ఐసీసీ చైర్మన్‌ రేసులో జై షా | ICC Chairman Election: All eyes On BCCI Secretary Jay Shah As Greg Barclay To Step Down After Current Term | Sakshi

ఐసీసీ చైర్మన్‌ రేసులో జై షా

Aug 21 2024 6:48 AM | Updated on Aug 21 2024 8:35 AM

ICC Chairman Election: All eyes On BCCI Secretary Jay Shah As Greg Barclay To Step Down After Current Term

దుబాయ్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్‌ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్‌ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. 

అయితే న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్‌ అటార్నీ అయిన బార్‌క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్‌ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement