
దాల్మియాకు లైన్ క్లియర్
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు జగ్మోహన్ దాల్మియాకు మార్గం సుగమైంది. దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవిని సొంతం చేసుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఎన్.శ్రీనివాసన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన పోటీలో నిలిచారు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.
మరాఠా యోధుడు శరద్ పవార్ రేసు నుంచి తప్పుకోవడంతో దాల్మియాకు లైన్ క్లియరయింది. తూర్పు జోన్ నుంచి ప్రవార్ ను ఎవరూ ప్రతిపాదించకపోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పాటిల్ తన పదవిని నిలుపుకోనున్నారు.