t20 leagues
-
భారత్‌లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడొద్దంటే ఎలా..? బీసీసీఐ అంక్షలపై రాబిన్ ఉతప్ప ఫైర్
రిటైరయ్యాక కూడా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్‌గా పిలువబడే ఈ నిబంధన అమల్లోకి వస్తే భారత ఆటగాళ్లు రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడానికి వీలు ఉండదు. ఈ నిబంధనపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. దీన్ని త్వరలోనే అమల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు రాబిన్ ఉతప్ప స్పందించాడు. బీసీసీఐ గనక ఈ నిబంధనను అమల్లో తెస్తే ఇప్పుడిప్పుడే రిటైర్డ్ అయిన క్రికెటర్లు చాలా నష్టపోతారని అన్నాడు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది రిటైర్డ్ క్రికెటర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఇది చాలా అన్యామని తెలిపాడు. భారత రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్ట్ ఉండదు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లో అయినా పాల్గొనే హక్కు వారికి ఉంటుంది, ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించదని అనుకుంటున్నా అంటూ ఇటీవల పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. కాగా, ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు బీసీసీఐతో ఒప్పంద ఉన్న భారత క్రికెటర్లకు అనుమతి లేదన్న విషయం తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు ఉన్ముక్త్ చంద్ లాంటి క్రికెటర్లు బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐతో ఎలాంటి అనుబంధం లేని భారత మాజీ క్రికెటర్లు (ఉతప్ప, పఠాన్ సోదరులు, శ్రీశాంత్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్ని) పలు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని భావించాలని తెలుస్తుంది. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పడిపోతుందని భావిస్తున్న బీసీసీఐ, రిటైర్డ్ ఆటగాళ్లను విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా అంక్షలు విధిస్తుంది. ఇందులో భాగంగానే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై స్పందించిన రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉతప్ప ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ10 లీగ్‌లోనూ, అంతకుముందు యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ పాల్గొన్నాడు. -
పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం దుబాయ్ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది. ►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్‌లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ► ఇక టెస్టు క్రికెట్లో ఓవర్‌రేట్ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్‌గా..
ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొని పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రధాన జట్లతో పాటు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకునేందుకు క్యాష్ రిచ్ లీగ్ దోహదం చేస్తోంది. అయితే, మన క్రికెటర్లకు మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే అవకాశం లేదు. బంధం తెంచుకుంటేనే ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే భారత క్రికెట్ నియంత్రణ మండలితో బంధాలన్నీ తెంచుకోవాల్సిందే. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికిన తర్వాతే విదేశీ టీ20 లీగ్‌లలో ఆడాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. సమీక్ష నిర్వహించడం ద్వారా అయితే, తాజాగా ఈ పాలసీపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. జూలై 7 నాటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికా జూలై నుంచి మేజర్ లీగ్ క్రికెట్(MLC) పేరిట టీ20 టోర్నీ నిర్వహించనుంది. మార్పులు చేసేందుకు సిద్ధం ఇటీవల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లు కొందరు ఈ లీగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తమ పాత విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెంచడం సహా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు యువ ఆటగాళ్లు బోర్డుతో బంధం తెంచుకునే పరిస్థితులను చక్కదిద్దే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ జట్టుకు కెప్టెన్‌గా ధావన్! ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన సీనియర్ ఆటగాళ్లకు దోహదం చేసేలా బోర్డు నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంతో పాటు ఏసియన్ గేమ్స్‌కు భారత పురుష, మహిళా జట్లను పంపే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ పురుషుల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆటగాళ్లు వరల్డ్‌కప్-2023 సన్నాహకాలతో బిజీగా ఉండనున్న తరుణంలో గబ్బర్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏసియన్ గేమ్స్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. చదవండి: మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్.. 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ -
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదనే నిబంధన విషయంలో బీసీసీఐ పట్టువీడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లోని మెజార్టీ ఫ్రాంచైజీలు బీసీసీఐని నడిపిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల చేతుల్లోనే ఉండటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభంకానున్న టీ20 లీగ్‌లో ఆరింటికి ఆరు జట్లను ఐపీఎల్ ఓనర్లే చేజిక్కించుకోవడంతో ఈ విషయమై బీసీసీఐపై ఒత్తిడి అధికమైందని భారత క్రికెట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) స్పష్టత రానుందని బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ పురుష క్రికెటర్‌కు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. రిటైరైన వాళ్లు, ఇకపై టీమిండియాకు ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు మాత్రమే ఫారెన్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. చదవండి: భారత్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి -
క్రికెట్‌పై కన్నేసిన సత్యనాదెళ్ల, రూ.930కోట్లతో..!
అమెరికాలో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు త్వరలో తొలి ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు ఇండో-అమెరికన్ వ్యాపార వేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 100 కోట్లకు మందికి పైగా ప్రజలు క్రికెట్‌ను అభిమానిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రమే ఇది పాపులర్ అయ్యింది. అలాంటి జెంటిల్ గేమ్ క్రికెట్ మ్యాచ్‌లు ఇకపై అమెరికాలో జరగనున్నాయి. ఇందుకోసం సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్లుగా పలు దిగ్గజ కంపెనీలకు చెందిన యజమానులు, సీఈవోలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)ను ప్రారంభించారు. ఈ లీగ్ సంస్థలో సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడిగా ఉన్నారు. 📡 Investment secured to #BuildAmericanCricket 📡 MLC plans to deploy $120 million to launch world class T20 cricket league and transform cricket infrastructure in the USA 🏏🇺🇸 Read full press release ➡️ https://t.co/mTvWu6LQg1 pic.twitter.com/oJWbcTxpG1 — Major League Cricket (@MLCricket) May 18, 2022 120 మిలియన్ డాలర్ల ఫండ్ అమెరికాలో వరల్డ్ క్లాస్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ, అందుకు కావాల్సిన ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ కోసం నిర్వాహకులు ఏ అండ్ ఏ1 ఫండ్ రైజింగ్ పేరుతో నిధుల్ని సమీకరించారు. ఇప్పటివరకు 44మిలియన్ డాలర్లను సేకరించగా..మరో 12నెలల్లో 76మిలియన్ డాలర్లు సేకరించడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి.మొత్తంగా 120మిలియన్ (రూ.9,32,30,10,000) డాలర్లను ఫండ్‌ను సేకరించేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారు నిర్వాహకులు. చదవండి👉మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే! -
ఆడిస్తున్నారు కానీ.. మ్యాచ్ ఫీజు చెల్లించట్లేదు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్ జరిగినా చక్కని ఆదరణ లభిస్తోంది. నిర్వాహకులు స్టార్లతో ఆడిస్తున్నారు... కానీ సరిగ్గా చెల్లించడమే లేదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ఐసీఏ) తెలిపింది. ఐపీఎల్ గురించి తెలిసినవారెవరైనా... ఆటగాళ్లకు స్టార్డమ్తో పాటు అధిక ఆదాయం లీగ్‌ల ద్వారానే లభిస్తుందనే అనుకుంటారు. కానీ అన్ని లీగ్‌లు ఐపీఎల్లా లేవు. ఇదే ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టి20 లీగ్‌లు చెల్లింపుల విషయంలో ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎఫ్ఐసీఏ చేపట్టిన వార్షిక సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. లీగ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లలో మూడోవంతు క్రికెటర్లు వేతనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. కొందరికి ఆలస్యంగా వేతనాలు అందగా... మరికొందరు రిక్తహస్తాలతోనే వెనుదిరిగినట్లు ఆ నివేదికల ద్వారా తెలిసింది. గ్లోబల్ టి20 కెనడా, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, అబుదాబి టి10, ఖతార్ టి10, యూరో టి20 స్లామ్, మాస్టర్స్ చాంపియన్స్ లీగ్‌ల్లో పాల్గొన్న 34 శాతం క్రికెటర్లు ‘చెల్లింపుల’ సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎఫ్ఐసీఏ వెల్లడించింది. లీగ్‌ల నిర్వహణకు అనుమతులిచ్చే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ అంశంపై దృష్టి సారించాలని ఎఫ్ఐసీఏ సీఈఓ టామ్ మఫట్ కోరారు. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ రూపురేఖలు, తీరుతెన్నులు గజిబిజీగా ఉన్నాయన్న ఎఫ్ఐసీఏ... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను సమస్యకు పాక్షిక పరిష్కారంగా అభివర్ణించింది. -
బ్రేవో వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్ 2012, 2016 టి 20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. కెరీర్ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్ వన్డే కెరీర్ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ముంబై టి20 లీగ్ నుంచి తప్పుకొని...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై టి20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. తండ్రి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతుల్ గైక్వాడ్ శిక్షణలో బౌలింగ్ శైలికి తుది మెరుగులు దిద్దుకుంటున్న అర్జున్ టెండూల్కర్ ఇప్పుడప్పుడే పోటీ క్రికెట్లో అడుగుపెట్టొద్దని సచిన్ సూచించడంతో ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ లీగ్‌లో ఆరుజట్లు పాల్గొంటాయి. వాంఖెడే వేదికగా ఈ నెల 11 నుంచి 21 వరకు ఈ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
ఇక కోలుకోవడం చాలా కష్టం: క్రిస్ గేల్
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫోర్క్, చిన్న కత్తి లాంటి వాటితో కూడా సిక్సర్లు కొట్టగలనని ఇటీవల చెప్పిన గేల్.. వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవం తెచ్చుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సమీప భవిష్యత్తులో కూడా తమ జట్టు టెస్టుల్లో రాణించే అవకాశాలు కనిపించడం లేదన్నాడు. ప్రస్తుత క్రికెట్ విధానంతో టెస్టుల్లో కరీబియన్లు ఓటముల నుంచి కోలుకుని రాణించడం సాధ్యం కాదన్నాడు. అవకాశమిస్తే తాను 2019 వన్డే ప్రపంచ కప్ లో ఆడతానని, బహుశా అప్పటివరకే తన వన్డే కెరీర్ ఉంటుందని చెప్పాడు. గతంలో కేవలం ఫాస్ట్ బౌలర్లు మాత్రమే జట్టుకు విజయాలు అందించేవార ఇప్పుడు రెండు విభాగాలలో అలాంటి పరిస్థితి లేదన్నాడు. క్రిస్ గేల్ 103 టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదడంతో పాటు మొత్తం 7214 పరుగులు చేశాడు. ఇటీవల తమ జట్టు స్వదేశంలో భారత్ చేతిలో, విదేశాలలో పాకిస్తాన్ చేతిలో సిరీస్ లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశాడు. ఏకాగ్రత, నిరంతర కృషి ఉంటేనే ఈ పార్మాట్లో రాణించగలరని చెప్పాడు. టీ20 అనేది తక్కువ సమయంలో మ్యాచ్ ముగుస్తుంది కనుక కొద్దిసేపు రాణిస్తే సరిపోతుందని.. అందుకే వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ లు నెగ్గుతుందన్నాడు. తర్వాతి తరం ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ పైనే దృష్టి పెడతారని, సుదీర్ఘ ఆటపై ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నందున బిగ్ బాష్ లో ఆడటం లేదని, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ లలో రాణించడంపైనే దృష్టి సారించినట్లు క్రిస్ గేల్ వివరించాడు.