BCCI president Post
-
బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీ.. పదవి కోల్పోవడంపై తొలిసారి నోరు విప్పాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దాదా ఈ విషయంపై స్పందిస్తూ.. ఆటగాడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా జీవిత కాలం కొనసాగడం కుదురదని, ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని వైరాగ్యంతో నిండిన మాటలు మాట్లాడాడు. ఆటగాడిగా, బోర్డు అధ్యక్షుడిగా నాణెం రెండు కోణాలు చూడటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. భవిష్యత్తులో ఇంతకంటే అత్యున్నత పదవి చేపట్టేందుకు ప్రయత్నిస్తానని, ఐసీసీ అధ్యక్ష పదవిపై తన మనసులో మాటను పరోక్షంగా బయటపెట్టాడు. టీమిండియా కెప్టెన్‌గా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ బాస్‌గా భారత క్రికెట్‌కు సంబంధించి అత్యున్నత పదవులన్నీ అనుభవించానని, భవిష్యత్తు మరింత పెద్దదిగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. అంతిమంగా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు సంతృప్తినిచ్చాయని, తన హయాంలో భారత క్రికెట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపాడు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగేందుకు బోర్డు పెద్దలు అంగీకరించకపోవడంతో దాదా అయిష్టంగానే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అతని తదుపరి బీసీసీఐ బాస్‌గా రోజర్ బిన్నీ ఎన్నిక లాంఛనమేనని సమాచారం. ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ దాదాగిరి కోల్పోవడంలో తన అనుంగ అనుచరుడు జై షా పాత్ర ఉందని దాదా అభిమానులు బహిరంగంగా ఆరోపణలకు దిగుతున్నారు. జై షా పక్కనే ఉండి దాదాకు వెన్నుపోటు పొడిచాడని అంటున్నారు. బీజేపీలో చేరలేదన్న కసితో దాదాపై కక్ష సాధించారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంకొందరైతే కోహ్లి ఉసురు తగిలి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. -
దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!
బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్ గంగూలీకి మరో అవమానం తప్పేలా లేదు. బీసీసీఐ పదవి పోతే పోయింది.. ఐసీసీలోనైనా చక్రం తిప్పొచ్చని భావించిన దాదాకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఐసీసీ పదవి కోసం ఐపీఎల్ చైర్మన్ పదవిని కాదన్న దాదాపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారని.. గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించేందుకు వారు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. The BCCI won't support Sourav Ganguly for the post of ICC Chairman even if Ganguly desires to move to the ICC. (Reported by Indian Express). — Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2022 ఈ మొత్తం తంతు తన అనుంగ అనుచరుడి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీని ఇలా ఘోరంగా అవమానించడానికి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, పక్కనే ఉండి జై షా.. గంగూలీ పుట్టి ముంచాడని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేని జై షా, సెక్రెటరీగా కొనసాగగా లేనిది.. టీమిండియా కెప్టెన్‌గా, బోర్డు చైర్మన్‌గా అపార అనుభవమున్న గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగితే తప్పా అని నిలదీస్తున్నారు. Another example of political vendetta. Son of @AmitShah can be retained as Secretary of #BCCI. But @SGanguly99 can't be. Is it because he didn't join @BJP4India ? We are with you Dada! #SouravGanguly — Prabir Kumar mahato (@prabirr3) October 11, 2022 కేంద్ర పెద్దల డైరెక్షన్లో జై షా.. గంగూలీని వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తున్నారు. గంగూలీకి ఐసీసీ అధ్యక్ష పదవి కూడా దక్కకుండేందుకు జై షా చక్రం తిప్పుతున్నాడని బహిరంగా చర్చించుకుంటున్నారు. బీసీసీఐలో రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగే ఆనవాయితీ లేనప్పుడు.. ఈ రూల్ ఉపాధ్యక్షుడికి, కార్యదర్శికి వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీస్ బేరర్లంతా రెండోసారి పదవుల్లో కొనసాగేందుకు కోర్డులో పోరాటం చేసిన వ్యక్తిని ఇంతలా అవమానించడం సరికాదని వాపోతున్నారు. Expected changes in BCCI set-up:- (According to Cricbuzz) •BCCI President - Roger Binny. •BCCI Secretary - Jay Shah. •Vice President - Rajeev Shukla. •BCCI Treasurer - Ashish Shelar. •Joint Secretary - Devajit Saikia. •IPL Chairman - Arun Dhumal. — CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022 ఇదిలా ఉంటే, బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఐపీఎల్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయని సమాచారం. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా, ట్రెజరర్‌గా ఆశిష్ షేలర్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ అభ్యర్ధిత్వాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 18న జరుగబోయే బీసీసీఐ ఏజీఎంలో వీరందరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
‘బీజేపీలో చేరలేదనే గంగూలీపై కక్ష సాధింపు’
కోల్‌కతా: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే వార్తను వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ సెక్రెటరీగా రెండో టర్మ్ కొనసాగిస్తూ గంగూలీకి అధ్యక్షుడిగా మరోమారు అవకాశం ఇవ్వకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ‘సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు బెంగాల్ ప్రజల్లో ఓ వార్తను వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నాం. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని తెలిపారు ఘోష్. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మరోవైపు.. గంగూలీకి మద్దతు తెలిపారు టీఎంసీ ఎంపీ సాంతాను సేన్. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండాసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖండించిన బీజేపీ.. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. బీసీసీఐ చీఫ్ మార్పుపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం టీఎంసీ మానుకోవాలని హెచ్చరించారు. ఇదీ చదవండీ: Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..! -
ఐపీఎల్ పదవిని తిరస్కరించిన గంగూలీ.. తన స్థాయికి చిన్నది అంటూ..!
బీసీసీఐ తాజా మాజీ బాస్ సౌరవ్ గంగూలీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోసారి బీసీసీఐ పగ్గాలు చేపడదామని ఆశించి భంగపడ్డ దాదాకు బోర్డు సభ్యులు ఓ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దాదా ఆ ఆఫర్‌ను చాలా లైట్‌గా తీసుకుని తిరస్కరించాడని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా టెంప్టింగ్ ఆఫర్ అంటే.. ఇవాళ జరిగిన బోర్డు ముఖ్య సమావేశంలో సభ్యులంతా గంగూలీని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చైర్మన్‌గా ఉండాలని కోరారట. అయితే ఇది చిన్న పదవిగా భావించిన గంగూ భాయ్.. సబ్ కమిటీకి నేను హెడ్‌గా ఉండటమేంటని ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న అరుణ్ ధుమాల్‌కు ఆ పదవి ఇవ్వాలని బోర్డు సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చారట. అలాగే గంగూలీని బీసీసీఐ తరఫున ఐసీసీ చైర్మన్ పదవికి నామినేట్ చేయాలని నిర్ణయించారట. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ముఖ్య అధికారి ఒకరు ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇవాళ ముంబైలో జరిగిన బీసీసీఐ ఏజీఎంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్ చైర్మన్ పదవుల ఎన్నికపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయని సమాచారం. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా, ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ అభ్యర్ధిత్వాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 18న జరుగబోయే బీసీసీఐ ఏజీఎంలో వీరందరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
దాల్మియాకు లైన్ క్లియర్
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు జగ్మోహన్ దాల్మియాకు మార్గం సుగమైంది. దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవిని సొంతం చేసుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఎన్.శ్రీనివాసన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన పోటీలో నిలిచారు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. మరాఠా యోధుడు శరద్ పవార్ రేసు నుంచి తప్పుకోవడంతో దాల్మియాకు లైన్ క్లియరయింది. తూర్పు జోన్ నుంచి ప్రవార్ ను ఎవరూ ప్రతిపాదించకపోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పాటిల్ తన పదవిని నిలుపుకోనున్నారు.