బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అధ్యక్షుడి పదవి కోసం జైషా ప్రస్తుతం ఉన్న పోస్టులను వదులుకోనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.
ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్స్ కంటే ముందే జై షా ఏసీసీ చైర్మెన్ పదవికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇండోనేషియాలోని బాలిలో రాబోయే రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సాధారణ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జైషా తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశాల్లో ఆసియా కప్ 2025 వేదికపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment