నవాజుద్దిన్ సిద్ధిఖీ
2018లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్లు నటించిన ‘రేస్ 3, థగ్స్ ఆఫ్ హిందోస్తాన్, జీరో’ చిత్రాలు విఫలం కావడంతో బాలీవుడ్‌లో ‘ఖాన్ల పని అయిపోయింది. ఖాన్‌దాన్‌కి చుక్కెదురు’ అనే కామెంట్లు వినిపించాయి. అయితే బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ మాత్రం ‘ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఖాన్ల పని అయిపోయిందనుకోకూడదు’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో మార్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సినిమాల్లో స్థిరంగా ఉండేది మార్పు మాత్రమే. ఇలా మార్పుకి కారణమైన శేఖర్ కపూర్, అనురాగ్ కశ్యప్, రామ్‌గోపాల్ వర్మ లాంటి దర్శకులను అభినందించాలి. ఈ మధ్య చాలామంది కొత్త తరం సినిమాలు వస్తున్నాయంటున్నారు. అవి ఎప్పుడూ ఉండేవే. వీటితో ఖాన్ల సినిమాలు పోల్చి వాళ్ల పనైపోయింది అనుకోకూడదు. ఇండస్ట్రీ అలా వర్క్ అవ్వదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment