Khans movie
-
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయమైన సూటిగా స్పష్టంగా చెప్పేసే ఆమె ప్రస్తుతం సక్సెస్ఫుల్ హోస్ట్‌గా కూడా రాణిస్తోంది. ఇకపోతే కంగనా లేటెస్ట్ మూవీ 'ధాకడ్' నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు పెద్ద చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి పెద్ద రిస్క్ తీసుకోవడం వల్లే తను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనా తెలిపింది. 'నేను చాలా మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఖాన్, కుమార్ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నందుకు 'ఎందుకు తన జీవితాన్ని వృథా చేసుకుంటుంది' అన్నట్లుగా నన్ను చూసేవారు. కానీ మీ భవిష్యత్తు పట్ల మీకు పూర్తి విజన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీలో ఏదో సమస్య ఉందని మాత్రం అనుకుంటారు.' అని కంగనా పేర్కొంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్' మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
ఖాన్ల పని అయిపోలేదు
2018లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్లు నటించిన ‘రేస్ 3, థగ్స్ ఆఫ్ హిందోస్తాన్, జీరో’ చిత్రాలు విఫలం కావడంతో బాలీవుడ్లో ‘ఖాన్ల పని అయిపోయింది. ఖాన్‌దాన్‌కి చుక్కెదురు’ అనే కామెంట్లు వినిపించాయి. అయితే బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ మాత్రం ‘ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఖాన్ల పని అయిపోయిందనుకోకూడదు’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో మార్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సినిమాల్లో స్థిరంగా ఉండేది మార్పు మాత్రమే. ఇలా మార్పుకి కారణమైన శేఖర్ కపూర్, అనురాగ్ కశ్యప్, రామ్‌గోపాల్ వర్మ లాంటి దర్శకులను అభినందించాలి. ఈ మధ్య చాలామంది కొత్త తరం సినిమాలు వస్తున్నాయంటున్నారు. అవి ఎప్పుడూ ఉండేవే. వీటితో ఖాన్ల సినిమాలు పోల్చి వాళ్ల పనైపోయింది అనుకోకూడదు. ఇండస్ట్రీ అలా వర్క్ అవ్వదు’’ అని అన్నారు. -
'వారి సినిమాల్నిబహిష్కరించాలి'
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ద్వారా హింసాత్మక సంస్కృతిని పెంపొందిస్తున్నారని, యువత దానికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు.'మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యువకుణ్ని ప్రశ్నించాను. జీవితంలో ఏమవ్వాలని అనుకుంటున్నావని అడిగాను. దానికి ఆ యువకుడు అమీర్, షారుఖ్ , సల్మాన్ ఖాన్ తరహాలో నటుణ్ని అవ్వాలనుకుంటున్నాఅని బదులిచ్చాడు. ఎందుకు అలా అవ్వాలని అనుకుంటున్నావని అడిగితే.. వారు స్టంట్స్ బాగా చేస్తారని ఆ యువకుడి తల్లి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే వారు హింసను ప్రోత్సహిస్తున్నారని అర్ధమవుతోంది.అందుకే యువత వారికి ఆకర్షితులవ్వకూడదని సూచిస్తున్నా'అని ప్రాచీ తెలిపారు.