Dhaakad Trailer: Kangana Ranaut Opens Up on Rejecting Films With Khans and Kumar - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఖాన్, కుమార్​ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా

Published Sat, Apr 30 2022 10:18 AM | Last Updated on Sat, Apr 30 2022 3:40 PM

Kangana Ranaut Says She Rejected Khans And Kumars Movies - Sakshi

బాలీవుడ్ ఫైర్​ బ్రాండ్ కంగనా రనౌత్​ కాంట్రవర్సీ క్వీన్​గా పేరు తెచ్చుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయమైన సూటిగా స్పష్టంగా చెప్పేసే ఆమె ప్రస్తుతం సక్సెస్​ఫుల్ హోస్ట్​గా కూడా రాణిస్తోంది. ఇకపోతే కంగనా లేటెస్ట్‌ మూవీ 'ధాకడ్'​ నుంచి ఇటీవల విడుదలైన టీజర్​కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఈ ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమంలో కంగనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

పలు పెద్ద చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్​లకు దూరంగా ఉండటం వంటి పెద్ద రిస్క్​ తీసుకోవడం వల్లే తను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనా తెలిపింది. 'నేను చాలా మేల్ సెంట్రిక్​ చిత్రాలను తిరస్కరించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఖాన్​, కుమార్​ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నందుకు 'ఎందుకు తన జీవితాన్ని వృథా చేసుకుంటుంది' అన్నట్లుగా నన్ను చూసేవారు. కానీ మీ భవిష్యత్తు పట్ల మీకు పూర్తి విజన్​ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీలో ఏదో సమస్య ఉందని మాత్రం అనుకుంటారు.' అని కంగనా పేర్కొంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్' మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్‌ షాకింగ్ రియాక్షన్‌

షారుఖ్‌, అక్షయ్‌, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్‌.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement