
నెంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన సైనా
న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను చేజార్చుకుంది. గురువారం ప్రకటించిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్తో సరిపెట్టుకోగా.. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ నెంబర్ వన్ ర్యాంక్ను దక్కించుకుంది. గత రెండు టోర్నీల్లో సైనా పేలవ ప్రదర్శన చేయడంతో ర్యాంక్ పడిపోయింది.
తాజా జాబితాలో భారత యువ షట్లర్ పీవీ సింధు 13వ ర్యాంక్ను నిలబెట్టుకుంది. పురుషుల సింగిల్స్లో బారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్, ప్రణోయ్ ర్యాంక్లు దిగజారాయి. శ్రీకాంత్ 6, కశ్యప్ 10, ప్రణోయ్ 17వ ర్యాంక్ల్లో నిలిచారు.