సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు | saina nehwal makes interesting comments | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Aug 18 2015 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బెంగళూరుకు మకాం మార్చడం, కోచ్ను మార్చడం కలసి వచ్చిందని సైనా వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ దిగ్గజాలు విమల్ కుమార్, ప్రకాశ్ పదుకొనే సలహాలు తనకు ఎంతో మేలు చేశాయని చెప్పింది. ఇవన్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించడానికి ఉపయోగపడ్డాయని సైనా తెలిపింది.

ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  సైనా బెంగళూరుకు వెళ్లకముందే గోపీచంద్ అకాడమీలో ఆయన వద్దే కొన్నేళ్ల పాటు శిక్షణ పొందింది. గోపీ, సైనా గురుశిష్యులుగా ఎన్నో విజయాలు సాధించారు కూడా. అయితే గోపీచంద్తో విబేధాల వల్లే సైనా బెంగళూరుకు మకాం మార్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గోపీతో విబేధాలున్నట్టు సైనా నేరుగా చెప్పలేదు. మరో స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మాత్రం గోపీపై తీవ్ర విమర్శలు చేసింది.

సైనా తన కెరీర్లో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పతకం కల మొన్నటి వరకు నెరవేరలేదు. తాజాగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో సైనా రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. గోపీ దగ్గర శిక్షణ పొందినపుడు సాధించలేనిదాన్ని (ప్రపంచ చాంపియన్షిప్ పతకం) ప్రస్తుత కోచ్ విమల్ కుమార్ శిక్షణలో సొంతం చేసుకుంది. కోచ్ను మార్చడం వల్లే తనకు మేలు జరిగిందని సైనా చెప్పడం వెనుక గోపీచంద్తో విబేధాలున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement