
Ganguly Comments On Wife And Girlfriend: కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా కోహ్లి యాటిట్యూడ్‌పై ప్రశంసలు కురిపించిన దాదా.. ఒత్తిడి ఎదుర్కొనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. మనిషి జీవితంలో ఒత్తిడి అనేది అస్సలు ఉండదని, అది భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ల వల్లే వస్తుందంటూ నవ్వులు పూయించాడు. గంగూలీ సమాధానంతో అక్కడున్నవారంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు.
కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన అనంతరం టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తొలగించడానికి ముందు బీసీసీఐ తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కేవలం గంటన్నర ముందే విషయాన్ని చెప్పారని పేర్కొన్నాడు. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా తనను ఎవ్వరూ వారించలేదని, బీసీసీఐ చెబుతున్నది అవాస్తవమని అన్నాడు. అయితే దీనిపై బీసీసీఐ మరోలా స్పందించి, కోహ్లి వ్యాఖ్యలను ఖండించింది.
ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. డిసెంబర్ 26న భారత్ తొలి టెస్టు ఆడనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమాయ్యడు.
చదవండి: 9 బంతుల్లో 44 పరుగులు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు!
Comments
Please login to add a commentAdd a comment