Sourav Ganguly Out Of BCCI President, BCCI Wont Back Him For ICC Chairman Post - Sakshi
Sakshi News home page

దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!

Published Wed, Oct 12 2022 4:22 PM | Last Updated on Wed, Oct 12 2022 5:32 PM

After Being Dumped As BCCI President, Ganguly May Not Make It To ICC Too - Sakshi

బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్‌ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఐసీసీ పదవి కోసం ఐపీఎల్‌ చైర్మన్‌ పదవిని కాదన్న దాదాపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారని.. గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించేందుకు వారు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఈ మొత్తం తంతు తన అనుంగ అనుచరుడి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీని ఇలా ఘోరంగా అవమానించడానికి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, పక్కనే ఉండి జై షా.. గంగూలీ పుట్టి ముంచాడని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం క్రికెట్‌ పరిజ్ఞానం లేని జై షా, సెక్రెటరీగా కొనసాగగా లేనిది.. టీమిండియా కెప్టెన్‌గా, బోర్డు చైర్మన్‌గా అపార అనుభవమున్న గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగితే తప్పా అని నిలదీస్తున్నారు. 

కేంద్ర పెద్దల డైరెక్షన్‌లో జై షా.. గంగూలీని వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తున్నారు. గంగూలీకి ఐసీసీ అధ్యక్ష పదవి కూడా దక్కకుండేందుకు జై షా చక్రం తిప్పుతున్నాడని బహిరంగా చర్చించుకుంటున్నారు. బీసీసీఐలో రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగే ఆనవాయితీ లేనప్పుడు.. ఈ రూల్‌ ఉపాధ్యక్షుడికి, కార్యదర్శికి వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీస్‌ బేరర్లంతా రెండోసారి పదవుల్లో కొనసాగేందుకు కోర్డులో పోరాటం చేసిన వ్యక్తిని ఇంతలా అవమానించడం సరికాదని వాపోతున్నారు. 

ఇదిలా ఉంటే, బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీ, ఐపీఎల్‌ చైర్మన్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయని సమాచారం. అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా, కార్యదర్శిగా జై షా, ట్రెజరర్‌గా ఆశిష్‌ షేలర్‌, జాయింట్‌ సెక్రటరీగా దేవజిత్‌ సైకియా, ఐపీఎల్‌ చైర్మన్‌గా బ్రిజేష్‌ పటేల్‌ స్థానంలో అరుణ్‌ ధుమాల్‌ అభ్యర్ధిత్వాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 18న జరుగబోయే బీసీసీఐ ఏజీఎంలో వీరందరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement