టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ | BCCI Announce Rs 125 Crore Prize Money For Team India After T20 World Cup Win Against SA, More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించిన బీసీసీఐ

Jun 30 2024 8:28 PM | Updated on Jul 1 2024 10:45 AM

BCCI Announce Rs 125 Crore Prize Money For Team India After T20 World Cup Win

టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్‌ చేశాడు. అత్యుత్తమ విజయాన్ని సాధించిన  ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.

కాగా, నిన్న (జూన్‌ 29) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 47; ఫోర్‌, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్‌, రబాడ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్‌ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్‌ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.

వరల్డ్‌కప్‌ గెలిచిన అనంతరం విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ఈ టోర్నీతోనే ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement