త్వరలో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ కార్యదర్శి జై షాపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి క్రికెట్‌కు ఇన్‌చార్జ్ అయ్యాడని విమర్శలు గుప్పించారు. దేశం మొత్తంలో వ్యాపారాలు ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడుస్తున్నాయని అన్నాడు.
सारे बिजनेस देश के 3-4 लोगों को ही मिलते हैं।
अमित शाह के बेटे ने कभी क्रिकेट बैट नहीं उठाया, वो क्रिकेट का इंचार्ज बन गया है।
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 अनंतनाग, जम्मू-कश्मीर pic.twitter.com/wUylZ7QSul— Congress (@INCIndia) September 4, 2024
రాహుల్ వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలే చేశాడు. కాగా, జై షా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా షా కుమారుడన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్‌లో పాకిస్థాన్ మినహా అందరూ జై షాకు మద్దతు తెలిపారు. షా.. ఈ ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. భారత్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టబోయే ఐదో వ్యక్తి జై షా. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment