శశాంక్ మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఊహాగానాలకు తెర దించుతూ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలగారు. ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం రావడంతో ఆయన బీసీసీఐ పదవిని వదులుకున్నారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు.
మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు విన్పిస్తున్నాయి.