
తన భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో సైతం ఆమె యాక్టివ్‌గా ఉంటారు. తన సంబంధించిన విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పంచుకుంటారు. త్వరలోనే తల్లికాబోతున్న ఆమె తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆమె హీరోగా చరణ్ సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న అవార్డుల గురించి చెబుతూ మురిసిపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ నాకు మద్దతు ఇస్తుంటాడు. అలాగే నేను కూడా ప్రతి విషయంలో తనకి సపోర్ట్‌గా ఉంటాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ నేను చర్రి వెన్నంటే ఉంటాను. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి సందర్భంలోనైనా వీలైనంత వరకు తనకి సాయం చేస్తూంటా. ఇక ఈ ఏడాది చరణ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన వర్క్ పరంగానూ,
వ్యక్తిగతంగానూ 2023 ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన అందుకుంటున్న అవార్డులు, ప్రశంసలతో చరణ్ చాలా ఆనందంగా ఉన్నాడు. ముఖ్యంగా తన వర్క్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాడు. మీరే చూస్తున్నారు ఆయనకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం తను ఎన్నోప్రశంసలు అందుకున్నాడు. చూస్తుంటే ఈ ఏడాది చరణ్‌దే అనిపిస్తోంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఈ మూవీ టీంతో పాటు ఉపాసన కూడా అమెరికాలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
చదవండి:
దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో
ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..