అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం దుబాయ్ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర తీసింది.
ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది.
►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్‌లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్‌లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతున్న సంగతి తెలిసిందే.
► ఇక టెస్టు క్రికెట్‌లో ఓవర్‌రేట్ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది.
చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో
Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం
Comments
Please login to add a commentAdd a comment