ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా ఇవాళ (డిసెంబర్ 1) బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్‌ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు. షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌లుగా కొనసాగారు.
ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక జై షా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని వెల్లడించారు. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షాకు తొలి టోర్నమెంట్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment