సైనా నెహ్వాల్ మరో సంచలనం | saina nehwal entres final in world badminton championship | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ మరో సంచలనం

Published Sat, Aug 15 2015 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

సైనా నెహ్వాల్ మరో సంచలనం

సైనా నెహ్వాల్ మరో సంచలనం

జకార్తా: తెలుగుతేజం సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాదీ తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-17, 21-17 స్కోరుతో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సైనా వరుస గేమ్ ల్లో నెగ్గింది. లిందావెనిపై ముఖాముఖి రికార్డును 3-1కు పెంచుకుంది.  ఫైనల్ సమరంలో సైనా.. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మరో సెమీస్లో కరోలినా 21-17, 15-21, 21-16తో సంగ్ జి హ్యున్ (కొరియా)ను ఓడించింది. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించినా ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్నిఅందుకోని సైనా.. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతూ పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో సైనా ఓడినా రజత పతకం దక్కుతుంది. గెలిస్తే స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement