ICC chairman
-
2032 ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా
ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా ఇవాళ (డిసెంబర్ 1) బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్‌ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు. షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా కొనసాగారు.ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక జై షా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని వెల్లడించారు. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షాకు తొలి టోర్నమెంట్ కావడం విశేషం. -
ఐసీసీ చైర్మన్‌గా రెండు విడతల్లో కొనసాగనున్న జై షా..!
డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్ బార్క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. బార్క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్‌గా పని చేశాడు. వాస్తవానికి బార్క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్‌గా షా ఎంపికయ్యాడు.మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.జై షా తర్వాత ఎవరు..?ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. -
జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టనోడు క్రికెట్‌కు ఇన్చార్జ్ అయ్యాడు..!
త్వరలో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ కార్యదర్శి జై షాపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి క్రికెట్‌కు ఇన్చార్జ్ అయ్యాడని విమర్శలు గుప్పించారు. దేశం మొత్తంలో వ్యాపారాలు ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడుస్తున్నాయని అన్నాడు. सारे बिजनेस देश के 3-4 लोगों को ही मिलते हैं। अमित शाह के बेटे ने कभी क्रिकेट बैट नहीं उठाया, वो क्रिकेट का इंचार्ज बन गया है।: नेता विपक्ष श्री @RahulGandhi 📍 अनंतनाग, जम्मू-कश्मीर pic.twitter.com/wUylZ7QSul— Congress (@INCIndia) September 4, 2024రాహుల్ వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలే చేశాడు. కాగా, జై షా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా షా కుమారుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్లో పాకిస్థాన్ మినహా అందరూ జై షాకు మద్దతు తెలిపారు. షా.. ఈ ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. భారత్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టబోయే ఐదో వ్యక్తి జై షా. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పని చేశారు. -
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో మొదలై ఐసీసీ పీఠం దాకా..!
35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం నిన్ననే అధికారికంగా వెలువడింది. షా ఐసీసీ బాస్‌గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. షా ఐసీసీలో అత్యున్నత స్థానానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కాడు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. తాజాగా ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. షా ఐసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడు. షా ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.జై షా ప్రస్తానం..2009-2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్2013-2015 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ2015-2019 వరకు బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ2019-2024 వరకు బీసీసీఐ సెక్రెటరీ2024- ఐసీసీ చైర్మన్ -
జై షా వారసుడెవరో!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఒక్కడి పేరే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి భారత బోర్డులో ఆయన వారసుడు ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఐసీసీలో మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో చైర్మన్ పదవి ఏకగ్రీవంతో దక్కనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బీసీసీఐలో రెండోసారి కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం మరో ఏడాది మిగిలుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో జై షా వారసుడెవరనే చర్చలో ప్రముఖంగా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో కీలకమైన కార్యదర్శి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపడతారు. దీంతో ఇంకో మూడు నెలల వరకు జై షా బీసీసీఐ పదవిని అట్టిపెట్టుకునే అవకాశముంది. -
ఐసీసీ చైర్మన్ రేసులో జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ అటార్నీ అయిన బార్క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Jay Shah: ఐసీసీ తదుపరి చైర్మన్‌గా జైషా?
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జై షా పోటీచేయనున్నట్లు సమాచారం. ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో మారు ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ చైర్మెన్ పదవిపై జై షా పదవిపై ఆసక్తిగా ఉండటంతో గ్రెగ్ బార్క్లే పోటీ నుంచి తప్పుకోనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. కాగా గ్రెగ్ బార్క్లే జై షా మద్దతుతోనే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్‌కప్-2024 ముందు వరకు జై షా బీసీసీఐ సెక్రటరీ, ఐసీసీ చైర్మెన్‌గానే కొనసాగించాలని భావించండట. కానీ ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు రావడంతో జై షా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐసీసీ బాస్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. ఇక వేళ జై షా ఐసీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. అదే విధంగా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. -
ఐసీసీ కీలక పదవికి గురిపెట్టిన జై షా.. అందుకోసం ఏకంగా!
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అధ్యక్షుడి పదవి కోసం జైషా ప్రస్తుతం ఉన్న పోస్టులను వదులుకోనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్స్ కంటే ముందే జై షా ఏసీసీ చైర్మెన్ పదవికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇండోనేషియాలోని బాలిలో రాబోయే రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సాధారణ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జైషా తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశాల్లో ఆసియా కప్ 2025 వేదికపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. -
దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!
బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఐసీసీ పదవి కోసం ఐపీఎల్ చైర్మన్ పదవిని కాదన్న దాదాపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారని.. గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించేందుకు వారు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. The BCCI won't support Sourav Ganguly for the post of ICC Chairman even if Ganguly desires to move to the ICC. (Reported by Indian Express). — Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2022 ఈ మొత్తం తంతు తన అనుంగ అనుచరుడి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీని ఇలా ఘోరంగా అవమానించడానికి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, పక్కనే ఉండి జై షా.. గంగూలీ పుట్టి ముంచాడని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేని జై షా, సెక్రెటరీగా కొనసాగగా లేనిది.. టీమిండియా కెప్టెన్‌గా, బోర్డు చైర్మన్‌గా అపార అనుభవమున్న గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగితే తప్పా అని నిలదీస్తున్నారు. Another example of political vendetta. Son of @AmitShah can be retained as Secretary of #BCCI. But @SGanguly99 can't be. Is it because he didn't join @BJP4India ? We are with you Dada! #SouravGanguly — Prabir Kumar mahato (@prabirr3) October 11, 2022 కేంద్ర పెద్దల డైరెక్షన్లో జై షా.. గంగూలీని వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తున్నారు. గంగూలీకి ఐసీసీ అధ్యక్ష పదవి కూడా దక్కకుండేందుకు జై షా చక్రం తిప్పుతున్నాడని బహిరంగా చర్చించుకుంటున్నారు. బీసీసీఐలో రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగే ఆనవాయితీ లేనప్పుడు.. ఈ రూల్ ఉపాధ్యక్షుడికి, కార్యదర్శికి వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీస్ బేరర్లంతా రెండోసారి పదవుల్లో కొనసాగేందుకు కోర్డులో పోరాటం చేసిన వ్యక్తిని ఇంతలా అవమానించడం సరికాదని వాపోతున్నారు. Expected changes in BCCI set-up:- (According to Cricbuzz) •BCCI President - Roger Binny. •BCCI Secretary - Jay Shah. •Vice President - Rajeev Shukla. •BCCI Treasurer - Ashish Shelar. •Joint Secretary - Devajit Saikia. •IPL Chairman - Arun Dhumal. — CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022 ఇదిలా ఉంటే, బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఐపీఎల్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయని సమాచారం. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా, ట్రెజరర్‌గా ఆశిష్ షేలర్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ అభ్యర్ధిత్వాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 18న జరుగబోయే బీసీసీఐ ఏజీఎంలో వీరందరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎంపిక ఖరారు..?
Sourav Ganguly: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజైన్ స్పోర్ట్‌స్టార్ ఓ కథనంలో ప్రస్తావించింది. ఐసీసీ చైర్మన్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దాదా ఎంపిక లాంఛనమేనని స్పోర్ట్‌స్టార్ విశ్లేషించింది. రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడల మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆనురాగ్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపించినా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు బీసీసీఐ వర్గాలు నిరాకరించాయి. అధ్యక్ష ఎన్నికకు సమయం చాలా ఉందని, ఇప్పటి నుంచే ఆ అంశంపై డిస్కషన్ ఎందుకని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అన్నారు. Sourav Ganguly could be the next chairman of the ICC. (Reported by Sportstar). — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2022 కాగా, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ వార్గలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ క్రికెటర్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఐసీసీలో కీలక పదవి దక్కింది. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ మంగళవారం (జులై 26) ప్రకటించింది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు బర్మింగ్హమ్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ వెల్లడించింది. చదవండి: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
ఐసీసీ చైర్మన్ పదవి.. బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!
Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ చైర్మన్ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా.. తాజాగా జై షా, అనురాగ్ ఠాకూర్ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. చదవండి: రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..! -
ఐసీసీలోనూ భారత్–పాక్ గొడవ
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌ను ఎంపిక చేసే విషయంపై సోమవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీనికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్ బోర్డుల మధ్య సయోధ్య లేకపోవడమేనని తెలిసింది. ఓటు హక్కు ఉన్న సభ్య దేశాల్లో మూడింట రెండొంతల మెజార్టీ ప్రకారం చైర్మన్‌ను ఎన్నుకోవాలని పాకిస్తాన్, దానికి మద్దతిస్తున్న దేశాలు చెబుతుండగా... ఎన్నికలు నిర్వహించాలని, సాధారణ మెజార్టీ ప్రకారమే ఎంపిక జరగాలని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్‌కు మద్దతునిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీలో 17 సభ్య దేశాలకు ఓట్లు ఉన్నాయి. పాక్ చెబుతున్నదాని ప్రకారం కనీసం 12 దేశాలు కొత్త చైర్మన్ కోసం మద్దతివ్వాల్సి ఉంటుంది. అదే ఎన్నిక జరిగితే గెలుపు కోసం 9 ఓట్లు చాలు. దురదృష్టవశాత్తూ ఏ పద్ధతి అనుసరించాలనేదానిపై ఐసీసీలోనే స్పష్టత లేకపోవడమే సమస్యగా మారింది. ‘ప్రస్తుతం ఇది భారత్, పాక్ మధ్య పోరుగా మారింది. దీనిపై ఏదో ఒక తీర్మానం చేసి త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు అభిప్రాయ పడ్డారు. ఈ అంశంపై మున్ముందు ఐసీసీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. -
గంగూలీ తగిన వ్యక్తి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తగిన వ్యక్తి అని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. గంగూలీ తెలివితేటలు క్రికెట్ పరిపాలనలో ఉపయోగపడతాయని అతను అన్నాడు. ‘నా దృష్టిలో గంగూలీ ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. క్రికెటర్‌గా అతని ఘనతలు చూసి మాత్రమే కాకుండా గంగూలీ బుర్రను చూసి నేను అభిమానినయ్యా. ఐసీసీ పదవిలో ఉన్నవారు ఒక దేశపు బోర్డు గురించి కాకుండా అందరి గురించి, క్రికెట్ మేలు గురించి మాత్రమే ఆలోచించాలి. అది గంగూలీ చేయగలడని నా నమ్మకం. అతని ఆలోచనా దృక్పథం అలాంటిది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందే, పరిపాలనలో, కోచింగ్‌లో రాకముందే గంగూలీ ఏమిటో నేను చూశాను. ఎంసీసీ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఆటగాళ్లందరితో అతను సత్సంబంధాలు నెరపడం అతని సమర్థతను సూచిస్తోంది’ అని సంగక్కర వివరించాడు. త్వరలోనే ఐసీసీ చైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో గంగూలీ పేరుపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. -
పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం వెల్లడించింది. శశాంక్ మనోహర్ వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు.. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా చైర్మన్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని మాట్లాడుతూ.. చైర్మన్‌గా తమను ముందుండి నడిపించిన శశాంక్ మనోహర్‌కు ఐసీసీ బోర్డు, సిబ్బంది, మొత్తం క్రికెట్ కుటుంబం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాన్నారు. మనోహర్ శశాంక్, ఆయన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా.. శశాంక్ సైతం మనోహర్‌పై ప్రశంసలు కురిపించారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అమోఘమని. ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. కాగా వారం రోజుల్లోగా శశాంక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసీబీ మాజీ చైర్మన్ కోలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చైర్మన్‌గా శశాంక్ ఎన్నికైన నాటి నుంచి బీసీసీఐకి ఐసీసీతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.(శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ ఆగ్రహం) -
ఐసీసీ చైర్మన్ రేసులోకి గంగూలీ వచ్చేశాడు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవిపై కన్నేసిన భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదిశగా పావులు కదుపుతున్నాడు. సభ్యదేశాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా సఫారీలో టి20 సిరీస్‌కు ఓకే చెప్పాడు. అలాగే సౌరవ్ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. ఇటీవలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా... తాజాగా క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా ఐసీసీ చైర్మన్ పదవికి గంగూలీ సరైన అభ్యర్థి అని వ్యాఖ్యానించాడు. స్మిత్‌తో పాటు సీఈవో జాక్వెస్ పాల్ కూడా భారత మాజీ కెప్టెన్‌కు మద్దతునిచ్చారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం ఈనెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో మనోహర్ మరో రెండు నెలలపాటు ఈ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే ఆయన తర్వాత ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఐసీసీ చైర్మన్ పదవి బరిలో ఉండగా... స్మిత్ బహిరంగ మద్దతుతో అనూహ్యంగా గంగూలీ రేసులోకొచ్చాడు. ‘ఐసీసీ చైర్మన్‌గా గంగూలీలాంటి వారుంటే మంచిది. అతను అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాడు. గంగూలీ వల్ల ఆటకు లబ్ది కలుగుతుంది. అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం చైర్మన్‌గా విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తాయి’ అని స్మిత్ పేర్కొన్నాడు. -
మరో రెండు నెలలు శశాంక్ కొనసాగింపు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తప్పుకుంటే చైర్మన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాజా ఈ పదవి కోసం తహతహలాడినా... శాశ్వత సభ్య దేశాల మద్దతు ఆయనకు దక్కలేదు. మరో వైపు మనోహర్ తప్పుకోవడంపై చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. శశాంక్ అనుకుంటే మరోసారి కూడా ఎంపిక కాగలరని ఆయన అన్నారు. చైర్మన్‌గా శశాంక్ వచ్చినప్పటినుంచి ఐసీసీతో భారత బోర్డుకు సత్సంబంధాలు లేవు. -
ఐసీసీ ఛైర్మన్ పదవికి మనోహర్ రాజీనామా
-
ఐసీసీ చైర్మన్ శశాంక్ రాజీనామా
-
ఐసీసీ చైర్మన్ శశాంక్ రాజీనామా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ అనూహ్యరీతిలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) గతకొంతకాలంగా శశాంక్ తీరుపై గుర్రుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐసీసీ చైర్మన్‌గిరీ నుంచి శశాంక్ అర్ధంతరంగా తప్పుకున్నారని అంటున్నారు. గతంలో రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయన.. 2016 మేలో ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్ చైర్మన్‌గా నిలిచారు. రెండేళ్లు ఆయన పదవీకాలం కాగా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ ఆయన అర్ధంతరంగా తప్పుకున్నారు. -
ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అధ్యక్షుడిగా ఉండాలని ఉన్నప్పటికీ ఐసీసీ చైర్మన్ పదవి కోసం రాజీనామా చేశానని శశాంక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రికెట్ బోర్డు గర్వించేలా చేస్తానని, ఇతర భాగస్వాములతో కలసి పనిచేసి క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని చైర్మన్ గా ఎన్నికయిన సందర్భంగా శశాంక్ పేర్కొన్నాడు. మంగళవారం నాడు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ గురువారం ఐసీసీ అత్యున్నత పదవిని చేపట్టాడు. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు. ఐసీసీ డైరెక్టర్స్ ఒక అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తారు. ఆ క్యాండిడేట్ పేరును ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్లు బలపరచాలి. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికలకు గానూ శశాంక్ ఒక్కరి పేరు ప్రతిపాదించారు. చైర్మన్ ఎన్నికను ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ పర్యవేక్షించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికకు పాత పద్ధతికి చాలా మార్పులున్నాయి. గతంలో ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు అధ్యక్షులైనా ఐసీసీ చైర్మన్ బరిలో నిలిచే అవకాశం ఉండేది. దేశ క్రికెట్ బోర్డుతో సంబంధం లేదంటూ ఇండిపెండెంట్ గా ఈ బరిలో నిలిచి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచాడు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది.. కానీ..!
న్యూఢిల్లీ: తనపై ఇప్పటికీ ఒత్తిడి ఉందని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్ తెలిపారు. మరి కొంత కాలం బీసీసీఐ అత్యున్నత పదవిలో కొనసాగాలంటూ తనపై కొందరు పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ అంటున్నారు. శశాంక్ కు కూడా ఈ పదవిని అప్పుడే వదులుకోవడం ఇష్టం లేదని, అయితే ఐసీసీ తాజా నిబంధనల వల్ల ఇప్పుడే వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నాగ్ పూర్ కు చెందిన లాయర్ వివరించారు. గత అక్టోబర్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన శశాంక్ మాట్లాడుతూ... బోర్డులో వీలైనన్ని మార్పులు తీసుకొచ్చాను, సాధ్యమైనంత వరకూ తన మార్క్ వర్క్ చేసి చూపించానని పేర్కొన్నారు. గతంలో బీసీసీఐ చైర్మన్ గా ఒకసారి చేశాను. దాల్మియా మరణంతో మరోసారి తనకు ఉన్నత పదవి రావడంతో స్వీకరించాను. బోర్డు నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా ఎంతో కొంత బోర్డుకు, దేశానికి తిరిగి ఇచ్చేయాలని, సేవలు చేయాలని భావించానని రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనలు ఇవే' అంటూ శశాంక్ చెప్పుకొచ్చారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఏర్పడటంతో ప్రస్తుత పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ బాధ్యతలు చేపట్టినట్లయితే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగుతారు. ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయాలంటే ఏ బోర్డులోనూ సభ్యుడిగి ఉండకూడదన్న నిబంధనలు అయనకు అడ్డంకిగా మారాయి. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్నికలు వచ్చే జూన్ నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఇందుకు అన్ని విధాలుగా శశాంక్ మనోహర్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. -
శశాంక్ మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఊహాగానాలకు తెర దించుతూ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలగారు. ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం రావడంతో ఆయన బీసీసీఐ పదవిని వదులుకున్నారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు విన్పిస్తున్నాయి. -
ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టనున్న శ్రీనివాసన్