PV Sindhu Interesting Comments About Friendship With Prabhas In Latest Interview - Sakshi
Sakshi News home page

PV Sindhu: నా బయోపిక్‌ కూడా ఉండొచ్చు.. అందులో

Published Sat, Aug 20 2022 4:17 PM | Last Updated on Sun, Aug 21 2022 11:07 AM

PV Sindhu About Prabhas In Latest Interview - Sakshi

PV Sindhu About Prabhas In Latest Interview: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని ఉన్నంతంగా నిలబెట్టాయి. ఇటీవల కామన్‌వెల్త్‌ 2022 గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి, ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వూలో పాల్గొని తన ఫేవరేట్‌ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

'మెడల్‌ తీసుకున్నప్పుడు మన చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్‌ ఎలా ఉంటుంది?' అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ''అక్కడ విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ హైగా వినిపించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది'' అని సింధు తెలిపింది. అనంతరం లవ్ లెటర్స్‌ గురించిన అడగ్గా.. ''ఇప్పటివరకు నాకు ఎన్నో ప్రేమలేఖలు వచ్చాయి. ఆ లెటర్స్‌ అన్నింటిని మా ఇంట్లో వాళ్లందరం కలిసే చదివేవాళ్లం. ఓ 70 ఏళ్ల వ్యక్తి అయితే, ఇలాగే లేఖ రాశాడు. అతనికిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్‌ చేస్తానని అందులో రాశాడు'' అని పేర్కొంది. 

చదవండి: నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రం.. నటికి భర్త మాత్రం లేడు!

'తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం' అని అడగ్గా ''చాలా మంది ఉన్నారు. ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. మేము మంచి ఫ్రెండ్స్‌ కూడా'' అని సింధు చెప్పడంతో 'ఎందుకు సేమ్‌ హైట్‌ కాబట్టా?' అని యాంకర్‌ నవ్వులు తెప్పించాడు.  ఇంకా ఆ ఇంటర్వ్యూ ప్రొమోలో ''నేను ఏదైనా పోటీలో ఫెయిల్‌ అయితే.. ఎందుకలా ఆడుతున్నావ్? మొన్న ఆ గేమ్‌లో ఆడావు కదా అలా ఆడొచ్చు కదా అంటారు. అప్పుడు నాకు దా నువ్‌ వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది.'' అని చెప్పింది. 'భవిష్యత్తులో హీరోయిన్‌ అయ్యే అవకాశం ఉందా?' అన్న అప్రశ్నకు 'ఏమో.. నా బయోపిక్‌ కూడా ఉండొచ్చేమో!' అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది పీవీ సింధు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement