామెంట్స్ చేశారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వమే లేదని, అప్పట్లో హిందూమతం లేదన్నారు. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్ పేర్కొన్నారు. ఇక కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రధాని మోదీకి వెంకయ్యనాయుడి సలహా
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేతలను కలవాలని సలహా ఇచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తక ఆవిష్కరణలో ముందుగా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు వెంకయ్యనాయుడు. భారతదేశం ఇప్పుడు లెక్కించదగిన శక్తి. దాని స్వరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. మోదీ పాలనలో దేశం ఆరోగ్య రంగం, విదేశాంగ విధానం, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లో లక్ష్యసాధనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుందని కొనియాడారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఘనత సాధించడం సర్వసాధారణ విషయం కాదని, అద్బుతమన్న వెంకయ్యనాయుడు.. మోదీ నిర్ణయాలు, ఆ మార్గంలో యావత్ దేశపౌరులు పయనించడమే కారణమని చెప్పారు. కానీ, మోదీ పాలనాపరమైన విధానాలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉందని.. అందుకు రాజకీయపరమైన కారణాలు, అపార్థాలు కూడా కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. వాటిని చెరిపేసేందుకు తరచూ మోదీ రాజకీయ వర్గాలను కలుస్తూ ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలను కలుస్తూ ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. తద్వారా అపార్థాలు తొలగిపోతాయన్నారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, ప్రజల ఆదేశాన్ని గౌరవించాలని నాయుడు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కారని గుర్తించాలని అని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి.. ఇలా ఉన్నతపదవులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారాయన. 2019 మే-2010 మే మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలతో కూడిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐబీ సెక్రెటరీ అపూర్వ చంద్ర హాజరయ్యారు. ఇదీ చదవండి: హర్తాల్ కోసమే కాంగ్రెస్ యాత్రకు బ్రేక్! -
నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఫ్యాన్స్ బేస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెకు టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్ బేస్ మీకుందని, మీరు ట్రెండ్ సెట్టరా అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ దీనిపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అదే అర్థం కాదని, అసలు వారంత తనలో ఏం చూసి అభిమానిస్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతానన్నారు. దీంతో అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనేది మీరు ఒప్పుకోట్లేదా అని అడగ్గా.. ఇలాంటి కొన్ని అంశాలు తనని ఇబ్బంది పెడతాయన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే. వారంత నా పాట అంటే ఇష్టపడతారా? నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్లిన ‘మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ పలకరిస్తారు. ఓ సారి నేను ఓ ఈవెంట్ వెళ్లాను. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్.. దీని ఆంతర్యం ఏంటి? అక్కడ నన్ను ఓ వ్యక్తి చూసి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. చూట్టూ బౌన్సర్స్ ఉన్నారు. అయినా అతను నా దగ్గరి పరుగెడుతున్నాడు. నేను అతడిని వదలిలేయమని బౌన్స్ర్కు చెప్పాను. అతను నా దగ్గరిక వచ్చి అభిమానాన్ని చాటుకుంటాడనుకున్నా. కానీ రాగానే అతడు తన ఫోన్లో నా ఫొటో చూపించాడు. అది చూపిస్తూ ‘మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు. ఈ చీర చాలా బాగుంది. ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా’ అన్నాడు అని చెప్పింది. అనంతరం ‘కొంతమందిని పక్కనే పెడితా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనీగా నా కళను గుర్తించి నన్ను.. నన్నుగా అభిమానించేవారు చాలామంది ఉన్నారని తెలిసి ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ -
సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్.. దీని ఆంతర్యం ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన చిత్రంలోని ఓ డైలాగ్‌ను షేర్ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ చిత్రంలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను చిరు తాజాగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయపరంగా ఆసక్తిని పెంచుతున్నాయి. చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు మంగళవారం చిరు ట్వీట్ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో ఉన్న ఆడియోను షేర్ చేశారు. దీంతో చిరు రాజకీయ రీఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ డైలాగ్ షేర్ చేయడం వెనక ఆంతర్యం ఏంటా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. pic.twitter.com/6UQ1QwNsWi — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022 -
‘భార్యంటే.. వాడుకుని వదిలేసే వస్తువు కాదు’
ఆయనకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించాడు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. భార్యను శాశ్వతంగా వదిలించుకుని ప్రియురాలికి దగ్గరయ్యేందుకు ‘విడాకుల’నే మాస్టర్ ప్లాన్ వేశాడు. పైగా భార్య తనపై దాడి చేసిందంటూ ‘వైవాహిక క్రూరత్వం’ కారణంగా చూపించాడు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే.. వివాహ బంధం.. ఏదో వస్తువును కొనుక్కున్నట్లు కాదు. భార్యంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు. మన సంప్రదాయం అది కానే కాదు. ఇప్పటి యువతరం మనస్తత్వాన్ని, పాటిస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయపు అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం. కొత్త తరం దాదాపుగా.. పెళ్లంటే ఒక అరిష్టంగా భావిస్తోంది. సహజీవన సంప్రదాయం పెరిగిపోతోంది. ఇది సమాజపు మనస్సాక్షిని ఇబ్బందికి గురి చేస్తోంది. WIFE అంటే.. ఈరోజుల్లో.. అంతా పెళ్లిని ఒక ‘చేదు’ అనుభవంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవితానికి, బాధ్యతలకు, విధులకు పెళ్లి ఒక ఆటంకంగా మారిపోయినట్లు ఫీలైపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ అంటే Wise Investment For Ever అనే అర్థం ఉండేది. ఇప్పుడది Worry Invited For Everగా మారిపోయింది. 'యూజ్ అండ్ త్రో' అనే వినియోగదారుల సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకోవడానికే.. లివ్-ఇన్-రిలేషన్షిప్స్ అన్నచందాన మారిపోయింది పరిస్థితి. విడాకులతో నాశనం కాబడ్డ కుటుంబాల ఆర్తనాదాలు మొత్తం సమాజం మనస్సాక్షిని కదిలించే శక్తి ఉంది. విడాకుల కోసం కోర్టుకెక్కిన జంటలు, విడాకుల తర్వాత పిల్లలను విడిచిపెడుతున్నవాళ్లు, విడాకులు తీసుకున్నవారు.. పెరిగిపోతున్నప్పుడు.. కచ్చితంగా అది సామాజిక జీవితంలోని ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు అని కేరళ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఏంటంటే.. కేరళ అలపుజ్జాకు చెందిన జంటకు సౌదీ అరేబియాలో స్థిరపడింది. 2009లో వివాహం జరగ్గా.. 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు భర్త. తన భార్య తనపై దాడి చేసిందని, క్రూరత్వం కింద తనకు విడాకులు ఇప్పించాలని కోరాడతను. అయితే.. 2017 నుంచి ఓ మహిళతో తన భర్త వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని, ప్రశ్నించినందుకే ఇలా తన నుంచి విడిపోవాలనుకుంటున్నాడని సదరు భార్య వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భార్య క్రూరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో క్ట్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్.. డైవోర్స్ యాక్ట్ 1869 ప్రకారం.. ఫ్యామిలీ కోర్టు ఆ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే.. అతని తల్లి మాత్రం కోడలి వైపే నిలబడింది. తన కొడుకు కోడలు, వాళ్ల పిల్లలతో మంచిగా బతకాలని పోరాడింది. మరోవైపు భార్య(38) కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని వదులకుని తనతో సంతోషంగా ఉంటే చాలనుకుంటోంది. దీంతో ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు బెంచ్.. పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని నొక్కి మరీ చెప్పి.. విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు.. భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని సదరు భర్తకు సూచిస్తూ డివిజన్ బెంచ్ జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్యూ, జస్టిస్ సోఫీ థామస్‌లు కీలక వ్యాఖ్యలతో ఆగస్టు 24వ తేదీన తీర్పు ఇచ్చారు. ఇదీ చదవండి: డాక్టర్ కోసం పడిగాపులు.. కన్నతల్లి ఒడిలోనే పసికందు మృతి -
ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు
PV Sindhu About Prabhas In Latest Interview: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని ఉన్నంతంగా నిలబెట్టాయి. ఇటీవల కామన్వెల్త్ 2022 గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి, ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వూలో పాల్గొని తన ఫేవరేట్ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'మెడల్ తీసుకున్నప్పుడు మన చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది?' అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ''అక్కడ విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ హైగా వినిపించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది'' అని సింధు తెలిపింది. అనంతరం లవ్ లెటర్స్ గురించిన అడగ్గా.. ''ఇప్పటివరకు నాకు ఎన్నో ప్రేమలేఖలు వచ్చాయి. ఆ లెటర్స్ అన్నింటిని మా ఇంట్లో వాళ్లందరం కలిసే చదివేవాళ్లం. ఓ 70 ఏళ్ల వ్యక్తి అయితే, ఇలాగే లేఖ రాశాడు. అతనికిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్ చేస్తానని అందులో రాశాడు'' అని పేర్కొంది. చదవండి: నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రం.. నటికి భర్త మాత్రం లేడు! 'తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం' అని అడగ్గా ''చాలా మంది ఉన్నారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేము మంచి ఫ్రెండ్స్ కూడా'' అని సింధు చెప్పడంతో 'ఎందుకు సేమ్ హైట్ కాబట్టా?' అని యాంకర్ నవ్వులు తెప్పించాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూ ప్రొమోలో ''నేను ఏదైనా పోటీలో ఫెయిల్ అయితే.. ఎందుకలా ఆడుతున్నావ్? మొన్న ఆ గేమ్‌లో ఆడావు కదా అలా ఆడొచ్చు కదా అంటారు. అప్పుడు నాకు దా నువ్ వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది.'' అని చెప్పింది. 'భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా?' అన్న అప్రశ్నకు 'ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో!' అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది పీవీ సింధు. -
అలా రెండు సార్లు జరిగినా తట్టుకున్నాం: నిర్మాత
Aam Aha Movie Pre Release Event: డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః' మూవీ. మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండల ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ 'అం అః' చిత్రానికి ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ ట్యాగ్‌లైన్ పెట్టారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ప్రారంభించడానికి చాలా టైం పట్టింది. ముందు శ్యాం గారు నా వద్దకు ఓ కథ తీసుకొని వచ్చారు. అయితే దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందనిపించింది. ఆ తరువాత నవీన్ గారు మరో కథను తీసుకొచ్చారు. దాని మీద చాలా పని చేశాం. ఈ కథకు కొత్త వాళ్లు అయితే బాగుందని అనుకున్నాం. ఆ టైంలో మాకు సుధాకర్ కనిపించారు. ఈ సినిమా సమయంలో రెండుసార్లు పాండమిక్ వచ్చింది. అయినా తట్టుకున్నాం. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశారు. ఇందులో శ్యామ్ గారి పనితనం చూస్తే మైండ్ బ్లాక్ అవుతంది.. మళ్లీ మళ్లీ సినిమాను చూస్తారు. అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఒళ్లంతా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమాను చూసి విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ స్థాయి వరకు నేను రావడానికి ఎంతో మంది త్యాగం ఉంది. అం అ: టీం నన్ను నమ్మింది. సక్సెస్ అవుతాడా? లేదా? అనే ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను నమ్మి ఇంత వరకు తీసుకొచ్చారు. నా కుటుంబం నాకు అండగా నిలబడింది. నా నిర్మాతలు నన్ను నమ్మి.. వారి టైం, డబ్బు నా మీద ఖర్చు పెట్టినందుకు రుణపడి ఉంటాను. నాతో వర్క్ షాప్‌లు చేయించి ఇంత బాగా సినిమాను తీసిన దర్శకుడికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ‘నేను అనంతపురం అమ్మాయిని. బెంగళూరులో ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. ఇలాంటి చిత్రంలో నాకు ఆఫర్ వస్తుందని నేను అనుకోలేదు. శ్యామ్ సర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పని చేశారు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. నాకు సపోర్ట్ ఇచ్చిన నిర్మాత, హీరోకు థాంక్స్’ అని హీరోయిన్ సిరి కనకాల తెలిపింది. డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఫస్ట్ థియేటర్ మూవీ. నాకు ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కల సాకారం అవ్వడానికి మా నిర్మాత కారణం. సురేందర్ రెడ్డి, గుణ శేఖర్, వైవీఎస్ చౌదరిల వద్ద ఓ పదమూడేళ్లు పని చేశాను. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉండేలా కథ రాసుకుంటారు. వారి దగ్గరి నుంచి అది నేను నేర్చుకున్నాను. ఇందులో అప్లై చేశాను. నాకు ఈ టీం అంతా కూడా ఎంతో సహకరించింది. నవీన్ ఇరగాని నాకు ఈ సబ్జెక్ట్ అందించి సాయం చేశారు. కరోనా సమయంలో ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా మధ్యలో ఓ చిన్న చిత్రం చేశాం. ట్రూ అనే చిత్రం అమెజాన్‌లో 25 రోజులు టాప్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. దాని కంటే వంద శాతం ఎక్కువగా కష్టపడ్డాం. ఆ సినిమా కంటే ఇది పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది’ పేర్కొన్నారు. -
ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది: డైరెక్టర్
Aadi Sai Kumar Comments On Tees Maar Khan: స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తీస్ మార్ ఖాన్". విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ... ''ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేశాను కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాను కానీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అయింది అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు కల్యాణ్ ఈ కథ చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఈ కథకు మంచి స్పాన్ ఉందని, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనుకున్నాను. అయితే మా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. ఇప్పటి వరకు మేము అన్ని పాటలు ఆన్ లైన్ లోనే రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ అయ్యాంగార్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ,పూర్ణ వంటి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు. ప్రతిసారి సాయి కార్తీక్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తారు. డి. ఓ. పి. గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తరువాత థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అని భయముండేది. అయితే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అందరికీ మంచి హోప్ ని ఇచ్చాయి. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలి'' అని తెలిపారు. ''ఇందులో ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను కాదు, అయినా నేను ఈ కథ చెప్పగానే నన్ను నా కథను నమ్మి ఇంత పెద్ద కాస్టింగ్ ఇచ్చారు. హీరో ఆది గారికి ఈ కథ నచ్చుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. తను నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. సాయి కార్తిక్ గారు నేను అనుకున్న దానికంటే మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ పేర్కొన్నారు. -
'జీ సరిగమప' విన్నర్ శృతిక సముద్రాల ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే? -
రూల్స్ పక్కనపెట్టి ఆ పని చేశా: మంత్రి గడ్కరీ
ముంబై: ‘‘నేను తరచూ అధికారులకు చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అంటూ పని చేయాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానినే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మా ప్రకారమే పనిచేస్తుందని.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ, ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం మాత్రం వేరే ఉంది. మంచి చేయాలనే ఆలోచనే ఉంటే.. పేదల సంక్షేమ విషయంలో ఏ చట్టం, అధికారం అడ్డుతగలబోదన్న కోణంలో గడ్కరీ పైవ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం రూల్స్, బ్యూరోక్రసీని పక్కనపెట్టి ఆయన చేసిన ఓ మంచి పనిని గుర్తు చేసుకున్నారాయన. అది 1995వ సంవత్సరం. ఆ సమయంలో మనోహర్ జోషి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. గడ్కరీ ఏమో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్‌గా పని చేశారు. విదర్భ మేల్ఘాట్ రీజియన్‌లో పోషకాహార లోపంతో పిల్లలు మరణించడం ఎక్కువగా ఉండేది. కనీసం 2వేల మంది పిల్లలైనా చనిపోయి ఉంటారక్కడ. ఆ సమయంలో ఆ ప్రాంతానికి రోడ్లు వేయాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. కానీ, అటవీ శాఖ అధికారులు చట్టాల వంకతో అడ్డుకునే యత్నం చేశారు. చివరకు అమరావతి కమిషనర్ సైతం ఎలాంటి సాయానికి ముందుకు రాలేదు. అది బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ టైంలో నా దారిలో సమస్యను పరిష్కరించా అని చెప్పుకొచ్చారాయన. ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు గడ్కరీ. ‘‘ఏ చట్టం పేదల సంక్షేమానికి అడ్డుకాదన్నది నాకు తెలుసు. అవసరమైతే సదరు చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదు. మహాత్మాగాంధీ అదే చెప్పారు’’ అని గడ్కరీ ఉటంకించారు. నాసిక్‌లో మంగళవారం మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ చూపిన చొరవతోనే మేల్ఘాట్ రీజియన్‌లో 450 గ్రామాలకు రోడ్లు పడ్డాయి. అక్కడి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయ్ కూడా. ఇదీ చదవండి: ఆ బీజేపీ సీఎంకు పదవీగండం! -
ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్
Nithiin About Macherla Niyojakavargam Movie: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నితిన్ మీడియా సమావేశంలో నితిన్ పంచుకున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర విశేషాలివి. ►కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా. ►ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనే అలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ►కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కథ చాలా యూనిక్‌గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో ఉండే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో ఉంటుంది. ►2017 'లై 'షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ''నువ్వు డైరెక్టరైతే బావుంటుంది'' అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను. ►శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వల్ల .. ఎంత కావాలో అంతే తీశాడు. దీంతో వృథా తగ్గింది. మాచర్లలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. ఐతే శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడి లాగా తీశాడు. ►శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్లీ ఆ ఫీల్డ్ కి వెళ్లాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ►ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఏఎస్ అధికారులని కలవడం, వాళ్ల బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా ఉండాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే చెప్పాడు. ►మాచర్ల నియోజకవర్గం కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీ. దర్శకుడు శేఖర్‌ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్లో ఒక ఫోర్స్ ఉంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం. సముద్రఖని గారికి శేఖర్ కథ చెప్పినపుడు.. తమిళనాడులో ఇలాంటి ఇన్సిడెంట్ ఉందని సముద్రఖని గారు అన్నారు. ►ఐఏఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా ఉంటే ఎలా ఉంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం. ►ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ గా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్ తో వుంటుంది. ►మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి. ►కేథరీన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది. ►చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా. ►కృతి శెట్టి షూటింగ్ లో ప్రతిది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది. ►ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్, స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి. ►ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. ►కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం. ►సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపథ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు. ►ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్లీ షూటింగులు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ►సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్లను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా, ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా. ►ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనేదే నా ప్లాన్. ►ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీవ్ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను. ►'రాను రాను' అనే పాట ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు జయం హైలెట్స్ లో ఒకటైన 'రాను రాను' పాటని రీమిక్స్ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం లో మూడు పాటలు డ్యాన్స్ వేశాను. డ్యాన్సులన్నీ బావుంటాయి. ►హైదరాబాద్, విశాఖ పట్నంలో షూట్ చేశాం. పాటల కోసం విదేశాలకు వెళ్లాం. ప్రసాద్ మురెళ్ల గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ►పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదని నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడే అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. ►వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా. -
నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్
Prabhas Interesting Comments In Sita Ramam Pre Release Event: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భాగంగాలో స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్ మొదట ఏం మాట్లాడను అని షాక్ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని చెప్పాడు డార్లింగ్. 'ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు' అని స్వప్న దత్ తెలిపారు. అనంతరం స్వప్న దత్ మాట్లాడకా ఆమె కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని నవ్వులు పంచాడు. ''ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి'' అని ప్రభాస్ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. 'నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్ వద్ద అడిగి తీసుకున్న' అని ప్రభాస్ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్ తీసుకున్నాడు ప్రభాస్. 'సీతారామం' చిత్ర యూనిట్ అంతా టికెట్‌తో పాటు ఫొటోలకు ఫోజులివ్వడంతో ఈ ఈవెంట్ ముగిసింది. -
సౌత్ Vs నార్త్.. 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
Alia Bhatt On South Industry Says Even All Their Films Not Worked: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కమిట్ అయిన సినిమాలకు ప్రెగ్నెన్సీలోనూ ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల అలియా హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రీకరణలో పాల్గొంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మూవీ డార్లింగ్స్ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''భారతీయ చిత్రపరిశ్రమ మొత్తానికి ఇది కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో మనం హిందీ చిత్రాలపై కాస్త దయ చూపించాలి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఆహా బాలీవుడ్.. ఓహో హిందీ సినిమాలు అని చెప్పుకుంటున్నాం. కానీ ఇటీవల విడుదలైన ఎన్ని బాలీవుడ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి ? సౌత్ ఇండస్ట్రీలో కూడా అన్ని సినిమాలు బాగా ఆడలేదు. అక్కడ కూడా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా. అంతెందుకు నా సినిమా 'గుంగూభాయి కతియావాడి'నే తీసుకోండి. అది మంచి విజయాన్నే సొంతం చేసుకుంది కదా'' అని ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ పేర్కొంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ ప్రమోషన్స్‌లో పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు 'ఇలాంటి సమయంలో రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఇబ్బందిగా లేదా? అని చాలామంది అంటున్నారు. నిజానికి, మనం సంపూర్ణ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్న కూడా పని నుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఉత్సాహాంతో పని చేసుకోవచ్చు. నాకు వృత్తిపట్ల ఉన్న ప్రేమ, అంకితభావంతోనే ఇలా చేయగలుగుతున్నా' అని చెప్పుకొచ్చిందీ క్యూట్ హీరోయిన్. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా భట్ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. -
పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన
ప్రముఖ నేపథ్యగాయనిగా పేరు సంపాందించుకుంది కల్పన (Singer Kalpana). తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడింది. సంగీతంపై అమితమైన మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించింది. శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్‌లోనైనా అవలీలగా కల్పన ఆలపిస్తుంది. 'మనోహరం' సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్‌తో ఫుల్ టైమ్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారింది. ఎమ్ఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కెవి, మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కలిసి ఆమె పనిచేశారు. వరల్డ్‌వైడ్‌గా 3 వేల స్టేజ్ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిన కల్పన బిగ్‌బాస్‌లో కూడా అలరించింది. అయితే ఎంతో సక్సెస్ సాధించిన కల్పన జీవితంలో కూడా ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ''25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. అనేక వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. ఒక పాప ఉంది. ఉద్యోగం లేదు. అన్నీ కోల్పోయిన నేను ఆఖరికి చనిపోవాలనుకున్నా. కానీ సింగర్ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పాల్గనమని ఎంకరేజ్ చేశారు. చదవండి: అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటికి నాకు మలయాళం అస్సలు తెలియదు. కసితో వెళ్లాను. నా కుమార్తె కోసం విల్లా గెలవాలనుకున్నాను. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో కష్టపడి ఆ పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ గెలుపు తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది'' అని ఇటీవల తెలిపారు సింగర్ కల్పన. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య
Naga Chaitanya Comments On Thank You Movie: ‘‘ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్త విషయం ఉంటేనే థియేటర్స్‌కు వస్తున్నారు. ట్రైలర్ చూసి ఆ మూవీ చూడాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు చిత్రాల ఎంపికలో నా మైండ్ సెట్ కూడా మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్ అనే విషయాలు పక్కన పెడితే కథే కింగ్ అని నమ్ముతాను’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ‘దిల్’ రాజుగారితో 12 ఏళ్ల తర్వాత (2019లో ‘జోష్’ వచ్చింది) ‘థ్యాంక్యూ’ సినిమా చేశాను. ఈ గ్యాప్‌లో ఆయన కాంపౌండ్ నుంచి చాలా కథలు విన్నాను. అయితే ఎగ్జయిటెడ్‌గా అనిపించలేదు. కానీ ‘థ్యాంక్యూ’ గురించి రాజు, విక్రమ్, బీవీఎస్ రవి చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా తప్పక చేయాలనిపించి, చేశా. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. ‘థ్యాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో మూడు షేడ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు రకరకాల దశలలో కనిపిస్తాను. ఇప్పుడంటే నన్ను టీనేజర్ పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను (నవ్వుతూ). విక్రమ్ కుమార్ సున్నితమైన విషయాలను బాగా డీల్ చేస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు? అనేది ‘థ్యాంక్యూ’లో మెయిన్ పాయింట్. ఈ సినిమాతో వ్యక్తిగా నేను చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాణ్ణి.. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిలా కనపడటానికి ప్రొడక్షన్ వాళ్లు సపోర్ట్ చేసి, మూడు నెలలు సమయం ఇచ్చారు. ఆ టైమ్‌లో వర్కవుట్స్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా వర్క్‌షాప్స్ కూడా చేశాను. ప్రతి స్క్రిప్ట్‌లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్ చేస్తోంది. భవిష్యత్‌లో కుదురుతుందో? లేదో చూడాలి (నవ్వుతూ). అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్ బాగుంది. తన లుక్ మార్చుకోవటం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఏజెంట్’తో తనకు మాస్, కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ వస్తుందనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. తరుణ్ భాస్కర్‌తో ఓ చిత్రం డిస్కషన్లో ఉంది. పరుశురామ్తోనూ ఓ పాయింట్ అనుకున్నాం. కోవిడ్ సమయంలోనే హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’ అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 25కిలోలు బరువు తగ్గాను. నాన్న (నాగార్జున), చిరంజీవి, రాజమౌళి, సుకుమార్, ఆమిర్ ఖాన్ గార్లతో ‘లాల్‌సింగ్ చద్దా’ ప్రీమియర్ చూడటం మరచిపోలేని అనుభూతి. అందరికీ సినిమా బాగా నచ్చింది. చిరంజీవిగారు మా సినిమాని సమర్పించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. -
షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 'మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై మీటింగ్‌లో మాట్లాడుకున్నాం. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరల అంశంపై చర్చించాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయమై నిర్మాతలందరం మాట్లాడాం. ఓటీటీలో సినిమా విడుదల అనేది 8 వారాల లేక 10 వారాల అనే అంశంపై కూడా చర్చించాం. చర్చల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. షూటింగ్స్ బంద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ వల్ల కథలు రాశారు, వాటిని హీరోలు ఒప్పుకున్నారు. నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కరోనా సమయంలో ఆడియెన్స్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అందుకు తగిన స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలం' అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చదవండి:👇 అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..! పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య
Naga Chaitanya About Thank You Movie: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నాగ చైతన్య పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. ''థ్యాంక్యూ కథ అభిరామ్ అనే వ్యక్తి ప్రయాణం. ఈ పాత్రలో శారీరకంగా, మానసికంగా పలు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఆడియెన్స్‌ను ఎలా కట్టిపడేస్తాయో ఈ అభిరామ్ ప్రయాణం అలానే కట్టిపడేస్తుంది. ఇలాంటి మంచి పాత్రలు ఏ యాక్టర్‌కైనా చాలా అరుదుగా వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్, నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ వినగానే 'జీవితంలో ఫలానా వారు మనకు స్పెషల్. వారికి ఫోన్ చేసి థ్యాంక్యూ చెప్పాలి' అనే ఫీలింగ్ మా అందరికీ కలిగింది. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకం ఉంది. రాశీఖన్నా రోల్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆమె లేకపోతే ఈ చిత్రమే లేదు'' అని నాగ చైతన్య తెలిపాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ -
CM KCR: ఓపెన్ ఛాలెంజ్.. ముందస్తు ఎన్నికల దిశగా సీఎం కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కామెంట్స్.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీలు డేట్ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని.. ముందస్తు ఎన్నికలకు వెళదామంటూ సీఎం కేసీఆర్ ఛాలెంజ్ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తున్నాయి. చదవండి: అసమర్థ ప్రధానితో దేశం అథోగతి.. మోదీపై కేసీఆర్ విమర్శల వర్షం దేశంలో అన్ని రకాలుగా అథోగతి పాలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, బీజేపీ విధానాలే కారణమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశం ఇంత అసమర్థ ప్రధానిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. నిష్క్రియ, అవివేక, అసమర్థ పాలనను మోదీ సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని జలగలా పీడిస్తోందని, ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని.. అనడం అహంకారం.. వివేకానికి నిదర్శనం. వాళ్లకు దమ్ముంటే డేట్ డిక్లేర్ చేస్తే నేను అసెంబ్లీ రద్దుకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మేం స్కాంస్టర్లము కాదు. కుంభకోణాలు చేయలేదు. అపకీర్తి మూట కట్టుకోలేదు. ప్రజల కోసం మంచి పనులు చేశాం. వాళ్లే గెలిపిస్తారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని బీజేపీ భయపడుతోందని కేసీఆర్ అన్నారు. -
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: సాయి కుమార్
Sai Kumar About Gandharva Movie: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వలో కీలక పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. గంధర్వ కథ చెప్పగానే మీరెలా ఫీలయ్యారు? దర్శకుడు అప్సర్ ఆర్మీ మనిషి. ఏదో కొత్తదనం ఆయనలో కనిపించింది. నాకు దర్శకుడు వీరశంకర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త దర్శకుడు కథ చెబుతాడు వినమన్నారు. నేను ఈ మధ్య కన్నడలో `రంగీ తరంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్లింది. నేను ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని నన్ను చాలామంది అడిగారు. కథను నమ్మాను అన్నాను. అలాగే ఎస్.ఆర్. కళ్యాణమండపం కూడా అలానే జరిగింది. ఇప్పుడు గంధర్వ కథ కూడా అంతే. చాలా కొత్తగా కథ వుంది. మనసావాచా కర్మనా మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా హిట్ వస్తుంది. గంధర్వలోనూ అంతా కొత్తవారైనా కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వున్నాయి. కలికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వస్తే ఎలా వుంటుందనే ఆసక్తికరంగా అనిపిస్తుంది. గంధర్వలో అలానే వుంటుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. చాలా పాత్రలు పోషించిన మీకు గంధర్వ ఎంత మేరకు కొత్తగా అనిపించింది? నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్లయింది. ఈరోజుకీ ఇంకా అదే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని పలుకరిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయడానికి కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా కిక్ ఇచ్చింది. అండర్ ప్లే, డ్రామా.. ఇలా ప్రతీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్రయత్నమే గంధర్వ సినిమాలోని నా పాత్ర వుంటుంది. గంధర్వలో 1971-2021 అని వుంది. దానికి మీ పాత్రకు సంబంధం వుందా? నేను ఇంతకుముందు ఇప్పుడు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా భిన్నంగా చేస్తున్నవే. ధనుష్ చిత్రం `సర్`లో నెగెటివ్ పాత్ర చేస్తున్నా. అలాగే దసరాలో ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంటుంది. ఇప్పుడు గంధర్వలో కూడా ఎవరూ ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంది. నేను పొలిటీషియన్. సీఎం అవ్వాలనుకుంటాను. సరిగ్గా ఆ టైంలో నా తండ్రి అంటూ సందీప్ మాధవ్ నా జీవితంలోకి వస్తాడు. తను యంగ్‌గా వుంటాడు. మా అమ్మకు, ఈయనకు వున్న రిలేషన్ ఏమిటని. మీడియా హైలైట్ చేస్తుంది. కథలో ట్విస్ట్ అదే. 1971-2021 టైం ట్రావెల్లో జరిగే కథ కాబట్టి అలా పెట్టారు. గంధర్వ చూశారు కదా ఎలా అనిపించింది? ఇప్పటి జనరేషన్ ప్రతీదీ పరిశీలిస్తున్నారు. మేథావుల్లా ఆలోచిస్తున్నారు. కంటెన్యూటీకూడా వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే కథను ముగింపులో చాలా జాగ్రత్తగా చెప్పాలని దర్శకుడితో అన్నాను. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సినిమాటిక్‌గా ఒప్పించగలగాలి. క్లైమాక్స్‌లో సైంటిఫిక్‌గా వుంటూనే అందరినీ మెప్పించేలా చేశాడని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయన సినిమా చూసి సూపర్‌డూపర్ హిట్ అవుతుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని డబ్బింగ్ చెప్పినవాళ్లు, సందీప్ మాధవ్, జయసింహ కూడా చెప్పారు. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ వుంటుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ వుంటాయి. ఓ పజిల్ కూడా వుంటుంది. సేమ్ మా నాన్నలా వుండే సందీప్‌ను చూసి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారనుకుంటాం. అనేది లాజిక్‌గా దర్శకుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది. ఈ జనరేషన్ హీరోలతో నటించడం ఎలా అనిపిస్తుంది? సందీప్ చేసిన గత సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్. కొత్త జనరేషన్ అయిన సత్యదేవ్, ప్రియదర్శితో నేను చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధర్వలో సందీప్‌తో చేశా. టైటిల్‌కు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం. ఇన్నేళ్ల కెరీర్లో చేయని పాత్రలేదు. ఇంకా కొరత వుందా? నేను నాటకాలు వేసే నాటినుంచి మేకప్ వేసుకుని ఇప్పటికి 50 ఏళ్లయింది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ల ప్రస్థానం నాది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలని నటుడిగా అనిపిస్తుంది. నటుడికి సంతృప్తి వుండదు. మేజర్ చంద్రకాంత్ షూట్లో ఎన్టీఆర్‌కు 72 ఏళ్లు. ఆ వయస్సులో ఆయన ఓ సీన్లో పైనుంచి దూకాలి. డూప్‌లేకుండా దూకేస్తానని చేసేశాడు. నటుడిగా అంత డెడికేషన్ వుండాలి. నేను నేర్చుకుంది అదే. కన్నడలో కామెడీ చేశాను. ఇటీవలే పౌరాణికంలో దుర్యోధనుడిగా నటించాను. ఇంకా పలు భిన్నమైన పాత్రలు చేయాలనుంది. కొత్త చిత్రాలు? తమిళంలో `డీజిల్` సినిమా చేస్తున్నా. అందులో డీజిల్ మాఫియా లీడర్‌గా నటిస్తున్నా. ఇందులో మూడు గెటప్లుంటాయి. ఇంకా ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నా. -
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్
Samantha Blames Karan Johar For Unhappy Marriages In KWK 7 Season: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షోతో ఫిల్మ్ మేకర్‌గానే కాకుండా మంచి హోస్ట్‌గా కరణ్ జోహార్ నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 6 సీజన్లపాటు అలరించిన ఈ షో ఏడో సీజన్ రానున్నట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసే సెలబ్రిటీలు, వారు చెప్పిన పలు ఆసక్తికర విషయాలను మరో ప్రోమో రూపంలో బయటకు ఒదిలాడు. ఇందులో భాగంగానే సమంత తన ఎపిసోడ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కరణ్ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సామ్‌తోపాటు ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సీజన్లో 'కబీర్ సింగ్' జోడీ షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, 'జుగ్ జుగ్ జియో' బృందం అనిల్ కపూర్, వరుణ్ ధావన్, 'లైగర్' జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే, బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ షో పూర్తి ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడూ వస్తాయా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. -
నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్ హీరోయిన్
Avika Gor About Tenth Class Diaries Movie And Her Lover: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ నా పాత్ర (చాందిని) చుట్టూ తిరుగుతుంది. చాందిని ఎక్కడ ఉంది? బతికి ఉందా? లేదా? అనే సస్పెన్స్ ఆసక్తికరంగా ఉంటుంది. చాందిని గురించి తెలుసుకోవాలని క్లాస్మేట్స్ ప్రయత్నిస్తారు. ఆ సస్పెన్స్ ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి’’ అని అవికా గోర్ అన్నారు. ‘గరుడవేగ’ కెమెరామేన్ అంజి దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ.. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రీ యూనియన్ అయితే ఎలా ఉంటుందనేది చూపించారు. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ.. మరోవైపు షూటింగ్స్ చేశాను. అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీరామ్‌తో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. అంజి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో విజువల్స్ బాగా తీశారు. నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల కొద్ది రోజులు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. ఇక నా ప్రతి అడుగులో మిళింద్ (ప్రేమికుణ్ణి ఉద్దేశించి) ఉన్నాడు. జులై 1న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలవుతోంది. కుదిరితే ఒక్క రోజు ముందు నా పుట్టిన రోజున (జూన్ 30) ఆ సినిమా చూడాలనుకుంటున్నాను. నేను నటించిన ‘థ్యాంక్యూ’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. మరో తెలుగు సినిమా చేస్తున్నాను’’ అని తెలిపింది. -
నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు: డైరెక్టర్
Director Jeevan Reddy Interesting Comments On Chor Bazaar Movie: ‘‘నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు. ‘జార్జ్ రెడ్డి’ తర్వాత ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోలేదని నా ఫ్రెండ్స్ అంటుంటారు. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటాను. లెక్కలు వేసుకోవడం రాదు.. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటాను’’ అన్నారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ ప్రేమకథా చిత్రం అయినప్పటికీ కథనం ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ కమర్షియల్‌గా సాగుతాయి. నేను అనుకున్న బచ్చన్ సాబ్ పాత్రకు ఆకాష్ వంద శాతం న్యాయం చేశాడు. ఈ చిత్రకథని పూరి జగన్నాథ్‌గారు వినలేదు.. మాపై అంత నమ్మకం ఆయనకు. ఇండస్ట్రీలో నాకు గురువు ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ). అయితే ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
అందుకోసం ఏడు కేజీల బరువు పెరిగాను: హీరో
‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
హైదరాబాద్‌లో అది 400 ఏళ్లుగా ఉంది: నిర్మాత
Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie: ‘‘హైదరాబాద్‌లో దాదాపు 400 సంవత్సరాలుగా ‘చోర్ బజార్’ ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ చోరీ చేసిన వస్తువులను అక్కడ విక్రయిస్తారని అంటుంటారు. ‘చోర్ బజార్’ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత వీఎస్ రాజు అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘నాది భీమవరం. సినిమాలపై ఆసక్తితో రామ్‌గోపాల్ వర్మ ‘రక్ష’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాను. ‘గుండెల్లో గోదారి, జోరు...’ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘రక్ష’ సమయంలోనే జీవన్ రెడ్డితో నాకు పరిచయం ఏర్పడింది. నేను దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ మాత్రమే చూసుకున్నాను. రాత్రి జరిగే కథ ఇది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు చూపించాం? అనేది ఆసక్తిగా ఉంటుంది. పృథ్వీ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అదనపు ఆకర్షణ. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ సంస్థ కలవడం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉండగా రీసెంట్గా మహేశ్ పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్‌లో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదం వాడుతానని తెలిపారు. హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే 'ఒక్కడు' మూవీని రీక్రియేట్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు. -
సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన నటనతో బాలీవుడ్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమంత పర్సనల్ లైఫ్‌పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Nandini Reddy On Samantha Personal Life Issues: స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హీరో నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఎవరి దారులు వారు చూసుకుంటూ కెరీర్లో అత్యున్నత స్థానానికి ఎదిగేందుకు సామ్, చై ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఎవరో ఒకరు వీరిద్దరి గురించి వారి సన్నిహితుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమంతకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ', 'జబర్దస్త్' సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కెరీర్, సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. జబర్దస్త్ సినిమా చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాలేకపోవడం, అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో నేను ఆమె పక్కన ఉన్నాను. ఆ సమయంలోనే మేము మరింత సన్నిహితులుగా మారిపోయాం. కానీ ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం. సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచింది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది.' అని తెలిపింది నందినీ రెడ్డి. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1061263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయమైన సూటిగా స్పష్టంగా చెప్పేసే ఆమె ప్రస్తుతం సక్సెస్ఫుల్ హోస్ట్‌గా కూడా రాణిస్తోంది. ఇకపోతే కంగనా లేటెస్ట్ మూవీ 'ధాకడ్' నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు పెద్ద చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి పెద్ద రిస్క్ తీసుకోవడం వల్లే తను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనా తెలిపింది. 'నేను చాలా మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఖాన్, కుమార్ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నందుకు 'ఎందుకు తన జీవితాన్ని వృథా చేసుకుంటుంది' అన్నట్లుగా నన్ను చూసేవారు. కానీ మీ భవిష్యత్తు పట్ల మీకు పూర్తి విజన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీలో ఏదో సమస్య ఉందని మాత్రం అనుకుంటారు.' అని కంగనా పేర్కొంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్' మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
యాంకర్ సుమపై ఆ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు. చదవండి: రాజీవ్‌తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య'
Koratala Siva Interesting Comments On Acharya Movie: ‘‘నా సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాటి తాలూకు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. నావి సందేశాత్మక సినిమాలు అనుకోను. ఒకవేళ నా సినిమాల వల్ల ప్రభావితమై మంచి పనులు జరిగితే చాలా సంతోషపడతాను’’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 28) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కొరటాల శివ పంచుకున్న విశేషాలు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ ఉండే ఓ వ్యక్తి ఓ టెంపుల్ టౌన్లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఆచార్య’ కథ రాసుకున్నాను. ఏ సినిమాలో అయినా విలన్‌పై హీరో పోరాడుతున్నాడు అంటే అది ధర్మం కోసమే. అయితే ధర్మం అవసరం అని ‘ఆచార్య’ సినిమాలో అండర్లైన్ చేశానంతే. కాకపోతే కథా నేపథ్యం కాస్త కొత్తగా ఉంటుంది. చదవండి: సిద్ధ పాత్రను పవన్ కల్యాణ్ చేసేవాడు!: చిరంజీవి ఇద్దరి లక్ష్యం ఒక్కటే ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్లో సిద్ధ అనే విద్యార్థి (రామ్‌చరణ్ పాత్ర) ఏ సమస్యని అయినా సరే అందంగా డీల్ చేస్తాడు. కానీ ‘ఆచార్య’ (చిరంజీవి పాత్ర పేరు) ఆవేశపరుడు. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. టెంపుల్ టౌన్లో ఉన్న సిద్ధ ఎందుకు అడవులకు వెళ్లాడు? అడవుల్లో ఉండాల్సిన ‘ఆచార్య’ ఎందుకు టెంపుల్ టౌన్‌కు రావాల్సి వచ్చింది అన్నదే కథ. రెండు కళ్లు చాల్లేదు చిరంజీవిగారు ఏ స్థాయి కమర్షియల్ స్టారో నాకు తెలుసు. ఆయన ఇమేజ్ను తగ్గించకుండా కమర్షియల్ పంథాలోనే ‘ఆచార్య’ కథ చెప్పాం. మాస్ ఎంగేజింగ్ బ్లాక్స్ ‘ఆచార్య’లో చాలానే ఉన్నాయి. తండ్రీ కొడుకులు కాబట్టి చిరంజీవి, చరణ్‌ల మధ్య మంచి సింక్ ఉంది. ఇద్దరూ బాగా చేశారు. ఇద్దరూ నటిస్తుంటే చూడ్డానికి నాకు రెండు కళ్లూ సరిపోలేదు. సిద్ధ క్యారెక్టర్ ఇంట్రవెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఫ్రీగా చేయలేదు ‘ఆచార్య’ సినిమాని ఫ్రీగా చేయలేదు. రిలీజ్ తర్వాత పారితోషికాలు తీసుకుంటాం. ప్రతి సినిమా నాకు టెన్షనే. ఓ పరీక్ష రాసినట్లే. పరీక్ష బాగా రాయకపోతే ఏ సమస్యా లేదు. అదే బాగా రాస్తే మనం అనుకున్న మార్కులు వస్తాయా? రావా? అని టెన్షన్. ‘ఆచార్య’ పరీక్ష బాగా రాశాను. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ సినిమా అప్డేట్.. నా తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే.. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. 'నేను తెలుసుకున్న పవర్ఫుల్ సోల్స్ క్యారెక్టర్స్‌లో స్వామి వివేకానంద ఒకరు. మీడియా, సోషల్ మీడియా వంటి మాధ్యమాలు లేని రోజుల్లో కూడా ఆయన వల్ల చాలామంది ప్రభావితం అయ్యారు. ప్రపంచం మొత్తం చూసేలా చాలా పెద్ద స్థాయిలో స్వామి వివేకానందగారి మీద ఓ సినిమా చేయాలని ఉంది. కానీ చాలా పరిశోధన చేయాలి. నాకు అంత అనుభవం రావాలి. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ‘గాంధీ’ సినిమాను ఎలా తీశారో అలా తీయాలని ఉంది.' అని కొరటాల శివ పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్.. రబియా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం! ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్‌ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
భార్య, గర్ల్‌ఫ్రెండ్ వల్లే అదంతా.. బీసీసీఐ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ganguly Comments On Wife And Girlfriend: కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా కోహ్లి యాటిట్యూడ్‌పై ప్రశంసలు కురిపించిన దాదా.. ఒత్తిడి ఎదుర్కొనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. మనిషి జీవితంలో ఒత్తిడి అనేది అస్సలు ఉండదని, అది భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ల వల్లే వస్తుందంటూ నవ్వులు పూయించాడు. గంగూలీ సమాధానంతో అక్కడున్నవారంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు. కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన అనంతరం టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తొలగించడానికి ముందు బీసీసీఐ తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కేవలం గంటన్నర ముందే విషయాన్ని చెప్పారని పేర్కొన్నాడు. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా తనను ఎవ్వరూ వారించలేదని, బీసీసీఐ చెబుతున్నది అవాస్తవమని అన్నాడు. అయితే దీనిపై బీసీసీఐ మరోలా స్పందించి, కోహ్లి వ్యాఖ్యలను ఖండించింది. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. డిసెంబర్ 26న భారత్ తొలి టెస్టు ఆడనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమాయ్యడు. చదవండి: 9 బంతుల్లో 44 పరుగులు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు! -
బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మీటింగ్‌కు వెళ్లకుంటే యాంటీ దళిత ముద్ర పడేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లడం వల్లనే బీజేపీ బతికిందన్నారు. ఏనాడు ఇంత సమయం వెచ్చించి ఇలాంటి సమావేశం జరగలేదని.. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా, నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరవడమే కాకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి. చదవండి: టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుంది.. అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
నా ఇంటిపేరు ‘గాంధీ’ కాకపోయి ఉంటేనా...
గువాహటి : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినా? అని ఆయన ప్రశ్నించారు. గువాహటిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సుల్తాన్పూర్ ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘నా పేరు ఫెరోజ్ వరుణ్ గాంధీ. ఇంటిపేరులో గాంధీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో అందరికీ తెలుసు. ఇంటి పేరు,పేరు ప్రతిష్ఠలు ముఖ్యం కాదన్న ఆయన.. ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని(ప్రైవేట్ బిల్లు ద్వారా) సవరించాలని వరుణ్ సూచించారు. ఒకవేళ అలాంటి అవకాశమే గనుక లభిస్తే రెండేళ్లలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎంపీలను 75 శాతం దాకా ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగమేదైనా సామాన్యులకు మాత్రం అన్ని ద్వారాలు మూసుకుపోయిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, వ్యాపారం, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ సామాన్యులకు అవకాశాలు అందకుండా పోతున్నాయని అన్నారు. ‘‘ఉదాహరణకు బ్రిటన్‌లో ప్రజల నుంచి లక్ష ఓట్ల సంతకాల సేకరణ ద్వారా ప్రజాప్రతినిధులను తొలగించే అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టడం లాంటివి చేస్తారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించటం లేదు. మొన్నామధ్య తమిళనాడు రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇక్కడ దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలు వ్యక్తం అయ్యాయి. కానీ, అక్కడి ప్రజా ప్రతినిధులంతా తమ జీతభత్యాలు పెంచుకునే విషయంపై ఒకరోజంతా చర్చించాయి. ఇది పరిస్థితి’’ అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. -
సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బెంగళూరుకు మకాం మార్చడం, కోచ్‌ను మార్చడం కలసి వచ్చిందని సైనా వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ దిగ్గజాలు విమల్ కుమార్, ప్రకాశ్ పదుకొనే సలహాలు తనకు ఎంతో మేలు చేశాయని చెప్పింది. ఇవన్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడానికి ఉపయోగపడ్డాయని సైనా తెలిపింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సైనా బెంగళూరుకు వెళ్లకముందే గోపీచంద్ అకాడమీలో ఆయన వద్దే కొన్నేళ్ల పాటు శిక్షణ పొందింది. గోపీ, సైనా గురుశిష్యులుగా ఎన్నో విజయాలు సాధించారు కూడా. అయితే గోపీచంద్‌తో విబేధాల వల్లే సైనా బెంగళూరుకు మకాం మార్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గోపీతో విబేధాలున్నట్టు సైనా నేరుగా చెప్పలేదు. మరో స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మాత్రం గోపీపై తీవ్ర విమర్శలు చేసింది. సైనా తన కెరీర్లో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పతకం కల మొన్నటి వరకు నెరవేరలేదు. తాజాగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో సైనా రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. గోపీ దగ్గర శిక్షణ పొందినపుడు సాధించలేనిదాన్ని (ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం) ప్రస్తుత కోచ్ విమల్ కుమార్ శిక్షణలో సొంతం చేసుకుంది. కోచ్‌ను మార్చడం వల్లే తనకు మేలు జరిగిందని సైనా చెప్పడం వెనుక గోపీచంద్‌తో విబేధాలున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.