BCCI president
-
కోహ్లి కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ
విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్ ఈ వివరణ ఇచ్చాడు. కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్ మెషీన్ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!
Roger Binny: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే సోషల్‌మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ఓ రేంజ్లో ఎండగడుతున్నారు. మాజీలు, విశ్లేషకులు సైతం ఎన్నడూ లేనంతగా స్వరం పెంచి టీమిండియా వైఫల్యాలను తూర్పారబెడుతున్నారు. బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ సైతం టీమిండియాను వదిలిపెట్టలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చేసిన సెంచరీలే భారత్‌కు ఆసీస్‌కు మధ్య వత్యాసమని తెలిపాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యమే టీమిండియా కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఈ పార్ట్నర్షిపే ఆసీస్ టీమిండియాపై ఆధిక్యత ప్రదర్శించేలా చేసిందని అన్నాడు. హెడ్, స్మిత్ సెంచరీ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల పోరాటం మూలాన మ్యాచ్ ఆఖరి రోజు వరకు వచ్చింది కాని, నా దృష్టిలో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ ఫైర్ -
త్వరలో పట్టాలెక్కనున్న సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో అతనే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్ అతి త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ ఉందని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి రివీల్ చేశాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ.. గంగూలీ, రణ్‌బీర్‌లకు సంబంధించిన వారెవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా గంగూలీకి అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించాడు. దాదా బయోపిక్కు సంబంధించి గతంలో ఇరు వర్గాలు చాలాసార్లు సిట్టింగ్ చేసినప్పటికీ.. రణ్‌బీర్ డేట్స్ కుదరక ఎలాంటి ఒప్పందం జరగలేదని, ప్రస్తుతం రణ్‌బీర్ డేట్స్ కుదరడంతో డీల్ ఓకే అయ్యిందని, గంగూలీ గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు మరో ముఖ్యమైన వ్యక్తితో (దర్శకుడు) కలిసి రణ్‌బీర్ త్వరలోనే కోల్‌కతాకు వెళ్లనున్నాడని సదరు వ్యక్తి మీడియాకు ఉప్పందించాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పర్యటనలో రణ్‌బీర్.. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని, క్యాబ్ అఫీస్ను అలాగే గంగూలీ ఇంటిని సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, దాదా ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ఏ అధికారిక పదవిలో లేకపోగా.. రణ్‌బీర్ మాత్రం 'తూ ఝూటీ మై మక్కర్' అనే చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. తన బయోపిక్‌లో నటించేందుకు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను గంగూలీ గతంలో సంప్రదించినట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. -
బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..!
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలంటూ బిన్నీకి వినీత్ నోటీసు జారీ చేశారు. భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని... ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ ఇటీవలే బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
షాకిచ్చిన గంగూలీ.. అన్న కోసం అధ్యక్ష పదవి త్యాగం
బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి మరోసారి ఆశించి భంగపడ్డ దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా నామినేషన్ వేయని దాదా.. సోదరుడు స్నేహాశిష్ గంగూలీ కోసం క్యాబ్ అధ్యక్ష పదవిని త్యాగం చేశాడు. గంగూలీ పోటీ నుంచి విరమించుకోవడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో స్నేహాశిష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం ఆనవాయితీగా వస్తుంది. నాటి నుంచి 2019 వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ తర్వాత దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడంతో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరోవైపు క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్‌గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు. ఈ పదవులకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవం కానున్నాయి. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర... -
పాకిస్తాన్‌కు వెళ్లేది లేనిది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది: బీసీసీఐ కొత్త బాస్
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద అంశంపై తాజాగా బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం భారత ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని బీసీసీఐ ఫాలో అవ్వాల్సిందే తప్పించి, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు భారత క్రికెట్ బోర్డుకు లేదని బీసీసీఐ అధ్యక్ష హోదాలో బిన్నీ వివరణ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఒకవేళ కేంద్రం నుంచి ఏవైనా కీలక ఆదేశాలు వస్తే మీడియాకు తప్పక తెలియజేస్తామని స్పష్టం చేశాడు. కాగా, ఇదే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రాలేదని ఆయన వివరించాడు. ఇదిలా ఉంటే, జై షా చేసిన ప్రకటనపై ఉలిక్కపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్‌లో అడుగుపెట్టకపోతే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ కూడా పాల్గొనబోదని బెదిరింపులకు దిగింది. -
మొత్తానికి గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ
-
ముందు షారుక్‌ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్‌ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు. అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు. చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
బీసీసీఐ కొత్త బాస్ ఎవరంటే..?
సౌరవ్ గంగూలీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. బిన్నీకి ఈ పదవి కట్టబెట్టేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులందరూ ఏకపక్షంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబైలో ఇవాళ జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్ చైర్మన్ అభ్యర్ధిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా కొనసాగనుండగా.. ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష బరిలో నిలిపేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రోజర్ బిన్నీ విషయానికొస్తే.. 67 ఏళ్ల ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ భారత్ 1983 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అతను ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో బిన్నీ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బిన్నీ.. 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 వన్డేలు ఆడి 1459 పరుగులు సాధించి, 113 వికెట్లు పడగొట్టాడు. 1983 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన బిన్నీ.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
బీసీసీఐ కి కొత్త బాస్...
-
గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు, మాజీ ఆల్‌రౌండర్, భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ పేరు గురువారం బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో కనిపించింది. బీసీసీఐ నిర్వహించబోయే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున రోజర్ బిన్నీ పేరు ఉంది. గతంలో కేఎస్పీఏ తరఫున సంతోష్ మీనన్ సమావేశాలకు హాజరయ్యేవాడు. తాజాగా మీనన్ స్థానంలో బిన్నీ సమావేశాలకు హాజరుకానుండటంతో బీసీసీఐ అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిన్నీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందు నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన జై షాకు అతని తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశిస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఈ ప్రచారాల సంగతి అటుంచితే.. బీసీసీఐ కొత్త బాస్ ఎవరనేది తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే. బీసీసీఐ అధ్యక్ష పదవి సహా పలు కీలక పోస్టులకు అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న పోటీలో ఉన్న సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ.. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి. -
ఐపీఎల్ మళ్లీ పాత ఫార్మాట్లో...
వచ్చే ఏడాది ఐపీఎల్ పూర్తి స్థాయిలో పాత ఫార్మాట్లో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. కరోనాకు ముందు ఉన్న విధంగా ప్రతీ జట్టు తమ సొంత మైదానంలో ఒక మ్యాచ్, ప్రత్యర్థి మైదానంలో మరో మ్యాచ్ ఆడుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఉండగా, ప్రతీ టీమ్ మిగిలిన 9 టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. 2022లో ఐపీఎల్ పూర్తిగా భారత్‌లోనే జరిగినా... కొన్ని వేదికలకే లీగ్‌ను పరిమితం చేశారు. వచ్చే సీజన్‌నుంచి అంతా సాధారణంగా మారిపోతుందని గంగూలీ స్పష్టం చేశారు. మరో వైపు 2023 సీజన్‌తో పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహిస్తామని గంగూలీ చెప్పారు. దీంతో పాటు టీనేజ్ అమ్మాయిల ప్రతిభను గుర్తించేందుకు తొలిసారి జాతీయ స్థాయిలో బాలికల అండర్–15 టోర్నీ కూడా జరపనున్నట్లు సౌరవ్ గంగూలీ వివరించారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా.. అత్యున్నత పదవి రేసులో గంగూలీ..?
Jay Shah To Become BCCI President Says Reports: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగంలో సవరణలకు ఆమోదం తెలుపుతూ నిన్న (సెప్టెంబర్ 14) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత పాలకమండలికి మరో విడత పదవులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. సుప్రీం తాజా తీర్పుతో ఆఫీస్ బేరర్లు వరుసగా 12 ఏళ్ల పాటు (స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు) పదవుల్లో కొనసాగే వెసలుబాటు లభించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా మరో మూడేళ్ల పాటు (వీరి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది) పదవుల్లో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడని, ఆ స్థానంలో ఉన్న గంగూలీ ఐసీసీ అధ్యక్ష రేసులో ఉండబోతున్నాడని పలు ప్రముఖ వెబ్సైట్లు కథనాలను ప్రసారం చేశాయి. జై షాకు బీసీసీఐ పట్టం కట్టేందుకు 15 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు సంసిద్ధంగా ఉన్నట్లు సదరు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఐసీసీ చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ స్థానంలో గంగూలీని కూర్చొబెట్టేందుకు సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ గంగూలీ ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే క్రికెట్లో అత్యున్నత పదవి చేపట్టబోయే 5వ భారతీయుడిగా రికార్డుపుటల్లోకెక్కుతాడు. గతంలో ఐసీసీ చైర్మన్లుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ పని చేశారు. -
మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా హర్మన్ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 "సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. they shouldn't be disappointed, they should be proud of that silver medal they should be disappointed for still not having a proper system in place for them and it's a bit ironic when he talks about a final game lol#CWG2022 https://t.co/ydsrD7ow7o — Nikhil Mane 🏏🇦🇺 (@nikhiltait) August 8, 2022 తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. The biggest disappointment is you. https://t.co/gBj47PO0HD — ಸುಶ್ರುತ । Sushrutha (@3eyeview) August 8, 2022 This guy is an absolute 🤡 Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal🇮🇳 (@IamHarshDeshwal) August 8, 2022 చదవండి: నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్ -
బాస్ ఈజ్ బ్యాక్.. మళ్లీ ఫీల్డ్‌లోకి దిగనున్న సౌరవ్ గంగూలీ..!
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఒకటి, రెండు ఛారిటీ మ్యాచ్‌ల్లో కనిపించిన దాదా.. త్వరలో ప్రారంభం కాబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్లో (ఎల్ఎల్సీ) తిరిగి తన బ్యాట్‌కు పని చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎల్ఎల్సీ రెండో సీజన్లో ఓ స్పెషల్ మ్యాచ్‌లో గంగూ భాయ్ ఆడబోతున్నాడు. View this post on Instagram A post shared by SOURAV GANGULY (@souravganguly) అజాదీకా అమృత్ మహోత్సవ్ (భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమం) సందర్భంగా మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ద్వారా నిధులు వసూలు చేయబోతున్నామని దాదా స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. త్వరలో లెజెండ్స్‌తో తాను క్రికెట్ ఆడబోతున్నానని, ఇందు కోసం జిమ్‌లో వర్కవుట్లు చేస్తునాన్నని అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. టీమిండియా తరఫున 113 టెస్ట్ మ్యాచ్‌లు, 311 వన్డేలు ఆడిన గంగూలీ, రెండో ఫార్మాట్లలో కలిపి దాదాపు 20 వేల పరుగులు చేశాడు. చదవండి: కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్ మాజీ ఆటగాడు -
ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎంపిక ఖరారు..?
Sourav Ganguly: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజైన్ స్పోర్ట్‌స్టార్ ఓ కథనంలో ప్రస్తావించింది. ఐసీసీ చైర్మన్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దాదా ఎంపిక లాంఛనమేనని స్పోర్ట్‌స్టార్ విశ్లేషించింది. రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడల మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆనురాగ్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపించినా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు బీసీసీఐ వర్గాలు నిరాకరించాయి. అధ్యక్ష ఎన్నికకు సమయం చాలా ఉందని, ఇప్పటి నుంచే ఆ అంశంపై డిస్కషన్ ఎందుకని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అన్నారు. Sourav Ganguly could be the next chairman of the ICC. (Reported by Sportstar). — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2022 కాగా, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ వార్గలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ క్రికెటర్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఐసీసీలో కీలక పదవి దక్కింది. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ మంగళవారం (జులై 26) ప్రకటించింది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు బర్మింగ్హమ్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ వెల్లడించింది. చదవండి: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
'ఆ టీ20 లీగ్‌లో నేను భాగం కావడం లేదు.. అవన్నీ రూమర్సే'
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో తాను భాగం కానున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. కాగా లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో గంగూలీ ఆడనున్నాడంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం ట్విటర్లో ఓ పోస్టును షేర్ చేశాడు. ఈ వార్త పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందించాడు. లెజెండ్స్ లీగ్‌తో తాను భాగం కావడం లేదని, అవి అన్ని రూమర్సే అని గంగూలీ కొట్టి పారేశాడు. "ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. నేను లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడటం లేదు అని" పిటిఐతో గంగూలీ పేర్కొన్నాడు. ఇక టోర్నమెంట్ ఒమెన్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ క్రికెటర్లు భాగం కానున్నారు. The @BCCI president @SGanguly99 to @PTI_News "I am not a part of any Legends League. The news is not true."#CricketTwitter — Kushan Sarkar (@kushansarkar) July 20, 2022 Here we go! One of India's most iconic captains and cricket's all-time greats Dada @SGanguly99 is now on #BossLogonKaGame. Legends don't get bigger than this! Welcome to @llct20, #Dada. @DasSanjay1812#BossGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/hbCCypmJCT — Legends League Cricket (@llct20) July 20, 2022 చదవండి: IND vs WI: జిమ్‌లో తెగ కష్టపడుతున్న రాహుల్.. వీడియో వైరల్..! -
గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు. London, UK | I was felicitated by the British Parliament as a Bengali so it was a nice feeling. It was in the Parliament. They had contacted me six months ago. They do this award every year and I got it: BCCI President Sourav Ganguly pic.twitter.com/Q8k3PdiO2k — ANI (@ANI) July 13, 2022 కాగా, జులై 13 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్ పార్లమెంట్ గంగూలీని గౌరవించింది. ఆ మ్యాచ్‌లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్ సింగ్ (69), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్)లు మరపురాని ఇన్నింగ్స్‌ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం కెప్టెన్ గంగూలీ షర్ట్ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్‌గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్ పార్లమెంట్ నిన్న దాదాను సత్కరించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‌లోనూ రోహిత్ సేన 1-0లో ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ.. -
లండన్ వీధుల్లో 'దాదా'గిరి.. నైట్ పార్టీలో హంగామా చేసిన బీసీసీఐ బాస్
టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ ప్రస్తుత బాస్ సౌరవ్ గంగూలీ తన 50వ జన్మదిన (జులై 8) వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు. అడ్వాన్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మిత్రులు (సచిన్), శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం ముంబైలో జరుపుకున్న దాదా.. గురువారం రాత్రి లండన్‌లో మరోసారి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. దాదా.. లండన్ వీధుల్లో భార్య డోనా, కూతురు సనాతో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి బర్త్‌డే పార్టీని ఎంజాయ్ చేశాడు. Sourav Ganguly Celebrating 50th B'day dancing Midnight with daughter Sana & Wife Dona Ganguly in London.@SGanguly99 #HappyBirthdayDada #BCCI #SouravGanguly #SouravGangulybirthday #birthday #Cricket #Dada pic.twitter.com/DO5sNr3bKy — Vineet Sharma (@Vineetsharma906) July 8, 2022 కూతురు సనా ఎదురుగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని టైటిల్ సాంగ్‌కు చిందేస్తూ పరవశించిపోయాడు. అలాగే మరో బాలీవుడ్ హిట్ సాంగ్‌కు భార్య డోనాతో కాలుకదిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. గంగూలీలోని డ్యాన్సింగ్ యాంగిల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దాదాగిరితో పాటు గంగూలీలో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పుట్టిన రోజు సందర్భంగా గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సహచర క్రికెటర్లు, అభిమానులు దాదాకు హాఫ్ సెంచరీ గ్రీటింగ్స్ తెలిపారు. చదవండి: Sourav Ganguly: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్! -
ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు
టీమిండియా మాజీ క్రికెటర్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. గంగూలీ కొనుగోలు చేసిన కొత్త బంగ్లా విలువ సుమారు రూ. 40 కోట్లు అని సమాచారం. గంగూలీ 48 సంవత్సరాల అనంతరం తన పూర్వీకుల ఇంటి నుంచి కొత్త భవనంలోకి మారనుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక కోల్‌కతాలోని లోవర్ రాడన్ స్ట్రీట్‌లో 23.6 కొత్తా(దాదాపు 10,280 స్క్వేర్‌ఫీట్) కలిగిన రెండంతస్తుల భవనాన్ని గంగూలీ కొనుగోలు చేశాడు. ఈ ప్రాపర్టీ మొత్తాన్ని భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ గంగూలీ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. పాత భవనమే అయినప్పటికి.. రోడ్డుకు దగ్గరగా ఉండడం.. టవర్ డెవలప్మెంట్కు అనుమతి ఉండడంతో దాదా ఎంతో ఇష్టంతో కొనుగోలు చేశాడు. చదవండి: Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి.. -
బీజేపీలో చేరనున్న బీసీసీఐ బాస్..?
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కమల తీర్ధం పుచ్చుకోనున్నాడన్న వార్తలు ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (మే 6) దాదాతో సమావేశం కానుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో పార్టీలోకి ఆహ్వానించేందుకే అమిత్ షా స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం కోల్‌కతా పర్యటనలో ఉన్న అమిత్ షా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం గంగూలీ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారని, ఆతర్వాత వీరిద్దరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని తెలుస్తోంది. బయటికి ఇది సాధారణ భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ.. షా పక్కా వ్యూహంతోనే గంగూలీని కలుస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, 2021 అసెంబ్లీ ఎన్నకల సమయంలోనే గంగూలీని బీజేపీలోకి లాక్కోవాలని కమల దళం గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే, ఆ సమయంలో కాషాయ కండువా కప్పుకునేందుకు దాదా ససేమిరా అన్నారు. బెంగాల్ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గంగూలీ.. ఆ సమయంలో బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరించడంతో కమల దళానికి ఊహించినన్ని సీట్లు రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా దాదాను పార్టీలోకి తీసుకుని అతన్నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ చేయాలని బీజేపీ ఇప్పటినుంచే ప్రయత్నాలను మొదలు పెట్టింది. మరోవైపు గంగూలీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సైతం సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దీంతో దాదా ఏ పార్టీలో జాయిన్ అవుతాడోనని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బెంగాలీలచే ముద్దుగా ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా పిలువబడే గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! -
'బీసీసీఐ బాస్‌ని.. పనికిమాలిన విషయాలు పట్టించుకోను'
కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఏదో ఒక అంశం గంగూలీని టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్ కమిటీ వ్యవహారాల్లో గంగూలీ తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు విరాట్ కోహ్లి, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో కలిసి గంగూలీ సమావేశమైన ఫోటో ఒకటి చక్కర్లు కొట్టింది. చదవండి: Australia Tour Of Pakistan: 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై సిరీస్ ఈ వార్తలను బీసీసీఐ బాస్ గంగూలీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. తాను బీసీసీఐకి బాస్‌నని.. ఇలాంటి తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గంగూలీ ఘూటు విమర్శలు చేశాడు.''నేను బీసీసీఐకి అధ్యక్షుడి హోదాలో ఉన్నా. అలాంటి గొప్ప స్థానంలో ఉన్నా నాకు పిచ్చి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఒక బీసీసీఐ బాస్‌గా నా పనేంటో తెలుసు. ప్రస్తుతం అదే చేస్తున్నా. సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో నా ఫోటోను పెట్టి నిబంధనలు అతిక్రమించాడని ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. సెక్రటరీ జై షా, విరాట్ కోహ్లితో కలిసి ఫోటో దిగినంత మాత్రానా నేను సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరైనట్లు ఎలా చెప్పగలరు. అది బయటో ఎక్కడో కలిసిన సందర్భంలో తీసిన ఫోటో అని భావించొచ్చు కదా.. అయినా ఇలాంటి పిచ్చి ఆరోపణలు నాకు అవసరం లేదు. టీమిండియా తరపున 424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాకు రూల్స్ ఏంటనేవి తెలియవా'' అంటూ విరుచుకుపడ్డాడు. చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. -
భార్య, గర్ల్‌ఫ్రెండ్ వల్లే అదంతా.. బీసీసీఐ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ganguly Comments On Wife And Girlfriend: కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా కోహ్లి యాటిట్యూడ్‌పై ప్రశంసలు కురిపించిన దాదా.. ఒత్తిడి ఎదుర్కొనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. మనిషి జీవితంలో ఒత్తిడి అనేది అస్సలు ఉండదని, అది భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ల వల్లే వస్తుందంటూ నవ్వులు పూయించాడు. గంగూలీ సమాధానంతో అక్కడున్నవారంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు. కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన అనంతరం టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తొలగించడానికి ముందు బీసీసీఐ తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కేవలం గంటన్నర ముందే విషయాన్ని చెప్పారని పేర్కొన్నాడు. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా తనను ఎవ్వరూ వారించలేదని, బీసీసీఐ చెబుతున్నది అవాస్తవమని అన్నాడు. అయితే దీనిపై బీసీసీఐ మరోలా స్పందించి, కోహ్లి వ్యాఖ్యలను ఖండించింది. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. డిసెంబర్ 26న భారత్ తొలి టెస్టు ఆడనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమాయ్యడు. చదవండి: 9 బంతుల్లో 44 పరుగులు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు! -
అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు
Ganguly Questioning Women Cricket Resurfaces: తమ ఆరాధ్య క్రికెటర్ వన్డే కెప్టెన్సీ ఊడటానికి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే ప్రధాన కారణమని భావిస్తున్న విరాట్ కోహ్లి అభిమానులు.. దాదా గతంలో చేసిన చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో గంగూలీ గతంలో అమ్మాయిలను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి కోహ్లి అభిమానుల కంటపడింది. గంగూలీని టార్గెట్ చేసేందుకు ఈ వీడియోను ప్రధాన ఆస్త్రంలా మార్చుకున్న కోహ్లి ఫ్యాన్స్, గంగూలీపై భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు మూడేళ్ల కిందట ఓ బెంగాళీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కూతురు సనా గంగూలీ ప్రస్తావన సందర్భంగా గంగూలీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. సనాని.. తానెప్పుడు క్రికెట్ ఆడమని అడగలేదని, అసలు అడగనని, ఎందుకంటే అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని, అమ్మాయిలు క్రికెట్ ఆడటానికే పనికిరారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో పెద్ద దుమారం రేపిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు గంగూలీని ఏకిపారేస్తున్నారు. బీసీసీఐ బాస్‌కి మహిళలంటే గౌరవం లేదని, అందుకే అలాంటి చీప్ వ్యాఖ్యలు చేశాడని మండిపడుతున్నారు. కాగా, భారత మహిళల జట్టు, పురుషుల జట్టుతో సమానంగా రాణిస్తూ ప్రపంచక్రికెట్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విధితమే. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి, షెఫాలీ వర్మ లాంటి క్రికెటర్లు పురుష క్రికెట్లతో సమానంగా రాణిస్తూ, ఇంచుమించు వారంతటి క్రేజ్‌ని సంపాదించారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో గంభీర్ ‘రీ ఎంట్రీ’.. ఈసారి కొత్త అవతారంలో.. -
కోహ్లి నా మాట వినలేదు: గంగూలీ
Sourav Ganguly Explain Reasons Behind Why Virat Kohli Removed From Odi Captaincy: విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీనుంచి తప్పిస్తూ రోహిత్ శర్మను ఆ స్థానంలో నియమిస్తున్నట్లు బుధవారం ఏకవాక్య ప్రకటన చేసిన బీసీసీఐ ఇప్పుడు సదరు అంశంపై స్పందించింది. స్వయంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై స్పష్టతనిచ్చాడు. కోహ్లి టి20 నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే వన్డే కెప్టెన్‌గా కూడా అతడిని తొలగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారని గంగూలీ వెల్లడించాడు. రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండటం భారత్‌లాంటి జట్టుకు సరైంది కాదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘టి20 కెప్టెన్సీని రాజీనామా చేయవద్దని కోహ్లిని మేం అభ్యర్థించాం. అయితే అతను మా మాటను పట్టించుకోకుండా తప్పుకోవాలనే నిర్ణయించుకున్నాడు. దాంతో సెలక్టర్లు కూడా వన్డేలు, టి20లకు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వ సమస్యలు వస్తాయని భావించారు. ఇతర వివరాలు చెప్పలేను గానీ అన్నింటికంటే ప్రధాన కారణం మాత్రం ఇదే. వన్డేల్లో కోహ్లి కెప్టెన్సీ రికార్డు బాగుందనేది వాస్తవం. ఆ అంశాన్ని కూడా పరిశీలించాం. అయితే తాను బాధ్యత తీసుకున్న కొన్ని మ్యాచ్‌లలోనే రోహిత్ కూడా తానేంటో నిరూపించుకున్నాడు. అతడు ఇకపై కూడా కెప్టెన్‌గా రాణిస్తాడనే ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని కోహ్లికు నేను, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కూడా స్వయంగా చెప్పాం. మా నిర్ణయాన్ని అతనూ అంగీకరించాడు’ అని గంగూలీ వివరించాడు. చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా! -
బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా
Ganguly Quits ATK Mohun Bagan Director Position: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి బుధవారం(అక్టోబర్ 27) రాజీనామా చేశాడు. ఐపీఎల్లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న RPSG గ్రూప్ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు గంగూలీ డైరెక్టర్ మాత్రమే కాదు..షేర్ హోల్డర్ కూడా. కాగా, RPSG గ్రూప్ లక్నో జట్టును రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ రెండు జట్ల చేరకతో ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖను నిర్వహించిన కిరణ్ రిజుజు ఇతర శాఖకు బదిలీ కావడంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండు వారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు కొత్త మంత్రి వచ్చారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనురాగ్ ఠాకూర్‌కు ఈ అవకాశం లభించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్‌కు ఇదివరకే క్రీడలతో అనుబంధముంది. ఆయన గతంలో 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు బీసీసీఐ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనుభవం అతనికుంది. ఇదిలా ఉంటే, ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్‌ను జులై నెలలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమై జపాన్ ప్రధాని యొషిహిదె సుగా టోక్యోలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి తోడు కొత్త క్రీడా మంత్రి రావడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయంలో ఉన్నారు. -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్: గంగూలీ
కరోనా నేపథ్యంలో టి20 ప్రపంచకప్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ప్రపంచకప్ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. తుది షెడ్యూల్, ఇతరత్రా విషయాలన్నీ త్వరలోనే వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పారు. -
ఇది ఎలా జరిగిందో చెప్పడం కష్టం: గంగూలీ
ముంబై: బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘బోర్డు ఈ సంవత్సరం లీగ్‌ను జరపాలని భావించిన సమయంలో దేశంలో కొన్ని కేసులు మాత్రమే ఉండడం, పరిస్థితి కూడా అదుపులోనే ఉన్నట్లు కనిపించింది. అందుకే మ్యాచ్‌లను వివిధ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. కానీ కరోనా పరీక్షల్లో నలుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఐపీఎల్ 14 వ ఎడిషన్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని బోర్డు మంగళవారం నిర్ణయించింది’’ అని తెలిపారు. నివేదిక ప్రకారం బయోబబుల్ ఉల్లంఘన లేదు ఆటగాళ్లకు పాజిటివ్ రావడంపై స్పందిస్తూ.. ‘‘బయోబబుల్‌లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని మాకు నివేదిక అందింది. అయినా ఆటగాళ్లకు పాజిటివ్ ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. బీసీసీఐ ఇంత పక్కాగా చర్యలు చేపట్టినా ఆటగాళ్లకు ఎలా వైరస్ సోకిందని చెప్పడం కూడా కష్టమే’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అమిత్ మిశ్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వృద్ధిమాన్ సాహాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ తర్వాత ఈ వాయిదా ప్రకటన వచ్చింది. అహ్మదాబాద్‌లో మే 30 వరకు జరగాల్సిన 60 మ్యాచ్‌ల టోర్నమెంట్లో కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. తాజాగా ఐపీఎల్ రద్దు కాలేదని, వాయిదా మాత్రమే వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దీనిపై మంగళవారం స్పష్టం చేశారు. ( చదవండి: IPL 2021: ఐపీఎల్ రీషెడ్యూల్.. బీసీసీఐ ఆప్షన్లు ఇవే..! ) -
గంగూలీకి మరో రెండు స్టెంట్లు
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు తాజాగా రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్లు అమర్చాం. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్‌కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని వారు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్లు వేశారు. -
రేపు గంగూలీ డిశ్చార్జి
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే మరికొన్ని రోజుల్లో లేదా వారాల్లో అతనికి మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో రూపాలి బసు తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి మంగళవారం గంగూలీని పరీక్షించిన తర్వాత తదుపరి చికిత్స గురించి వైద్యులకు సూచనలిస్తారని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఇప్పుడే యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం కనిపించలేదు. కానీ కొన్ని రోజుల్లో కచ్చితంగా యాంజియాప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. బుధవారం డిశ్చార్జి చేస్తాం. తర్వాత కూడా వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తుంటారు’ అని రూపాలి బసు వెల్లడించారు. మరోవైపు సోమవారం గంగూలీని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి జై షా పరామర్శించారు. -
నాలుగున్నర నెలల్లో 22 సార్లు : గంగూలీ
సాక్షి, ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కరోనా వైరస్ బారిన పడకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ లీగ్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఆందోళన మధ్య ఐపీఎల్-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహణలో బిజీగా బిజీగా గడిపిన గంగూలీ, రానున్న ఆస్ట్రేలియా పర్యటనపై మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తన చుట్టూ కేసులు ఉండటం వల్లే అన్ని సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా పెద్దవాళ్లైన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డా. తన కోసం కాదు కానీ చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్ సోకకూడదుకదా అందుకే.. అంటూ హైజీన్ టెక్నాలజీ బ్రాండ్ లివింగ్ గార్డ్ ఏజీ బ్రాండ్ అంబాసిడర్ గంగూలీ పేర్కొన్నారు. సిడ్నీలో 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ తరువాత ఆటగాళ్లందరూ క్షేమంగా ఉన్నారన్నారు. వారంతా ఆరోగ్యంగా ఆటకు సిద్ధంగా ఉన్నారని గంగూలీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు పెద్దగా లేవని బీసీసీఐ చీఫ్ చెప్పారు. అలాగే దేశీయంగా క్రికెట్ చాలా త్వరలోనే ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ భారత్ పర్యటనలో భాగంగానాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఐదు టి టీ20 మ్యాచ్‌లు ఆడనుందని చెప్పారు. అలాగే దేశమంతా కరోనా సెకండ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు ఈ క్రమంలో 8-10 జట్లు వచ్చినపుడు కొంచెం కష్టమవుతుందని చెప్పారు. ముంబై, న్యూఢిల్లీలో కేసులు బాగా పెరిగినట్టు తెలుస్తోంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని అంచనా వేయాలని గంగూలీ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో నవంబర్ 27 న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ తొలి వన్డే ఆడనుంది. -
అడిలైడ్‌లో ఆసీస్‌తో భారత్ డేనైట్ టెస్టు
కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్ వేదికగా డేనైట్‌లో ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్‌తో భారత్ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్‌లో ఈ పింక్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ‘దాదా’ ఐసీసీ చైర్మన్ రేసులో నుంచి తప్పుకున్నాడా? గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్‌కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. -
చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2020 రద్దయ్యింది అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. గంగూల్ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్ నజ్నూల్ హసన్ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు. (ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ) ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరం తెలపడంతో మ్యాచ్ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం (జూలై 9న) ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. . (ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు) -
ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్న ‘దాదా’... ఏమాత్రం అవకాశం దొరికినా సరైన భద్రతా చర్యలు తీసుకుంటూ లీగ్‌ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్‌కు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఐసీసీ టి20 వరల్డ్‌కప్ భవితవ్యంపై ప్రకటన చేయాల్సి ఉంటుందని అన్నాడు. బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న ‘దాదా’ ఇంకా ఏమన్నాడంటే... ► మా తొలి ప్రాధాన్యత భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే. 35–40 రోజులు దొరికినా చాలు టోర్నీ జరుపుతాం. కానీ వేదిక గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ► మొదట ఐపీఎల్ విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే ఏ దేశానికి లీగ్‌ను తరలించాలో ఆలోచించాలి. విదేశాల్లో అయితే ఫ్రాంచైజీలకు, బోర్డులకు వ్యయభారం ఎక్కువవుతుంది. ► పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ రద్దయింది. ► టి20 ప్రపంచకప్‌పై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. కానీ ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు అసలేం జరుగనుందనే దానిపై ఒక నిర్ణయానికి రాలేం. నా వ్యక్తిగత అంచనా ప్రకారమైతే ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగేది అనుమానమే. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లీగ్ జరుగుతుందని చెప్పలేను. అహ్మదాబాద్‌పై ప్రస్తుతం మా దృష్టి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడే నిర్వహిస్తామని కచ్చితంగా అయితే చెప్పలేను. ► కరోనా విరామం తర్వాత భారత్ ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదో చెప్పలేను. భారత క్రికెటర్ల ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యత. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదు. -
మీడియాకు లీకేజీలపై బీసీసీఐ ఆగ్రహం
బీసీసీఐకి సంబంధించిన అంతర్గత సమాచారం మీడియాలో తరచుగా వస్తుండటం పట్ల బోర్డు కార్యదర్శి జై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు ఉద్యోగులెవరూ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘బీసీసీఐ ఉద్యోగులు కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలిసింది. ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల బోర్డుకు సంబంధించి రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా గానీ తమకు తెలీకుండా గానీ ఎవరైనా, ఏ రూపంలోనైనా ఇలా సమాచారం బయటకు చేరవేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వేతన చెల్లింపులు కూడా లేకుండా ఉద్యోగంలోంచి తొలగిస్తాం’ అని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్లో జై షా పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమాచారం లీక్ కావద్దంటూ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్ కూడా ఇప్పుడు మీడియాకు లీక్ కావడం విశేషం. -
ఇప్పట్లో క్రికెట్ కష్టమే
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఈ ఏడాది ఏదో ఒక సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరగవచ్చని ఆశిస్తున్న వారికి ఇది నిరాశ కలిగించేదే. నేరుగా చెప్పకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్య పరోక్షంగా అదే సూచిస్తోంది. జర్మనీలోని ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ లీగ్ ‘బుండెస్లిగా’ మే నెల మొదటి వారం నుంచి ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘సామాజిక వ్యవహారశైలి విషయంలో భారత్, జర్మనీకి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. నాకు తెలిసి సమీప భవిష్యత్తులో భారత్‌లో క్రికెట్ సాధ్యం కాకపోవచ్చు. ఈ సమయంలో ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడించడం గురించి ఆలోచించడం కూడా అనవసరం. కానీ, అయితే లాంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఆటలను నేను ప్రోత్సహించను’ అని గంగూలీ స్పష్టం చేశాడు. అతని మాజీ సహచరుడు హర్భజన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. భజ్జీ చెప్పిన మాటలు కూడా ఐపీఎల్ నిర్వహణ ఎంత కష్టమో సూచిస్తున్నాయి. ‘భారత్‌లో అగ్రశ్రేణి క్రికెటర్లను చూసేందుకు జనం స్టేడియాలకు మాత్రమే రారు. ఒక ఐపీఎల్ జట్టు ప్రయాణిస్తుందంటే స్టేడియం బయట, హోటల్ వద్ద, ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడతారు. భౌతిక దూరం పాటించాల్సిన సమయంలో వీరందరినీ ఎలా ఆపగలం. నాకు తెలిసి కోవిడ్–19కు ఏదో వ్యాక్సిన్ కనుగొనే వరకు క్రికెట్ జరగరాదు’ అని మాజీ ఆఫ్‌స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఖాళీ మైదానాల్లో ఐపీఎల్‌ను నిర్వహించాలని ప్రసారకర్తలు భావిస్తున్నా... తాము అందుకు సిద్ధంగా లేమని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కేఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. చెపాక్ స్టేడియంలో తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కే భారీ సంఖ్యలో జనం వచ్చారని, భారత అభిమానులను నిలువరించడం అంత సులువు కాదని ఆయన అన్నారు. ప్రాణాపాయం ఉండే ఇలాంటి సమయంలో తమకు నష్టాలు వస్తాయని తెలిసినా తప్పదని వివరించారు. -
మూర్ఖులు అర్థం చేసుకోలేరు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తనకు ఎంతో గౌరవముందని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారంతా మూర్ఖులు అని, వారి అభిప్రాయాన్ని తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ సోషల్ మీడియా, మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ‘శాస్త్రి–గంగూలీకి చెందిన ఏ విషయమైనా మీడియాకు మాంచి మసాలాతో కూడిన భేల్పూరి, చాట్‌లాంటి వార్తలా అనిపిస్తోంది. మాపై వచ్చే ఊహాగానాలకు మీడియా విపరీతంగా స్పందిస్తూ ఉంటుంది. పని పాట లేనివారే సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఇందులో వాస్తవం లేదు.గంగూలీ క్రికెట్‌కు ఎంతో చేశాడు. అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో గంగూలీ మళ్లీ భారత క్రికెట్లో పునరుజ్జీవం నింపాడు. మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి నేను ఆలోచించను’ అని రవిశాస్త్రి వివరించారు. వారం క్రితం గంగూలీ కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చాడు. ఊహాగానాలు, కల్పిత వార్తలు నమ్మొద్దని తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికవడం పట్ల రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. భారత కోచ్ పదవి ఒత్తిడితో కూడినదని అన్నారు. ప్రారంభంలో భారత జట్టు నంబర్‌వన్‌గా ఎదుగుతుందని తానంటే అందరూ వింతగా చూశారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది అని కోచ్‌గా తన పనితీరుని విమర్శిస్తున్న వారికి సమాధానంగా చెప్పారు. టి20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా వికెట్ కీపర్‌గా పరీక్షిస్తామని అన్నారు. -
‘పింక్ బాల్’ ఎందుకు గుచ్చుకుంటోంది!
అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) అంటే భారత్ ఒకప్పుడు ఆమడ దూరం పరుగెత్తింది. ‘మేం ఉపయోగించం. ఏం చేసుకుంటారో పొమ్మంటూ’ ఐసీసీకి సవాల్ విసిరింది. డోపింగ్ పరీక్షలు నిర్వహించే ‘వాడా’ పరిధిలో ఇతర దేశాల క్రికెటర్లంతా ఉండగా, మేం మాత్రం సొంతంగా నిర్వహించుకుంటాం తప్ప అందరితో కలిసేది లేదని బీసీసీఐ కరాఖండీగా చెప్పింది. ఇటీవల ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కూడా తగిన కారణం చెప్పి తమ నిర్ణయంపై స్పష్టత ఇవ్వడంకంటే బీసీసీఐ ఆధిపత్య ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. డే అండ్ నైట్ టెస్టుల విషయంలోనూ ఇప్పటి వరకు అదే తీరు. మిగతా ప్రధాన టెస్టు జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడగా, భారత్ మాత్రం తమ పట్టు విడవలేదు. బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఈ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో టీమిండియా తొలి గులాబీ మ్యాచ్ త్వరలోనే జరుగుతుందా? డీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సమయంలో భారత్–శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో దీనిని ఒకసారి ఉపయోగించారు. అయితే నిర్ణయాలు అన్నీ తమకు ప్రతికూలంగా వెళ్లడంతో ఇకపై వాడేది లేదన్న బీసీసీఐ... డీఆర్ఎస్ లోపాలభరితం అని తేల్చేసింది. సాంకేతికంగా చెప్పుకోవడానికైనా భారత్ ఒక సిరీస్‌లో డీఆర్ఎస్ ఉపయోగించిన తర్వాత తమ అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచింది. కానీ డే అండ్ నైట్ టెస్టు విషయంలో కనీసం అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. మొదటి నుంచి మాకు సరిపోదు అంటూ దాటవేస్తూ వచ్చింది. గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో తమ దేశంలో జరిగిన సిరీస్‌లో ఒక టెస్టును ‘పింక్ బాల్’తో ఆడదామని కోరితే భారత్ ఏకవాక్యంతో గట్టిగా తిరస్కరించేసింది. ఇతర దేశాలన్నింటికీ పనికొచ్చిన గులాబీ బంతి టెస్టు మ్యాచ్ టీమిండియాకు వచ్చేసరికి మాత్రం తగనిదిగా మారిపోయింది. దులీప్ ట్రోఫీకే పరిమితం... ప్రపంచ క్రికెట్లో గులాబీ బంతితో ‘డే అండ్ నైట్’ టెస్టుల నిర్వహణ గురించి చర్చ జరుగుతున్న సమయంలో భారత్ తమ దేశవాళీ క్రికెట్లో వాడి చూడాలని భావించింది. 2015 డిసెంబర్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగ్గా... 2016 సీజన్ దులీప్ ట్రోఫీలో భారత్ మొదటిసారి గులాబీ బంతిని వాడింది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా డే అండ్ నైట్ మ్యాచ్‌లను కొనసాగిస్తూ ఫ్లడ్‌లైట్లలో ఆటను నిర్వహించింది. దేశవాళీలో సక్సెస్ అయితే టెస్టు క్రికెట్లో ప్రయత్నించవచ్చని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్ కారణంగా లేదా అనాసక్తి వల్ల కూడా భారత టెస్టు జట్టు రెగ్యులర్ ఆటగాళ్లు ఇందులో ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు. దాంతో ఆ మ్యాచ్ అనుభవం గురించి కానీ, గులాబీ బంతి స్పందించే తీరును గురించి కూడా మన ప్రధాన ఆటగాళ్లకు అవగాహనే రాలేదు. కోహ్లి, పుజారాలాంటి బ్యాట్స్‌మెన్... బుమ్రా, అశ్విన్‌లాంటి బౌలర్లు ఒక్కసారైనా వాడి ఉంటే ముందడుగు పడేదేమో. ఒక్క మ్యాచ్‌లో కూడా గులాబీ బంతిని వాడకుండా నేరుగా టెస్టు బరిలోకి దిగడం సాధ్యం కాదని టీమిండియా ఆ తర్వాత ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పడేసింది. ఈ సారి అవుట్... 2019 దులీప్ ట్రోఫీ సమయంలో బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సారి లీగ్ మ్యాచ్‌లన్నీ పాత పద్ధతిలోనే ఎర్ర బంతితోనే జరుగుతాయని, ఫైనల్ మాత్రం పింక్ బాల్‌తో డే అండ్ నైట్‌గా ఉంటుందని ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఫైనల్ మ్యాచ్‌ను కూడా ‘పింక్’ కాకుండా సాంప్రదాయ ఎర్ర బంతితోనే ఆడించింది. మూడు సీజన్ల అనుభవం తర్వాత ఇక ఇది తమకు పనికి రాదని బోర్డు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు దీని ద్వారా పరోక్షంగా అర్థమైంది. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా టెస్టుల్లో మన జట్టులో పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదు. అయితే మూడు సీజన్లు ఆడించినా... దృశ్యానుభూతి విషయంలో ప్రేక్షకులనుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ చేయకపోవడం విశేషం. ఇప్పుడు ఎందుకు... ప్రేక్షకులను స్టేడియానికి ఆకర్షించే అంశంలో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఘోరంగా విఫలమైంది. ఉచిత పాస్‌లు ఇవ్వడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీసుకురావడంవంటివి చేసినా మూడు వేదికల్లోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ముఖ్యంగా పుణేలో అయితే సగంకంటే ఎక్కువ స్టేడియానికి పై కప్పు లేకపోవడంతో ఎండ దెబ్బకు ఎవ్వరూ మ్యాచ్ వైపు కూడా చూడలేదు. ఇలాంటి ప్రేక్షకులను సాయంత్రం వేళ జరిగే డే అండ్ నైట్ టెస్టులు కొంత ఆకర్షించవచ్చు. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే ఈ తరహాలో ఏదైనా చేయాలనేది మొదటినుంచి గంగూలీ ఆలోచన. 1877లో తొలి టెస్టు మ్యాచ్ జరిగిన తర్వాత క్రికెట్ ఎన్నో రకాలుగా స్వరూపం మార్చుకుంది. ఎన్నో కొత్త అంశాలు వచ్చి చేరాయి. కాబట్టి పింక్ బాల్, ఫ్లడ్ లైట్ టెస్టు క్రికెట్ అనేది కూడా ఒక కొత్త ఆకర్షణ కాబట్టి ప్రయత్నిస్తే తప్పేంటనేది చాలా మంది వాదన. సహజంగానే ఇది అభిమానులకు కొత్త అనుభూతి ఇస్తుంది కాబట్టి ఐపీఎల్ తరహాలో సరదాగా సాయంత్రం గడిపేందుకు బాగుంటుందని సౌరవ్ భావిస్తున్నాడు. మ్యాచ్ సాధ్యమేనా! విదేశీ పర్యటనల్లో డే అండ్ టెస్టు గురించి ఇప్పుడే చెప్పలేం కానీ గంగూలీ స్వదేశంలోనైనా ఒక మ్యాచ్ ఆడించాలని పట్టుదలగా ఉన్నాడు. బహిరంగంగా చెప్పకపోయినా బోర్డు అధ్యక్షుడి వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లోనే ఒక టెస్టు విషయంలో అతను ఈ ఆలోచనతో ఉన్నట్లు అంతర్గత సమాచారం. బహుశా తన సొంత మైదానం కోల్‌కతాలో జరిగే రెండో టెస్టే పింక్ బాల్ మ్యాచ్ కావచ్చని కూడా వినిపిస్తోంది. భారత్‌తో పోలిస్తే బంగ్లా బలహీనమైన జట్టు కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పింక్ బంతి కారణంగా ఒక వేళ మ్యాచ్ గమనం భారత్‌కు ప్రతికూలంగా మారినా దానిని ఎదుర్కోగల సత్తా టీమిండియాకు ఉందని మాజీ కెప్టెన్ భావిస్తున్నాడు. ఈ విషయాన్ని కోహ్లితో చర్చించిన తర్వాతే దీనిపై అతను వ్యాఖ్య చేసినట్లు సమాచారం. మరోవైపు పింక్ బాల్‌తో టెస్టు నిర్వహణకు మద్దతిచ్చిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే... ఈ విషయంలో వాతావరణం, వేదిక, మ్యాచ్ జరిగే రోజులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నాడు. మంచు కారణంగా రాత్రి పూట బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోతే మొత్తం సమస్యగా మారిపోతుందని అభిప్రాయపడ్డాడు. బంతులతోనే సమస్య! దులీప్ ట్రోఫీలో ఆడిన అనేక మంది పింక్ బాల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే బోర్డు మరింత ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియాలో ‘కూకాబుర్రా’ బంతులు, ఇంగ్లండ్ లో ‘డ్యూక్’ బంతులు వాడతారు. ఈ రెండు దేశాల్లో వాడిన గులాబీ బంతులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. భారత్‌లో టెస్టులతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు ‘ఎస్జీ’ బంతులు ఉపయోగిస్తారు. ‘ఎస్జీ’ గులాబీ బంతులు ఏ మాత్రం నాణ్యతతో లేవని ఆటగాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఇతర టెస్టు దేశాల్లో ఫ్లడ్‌లైట్లు వాడినప్పుడు బంతి బాగా స్వింగ్ అయింది. కానీ మన వద్దకు వచ్చేసరికి అది జరగలేదు. పైగా బౌలర్లకు పింక్ బాల్స్ ఏమాత్రం అనుకూలంగా లేవు. తొలి స్పెల్ వేసిన తర్వాత ఇక బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. పది ఓవర్లకే సీమ్ పాడైపోతోంది. రివర్స్ స్వింగ్ కాకపోగా, స్పిన్నర్లకు కూడా పట్టు చిక్కడం లేదు’ అని విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ అన్నాడు. ఒక భారత అంపైర్ అభిప్రాయం ప్రకారం ‘దులీప్ ట్రోఫీలో ఉపయోగించిన బంతులపై వాడిన లక్క మరీ నాసిరకంగా ఉంది. అది చెదిరిపోయి బంతి నల్లగా మారిపోతోంది. ఫలితంగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో బ్యాట్స్‌మెన్‌కు అది కనిపించడం లేదు’ అని మరో కారణం వెల్లడించారు. అయితే ఇది పరిష్కరించుకోదగ్గ సమస్యే అని, నాణ్యత విషయంలో కంపెనీలకు తగు సూచనలు ఇచ్చి మంచి బంతులు తయారు చేయించుకోగలమని బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీమ్ వ్యాఖ్యానించారు. 11 - ఇప్పటి వరకు పురుషుల క్రికెట్లో జరిగిన డే నైట్ టెస్టుల సంఖ్య. అన్నింటా ఫలితాలు వచ్చాయి. భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా అన్ని జట్లు ఇప్పటికే డే నైట్ టెస్టులు ఆడాయి. ఇందులో ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు మ్యాచ్‌లు ఆడి, ఐదింటా విజయం సాధించింది. శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కోమ్యాచ్లో గెలిచాయి. -
దాదా అధ్యక్షుడయ్యాక రవిశాస్త్రి పరిస్థితేంటో?
సాక్షి, ముంబై: టీమిండియా మాజీ సారథి, క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షపదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. దీంతో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు.. చేయబోయే సంస్కరణలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనమైన తరుణంలో ఓ ఆసక్తికర చర్చను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి గంగూలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న విషయం తెలిసిందే. 2016లో టీమిండియా కోచ్ పదవికి తనను రిజెక్ట్ చేయడానికి గంగూలీనే ప్రధాన కారణమని రవిశాస్త్రి ఎన్నో సార్లు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు దిగాడు. అయితే రవిశాస్త్రి విమర్శలపై ఇప్పటివరకు గంగూలీ సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే గంగూలీ రవిశాస్త్రిపై రివేంజ్ తీసుకునే సమయం వచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవిశాస్త్రి భవితవ్యం ఏంటని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు. తనకు శత్రువులైన వారందినినీ తొలగించి.. దాదా తన కొత్త గ్యాంగ్ ఏర్పరుచుకుంటాడు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఫన్నీ మీమ్స్‌ను రూపొందించి నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. 2016లో టీమిండియా కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. దీనిలో భాగంగా ఈ కమిటీ అభ్యర్థులకు ఇంటర్య్వూలను ఏర్పాటు చేసింది. అయితే రవిశాస్త్రి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనడాన్ని లక్ష్మణ్, సచిన్‌లు స్వాగతించగా.. గంగూలీ మాత్రం తీవ్రంగా తప్పుబట్టాడు. కోచ్ పదవీ అంటే ఆషామాషీ కాదని.. కనీసం ఇంటర్వ్యూకు వచ్చే తీరిక కూడా లేని వ్యక్తిని కోచ్‌గా ఎందుకు ఎంపిక చేయాలనే వాదనను గంగూలీ గట్టిగా వినిపించాడు. అంతేకాకుండా అనిల్ కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయాలని పట్టుబట్టి ఇతర కమిటీ సభ్యులను ఒప్పించాడు. అయితే తనకు కోచ్ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి బహిరంగంగా ఎన్నో సార్లు విమర్శించాడు. అయితే కుంబ్లే రాజీనామా అనంతరం సీఏసీ రవిశాస్త్రినే తిరిగి కోచ్‌గా ఎంపిక చేసింది. ఆ సమయంలో కూడా రవిశాస్త్రి ఎంపిక పట్ల గంగూలీ ఆసక్తి చూపలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో బెటర్ ఆప్షన్ రవిశాస్త్రినే కావడంతో చేసేదేమి లేక అతడినే కోచ్‌గా ఎంపిక చేయడంతో కథ సుఖాంతమైంది. అంతేకాకుండా వీర్దిద్దరి మధ్య వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది. #BCCI #Ganguly Ravi Shastri right now. pic.twitter.com/5wf4G6isNF — ♠️A (@twelfthevil) October 13, 2019 -
'టీమిండియాను నంబర్ వన్ చేస్తా'
ముంబై: టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తానని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచుతామని, వారికి కాంట్రాక్టులు అమలు చేస్తామని చెప్పారు. మరిన్ని మహిళా క్రికెట్ టోర్నమెంట్ లు నిర్వహిస్తామన్నారు. టీమిండియా ప్రక్షాళనకు జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదించిన వాటిని అమలు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ప్రకటన ఇస్తామని, సమర్ధులు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే కోచ్ ను ఎంపిక చేస్తామని చెప్పారు. దేశీయ టోర్నమెంట్లు, సిరీస్ ల ద్వారానే బీసీసీఐకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందని వెల్లడించారు. రాష్ట్రాలు, కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు. రూ 100 కోట్లతో క్రికెట్ మైదానాలను పర్యావరణహితంగా మారుస్తామని, అభిమానులకు పెద్దపీట వేస్తామని ఠాకూర్ తెలిపారు. -
ఆ అర్హత నాకు లేదు: గంగూలీ
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావల్సిన అర్హత ఇంకా తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడు సార్లు వార్షిక సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే జగ్మోహన్ దాల్మియా మరణించిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్ 15నే గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. దాంతో మూడు వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇంకా దాదాకు రాలేదు. అందువల్ల తనకు బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లేదనే భావిస్తున్నట్లు చెప్పాడు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. సమాధానం ఇవ్వడం కష్టమన్నాడు. ఆ పదవి చేపట్టేందుకు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారని, దాని గురించి అసలు తాను ఆలోచించడం లేదని తెలిపాడు. -
శశాంక్ మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఊహాగానాలకు తెర దించుతూ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలగారు. ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం రావడంతో ఆయన బీసీసీఐ పదవిని వదులుకున్నారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు విన్పిస్తున్నాయి. -
మనోహర్ మళ్లీ వచ్చారు...
సమర్థత... నిరాడంబరత శశాంక్ మనోహర్ శైలి భిన్నం ఇప్పటికీ సెల్‌ఫోన్ వాడింది లేదు... వాచీ పెట్టుకోరు... కంప్యూటర్ వాడటం తెలీదు... సొంతంగానే కారు డ్రైవింగ్ చేసుకోవడం అలవాటు... కుబేరుడే అయినా 51 ఏళ్ల వయసులో తప్పనిసరి కావడంతోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం కోసం తొలిసారి విదేశీయానం చేశారు... వేల కోట్ల విలువతో ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ అధ్యక్షుడు అయిన వ్యక్తి ఇంత నిరాడంబరంగా ఉండటం ఊహించలేం! కానీ శశాంక్ మనోహర్ శైలి వేరు. సౌమ్యుడిగా కనిపించినా, పరిపాలన విషయంలో ముక్కుసూటితనంతో సమర్థంగా వ్యవహరించడమే కాకుండా అవినీతి మచ్చ అంటకుండా ఉండటం అందరి దృష్టిలో ఆయనపై గౌరవాన్ని పెంచింది. పదవీకాలం పూర్తయినా బోర్డును పట్టుకొని వేలాడకుండా తనకు చాలా పనులున్నాయని చెప్పి మరీ నాలుగేళ్లుగా దూరంగా ఉన్న ‘మిస్టర్ క్లీన్’ మనోహర్ ఇప్పుడు మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. క్రికెట్లోకి: 1990లో విదర్భ క్రికెట్ సంఘంలో చేరి 1996లో అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2005లో బోర్డు ఉపాధ్యక్షులు అయ్యారు. 2004లో నాగపూర్ టెస్టు కోసం ఫాస్ట్ పిచ్‌ను సిద్ధం చేయించడం గంగూలీ-దాల్మియాలతో విభేదాలకు కారణమైంది. 2008-11 మధ్య శ్రీనివాసన్ కార్యదర్శిగా ఉన్న సమయంలో వీరిద్దరూ సన్నిహితులే. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో శ్రీనికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నేపథ్యం: శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తండ్రి వీఆర్ మనోహర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. అదే స్నేహం పవార్‌తో ఇప్పటికీ కొనసాగుతోంది. పనితీరు: ఆటగాళ్లకు ప్రదర్శన ఆధారంగా పారితోషికాలు ఉండాలని ముందుగా ప్రతిపాదించారు. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రకటించిన మొత్తంకంటే రెట్టింపు క్రికెటర్లకు ఇప్పించారు. తన పదవీ కాలంలో 2010లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లలిత్ మోదీని సస్పెండ్ చేశారు. వివాదాలు: మోదీ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తున్నాడని తెలిసీ 18 నెలల పాటు పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఈ వివాదంలో రెండు ఐపీఎల్ జట్లను రద్దు చేసినా అవి కోర్టు తీర్పుతో తిరిగి రావడం మనోహర్ వైఫల్యమే. ఇక కొచ్చి జట్టును అకారణంగా రద్దు చేశారని ఇటీవల దాదాపు రూ. 550 కోట్ల జరిమానా కట్టమని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆయన హయాంలో జరిగిన తప్పే. అన్నింటికి మించి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’, నేనైతే రాజీనామా చేసేవాడిని అంటూ శ్రీనివాసన్‌ను తప్పు పట్టిన శశాంక్... బోర్డు అధ్యక్షుడిగా, రివ్యూ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆఫీస్ బేరర్లు ఐపీఎల్ జట్లను కొనవచ్చని నిబంధన రావడం విశేషం. -సాక్షి క్రీడావిభాగం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఆయన ఎన్నికను ప్రకటించారు. 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 58 ఏళ్ల మనోహర్ గతంలో 2008-2011 మధ్య కాలంలో కూడా బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడైన జగ్మోహన్ దాల్మియా గత నెల 20న మృతి చెందడంతో బోర్డు కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అర గంటలోపే... బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎస్జీఎం అరగంట లోపే ముగిసింది. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు శశాంక్‌కు మద్దతు ఇస్తామని ముందుకు రావడంతో అధ్యక్ష పదవి కోసం శనివారం మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో అప్పుడే ఆయన ఎన్నిక ఖరారైంది. దీనిని ఈ సమావేశంలో లాంఛనంగా ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీతో పాటు ఇతర ఈస్ట్‌జోన్ సంఘాలు మనోహర్ పేరును ప్రతిపాదించాయి. తమిళనాడు క్రికెట్ సంఘం తరఫున ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన స్థానంలో పీఎస్ రామన్ వచ్చారు. మరోవైపు ఠాకూర్‌పై వేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని శ్రీనివాసన్‌కు మనోహర్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కోర్టు బయట సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవచ్చని, తన మాటగా శ్రీనికి చెప్పాలని రామన్‌ను అధ్యక్షుడు కోరినట్లు సమాచారం. ‘రెండు నెలల్లో మార్పు చూపిస్తా’ బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కాగానే శశాంక్ మనోహర్ భారత క్రికెట్లో సంస్కరణలకు సంబంధించి తన ప్రణాళికలను ప్రకటించారు. పాలనా వ్యవహారాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘నా పదవి రెండేళ్లు ఉంటుంది. నాకు ఇప్పుడు రెండు నెలల సమయం ఇవ్వండి చాలు. మార్పు చూపిస్తా’ అని శశాంక్ స్పష్టం చేశారు. వేర్వేరు అంశాలపై అధ్యక్షుడు చేసిన ప్రకటనలు ఆయన మాటల్లోనే... కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్: పరిపాలకులు, ఆట గాళ్లు, వారి సిబ్బందికి సంబంధించి నెల రోజుల్లో కొత్త నిబంధనలు రూపొందిస్తాం. ఈ కార్యకలాపాలపై స్వతంత్ర న్యాయాధికారి పర్యవేక్షణ ఉంటుంది. మైదానంలో అవినీతి: ముందుగా ఆటగాళ్లను చైతన్యపరుస్తాం. అవినీతిని నివారించేందుకు మేం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందేమో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టడం ముఖ్యం. రాష్ట్ర క్రికెట్ సంఘాలపై పర్యవేక్షణ: వారికి ఏటా భారీ మొత్తం ఇస్తున్నా దానిని ఆటకు ఉపయోగిస్తున్నారా లేదా అనేదానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకపై బోర్డు నియమించే స్వతంత్ర ఆడిటర్ వారి అకౌంట్లను చూస్తారు. ఆ తర్వాతే మిగతా మొత్తం వారికి అందిస్తాం. డబ్బును మరో రకంగా వాడితే చర్య తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. బీసీసీఐ అకౌంట్ల వివరాలు: మా వద్ద పారదర్శకత లేదనే ఫిర్యాదు చాలా కాలంగా ఉంది. సమాచారం బయటికి చెప్పకపోవడం వల్లే వచ్చిన తప్పుడు అభిప్రాయం ఇది. ఇకపై బోర్డు నియమావళితో పాటు రూ. 25 లక్షల పైబడి చేసే ఏ ఖర్చు వివరాలు అయినా వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచుతాం. ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ ను కూడా ఇలాగే చేస్తాం. బోర్డు రికార్డులన్నీ కూడా సభ్యులు ఎప్పుడైనా చూడవచ్చు. కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దడం: ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పనితీరు బాగా లేదు. దీనిని సరిదిద్దాల్సి ఉంది. దేశంలో కుర్రాళ్లను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏడాదంతా ఎన్సీఏను నడిపించాలి. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు. భవిష్యత్తు కోసం కుర్రాళ్లను తీర్చిదిద్దడం మా బాధ్యత. మహిళా క్రికెట్: పురుషులలాగే ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు అందజేస్తాం. ఇప్పటికే ఫైనాన్స్ కమిటీ దీనికి ఆమోద ముద్ర వేసింది. అది ఆటకు మంచి చేస్తుంది. మరికొంత మంది మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. టి20 ప్రపంచకప్: వచ్చే ఏడాది మనం మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలకంటే దీనిని మరింత బాగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కక్ష సాధింపు ఉండదు ‘బీసీసీఐలోని సభ్యులందరితో కలిసి పని చేస్తాం. తమిళనాడు క్రికెట్ సంఘం సహా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. వ్యక్తులకంటే వ్యవస్థ ముఖ్యం. నేను చూసిన అత్యుత్తమ కార్యదర్శులలో శ్రీనివాసన్ ఒకరు. ఆయనను ఐసీసీ చైర్మన్‌గా కొనసాగించాలా వద్దా అనేది జనరల్ బాడీ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిబంధనలు ఏమైనా మారిస్తే ఆర్టీఐ పరిధిలోకి రావడానికి అభ్యంతరం లేదు. ఎల్బీడబ్ల్యూ మినహా డీఆర్ఎస్పై మాకు పెద్దగా అభ్యంతరం లేదు.’ - శశాంక్ మనోహర్, బీసీసీఐ అధ్యక్షుడు -
బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్
ముంబై: బీసీసీఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్ మరోసారి అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టనున్నారు. బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ ఎన్నిక లాంఛనమే. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన శనివారం నాటికి మనోహర్ ఒక్కరే రేసులో మిగిలారు. దీంతో ఆదివారం జరిగే బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నిక అనివార్యమైంది. దాల్మియా ఈస్ట్ జోన్‌కు చెందినవారు. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధి లేదా ఆ సంఘాలు బలపరిచిన వ్యక్తికి బోర్డు పగ్గాలు చేపట్టాలి. ఈస్ట్ జోన్‌లోని ఆరు క్రికెట్ సంఘాలూ మనోహర్‌కు మద్దతు తెలపడంతో బీసీసీఐ చీఫ్‌గా ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది. -
చక్రం తిప్పుతున్న శ్రీనివాసన్!
న్యూఢిల్లీ : ఏడు నెలల వ్యవధిలోనే బీసీసీఐలో మరో సారి రాజకీయం రాజుకుంది. దాల్మియా మృతితో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు బోర్డులోని రెండు వర్గాలు వ్యూహా ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ తన మద్దతుదారులతో గురువారం బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి, అభ్యర్థి ఎవరు అనే అంశాలను ఇందులో చర్చించనున్నారు. తనకు ఈ సమావేశం కోసం పిలుపు వచ్చినట్లు ఒక సీనియర్ సభ్యుడు ధ్రువీకరించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న అమితాబ్ చౌదరి కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు తనకు అనుకూలురైన సౌత్‌జోన్ సంఘాలనుంచి కూడా శ్రీని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలపై చర్చించేందుకు శ్రీనివాసన్ నాగపూర్‌లో శరద్‌పవార్‌తో కూడా సమావేశమైనట్లు తెలిసింది. ఇక రాజకీయాల్లో భిన్న ధ్రువాలే అయినా రాజీవ్ శుక్లాను అధ్యక్షుడిని చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్‌జోన్ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. -
బీసీసీఐ అధ్యక్ష పీఠంపై దాల్మియా
చెన్నె: పవర్ గేమ్ లో జగ్మోహన్ దాల్మియా పైచేయి సాధించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. మరో 3 నెలల్లో 75వ ఏట అడుగుపెడుతున్న ఆయన బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మరోమారు కైవశం చేసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయి బీసీసీఐలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. దాల్మియా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు ప్రకటించారు. -
'భారత క్రికెట్‌ను సక్సెస్ బాటలో నడిపిస్తా'
-
పదవి నుంచి తప్పుకోనున్న శ్రీనివాసన్!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పట్టు వీడనున్నట్లు కనబడుతుంది. సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించడంతో ఆయన గురువారం పలువురు న్యాయవాదులను కలసి సలహా సంప్రదింపులు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే త్వరలో ఐసీసీ పీఠం అధిష్టించవచ్చా లేక ఏమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నయా అంటూ ఆయన తన తరపు న్యాయవాదులతో శ్రీనివాసన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విధించిన గడువు రెండు రోజులు నేటితో ముగియనున్న నేపథ్యంలో శ్రీనివాసన్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రెండు రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. ఐపీఎల్ జట్టు అవినీతి వ్యవహారాలలో శ్రీనివాసన్ అల్లుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతం జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజులలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించింది. లేకుంటే తామే జోక్యం చేసుకుని అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
సుప్రీం కోర్టులో శ్రీనివాసన్‌కు ఊరట
బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఐతే ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్లో శ్రీని అల్లుడు గురునాథ్ మేయప్పన్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను బోర్డు పదవులకు దూరంగా ఉంచాలని కోర్టును బీహార్ సంఘం విన్నవించింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసనే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్ కొనసాగనున్నారు. అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు (శనివారం) ముగిసేసరికి ఆయన ఒక్కరే రేసులో ఉన్నారు. కాగా తీర్పు వెలువరించేవరకు బాధ్యతలు చేపట్టరాదని సుప్రీం కోర్టు షరతు విదించడంతో ఆయన పదవికి కొన్నిరోజులు దూరంగా ఉండకతప్పదు. ఇక బోర్డు ఉపాధ్యక్షుడిగా శివలాల్ యాదవ్ ఎన్నికయ్యారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి బీహార్ క్రికెట్ సంఘం శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో శ్రీని పోటీచేసేందుకు కోర్టు అనుమతించినా తీర్పు వచ్చేదాకా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది. శ్రీని అల్లుడు, చెన్నయ్ జట్టు మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్‌పై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాక ఆయన బోర్డు పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగారు. -
శ్రీనివాసన్ మళ్లీ ఎన్నికైతే భారత క్రికెట్ నాశనమే: మోడి
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికైతే అది భారత్ క్రికెట్‌కు వినాశకరమే అవుతుందని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి ధ్వజమెత్తారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, వ్యాపార ప్రకటనదారులు, పరిపాలకులు శ్రీనివాసన్ తిరిగి ఎన్నికైతే తీవ్రంగా నిరాశపడతారు. అది ఓ తప్పుడు సందేశాన్ని పంపినట్టవుతుంది. ఓ రకంగా భారత క్రికెట్ మునిగినట్టే. క్రికెట్‌ను ఇక్కడ మతంగా భావిస్తారు. ఆయనకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. దక్షిణాది సంఘాలు ఇంకా ఆయనకే మద్దతివ్వడం శోచనీయం’ అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మోడి అన్నారు. ‘ఏజీఎంలో పాల్గొనకుండా చూడండి’ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌ను బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇప్పట్లో వదిలేలా లేదు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీసీసీఐ కమిటీల్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ శ్రీనివాసన్ హాజరు కాకుండా అడ్డుకోవాలని కోరారు.