35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం నిన్ననే అధికారికంగా వెలువడింది. షా ఐసీసీ బాస్‌గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. షా ఐసీసీలో అత్యున్నత స్థానానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కాడు.
2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. తాజాగా ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. షా ఐసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడు. షా ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
జై షా ప్రస్తానం..
2009-2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్
2013-2015 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ
2015-2019 వరకు బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ
2019-2024 వరకు బీసీసీఐ సెక్రెటరీ
2024- ఐసీసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment