రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది.
చదవండి: సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
తొలుత కన్నడ చిత్రం విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రతి ప్రేక్షకులు ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా కాంతార మూవీ బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే.
చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్
కానీ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన కాంతార మూవీ కలెక్షన్లతో మ్యాజిక్ చేసింది. దీంతో సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది ఈ సినిమా. నా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఆలోచలనలో పడేసింది కాంతార. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది. ఇక నుంచి మేం సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్‌ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కాంతార సినిమా తెలిపింది’ అని రాజమౌళి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment