Greg Barclay
-
ఐసీసీ చైర్మన్ రేసులో జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ అటార్నీ అయిన బార్క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం దుబాయ్ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది. ►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్‌లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ► ఇక టెస్టు క్రికెట్లో ఓవర్‌రేట్ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
ఐసీసీ అధ్యక్షుడిగా మళ్లీ అతనే.. రేసులో కూడా లేని గంగూలీ
Greg Barclay: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్) మరోసారి ఎన్నికయ్యాడు. బార్క్లే ఎన్నికను ఐసీసీ బోర్డు ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. అధ్యక్ష రేసులో ఉండిన జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ డాక్టర్ టవెంగ్వా ముకుహ్లాని ఆఖరి రోజు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బార్క్లే ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతా అనుకున్నట్లుగానే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యర్ధిని నిలబెట్టకపోవడంతో బార్క్లే ఎన్నిక లాంఛనమైంది. బీసీసీఐ.. తొలుత మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బరిలోకి దింపాలని భావించినప్పటికీ, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 17 మంది సభ్యులున్న ఐసీసీ బోర్డులో బీసీసీఐ సహా 12 మందికి పైగా సభ్యులు బార్క్లేకు మద్దతు ప్రకటించారు. 2020 నవంబర్‌లో తొలిసారి ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన బార్క్లే .. ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగనున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఇవాళ జరిగిన ఐసీసీ మీటింగ్‌కు భారత్ తరఫున జై షా హాజరయ్యారు. చదవండి: టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్