International Cricket Council (ICC)
-
పాక్ ఎఫెక్ట్..? ఐసీసీ సీఈవో అలార్డీస్ రాజీనామా
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో సీఈవో జెఫ్ అలార్డీస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో కాకుండా.. దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్‌గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్‌లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. -
ICC: జై షా కీలక ముందడుగు.. చిన్న జట్ల పాలిట శాపం?!
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది. టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్‌గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.సీఏ, ఈసీబీ చైర్మన్లతో చర్చలుఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది. తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లునిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది. టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్‌లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్‌లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్‌లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా... బులవాయో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్‌ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓవరాల్‌గా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది. చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
International Cricket Council: టి20 ప్రపంచకప్ విజేతకు రూ.20.35 కోట్లు
న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్‌మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. సెమీఫైనల్స్‌తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి. -
T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు!
ICC’s new stop clock rule- దుబాయ్: పురుషుల జట్లు బ్యాటింగ్‌లో ఎడాపెడా దంచేసినా, చుక్కలు చూపించినా పర్లేదు. కానీ బౌలింగ్ సమయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య నిక్కచ్చిగా 60 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలి. నింపాదిగా బౌలింగ్ చేస్తానంటే ఇకపై అస్సలు కుదరదు. దుబాయ్‌లో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్టాప్ క్లాక్’ నిబంధనను ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు టి20 ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లన్నింటికీ రిజర్వ్ డేలను ఖరారు చేసింది. ‘స్టాప్ క్లాక్’ నిబంధన? రెండు ఓవర్ల మధ్య విరామ సమయాన్ని తగ్గించడమే ‘స్టాప్ క్లాక్’. ఒక బౌలర్ ఓవర్ ముగించిన వెంటనే మరో బౌలర్ 60 సెకన్లలోపే బౌలింగ్ చేయాలి. బౌలింగ్ జట్టు 60 సెకన్లలోపే ఓవర్ వేయకపోతే అంపైర్లు మూడుసార్లు హెచ్చరికలతో సరిపెడతారు. ఆ తర్వాత పునరావృతమైతే పెనాల్టీ విధిస్తారు. చదవండి: MI: బుమ్రా, హార్దిక్‌ను వదిలేద్దామంటే.. రోహిత్ శర్మనే అడ్డుకున్నాడు! -
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది. ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే ‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్‌మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్‌మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ సైతం.. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది. ఐసీసీ హర్షం ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
ICC: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన
Bangladesh all-rounder banned from all cricket: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. తప్పు చేశాడని తేలింది ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్ హుసేన్ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది. మళ్లీ అపుడే రీఎంట్రీ సాధ్యం కాగా తాజా నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్ 7 తర్వాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్. చదవండి: అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం -
న్యూజిలాండ్‌కు ఇది అవమానమే.. ఆఖరికి పాక్ కూడా అలాగే: స్టీవ్ వా
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరును ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా తప్పుబట్టాడు. జాతీయ జట్టు కంటే వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువైపోయిందంటూ మండిపడ్డాడు. తనే గనుక న్యూజిలాండ్ క్రికెట్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా జట్టు యాజమాన్యానికి తగిన విధంగా బుద్ధి చెప్పేవాడినంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోని 14 మంది సభ్యుల్లో దాదాపు అందరూ కొత్త వారే. కెప్టెన్ నీల్ బ్రాండ్ కూడా పెద్దగా పరిచయం లేని పేరు. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు అనామక ఆటగాళ్లను కివీస్ పర్యటనకు పంపేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి సహా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌కు చరమగీతం పాడేలా చర్యలకు పూనుకుంటున్న సౌతాఫ్రికా క్రికెట్‌ను హెచ్చరించాల్సిన అవసరం మీకు లేదా అంటూ ప్రశ్నించాడు. ‘‘సౌతాఫ్రికాకు టెస్టు గురించి పట్టదు. భవిష్యత్తులో తమ ఆటగాళ్లు కేవలం సొంతగడ్డపై జరిగే లీగ్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ నేనే గనుక న్యూజిలాండ్ స్థానంలో ఉండి ఉంటే.. ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడిని. అసలు కివీస్ జట్టు ఈ అనామక టీమ్‌తో ఆడేందుకు ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. టెస్టు క్రికెట్ అంతం కాబోతోందనడానికి ఇలాంటివి సంకేతాలు. ఐసీసీతో పాటు ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఏం చేస్తున్నాయి? వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలి. చరిత్ర, సంప్రదాయానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా? కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే.. సర్ డాన్ బ్రాడ్‌మన్, గ్రేస్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ వంటి దిగ్గజాల లెగసీని కొనసాగించేవారెవరు? టెస్టు క్రికెట్ ఫీజుల విషయంలో ఆయా బోర్డులు ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. అందుకే చాలా మంది ఆటగాల్లు టీ10, టీ20 లీగ్‌ల వైపు చూస్తున్నారు’’ అని సిడ్నీ హెరాల్డ్‌తో స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ.. అనామక జట్లను విదేశీ పర్యటనలకు పంపిస్తున్నాయని స్టీవ్ వా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా జాతీయ జట్టు టూర్లపై ప్రభావం పడటం ఇది రెండోసారి. గతేడాది టీ20 లీగ్ కారణంగా తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు చేసుకోవాలని భావించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు లేకుండానే సిరీస్‌ను ముగించేసింది. ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బాక్సిండే టెస్టులో భారత జట్టును చిత్తు చేసిన ప్రొటిస్ బుధవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్‌లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ -
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
ICC: అద్భుత ఇన్నింగ్స్.. ఐసీసీ అవార్డు అతడికే! వరల్డ్‌కప్‌లో..
ICC Men's Player of the Month: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్ ఖాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజంకు క్రికెట్ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బాబర్.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు. నేపాల్‌పై శతక్కొట్టిన బాబర్ తద్వారా.. పాకిస్తాన్ అఫ్గన్ జట్టును 3-0తో వైట్‌వాష్ చేయడంలో బాబర్ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు. అరుదైన రికార్డు తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్లో బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటి ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్ ఆజం.. ఆసియా కప్- వన్డే వరల్డ్‌కప్-2023లో గెలుపొంది పాకిస్తాన్ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్‌లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు. చదవండి: Asia Cup: షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ -
టీమిండియాతో మ్యాచ్.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ!
India tour of West Indies, 2023 Test Series: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇటీవల టీమిండియా- విండీస్ టెస్టు కోసం విండ్సర్ పార్కులో తయారు చేసిన పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్ట జూలై- ఆగష్టులో కరేబియన్ దీవిలో పర్యటించిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల విజృంభణతో విండీస్ కుదేలు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జూలై 12న డొమినికాలోని రొసోవ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లతో విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తదుపరి లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు ఏడు, జడ్డూకు రెండు వికెట్లు దక్కాయి. చెత్త పిచ్ అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో టర్నింగ్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో చెత్త పిచ్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా.. విండ్సర్ పిచ్‌కు బిలో ఆవరేజ్ రేటింగ్‌తో విండీస్ బోర్డును పనిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేరింది. అయితే, ఈ విషయంపై బోర్డు అప్పీలు వెళ్లే అవకాశం ఉంది. ఆ పిచ్‌కు రేటింగ్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుకు వేదికైన.. జమైకాలోని క్వీన్స్ పార్క్ ఓవల్‌కు ఆవరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత జట్టు 1-0తో సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం 3-2 తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే.. -
టీమిండియా కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం: ఐసీసీ ప్రకటన.. ఆమె ఏం తప్పు చేసిందని?
India women's team skipper Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అందుకే ఈ చర్యలు ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా ఢాకాలో శనివారం బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ సందర్భంగా హర్మన్ వ్యవహరించిన తీరుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హర్మన్... తాను అవుటైన తర్వాత వికెట్లను బ్యాట్‌తో కొట్టినందుకు గానూ ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు.. డిసిప్లినరి రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది. రెండు మ్యాచ్‌లు ఆడకుండా అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఐసీసీ నియమావళిలోని 2.8 నిబంధనను అతిక్రమించిందన్న ఐసీసీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా అంపైర్‌ను విమర్శించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోత(డిమెరిట్ పాయింట్ కూడా) విధించినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ.. హర్మన్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిషేధం విధించిన నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆమె ఒక టెస్టు మ్యాచ్ లేదంటే.. రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. తప్పుడు నిర్ణయమని అంపైర్‌పై కోపంతో అలా.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ బౌలింగ్‌లో భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. ఎల్బీడబ్ల్యూ అయినట్లు పేర్కొన్నాడు. అయితే, బంతి లెగ్స్టంప్నకు ఆవల పిచ్ అయిందనుకున్న హర్మన్ తను అవుట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలిచేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అండగా నిలుస్తున్న అభిమానులు అంతేకాదు మ్యాచ్ తర్వాత అంపైరింగ్ ప్రమాణాలను తప్పుబట్టిన ఆమె.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీస మర్యాద చేయలేదంటూ బంగ్లాదేశ్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో టీమిండియా అభిమానులు.. ‘‘సూపర్ హర్మన్.. ఆటలో మనకు అన్యాయం జరిగిందని భావించినపుడు కోపం రావడం సహజం. అది మానవ నైజం. ఇక మన హైకమీషన్ పట్ల వాళ్లు వ్యవహరించిన తీరుకు నువ్విచ్చిన కౌంటర్ అదుర్స్. మన పురుష క్రికెటర్లు కూడా ఇంత డేరింగ్‌గా మాట్లాడేవాళ్లు కాదేమో! నీపై ఐసీసీ చర్యలు తీసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. చదవండి: రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం దుబాయ్ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది. ►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్‌లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ► ఇక టెస్టు క్రికెట్లో ఓవర్‌రేట్ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్‌ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్‌లలో టోర్నీ ప్రైజ్‌మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా -
ODI WC: కౌంట్‌డౌన్ మొదలు...
ఈ శీతాకాలం మునుపటిలా చల్లగా ఉండదు. వన్డే ప్రపంచకప్‌తో హీటెక్కనుంది. ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ మజాను పంచనుంది. భారీ స్కోర్లతో, వీర విహారాలతో సాగిపోనుంది. బంతి, బ్యాట్ పైచేయి తేల్చుకునేందుకు సమాయాత్తమైంది. బోరుకొట్టే మ్యాచ్‌లు కాకుండా... హోరెత్తించే షోలతో ఈ మెగా ఈవెంట్ మురిపించేందుకు సిద్ధమైంది. సెంచరీలు కొట్టే బ్యాటర్లు, హ్యాట్రిక్స్ వికెట్లు తీసే బౌలర్లు... ప్రపంచకప్ కలను సాకారం చేసుకునేందుకు తాజా దిగ్గజాలు సై అంటే సై అంటున్నారు. ముంబై: వన్డే ప్రపంచకప్ అంకానికి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. 12 ఏళ్ల తర్వాత భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి మాత్రం ఒంటరిగా నిర్వహించనుండటం ఈ కప్కున్న మరో ప్రత్యేకత. అందుకేనేమో అన్ని అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించి.... అంతా కసరత్తు చేశాకే ఆలస్యంగా కేవలం వంద రోజుల ముందే షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో ఓ ఏడాది ముందే ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేసేది. వాన ముప్పున్న వేదికల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లను కేటాయించలేదు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ముంబైలో విడుదల చేసింది. అక్టోబర్ 5న తెరలేచే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి నవంబర్ 19న జరిగే టైటిల్ పోరుతో తెరపడనుంది. గత ఫార్మాటే ఈ మెగా ఈవెంట్ కూడా గత ప్రపంచకప్ (2019) ఫార్మాట్‌లాగే రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. అంటే పది జట్లు ప్రతీ ప్రత్యరి్థతోనూ లీగ్ దశలో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్టు సెమీఫైనల్స్‌కు (నాకౌట్) అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్‌కు నవంబర్ 15న ముంబై... రెండో సెమీఫైనల్‌కు నవంబర్ 16న కోల్‌కతా వేదిక కానున్నాయి. భారత్ గనుక సెమీఫైనల్ చేరితే ముంబైలో ఆ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్‌కు పాకిస్తాన్ ఎదురైతే ఈ సెమీఫైనల్ కోల్‌కతాలో జరుగుతుంది. నాకౌట్ మ్యాచ్‌లకే (సెమీఫైనల్స్, ఫైనల్) రిజర్వ్ డేలున్నాయి. ఆరు ‘డే’ మ్యాచ్‌లు... మిగతావి డే–నైట్... ఈ టోర్నీలో మొత్తం జరిగే మ్యాచ్‌లు 48. లీగ్ దశలో 45 పోటీలు జరుగుతాయి. ఇందులో కేవలం ఆరు లీగ్‌లే డే మ్యాచ్‌లుగా ఉదయం గం. 10:30 గంటలకు మొదలవుతాయి. మిగతావన్నీ డే–నైట్ మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. వీటితో పాటు నాకౌట్ మ్యాచ్‌లు కూడా డేనైట్ వన్డేలే! డే–నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. దాయాదులు దంచుకునేది... మాంచి క్రికెట్ కిక్ ఇచ్చే... అందరూ లుక్కేసే మ్యాచ్ భారత్, పాకిస్తాన్ పోరు! చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఇదే కాదు... ఫైనల్ (నవంబర్ 19) సహా 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య టోర్నీ ఆరంభ పోరు (అక్టోబర్ 5న), ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (నవంబర్ 4) తలపడే మేటి మ్యాచ్‌లను లక్ష పైచిలుకు ప్రేక్షకులు చూసే నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఏర్పాటు చేశారు. గత మూడు ప్రపంచకప్‌లలో (2011లో భారత్; 2015లో ఆస్ట్రేలియా; 2019లో ఇంగ్లండ్) ఆతిథ్య జట్టు విజేతగా నిలువడం విశేషం. నాలుగోసారి పూర్తిగా ఇండియాలోనే.... భారత్ ఆతిథ్యమివ్వబోయే నాలుగో వన్డే ప్రపంచకప్ ఇది. ఈసారి పూర్తిగా భారత్‌లోనే జరుగనుండటం ఈ వరల్డ్‌కప్ ప్రత్యేకత! తొలిసారిగా 1987లో పాక్‌తో కలిసి, రెండోసారి 1996లో పాక్, లంకలతో ఉమ్మడిగా, మూడోసారి 2011లో లంక, బంగ్లాదేశ్‌లతో సంయుక్తంగా భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇప్పటి వరకు 12 సార్లు వన్డే ప్రపంచకప్ జరగ్గా... రెండోసారి మాత్రమే ఆతిథ్య జట్టు టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగడంలేదు. 1996లో భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగ్గా... 2023లోనూ ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనుండటం విశేషం. హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్ లేదు భారత్‌లోని 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇందులో హైదరాబాద్‌కూ ఆతిథ్య భాగ్యం దక్కింది. కానీ భారత్ ఆడే మ్యాచ్‌కు నోచుకోలేకపోయింది. పాకిస్తాన్ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఉప్పల్ మైదానంలో జరుగుతాయి. ఈ రెండింటికి ప్రత్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా రెండు జట్లు ఖరారవుతాయి. ముంబై, పుణే, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ధర్మశాల, లక్నో, కోల్‌కతా, బెంగళూరు ఈ 9 వేదికల్లో ఐదేసి చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఈ మెగా టోరీ్నకి సన్నాహాల్లో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెపె్టంబర్ 30న గువాహటిలో ఇంగ్లండ్ జట్టుతో... అక్టోబర్ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్–1 జట్టుతో టీమిండియా తలపడుతుంది. -
అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్!
వన్డే ప్రపంచకప్‌కు మరో 100 రోజుల సమయం ఉంది. భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోరీ్నపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నం చేశాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది. అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరింది. నేటినుంచి జరిగే వరల్డ్ టూర్లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ఇందులో ప్రపంచ కప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. -
World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చే పరిణామం...వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఖాయమై రూ. 117 కోట్లతో ఆధునీకరణకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోందని, మెగా ఈవెంట్లో టీమిండియా మ్యాచ్‌ను వీక్షించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే అవకాశం లేదని తేలింది. మ్యాచ్ వేదికలు, తేదీలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బీసీసీఐ షెడ్యూల్ డ్రాఫ్ట్ సమర్పించింది. ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు. ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే... సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా... 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే... లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో లీగ్ దశకే పరిమితం కాగా... నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది. అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది. భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ కాకుండా భారత్‌లో 8 వేదికల్లో 29 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఖరారు చేసింది. అప్పట్లోనే అన్ని రకాలుగా సిద్ధమైన హైదరాబాద్ స్టేడియం 3 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది కూడా. అయితే వరల్డ్ కప్ మైదానాల్లో మాత్రం ఉప్పల్‌కు చోటు దక్కలేదు. ‘టెస్టు హోదా ఉన్న స్టేడియాలను మాత్రం బోర్డు పరిశీలించింది’ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కాయన్న ఆనందంలో అభిమానులు ఉండగా, ఇప్పుడు భారత్ మ్యాచ్ లేకపోవడం సహజంగానే నిరాశపర్చే అంశం. క్రికెట్ పట్ల చూపించిన ఆదరణను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియం ఎప్పుడూ నిరాశపర్చలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు...ఐపీఎల్ హోం టీమ్ సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన ఇచ్చినా సరే, స్టేడియంలో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా చూస్తే చక్కటి అవుట్‌ఫీల్డ్, ఫిర్యాదులు లేని పిచ్‌తో సహా సౌకర్యాలపరంగా చూస్తే ఇతర అన్ని స్టేడియాలతో పోలిస్తే మేలైన వసతులు ఉన్నాయి. అయితే ఇదంతా బోర్డు పట్టించుకున్నట్లుగా లేదు. వరల్డ్ కప్‌లో వేదికల ఖరారు గురించి గత నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. కార్యదర్శి జై షా నేతృత్వంలో ఇది పని చేసింది. భారత మ్యాచ్‌లకు కేటాయించిన 9 వేదికలను చూస్తే వేర్వేరు కారణాలతో వీటిని ఖాయం చేసినట్లుగా అర్థమవుతుంది. భారత క్రికెట్లో మొదటినుంచి ‘ప్రధాన’ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సహజంగానే పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మ్యాచ్ (పాక్‌తో) నిర్వహించాలని బోర్డు భావించింది. మిగతా మూడు వేదికల విషయంలో బోర్డు అంతర్గత రాజకీయాలు పని చేశాయి. బోర్డు ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా తన సొంత మైదానమైన లక్నోలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ అసోసియేషన్‌కు చెందిన ధర్మశాలలో మ్యాచ్‌లను తీసుకున్నారు. పుణేకు కూడా మ్యాచ్ కేటాయించుకోవడంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసి సఫలమైంది. నిజానికి ముందుగా షార్ట్ లిస్ట్ చేసిన 12 వేదికల్లో పుణే పేరు లేదు. ఆ తర్వాత దానిని అదనంగా చేర్చడంలోనే పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ మ్యాచ్ ఉప్పల్‌కు దక్కేదేమో. కానీ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ప్రాతినిధ్యమే లేదు. నిత్య కలహాలతోనే అసోసియేషనే లేకుండా మాజీ న్యాయమూర్తి చేతుల్లో ఉన్న వ్యవస్థ మ్యాచ్‌పై పట్టుబట్టే పరిస్థితిలో అసలే లేదు! -
ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు?
ICC Announces New Rules- దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తరుచూ వివాదాస్పదమవుతున్న నిర్ణయాలను సవరించింది. సాఫ్ట్ సిగ్నల్, ఫ్రీ హిట్‌కు బౌల్డయితే పరుగులపై స్పష్టతనిచ్చింది. పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే బ్యాటర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే! ఇకపై తన ఇష్టానికి వదిలేయరు. ఇది ఐసీసీ కొత్త రూల్! సాఫ్ట్ సిగ్నల్: సాధారణంగా క్యాచ్‌లు పట్టినపుడు తీసుకునే నిర్ణయాలు. బౌండరీకి దగ్గరో, లేదంటే బంతి నేలను తాకినట్లు పట్టిన క్యాచ్‌లు వివాదాస్పదమవుతాయి. ఫీల్డ్ అంపైర్ తొలుత అవుటిచ్చినా... దాన్ని మళ్లీ టీవీ (థర్డ్) అంపైర్‌కు నివేదిస్తారు. కానీ మళ్లీ సాఫ్ట్ సిగ్నల్’ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ‘సాఫ్ట్’కు కాలం చెల్లింది. టీవీ అంపైర్‌దే తుది నిర్ణయమవుతుంది. దీంతో ఫీల్డ్ అంపైర్‌కు ఇది మరో కోతలాంటిది! ఫ్రీ హిట్‌కు బౌల్డయితే: ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు చట్టబద్ధమే! ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని ఐసీసీ కమిటీ ప్రకటించింది. అయితే ఇలా తీసిన పరుగులు ఎక్స్‌ట్రాల కోటలో జమకావు. బ్యాటర్స్ ఖాతాలోకి వెళ్తాయి. గత టి20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఫ్రీ హిట్‌కు బౌల్డయి మూడు పరుగులు రాబట్టాడు. పాక్ క్రికెటర్లు గగ్గోలు పెడితే అంపైర్లు నియమావళిని వివరించినా... చాన్నాళ్లు దీనిపై చర్చ నడిచింది! హెల్మెట్ ఐచ్చికం కాదు... కచ్చితం: పేసర్లు బౌలింగ్‌కు దిగితే బ్యాటర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. అలాగే బ్యాటర్లకు చేరువగా మోహరించిన ఫీల్డర్లు సైతం హెల్మెట్ పెట్టుకోవాలి. చదవండి: వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్ టైటాన్స్ క్వాలిఫై... సన్‌రైజర్స్ అవుట్ -
‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చెప్పాల్సిందే! అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే! బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు. క్లియర్‌గా కనిపించినా ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్‌గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది. నాటి మ్యాచ్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో సామ్ కరన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు. అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి రూల్‌ను రద్దు చేయాల్సిందే! దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. చదవండి: కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం'
ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 30 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు ఇరుజట్ల స్పిన్నర్లు తీయగా.. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండోర్ పిచ్‌పై సీరియస్ అయింది. ఆస్ట్రేలియా, టీమిండియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్‌ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ''పిచ్ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి బ్యాలెన్స్ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్‌లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. క్యురేటర్ పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ఇండోర్ పిచ్‌కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది. నివేదికను బీసీసీఐకి ఫార్వర్డ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకోవచ్చు. '' ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని'' ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: టీమిండియాకు సంకట స్థితి.. నాలుగో టెస్టు గెలిస్తేనే తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే! -
'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుందంటారు. అలాంటి ఐసీసీ గురువారం క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరింది. కారణం ఏంటనేది ఈ పాటికే మీకందరికి అర్థమయ్యే ఉంటుంది. పెద్దన్న(ఐసీసీ) బుధవారం ర్యాంకింగ్స్‌లో చిన్న తప్పిదం చేసింది. బుధవారం మధ్యాహ్నం టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిదంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. భారత్ ఖాతాలో 115 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్లతో ఉందని పేర్కొంది. దీంతో టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా అవతరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే దాదాపు ఏడు గంటల తర్వాత ఐసీసీ తప్పిదాన్ని గుర్తించింది. భారత్ ఇంకా టాప్ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. తాజాగా గురువారం తమ తప్పిదానికి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఐసీసీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి తొలి టెస్టుకు ముందు టీమిండియా 111 పాయింట్లతో రెండో స్థానంలో.. 126 పాయింట్లతో ఆసీస్ తొలిస్థానంలో ఉన్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ టేబుల్‌ను అప్డేట్ చేసింది. మ్యాచ్ గెలిచిన భారత్‌కు నాలుగు పాయింట్లు రాగా.. ఆసీస్‌కు ఎలాంటి పాయింట్లు రాలేదు. అయితే ఐసీసీ పొరపాటున టీమిండియా 115 పాయింట్లను టాప్‌గా పరిగణించి.. ఆస్ట్రేలియాకు 111 పాయింట్లు అంటూ చూపించింది. దీంతో టీమిండియా నెంబర్‌వన్ అని ప్రకటించింది. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ విషయంలో పొరపాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు ఇదే ఏడాది జనవరి 17న టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ సాధించిందంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా 126 పాయింట్లతో నెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు 15 పాయింట్లు కోత పడడంతో వారి రేటింగ్ 111కు పడిపోయింది. దీంతో 115 పాయింట్లతో టీమిండియా నెంబర్‌వన్ అయినట్లు తెలిపింది. అయితే రెండు గంటల వ్యవధిలోనే తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ లెక్క సరిచేసింది. అయితే ఈ ఏడాదిలో నెల వ్యవధిలో ఐసీసీ రెండుసార్లు పొరపాటు చేయడంపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తావు.. ఇలా అయితే ఎలా''.. ''తప్పు చేస్తే దండిచాల్సిన నువ్వే పొరపాటు చేస్తే ఎలా పెద్దన్న''.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాలు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆడనున్నాయి. టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. India 🇮🇳 spot on the 🔝 in #icc new Test Ranking 1. India 🇮🇳 India 🇮🇳 now T20- no.1 , ODI no.4,Test no.1#bcci #TeamIndia #ranking #believeinblue pic.twitter.com/8XXLnvygqE — Sartaj 🇮🇳 (@i_amSartaj) January 17, 2023 చదవండి: భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2 'ఆరడుగుల బౌలర్ కరువయ్యాడు'.. ద్రవిడ్ అదిరిపోయే కౌంటర్ -
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
ICC World Test Championship 2021 - 2023: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021- 23 సీజన్ ఫైనల్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7న ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుందని పేర్కొంది. జూన్ 12ను రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. కివీస్‌దే తొలి ట్రోఫీ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియాను ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక తాజా సీజన్లో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో ఆస్ట్రేలియా, టీమిండియా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు టాప్-2లో ఉన్న ఈ రెండు పటిష్ట జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం కానుంది. టీమిండియా- ఆసీస్ పోటాపోటీ అయితే, ఆస్ట్రేలియా 136 పాయింట్ల(75.56 పర్సంటైల్)తో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ 99 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా సిరీస్ గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అలా అయితే కంగారూలకు కష్టాలు తప్పవు. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లనిపిస్తున్నా.. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్‌ల ఫలితాలు తేలే వరకు వేచి చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక, సౌతాఫ్రికా మిగిలిన సిరీస్‌లు ఆడిన తర్వాతే ఫైనలిస్టులకు సంబంధించి స్పష్టత వస్తుంది. ది ఓవల్ క్రికెట్ స్టేడియం ఇక క్రికెట్ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ గతంలో ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఓవల్‌కు వేదికను మార్చింది. కాగా ఓవల్ స్టేడియం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్టన్లో ఉంది. 1845లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది. చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' Rishabh Pant: 'స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే హాయిగా ఉంది' -
వాళ్లు ఎక్కడికైనా పోనీ, ఏమైనా చేసుకోనీ..అయినా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Javed Miandad Fumes At ICC Over Asia Cup 2023: ఆసియా కప్-2023 నిర్వహణ, వేదిక తదితర అంశాలపై చిక్కుముడి వీడలేదు. బహ్రెయిన్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై మండలి ఓ నిర్ణయానికి వస్తుందని భావించినా అలా జరుగలేదు. దీంతో వచ్చే నెలలో మరోసారి సమావేశమైన తర్వాత ఈ మెగా టోర్నీ ఎక్కడ జరుగనుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించగా.. పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా రాని స్పష్టత అప్పటి నుంచి టోర్నీ నిర్వహణ ఎక్కడ అన్న అంశంపై సందిగ్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం బహ్రెయిన్‌లో జరిగిన సమావేశంలో యూఏఈ పేరు ప్రస్తావన(తటస్థ వేదిక)కు వచ్చినా.. ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మార్చి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఏంటి ఇదంతా? ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ మద్దతు తమకేమీ అవసరం లేదని.. వాళ్లు పాకిస్తాన్లో ఆడకపోయినా పర్లేదని పేర్కొన్నాడు. అయినా ఐసీసీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించాడు. భారత్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎక్కడికైనా పోనివ్వండి... ఐసీసీ ఏం చేస్తోంది? పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి.. వాళ్లు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వాళ్లతో మాకేం పనిలేదు. అసలు మేము వాళ్లను పట్టించుకోము. నిజానికి ఇక్కడ తప్పుబట్టాల్సింది ఐసీసీని. ఈ సమస్యకు పరిష్కారం చూపని ఐసీసీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. దాని వల్ల ఉపయోగం ఏమిటి? మా దగ్గర ఇలాంటి చెల్లవు ప్రతి జట్టుకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలి కదా. టీమిండియా పటిష్ట జట్టే కావొచ్చు. అయినంత మాత్రాన వాళ్లొక్కలే క్రికెట్ ప్రపంచాన్ని నడిపించడం లేదు కదా. భారత జట్టు సొంతగడ్డపై పవర్‌హౌజ్ లాంటిది అయి ఉండవచ్చు.. అదంతా వాళ్ల దేశంలోనే చెల్లుతుంది. మా దగ్గర కాదు. ప్రపంచం మొత్తం మీద వాళ్ల మాటే నెగ్గాలంటే కుదరదు. అయినా పాకిస్తాన్‌కు వచ్చి మీరెందుకు ఆడరు? ఒకవేళ ఇక్కడికి వచ్చి ఓడిపోతే ఆ దేశ ప్రజలు సహించరు. అందుకేనా’’ అంటూ కవ్వింపు మాటలు మాట్లాడాడు. అదే విధంగా.. ఐసీసీ ఇప్పటికైనా భారత బోర్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. ఆ ఐదుగురు యమ డేంజర్.. ఏమరపాటుగా ఉంటే! Jasprit Bumrah: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే -
ఐసీసీ టెస్టు జట్టు: ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ICC Men’s Test Team of the Year 2022: గతేడాది టెస్టుల్లో తమదైన ముద్ర వేసిన పురుష క్రికెటర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్‌స్టోక్స్‌ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చింది. భారత్ నుంచి ఒకే ఒక్కడు కాగా టీమిండియా నుంచి పంత్ ఒక్కడికే ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో స్థానం దక్కడం విశేషం. ఈ టీమ్‌లో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్.. మూడో స్థానంలో మార్నస్ లబుషేన్, ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, రిషభ్ పంత్, ప్యాట్ కమిన్స్‌కు చోటిచ్చింది ఐసీసీ. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా పేస్ విభాగంలో కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్ స్పిన్ విభాగంలో నాథన్ లియోన్ ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 2021-23 సీజన్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఆసీస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు అత్యధికంగా నలుగురు ఈ జట్టులో స్థానం సంపాదించారు. బజ్‌బాల్ విధానంతో టెస్టు క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న సారథి స్టోక్స్‌తో పాటు బెయిర్‌స్టో, ఆండర్సన్ ఇంగ్లండ్ నుంచి చోటు దక్కించుకున్నారు. వారెవ్వా పంత్ 2022లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ 12 ఇన్నింగ్స్‌లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గతేడాది పంత్ టెస్టుల్లో 21 సిక్సర్లు బాదాడు. ఆరు స్టంప్స్‌లో భాగమయ్యాడు. 23 క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకుంటున్న విషయం విదితమే. ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 1.ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా 2.క్రెయిగ్ బ్రాత్‌వెట్- వెస్టిండీస్ 3.మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా 4.బాబర్ ఆజం- పాకిస్తాన్ 5.జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్ 6.బెన్ స్టోక్స్- ఇంగ్లండ్ (కెప్టెన్) 7.రిషభ్ పంత్- ఇండియా(వికెట్ కీపర్) 8.ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా 9.కగిసో రబడ- సౌతాఫ్రికా 10.నాథన్ లియోన్- ఆస్ట్రేలియా 11.జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్. చదవండి: IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్‌మ్యాన్ ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బాబర్ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే -
క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లి క్రికెట్ చర్రితలో ఏ ఆటగాడికి సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన ఘనతను ఇవాళ (జనవరి 23) సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి.. ఐసీసీ మూడు ఫార్మాట్ల క్రికెట్ జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. •ICC Test team of the year. •ICC ODI team of the year. •ICC T20 team of the year. Virat Kohli is the only player to feature or to be part of the ICC's years team in all three formats.!! — CricketMAN2 (@ImTanujSingh) January 23, 2023 2012, 2014, 2016, 2017, 2018, 2019 ఐసీసీ వన్డే జట్లలో చోటు సంపాదించిన కింగ్.. 2017, 2018, 2019 ఐసీసీ టెస్ట్ టీమ్‌ల్లోనూ సభ్యుడిగా ఎంపిక కాబడ్డాడు. తాజాగా 2022 ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న రన్‌మెషీన్.. ఐసీసీ బెస్ట్ టెస్ట్ (3), వన్డే (6), టీ20 జట్ల (1)లో భాగమైన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతేడాది పొట్టి ఫార్మాట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్.. ఆసియాకప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ సెంచరీ, టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై అజేయమైన హాఫ్‌సెంచరీ తదితర మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి బెస్ట్ టీ20-2022 జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది సూపర్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్న కోహ్లి.. 2023లో వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో కింగ్ ఇప్పటికే 2 సెంచరీలు (శ్రీలంకపై) బాదాడు. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న పరుగుల యంత్రం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే 4 మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. కాగా, ఐసీసీ ప్రకటించిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు కూడా చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు సారధి జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం
ICC Mens T20I Team Of The Year 2022: 2022 సంవత్సరానికి గానూ ఐసీసీ ఇవాళ (జనవరి 23) తమ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్.. జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్‌ను ఎంపిక చేసింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. మొత్తం 11 మంది సభ్యుల జాబితాను వెల్లడించింది. ఓపెనర్లుగా కెప్టెన్ జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ మేనేజ్మెంట్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి (భారత్), ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (భారత్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), స్పిన్నర్‌గా వనిందు హసరంగ (శ్రీలంక), పేసర్లుగా హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్)లను ఎంపిక చేసింది. -
సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం
క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సైబర్ క్రైమ్ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్లైన్ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్ మెయిల్ స్కామ్ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్ మెయిల్ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు మెయిల్ చేశారట. ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్‌తోనే సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్‌ను టీజ్ చేసిన రోహిత్ శర్మ Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్ అండ్ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్ మెకల్లమ్ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు. -
నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత నెలలో కనబరిచిన ప్రదర్శనకుగాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో (82 నాటౌట్) జట్టును గెలిపించిన కోహ్లి... నెదర్లాండ్స్ (62 నాటౌట్), బంగ్లాదేశ్ (64 నాటౌట్)లపై కూడా అజేయ అర్ధసెంచరీలతో శివమెత్తాడు. దక్షిణాఫ్రికా (12)తో విఫలమైన కోహ్లి... జింబాబ్వేపై 26 పరుగులు చేశాడు. దీంతో కోహ్లితో పాటు అవార్డు రేసులో మిల్లర్ (దక్షిణాఫ్రికా), సికందర్ రజా (జింబాబ్వే) ఉన్నప్పటికీ భారత ఆటగాడినే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ వరించింది. నెలవరీ ప్రదర్శనకిచ్చే అవార్డు అతనికిదే తొలిసారి. ‘అక్టోబర్ నెలకు సంబంధించిన అవార్డు నాకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఓటేసిన క్రికెట్ అభిమానులు, ప్యానెల్ సభ్యులకు ధన్యవాదాలు’ అని కోహ్లి తెలిపినట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళా క్రికెటర్లలో పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ నిదా దార్ ఈ అవార్డుకు ఎంపికయింది. ఆమెతో భారత ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీపడ్డారు. ఆయితే ఆసియా కప్ టోర్నీలో నిలకడగా రాణించిన పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌కే ఈ అవార్డు లభించింది. -
WC 2022: టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి.. కానీ ఐసీసీ మాత్రం అంతే!
T20 World Cup 2022- India Vs Netherlands: సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. హోటల్ చాలా దూరం..! ఈ క్రమంలో నెదర్లాండ్స్‌తో సిడ్నీ వేదికగా గురువారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీసు సెషన్లో పాల్గొంది. కాగా టీమిండియా బస చేసే హోటల్‌కు.. గ్రౌండ్‌కు దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతదూరం నుంచి ప్రాక్టీసుకు వెళ్లిన ఆటగాళ్లకు మధ్యాహ్నం సరైన భోజన వసతి కల్పించడంలో టోర్నీ నిర్వాహకులు(ఐసీసీ) విఫలమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తదితరులు నెట్ సెషన్లో పాల్గొనగా.. ప్రాక్టీస్ తర్వాత సరైన భోజనం పెట్టలేదని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫుడ్ బాగా లేదు! ‘‘ఫుడ్ అస్సలు బాగాలేదు. ప్రాక్టీస్ తర్వాత కనీసం వేడి వేడి సాండ్విచ్ కూడా ఇవ్వలేదు. దీంతో కొంతమంది ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లిన తర్వాతే భోజనం చేయాలని భావించారు’’ అని భారత జట్టుకు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. ఇక సిడ్నీలో ఆతిథ్యం విషయంలో అసంతృప్తితో ఉన్న టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐసీసీ అలాగే చేస్తుంది ఈ నేపథ్యంలో ఆప్షనల్ ట్రెయినింగ్ సెషన్‌ను కొంతమంది బాయ్‌కాట్ చేసినట్లు వార్తలు రాగా.. బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. ‘‘ఎవరూ నెట్ సెషన్ బాయ్‌కాట్ చేయలేదు. కొంతమంది పండ్లు, ఫెలాఫెల్(బీన్స్‌తో చేసే డీప్ ఫ్రై వంటకం- మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువగా తింటారు) తిన్నారు. అయితే, లంచ్ హోటల్లోనే చేయాలని భావించారు. అసలు సమస్య ఏమిటంటే.. లంచ్ తర్వాత ఐసీసీ వేడి వేడి వంటకాలు వడ్డించదు. ద్వైపాక్షిక సిరీస్ సమయంలో అయితే.. ఆతిథ్య దేశానికి చెందిన క్యాటరింగ్ ఇన్చార్జ్ ఈ వ్యవహారాలు చూసుకుంటారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత భారతీయ వంటకాలు వడ్డిస్తారు. అయితే, ఐసీసీ మాత్రం అన్ని దేశాల ఆటగాళ్లకు ఒకే రకమైన భోజనం ఇస్తుంది. అవకాడోతో తయారు చేసిన చల్లారిపోయిన సాండ్విచ్ మాత్రమే కాదు.. టొమాటో, దోసకాయ వంటివి కూడా భోజనంలో ఉంటాయి’’ అని పీటీతో వ్యాఖ్యానించారు. చదవండి: WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ -
T20 WC: ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు.. ట్రోఫీకి అటు పక్కన కేన్ మామ, ఇటు పక్కన ఫించ్
T20 World Cup 2022: పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం(అక్టోబరు 16) వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా శ్రీలంక- నమీబియా జట్ల మధ్య జిలాంగ్లోని కార్డీనియా పార్క్ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీకి తెరలేవనుంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనబోయే జట్లు ఆసీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ ఐసీసీ ఈవెంట్, మెగా సమరానికి తాము సన్నద్ధమవుతున్న తీరు గురించి మాట్లాడారు. PC: ICC Twitter ట్రోఫీతో కెప్టెన్లు! ఈ సందర్భంగా ఇండియా(రోహిత్ శర్మ), ఆస్ట్రేలియా(ఆరోన్ ఫించ్), ఇంగ్లండ్(జోస్ బట్లర్), పాకిస్తాన్(బాబర్ ఆజం), అఫ్గనిస్తాన్(మహ్మద్ నబీ), శ్రీలంక(దసున్ షనక), న్యూజిలాండ్(కేన్ విలియమ్సన్), బంగ్లాదేశ్(షకీబ్ అల్ హసన్), వెస్టిండీస్(నికోలస్ పూరన్), సౌతాఫ్రికా(తెంబా బవుమా), జింబాబ్వే(క్రెయిగ్ ఎర్విన్), నమీబియా(గెర్హార్డ్ ఎరాస్మస్), ఐర్లాండ్(ఆండ్రూ బల్బిర్నీ), స్కాట్లాండ్(రిచర్డ్ బెరింగ్టన్), నెదర్లాండ్స్(స్కాట్ ఎడ్వర్డ్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(సీపీ రిజ్వాన్) కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చారు. All the 16 captains in one frame 📸 🤩#NewCoverPic | #T20WorldCup pic.twitter.com/WJXtu0JEvx — ICC (@ICC) October 15, 2022 ఇందుకు సంబంధించిన ఫొటోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు’’ అంటూ ట్వీట్ చేసింది. అదే విధంగా సారథులంతా ఒకేచోట చేరి తీసుకున్న సెల్ఫీని సైతం షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో సూపర్-12 దశ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబరు 13న ఫైనల్ మ్యాచ్‌కు సైతం ఎంసీజీ వేదిక కానుంది. Selfie time 😁🤳#T20WorldCup pic.twitter.com/snMOzdPMq3 — ICC (@ICC) October 15, 2022 చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు Mitchell Starc-Buttler: 'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి' -
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’... హర్మన్‌ప్రీత్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది. ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల (1999) తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ అమ్మాయిలు సిరీస్ గెలిచారు. -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
ICC media rights: రూ. 24 వేల కోట్లకు...
దుబాయ్: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అన్ని మ్యాచ్‌ల హక్కులను డిస్నీ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారం వేలం నిర్వహించగా... దీనిని ఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల కాలానికి (2024–2027) ఈ హక్కులు వర్తిస్తాయి. టీవీ, డిజిటల్ హక్కులు రెండింటినీ సొంతం చేసుకున్న డిస్నీ... ఇందు కోసం సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24 వేల కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. ఈ మొత్తంపై ఐసీసీ ప్రకటనలో వెల్లడించకపోయినా... గత హక్కులతో పోలిస్తే భారీ పెరుగుదల వచ్చినట్లు మాత్రం పేర్కొంది. హక్కుల కోసం డిస్నీతో పాటు సోనీ, వయాకామ్, జీ సంస్థలు కూడా పోటీ పడినా... వారెవరూ కూడా రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధపడలేదని తెలిసింది. ఐసీసీ ఇచ్చిన హక్కుల్లో పురుషుల, మహిళల వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు అండర్–19 ప్రపంచకప్ కూడా ఉంటాయి. డిస్నీ స్టార్ వద్ద ఇప్పటికే ఐపీఎల్, బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా బోర్డు డిజిటల్ హక్కులు కూడా ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌లలో హక్కుల కోసం క్రిస్మస్కు ముందు ఐసీసీ మరోసారి వేలం నిర్వహించే అవకాశం ఉంది. -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
మూడు సంవత్సరాల్లో 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఎవరితో ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను మంగళవారం విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్ 2025 కాలానికి గానూ మహిళా క్రికెట్ జట్లు ఆడబోయే సిరీస్‌లు, మెగాటోర్నీ వివరాలను ఎఫ్టీపీలో పేర్కొంది. ఇందులో 2023 వన్డే వరల్డ్ కప్‌తో పాటు మొత్తంగా 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టి20లు ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులు ఆడనున్నాయి. ఇతర జట్లు ఎక్కువగా టి20లవైపే మొగ్గుచూపాయి. ఇక మహిళా క్రికెట్లో ఎఫ్టీపీ షెడ్యూల్ రూపొందించడం ఒక అద్భుతం ఘట్టం. ఎఫ్టీపీ అనేది కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే గాక మహిళల క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కివీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పలుమార్లు హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. అందుకే ఎఫ్టీపీలో మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాం అని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీమ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్(IWC)లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్‌లు ఆడనున్నాయి. దీంతో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం అన్ని జట్లకు ఉండనుంది. పాకిస్తాన్ మినహా మిగతా 9 దేశాలతో మ్యాచ్‌లు.. 2022-25 కాలానికి గాను ప్రకటించిన ఎఫ్టీపీలో టీమిండియా మహిళల జట్టు ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా తొమ్మిది దేశాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రై సిరీస్‌లు ఉన్నాయి. అలాగే 2023 డిసెంబర్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2022-25 కాలంలో టీమిండియా మహిళలు ఆడనున్న ద్వైపాక్షిక సిరీస్‌లు.. ►ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. ►డిసెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ►వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రకా, న్యూజిలాండ్‌తో ట్రై సిరీస్‌లో ఆడనున్న టీమిండియా నాలుగు టి20లు ఆడనున్నాయి ►2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►స్వదేశంలో సెప్టెంబర్-అక్టోబర్ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేలు ►న్యూజిలాండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ►డిసెంబర్ 2023లో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు, మూడు టి20లు ►డిసెంబర్ 2023లోనే ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ►నవంబర్ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు ►డిసెంబర్ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు 2022-25లో జరగనున్న ఐసీసీ మెగాటోర్నీలు ►ఫిబ్రవరి 2023 - దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2024 - బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2025 - భారత్ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ UNVEILING 👀 The first-ever Women’s Future Tours Program ⬇️ — ICC (@ICC) August 16, 2022 చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్
దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది. -
Joe Root: జో రూట్‌కు అరుదైన గౌరవం.. వెండి బ్యాట్ బహూకరణ
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్సీ భారం తొలగిన తర్వాత మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో రూట్ తొలి టెస్టు సందర్భంగా 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌కు ముందు రూట్‌కు అరుదైన బహుమతి లభించింది. ఈ టెస్టు నంబర్ వన్ బ్యాటర్ వెండి బ్యాట్ కానుకగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అతడు తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రూట్ పది వేల మార్కు అందుకున్న సంగతి తెలిసిందే. అదే కివీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేయడంలో కీలకంగా వ్యవహరించి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌తో సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. చదవండి: Ind Vs Eng 5th Test: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం -
సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ మాజీ క్రికెటర్.. లీసాకు అరుదైన గౌరవం!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్కు అరుదైన గౌరవం దక్కింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(ఎఫ్ఐసీఏ) అధ్యక్ష పదవి దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య అధ్యక్షురాలిగా ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని నియాన్ వేదికగా జరిగిన ఎఫ్ఐసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ విక్రమ్ సోలంకి స్థానాన్ని లీసా స్తాలేకర్ భర్తీ చేయనున్నారు. ఇక గతంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ బ్యారీ రిచర్డ్స్, వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ జిమ్మీ ఆడమ్స్ ఈ పదవిని చేపట్టారు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన లీసా.. తనకు దక్కిన గొప్ప గౌరవం ఇది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గ్లోబల్ గేమ్ క్రికెట్లో నూతన దశ ఆరంభమైందని, ఇక్కడ పురుషులు, మహిళలు అనే అసమానతలకు తావు లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాగా 1998లో స్థాపించబడిన ఎఫ్ఐసీఏ అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాతినిథ్యం వహిస్తూ వారికి సంబంధించిన పలు అంశాల్లో గళం వినిపిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ ప్లేయింగ్ కమిటీలో ఈ సమాఖ్య ప్రతినిధి ఉంటారు. అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 187 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో ఆసీస్ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా పేరొంది తద్వారా 2007, 2008లో బెలిండా క్లార్క్ అవార్డు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్‌కప్-2010 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. చదవండి: BCCI- IPL: కచ్చితంగా.. భారత్ ఏం చెబితే అదే జరుగుతుంది.. ఎందుకంటే: ఆఫ్రిది -
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే: జయవర్ధనే
కెరీర్లో తాను ఎదుర్కొన్న అత్యంత ఉత్తమమైన, కఠినమైన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అన్నాడు. అతడితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో జయవర్దనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక- పాకిస్తాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ డిజిటల్ షోలో అతడు మాట్లాడుతూ తన అనుభవం గురించి పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వసీం అక్రమ్. అతడు తన కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నేను అరంగేట్రం చేశాను. తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని! నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్న ఇబ్బంది పెట్టడం తనకు వెన్నతో పెట్టిన విద్య’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. నిలకడగా బౌలింగ్ చేయడంలో వసీం అక్రమ్ దిట అని ప్రశంసించాడు. కాగా పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్లో 916 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టు వికెట్లు 414. వన్డే వికెట్లు 502. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
ఇటీవలీ కాలంలో క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత దేశంలో సిరీస్ ఆడుతున్న జట్టుకు అక్కడి లోకల్ అంపైర్స్ మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థి జట్లు సిరీస్‌లు కోల్పోయేలా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది పక్కనబెడితే.. తాజాగా ఐసీసీ అంపైరింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు ఉన్న న్యూట్రల్ అంపైర్(తటస్థ అంపైర్) విధానాన్ని ఐసీసీ తిరిగి తీసుకురానుంది. దీనివల్ల పక్షపాత ధోరణి అనే పదానికి చెక్ పెట్టినట్లు అవుతుందని ఐసీసీ చైర్మెన్ గ్రేగ్ బార్క్లే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి కరోనా ముందు న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. న్యూట్రల్ అంపైరింగ్ అంటే ఒక దేశం మరొక దేశంలో సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు లోకల్ అంపైర్లతో పాటు బయటి దేశాలకు చెందిన అంపైర్లు ఫీల్డ్ అంపైర్స్‌గా వ్యవహరించేశారు. అయితే 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో బయటి దేశాల అంపైర్లపై ట్రావెల్‌పై బ్యాన్ విధించడంతో న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థకు బ్రేక్ పడింది. అప్పటినుంచి ఏ దేశంలో సిరీస్‌లు జరిగినా ఆ దేశానికి చెందిన వ్యక్తులు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది.ఈ టూర్లో సౌతాఫ్రికాకు చెందిన అంపైర్లు మరియస్ ఎరాస్మస్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్‌లు తమ తప్పుడు నిర్ణయాలతో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వచ్చాయి. చాలా మంది బంగ్లా ఆటగాళ్ల ఔట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. దీనివల్ల జట్టు ఓటమిపై ప్రభావం చూపిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే న్యూట్రల్ అంపైరింగ్ లేకపోవడం వల్ల.. లోకల్ అంపైర్స్ నిర్ణయాలు తమ కొంప ముంచాయంటూ షకీబ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. షకీబ్ కామెంట్స్ తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లోకల్ అంపైరింగ్ పక్షపాత ధోరణిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తమ స్వదేశంలో లంకతో ఆడుతున్న సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్‌ను ఐసీసీ తాత్కాలికంగా ప్రవేశపెట్టింది. స్థానిక అంపైర్ షర్ఫుద్దౌలాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, వెస్టిండీస్‌కు చెందిన జోయెల్ విల్సన్‌లను అంపైర్లుగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తొందరలోనే న్యూట్రల్ అంపైరింగ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి తీసుకురానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. చదవండి: IND Vs SA T20 Series: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? Kusal Mendis: మ్యాచ్ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు -
ICC T20 Rankings: టీమిండియా నెంబర్‌వన్.. ఆరేళ్ల తర్వాత
దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్‌వన్‌గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్‌లో 5–0తో న్యూజిలాండ్‌తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 3–0తో వెస్టిండీస్‌పై సాధించిన విజయాల కారణంగా భారత్‌కు టాప్ ర్యాంక్ లభించింది. -
Ind Vs Pak: నిమిషాల్లోనే టికెట్లు ఫినిష్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు మరో 8 నెలల 6 రోజుల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ టికెట్ల విక్రయం... ప్రపంచ కప్ మెగా టోర్నీని ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23న ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగే భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల కోసం అంతా ఎగబడ్డారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఐసీసీ తమ వెబ్సైట్లో ‘హౌస్‌ఫుల్’ (అలొకేషన్ ఎగ్జాస్టెడ్) బోర్డు పెట్టింది. దాదాపు 90 వేల సామర్థ్యం గల ప్రతిష్టాత్మక ఎంసీజీ మైదానంలో టికెట్ల కోసం ఉన్న క్రేజ్ చూస్తే భారత్, పాక్ మ్యాచ్ విలువేమిటో అర్థమవుతుంది. 2007 నుంచి 2016 వరల్డ్‌కప్ వరకు ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 2021లో తొలిసారి పాక్‌ను విజయం వరించింది. -
ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్‌కు సమున్నత గౌరవం దక్కింది. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెను ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. కాగా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ టీ20లలో గతేడాదికి గానూ అత్యధిక పరుగులు సాధించిన నంబర్ వన్ బ్యాటర్‌గా టమీ బేమౌంట్ ఘనత సాధించింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ప్రపంచంలోని మూడో బ్యాటర్‌గా రికార్డులో తన పేరు లిఖించుకుంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడిన టమీ... 102 పరుగులతో రాణించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి సత్తా చాటింది. ముఖ్యంగా చేజారుతుందనుకున్న రెండో మ్యాచ్‌లో 53 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. అంతేగాక భారత మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మరోసారి టమీ అదరగొట్టింది. 113 పరుగులతో రాణించింది. అత్యధిక స్కోరు 97. ఈ నేపథ్యంలో ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టమీ నిలిచింది. ఆమె ఆట తీరును కొనియాడుతూ ఐసీసీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించింది. టేక్ ఏ బౌ అంటూ ప్రశంసించింది. Match-winning knocks, brisk starts and some memorable moments ✨ Take a bow, Tammy Beaumont 🙇 More 👉 https://t.co/Q32mIXUBoQ pic.twitter.com/uB6dRWKMeU — ICC (@ICC) January 23, 2022 -
టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన
దుబాయ్: అంతర్జాతీయ టి20ల్లో ఓవర్‌రేట్ ఇటీవల చాలా సమస్యగా మారిపోయింది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, జరిమానాలు విధించినా జట్లు ఓవర్లు పూర్తి చేసేందుకు నిర్ణీత షెడ్యూల్‌కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో వ్యూహ ప్రతివ్యూహల కోసం సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో ఇది మారడం లేదు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. జరిమానాలకంటే ఆ తప్పునకు మైదానంలోనే శిక్ష విధించాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తారు. ఇప్పటి వరకు ఐదు మందికి అవకాశం ఉండగా నలుగురినే అనుమతిస్తారు. కీలక సమయంలో బౌండరీ వద్ద ఒక ఫీల్డర్ తగ్గడం స్కోరింగ్‌పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జట్లు ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాయని ఐసీసీ భావిస్తోంది. సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్ కోత పడుతుంది. అయితే చివరి ఓవర్‌ను 85వ నిమిషంలోనే ప్రారంభిస్తే ఆ ఓవర్ కాస్త ఆలస్యంగా సాగినా చర్యలు ఉండవు. మూడో అంపైర్ ఈ టైమింగ్‌ను పర్యవేక్షిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగితే మాత్రం దానికి అనుగుణంగా సమయాన్ని సరి చేస్తారు. టి20 ఇన్నింగ్స్ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన. ఈ నెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
క్రికెట్ అభిమానులకు చేదు వార్త..
జెనీవా: విశ్వవేదికపై జెంటిల్మెన్ గేమ్‌ను చూడాలని ఆశించిన క్రికెట్ అభిమానుల ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లు చల్లింది. 2028 లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల కోసం ఐఓసీ ప్రకటించిన 28 క్రీడల జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. క్రికెట్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, ఆధునిక పెంటాథ్లాన్లకు చోటు కల్పించని ఐఓసీ.. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్కోర్ట్ క్లైంబింగ్ వంటి పలు క్రీడలకు కొత్తగా అవకాశం కల్పించింది. కాగా, విశ్వక్రీడల్లో క్రికెట్‌కు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే.1900 పారిస్ గేమ్స్‌లో క్రికెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ సమాఖ్యల్లో నెలకొన్న అవినీతి, డోపింగ్ పరిస్థితుల కారణంగా ఆ రెండు క్రీడలపై ఐఓసీ వేటు వేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఆ రెండు క్రీడలను ప్రాధమిక జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రవేశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఐఓసీ నుంచి ప్రాధమిక క్రీడల జాబితా వెలువడినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. చదవండి: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కేసులు.. -
Sourav Ganguly: కుంబ్లే స్థానంలో గంగూలీ.. ఇంతకీ ఆ కమిటీ ఏం చేస్తుంది?
BCCI president Sourav Ganguly replaces Anil Kumble as chairman of ICC Men’s Cricket Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త బాస్‌గా గంగూలీ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా సుదీర్ఘకాలంలో ఈ పదవిలో కొనసాగుతున్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో ఐసీసీ ఈ మేరకు అతడి స్థానాన్ని గంగూలీతో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా టీమిండియా సారథిగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీకి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా ఆటగాడిగానే కాకుండా... క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా తొలుత సేవలు అందించిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలు అందించనున్నాడు. ఈ కమిటీ ఏం చేస్తుంది... ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ)కి ఇది సబ్–కమిటీ. క్రికెట్ ఆట విషయాలను చర్చిస్తుంది. అంపైర్లు, రిఫరీల నిర్ణయాలు, ఆటలో సాంకేతికత వినియోగం, శాశ్వత హోదా దరఖాస్తులు, అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్లపై వచ్చే ఫిర్యాదుల్ని సమీక్షించి సీఈసీకి సిఫార్సు చేస్తుంది. చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్! Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్ కావడమే ఎంతో సంతోషం! -
ICC 2024-2031 Venues: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్.. మూడు ఇండియాలో
ICC Announces Venues For Upcoming Events From 2024 To 2031.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు.. రెండు చాంపియన్స్ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఐసీసీ మేజర్ టోర్నీలకు ఎనిమిది దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో ఒక టోర్నీకి అమెరికా- వెస్టిండీస్, మరొక టోర్నీకి పాకిస్తాన్, మూడు మేజర్ టోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ►జూన్ 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్నాయి. ►2025 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది ►2026 ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత్,శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి ►2027 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి. ►2028 అక్టోబర్ నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ►2029 అక్టోబర్ నెలలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ►2030 జూన్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ►2031 అక్టోబర్- నవంబర్ నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇండియా, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో జయవర్ధనే, పొలాక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. -
Joe Root: ‘నంబర్‌వన్’ రూట్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (901 రేటింగ్ పాయింట్లు)ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (916 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. రూట్ 2015 డిసెంబర్ తర్వాత మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. మరోవైపు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి (6వ ర్యాంక్)ను వెనక్కి నెట్టాడు. 2017 నవంబర్ తర్వాత భారత్ నుంచి మరో బ్యాట్స్‌మన్ కోహ్లికంటే మెరుగైన ర్యాంక్‌లో ఉండటం ఇదే మొదటిసారి. -
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
దుబాయ్: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను కూడా చూడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒలింపిక్స్‌లో జెంటిల్మెన్ గేమ్ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ‘విశ్వవ్యాప్తమైన మా క్రికెట్‌ను ఒలింపిక్ విశ్వక్రీడల్లోనూ చూడాలనుకుంటున్నాం. క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ఇందులో 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్నారు’ అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఒక తెలిపారు. బర్మింగ్‌హాంలో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చారు. కాగా ఈ క్రీడల్లో క్రికెట్ 1998లో ఒకసారి ఆడించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఇయాన్ వాట్మోర్ నేతృత్వంలో ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ పనిచేస్తుంది. ఇందులో ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ ఇంద్రనూయి, తవెంగ్వా ముకులని (జింబాబ్వే), మహీంద్ర వల్లిపురం (ఆసియా క్రికెట్ మం డలి), పరాగ్ మరాఠే (అమెరికా) సభ్యులుగా ఉన్నారు. నిజానికి ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చేందుకు బీసీసీఐ ఇన్నాళ్లు ససేమిరా అనడంతో అడుగు ముందుకు పడలేదు. ఒలింపిక్ సంఘం గొడుకు కిందికి వస్తే తమ స్వయం ప్రతిపత్తికి ఎక్కడ ఎసరు వస్తుందని బీసీసీఐ భావించింది. కానీ ఇటీవల బీసీసీఐ కార్య దర్శి జై షా సుముఖత వ్యక్తం చేయడంతో ఐసీసీ చకచకా పావులు కదుపుతోంది. చదవండి: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన కివీస్.. ఇద్దరు సీనియర్లు ఔట్ -
టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న భారత్, పాక్ మ్యాచ్!
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 24న (ఆదివారం) జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను రూపొందించింది. దాయాది సమరాన్ని ఆదివారం జరిపితే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. టి20 షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్లతో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా గ్రూప్‌లో చేరుతాయి. -
17 కోట్ల 70 లక్షల మంది చూశారు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా గత నెలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను కోట్ల మంది తిలకించారు. జూన్‌లో జరిగిన ఫైనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల 70 లక్షల మంది టీవీల్లో వీక్షించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీలో జరిగిన అన్ని సిరీస్‌ల్లో కంటే ఫైనల్ పోరునే ఎక్కువ మంది చూసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇందులో సింహభాగం భారత ప్రేక్షకులే ఉన్నట్లు ఐసీసీ తెలిపింది. -
కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ర్యాంక్‌లు యథాతథం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ర్యాంకుల్లో ఎటువంటి మార్పు జరగలేదు. 848 రేటింగ్స్‌తో కోహ్లి రెండో స్థానంలో ఉండగా... 817 రేటింగ్స్‌తో రోహిత్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఈ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో ఉన్నాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో అర్ధ శతకంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన శిఖర్ ధావన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు పైకి ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి బుమ్రా (6వ ర్యాంక్) మాత్రమే టాప్–10లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు. -
WTC 2023: షెడ్యూల్, కొత్త పాయింట్ల విధానం ఇదే
దుబాయ్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. సిరీస్ లెంత్‌తో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా పాయింట్ల శాతం ఆధారంగా ఆయా జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీని కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. సిరీస్‌లోని మ్యాచ్‌ల ఆధారంగా కేటాయించే పాయింట్లు 2 మ్యాచ్‌ల సిరీస్- 24 పాయింట్లు 3 మ్యాచ్‌ల సిరీస్- 36 పాయింట్లు 4 మ్యాచ్‌ల సిరీస్- 48 పాయింట్లు 5 మ్యాచ్‌ల సిరీస్- 60 పాయింట్లు -
భారత మహిళా క్రికెట్ జట్టుకు షాక్.. భారీ జరిమానా
లండన్: భారత మహిళల జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జరిమానా విధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయానికి అనుగుణంగా బౌలింగ్ చేయడంలో విఫలమైనందున మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1 సమమైంది. ఇక రెండో టీ20లో కీలకమైన బీమాంట్ వికెట్‌ను తీసిన భారత వుమెన్ క్రికెటర్ దీప్తి శర్మ (1/18)ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన భారత మహిళల జట్టు జరిమానా బారిన పడింది. -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్: గంగూలీ
కరోనా నేపథ్యంలో టి20 ప్రపంచకప్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ప్రపంచకప్ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. తుది షెడ్యూల్, ఇతరత్రా విషయాలన్నీ త్వరలోనే వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పారు. -
ICC T20 World Cup 2021: ప్రపంచకప్ తరలిపోయినట్లే
న్యూఢిల్లీ: భారత్‌లో టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ జూన్ 28 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే గడువు ఇచ్చింది. అయితే చివరి తేదీకి చాలా ముందే భారత క్రికెట్ బోర్డు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగాల్సిన ఈ టోర్నీని తాము నిర్వహించలేమని ఐసీసీకి బీసీసీఐ ఇప్పటికే చెప్పేసినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా... అంతర్గతంగా తమ పరిస్థితిని వారికి బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉంచుకుంటూ యూఏఈ, ఒమన్లలో వరల్డ్‌కప్ జరిపితే తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నిజాయితీగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షా 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇది తక్కువ కావచ్చు. కానీ మూడో వేవ్ గురించి గానీ... అక్టోబర్–నవంబర్లలో ఏం జరగవచ్చనేది జూన్ 28న అంచనా వేయడం చాలా కష్టం. ఎనిమిది టీమ్‌ల ఐపీఎల్‌నే తరలించినప్పుడు 16 జట్ల ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తాం. ఐపీఎల్ తరలింపునకు వర్షాలు కారణం కాదనేది అందరికీ తెలుసు. అది సుమారు రూ.2,500 కోట్ల ఆదాయానికి సంబంధించిన విషయం. అయినా ప్రపంచకప్ ఆడేందుకు ఎంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్ రావడానికి ఇష్టపడతారు అనేది కూడా కీలకం కదా’ అని బీసీసీఐలో కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ప్రపంచకప్ అంటే ఐపీఎల్ లాంటిది కాదని... ఏదైనా ఒక అసోసియేట్ జట్టులో పొరపాటున కొందరికి కరోనా సోకితే ఇక ఆ జట్టు ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండదని టోర్నీలో పాల్గొనబోయే ఒక అసోసియేట్ టీమ్‌కు చెందిన ఆటగాడు అభిప్రాయపడ్డాడు. మస్కట్లోనూ మ్యాచ్‌లు... వరల్డ్‌కప్ కోసం యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలతో పాటు అదనంగా పక్కనే ఉన్న ఒమన్ రాజధాని మస్కట్లోనూ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. 31 ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కారణంగా యూఏఈలో పిచ్‌లు పూర్తిగా జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో అవి సాధారణ స్థితికి వచ్చేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరం. ఆ సమయంలో వరల్డ్‌కప్ ఆరంభ రౌండ్ల మ్యాచ్‌లు మస్కట్‌లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాత వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. -
ఎఫ్‌టీపీపై చర్చకే పరిమితం!
దుబాయ్: భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల నిర్వహణ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్–ఎఫ్టీపీ), క్రికెట్‌ను మరిన్ని దేశాల్లో అభివృద్ధి చేసే అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు నేడు సమావేశం కానుంది. టి20 ప్రపంచ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే ముందు తమకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరిన నేపథ్యంలో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. జూలై 1 తర్వాత బీసీసీఐ వరల్డ్ కప్ విషయంలో స్పష్టతనిచ్చిన తర్వాతే ఐసీసీ స్పందించే అవకాశం ఉంది. కాబట్టి జూలై 18 నుంచి జరిగే ఐసీసీ తదుపరి సమావేశంలోనే వరల్డ్ కప్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇతర అంశాలే అజెండాగా ఐసీసీ సమావేశం సాగవచ్చు. 2023–2031 మధ్య ఎనిమిది సంవత్సరాల కాలంలో నిర్వహించబోయే ఐసీసీ టోర్నీలతో పాటు తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ జరుగుతుంది. క్రికెట్‌ను కనీసం 104 దేశాలకు విస్తరించాలని భావిస్తున్న ఐసీసీ... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా మహిళల క్రికెట్‌ను చేర్చేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించనుంది. -
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్‌మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్‌లో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్‌లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్‌కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే ముందు బ్యాట్స్‌మన్ షాట్‌కు ప్రయత్నించాడా అనే అంపైర్‌ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
WTC Final: అవసరమైతే ‘ఆరో రోజు’...
దుబాయ్: ఐదు రోజులు సాగే ఒక పూర్తి టెస్టు మ్యాచ్‌లో కనీసం 30 గంటల ఆట సాగాలి లేదా 450 ఓవర్లు పడాలి. ఇంత జరిగాక కూడా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఫలితం రాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే ఎలా? విజేత ఎవరు? ఇలాంటి సందేహం సాధారణ అభిమానికి వస్తే తప్పు లేదు. కానీ మ్యాచ్ నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వద్దనే దీనిపై సమాచారం లేదు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా ‘ఫైనల్’ నిబంధనల విషయంలో ఐసీసీకి ఇంకా స్పష్టత రాలేదు. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే ఎలా అనేదానిపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారి డబ్ల్యూటీసీ ప్రకటించిన సమయంలో ఇలాంటి పలు సందేహాలకు సమాధానమిచ్చిన ఐసీసీ... మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఐసీసీ వెబ్సైట్ నుంచి ఇవన్నీ తొలగించారు. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని కొన్ని సూచనలు వచ్చాయి. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచన. అయితే గంటల లెక్కను చూస్తే స్లో ఓవర్ రేట్ సమస్య రావచ్చు కాబట్టి 450 ఓవర్లకంటే తక్కువ పడితే రిజర్వ్ డేను కొనసాగించాలనేది మరో ఆలోచన. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు అసలు రాబోయే రోజుల్లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కొనసాగుతుందా అనే అంశంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. అనుకున్న స్థాయిలో డబ్ల్యూటీసీ విజయవంతం కాలేదని, ఫార్మాట్, పాయింట్ల కేటాయింపు విధానంపై బాగా విమర్శలు వచ్చాయని పలువురు సభ్యులు భావిస్తున్నారు. పైగా ఏడాదిపాటు కరోనా కారణంగా షెడ్యూల్ మొత్తం దెబ్బతింది. దాంతో దీనిపై జూన్ 1న జరిగే ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
ICC Test Rankings: భారత్‌దే అగ్రస్థానం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 120 రేటింగ్‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ (109 రేటింగ్) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్‌ను కేటాయించింది. ఇందులో భారత్ 24 మ్యాచ్‌ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్ 18 మ్యాచ్‌ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. -
ICC: గుణవర్ధనేకు గుడ్‌న్యూస్.. కానీ అతడికి మాత్రం!
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ అవిష్క గుణవర్ధనేపై వచ్చిన అవినీతి ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టివేసింది. ఐసీసీ ఆధ్వర్యంలోని అవినీతి వ్యతిరేక ట్రిబ్యునల్ గుణవర్ధనే ఎలాంటి తప్పూ చేయలేదని నిర్ధారించింది. ఇకపై గుణవర్ధనే క్రికెట్‌కు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. లంక తరఫున అతను 6 టెస్టులు, 61 వన్డేలు ఆడాడు. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2017లో జరిగిన టీ10 టోర్నమెంట్లో శ్రీలంక బౌలర్ నువాన్ జోయిసాతో కలిసి, అవిష్క మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐసీసీ ట్రిబ్యునల్ అతడిని నిర్దోషిగా తేల్చింది. ఇక లంక తరఫున 30 టెస్టులు, 95 వన్డేలు ఆడి బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల నువాన్‌పై నమోదైన నాలుగు అభియోగాలలో మూడింటిని కొట్టివేసిన ఐసీసీ.. విచారణకు సహకరించని కారణంగా అతడిపై ఆరేళ్ల నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై కూడా ఐసీసీ ఇటీవల ఎనిమిదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అతనిపై అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుదీర్ఘ నిషేధం విధిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: Virat Kohli: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కోహ్లి SRH: కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్ భారీ విరాళం -
ICC T20I Rankings: ఐదో స్థానంలో కోహ్లి, కేఎల్ రాహుల్ నం.7
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ కోహ్లి ర్యాంక్‌లో మార్పు లేదు. 762 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (743) తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రాణించిన పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్ పదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మలాన్ అగ్రస్థానంలో ఉండగా... ఫించ్ (ఆస్ట్రేలియా) రెండు, బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: పృథ్వీ షా అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌లను దాటేశాడు -
జింబాబ్వే కోచ్‌కు ఐసీసీ భారీ షాక్.. 8 ఏళ్ల నిషేధం
దుబాయ్: జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ప్రకటించారు. ఈ నిషేధ సమయంలో స్ట్రీక్ ఏ రకమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. 47 ఏళ్ల హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టుల్లో, 189 వన్డేల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టిన స్ట్రీక్ 2,943 పరుగులు సాధించాడు. ‘హీత్ స్ట్రీక్ ఎంతో అనుభవమున్న అంతర్జాతీయ మాజీ క్రికెటర్, జాతీయ జట్టు కోచ్. క్రికెట్లో అవినీతిని నిరోధించడం కోసం నిర్వహించిన ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో అతను పాల్గొన్నాడు. ఈ నిబంధనల ప్రకారం ఎంత బాధ్యతగా మెలగాలో కూడా అతనికి అవగాహన ఉంది. కానీ అతను ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు. 2016– 2018 మధ్యకాలంలో స్ట్రీక్ జింబాబ్వే జాతీయ జట్టుకు, వివిధ టి20 లీగ్‌లలో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొన్న ముక్కోణపు సిరీస్‌లో... 2018లో జింబాబ్వే–అఫ్గానిస్తాన్ సిరీస్‌లో... 2018 ఐపీఎల్లో... 2018 అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేశాడు. ఆటగాళ్లను బుకీలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించాడు. స్ట్రీక్ అంతర్గత సమాచారంతో ఆయా మ్యాచ్‌ల తుది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఐపీఎల్లో స్ట్రీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2029 మార్చి 28వ తేదీతో స్ట్రీక్‌పై ఎనిమిదేళ్ల నిషేధం ముగుస్తుంది. -
Umpire’s Call: ‘అంపైర్స్ కాల్’పై ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)లో తరచూ చర్చనీయాంశమవుతున్న ‘అంపైర్స్ కాల్’ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో తేల్చారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘క్రికెట్ కమిటీ ప్రధానంగా అంపైర్స్ కాల్‌పై చర్చించి విశ్లేషించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు. ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్ కాల్ తరచూ వివాదాస్పదమవుతోంది. బర్మింగ్‌హామ్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఐసీసీ... మహిళల వన్డే మ్యాచ్‌లు ‘టై’గా ముగిస్తే సూపర్ ఓవర్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. -
సీఈఓ సాహ్నిపై వేటుకు ఐసీసీ సిద్ధం!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో కలకలం రేగింది. ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మను సాహ్నిని సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. బోర్డులో ఎవరితోనూ కలుపుగోలుతనం లేని ఆయన నియంతృత్వ పోకడలతో అందరికి మింగుడు పడని ఉన్నతాధికారిగా తయారయ్యారు. సభ్యులే కాదు బోర్డు సహచరులు, కింది స్థాయి అధికారులు సైతం భరించలేనంత కరకుగా ప్రవర్తిస్తున్న ఆయన్ని ప్రస్తుతానికైతే సెలవుపై పంపించారు. రాజీనామా చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘రాజీ’పడకపోతే ఇక తొలగించడమైన చేస్తాం కానీ ఏమాత్రం కొనసాగించేందుకు సిద్ధంగా లేమని ఐసీసీ వర్గాలు, సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ అనంతరం డేవ్ రిచర్డ్సన్ స్థానంలో 56 ఏళ్ల సాహ్ని సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 2022 వరకు పదవిలో ఉండాల్సిన ఆయనకు అందరితోనూ చెడింది. ముక్కోపితత్వంతో వ్యవహరించే ఆయన శైలిపై విమర్శలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రముఖ సంస్థ ప్రైజ్ వాటర్‌హౌజ్ కూపర్ అంతర్గతంగా చేపట్టిన ఈ దర్యాప్తులో ప్రతీ ఒక్కరు సాహ్ని వ్యవహారశైలిని తులనాడినవారే ఉన్నారు... కానీ ఏ ఒక్కరు సమర్థించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఉన్నతాధికారుల బోర్డు ఆయన్ని మంగళవారమే సెలవుపై పంపింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సాహ్ని ఏకస్వామ్యంగా సాగిపోతున్నారు. సమష్టితత్వంతో, కలివిడిగా సాగాల్సివున్నా ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఐసీసీ విధాన నిర్ణయాల్లో సైతం తన మాటే నెగ్గించుకునే ప్రయత్నం చేశారు తప్ప... సహచరులు, సభ్యుల సూచనలకు విలువివ్వాలన్న స్పృహ కోల్పోయారు. సహచరులు, కింది స్థాయి ఉద్యోగులపై అయితే దుందుడుగా ప్రవర్తించేవారు. మధ్యే మార్గంగా సాగాల్సిన ఐసీసీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలోనూ ఇమ్రాన్ ఖాజా ఎన్నికయ్యేందుకు మొండిగా ప్రవర్తించారు. ఐసీసీలోని శాశ్వత సభ్యదేశాలే కాదు... మెజారిటీ అనుబంధ సభ్యదేశాల ప్రతినిధులకు ఇదేమాత్రం రుచించలేదు. ఐసీసీలోని ‘బిగ్–3’ సభ్యులైన బీసీసీఐ, ఈసీబీ, సీఏలు మను సాహ్నిని ఇక భరించలేమన్న నిర్ణయానికి రావడంతో సాగనంపక తప్పలేదు. గౌరవంగా రాజీనామా చేస్తే సరి లేదంటే ఐసీసీ తీర్మానం ద్వారా తొలగించడం అనివార్యమైంది. ఇందుకు ఐసీసీ బోర్డులోని 17 మంది సభ్యుల్లో 12 మంది మద్దతు అవసరమవుతుంది. -
ఐసీసీ సీఈవో మనూ సాహ్నీకి షాక్
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సీఈవో మను సాహ్నీని సెలవుపై పంపించారు. ఐసీసీలోని సభ్య దేశాలు, ఉద్యోగులతో ఆయన ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపిన ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్స్ తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో సాహ్నీ పదవీకాలం ముగియనుండగా.. ఆలోపే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ నుంచి బాధ్యతలు అందుకున్న సాహ్నీ.. అప్పటి నుంచి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీని కూడా శాసించగలిగే సామర్థ్యం ఉన్న బీసీసీఐ ఆయన తీరుపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ పదవికి న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేను ఈ బోర్డులు ప్రతిపాదించగా.. సాహ్నీ మాత్రం తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఐసీసీ ఒక టోర్నీ నిర్వహించాలన్న సాహ్నీ ప్రతిపాదన కూడా ఈ మూడు బోర్డులకు రుచించలేదు. దీంతో సాహ్నీ తీరుపై ఈ మూడు పెద్ద బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను సెలవుపై పంపించింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్ 'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి' -
‘ఫైనల్’ వేదిక మారింది!
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదికను అనూహ్యంగా మార్చాల్సి వచ్చింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి. స్టేడియం లోపలి భాగంలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండటంతో ‘బయో బబుల్’ ఏర్పాటు చేసేందుకు ఇది సరైన చోటుగా ఐసీసీ భావించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను మ్యాచ్ చూసేందుకు వెళ్లనున్నట్లు కూడా అతను వెల్లడించాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేను వెళుతున్నాను. విరాట్ కోహ్లి సారథ్యంలోని మన జట్టు విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్‌ను ఓడించగలదనే నమ్మకముంది. మనకంటే ముందే అక్కడికి చేరే న్యూజిలాండ్ రెండు టెస్టులు కూడా ఆడుతుంది’ అని గంగూలీ స్పష్టం చేశాడు. మే 30న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళుతుంది. ఐసీసీ ఇప్పటికే సదరు హోటల్ మొత్తాన్ని జూన్ 1 నుంచి 26 వరకు బుక్ చేసేసింది. అక్కడే టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది. టీమిండియాపై గంగూలీ ప్రశంసలు భారత జట్టు ఇటీవల సాధించిన విజయాల పట్ల గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్లుగా రహానే, కోహ్లి పనితీరును అభినందించాడు. యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ ఇలాం టి ఫలితాలు సాధించడం నిజంగా అద్భుతం. బ్రిస్బేన్‌లో విజయం గురించి ఎంత చెప్పినా తక్కు వే. బుమ్రా లేకుండా ఆ మ్యాచ్ గెలిచాం. నా దృష్టి లో సెహ్వాగ్, యువరాజ్, ధోని తరహాలో ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా పంత్‌లోనూ ఉంది. ఇక రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటంలో ద్రవి డ్ పాత్ర కూడా గొప్పది’ అని గంగూలీ అన్నాడు. -
ఫైనల్‌కు న్యూజిలాండ్
దుబాయ్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు మరో ‘ఫైనల్’ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కివీస్ అర్హత సాధించింది. కరోనా నేపథ్యంలో పలు టెస్టు సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా జట్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా కాకుండా... ఆడిన టెస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ దాని ద్వారా వచ్చిన పాయింట్ల శాతం ఆధారంగా ఐసీసీ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ పాయింట్ల శాతం 70 కాగా... ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడం కివీస్ జట్టుకు కలిసొచ్చింది. ఫలితంగా అందరికంటే ముందుగా ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత పొందింది. ఇతర జట్లలో ఒకరికి మాత్రమే కివీస్ పాయింట్ల శాతాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి విలియమ్సన్ సేన ఫైనల్ చేరడం ఖాయమైంది. ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఎవరు తలపడతారనేది భారత్–ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత అధికారికంగా ఖరారవుతుంది. అంకెలపరంగా చూస్తే పేరుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా పోటీలో ఉన్నా... ప్రస్తుత ఫామ్, వాస్తవికంగా చూస్తే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం దాదాపు ఖాయమే. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్ కనీసం 2–1తో గెలిచినా సరిపోతుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. జూన్ 23ను రిజర్వే డేగా కేటాయించారు. 2019 జులై 14న లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ‘బౌండరీ కౌంట్’ ద్వారా ఇంగ్లండ్ చేతిలో ఓడింది. మరో బెర్త్ కోసం మూడు జట్లు... భారత్: ప్రస్తుతం 71.7 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వెనక్కి నెట్టి భారత్ ఫైనల్ చేరాలంటే నాలుగు టెస్టుల ద్వారా మరో 70 పాయింట్లు రావాలి. అంటే కోహ్లి బృందం కనీసం 2–1 తేడాతో ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిస్తే చాలు. 3–0 లేదా 3–1 లేదా 4–0తో గెలిస్తే మరీ మంచిది. ఇంగ్లండ్: ప్రస్తుతం 68.7 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉంది. భారత్, ఆ్రస్టేలియా శాతాన్ని ఇంగ్లండ్ దాటాలంటే ఆ జట్టుకు మరో 87 పాయింట్లు కావాలి. అంటే కనీసం ఆ జట్టు భారత్‌పై 3 టెస్టులు గెలవాలి. అంటే 3–0 లేదా 4–0 లేదా 3–1తో టీమిండియాను ఓడించాలి. ఎలా చూసినా ఇది అసాధ్యమే! ఆస్ట్రేలియా: ప్రస్తుతం 69.2 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంకా బరి నుంచి పూర్తిగా తప్పుకోలేదు. జూన్‌లోపు ఎలాంటి టెస్టులు లేకపోవడంతో ఆస్ట్రేలియా శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఆసీస్ ముందుకెళ్లాలంటే మాత్రం భారత్ 1–0తో ఇంగ్లండ్‌పై గెలవాలి. లేదంటే ఇంగ్లండ్ 1–0 లేదా 2–0 లేదా 2–1తో సిరీస్ నెగ్గాలి. లేదంటే భారత్–ఇంగ్లండ్ సిరీస్ ‘డ్రా’ గా ముగియాలి (తేడాతో సంబంధం లేకుండా). అప్పుడే ఆ్రస్టేలియాకంటే భారత్, ఇంగ్లండ్ శాతం తక్కువ అవుతుంది. ఆసీస్ ఫైనల్‌కు చేరుతుంది. దక్షిణాఫ్రికాకు వెళ్లలేం... మెల్బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆ్రస్టేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే కారణమా... అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు. మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్మెంట్లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది. పాపం ఆసీస్! ఆ్రస్టేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆ్రస్టేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది. -
ఐసీసీ కీలక ప్రకటన.. ఇకపై ప్రతినెలా
దుబాయ్: అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతి నెలా 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ఓటింగ్ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. ఓట్ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) కాగా ఈ సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్ నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్‌తో పాటు రవిచంద్ర అశ్విన్ పేర్లను పరిశీలిస్తోంది. వీరితో పాటు జోరూట్(ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), మరిజన్నే కాప్(దక్షిణాఫ్రికా) పేర్లు కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి.(చదవండి: కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్) చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్ జట్టు న్యూఢిల్లీ: నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు చెన్నై చేరుకుంది. కరోనా నేపథ్యంలో నేటి నుంచి 6 రోజులపాటు క్రికెటర్లు క్వారంటైన్లో ఉండనున్నారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లండ్ తొలిటెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు. (చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) -
కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్ ప్లేయర్ లబ్‌షేన్ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్‌బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)... ఆల్‌రౌండర్ల కేటగిరీలో బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్డిండీస్), జడేజా (భారత్) వరుసగా టాప్–3లో ఉన్నారు. -
ఈ దశాబ్దపు మేటి క్రికెటర్ కోహ్లి
దుబాయ్: మన కోహ్లి మరో రెండు పురస్కారాలకి ఎంపికయ్యాడు. అలాగే ధోని కీర్తిలో ఇప్పుడు ‘క్రీడాస్ఫూర్తి’ చేరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన దశాబ్దపు మేటి సారథులుగా మన ఆటగాళ్లే (ధోని, కోహ్లి) నిలిచారు. ఇప్పుడు వ్యక్తిగతంగానూ మేటి క్రికెటర్లుగా ఎంపికయ్యారు. గత పదేళ్ల ప్రపంచ క్రికెట్లో పురుషుల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు) విరాట్ కోహ్లి అని ఐసీసీ ప్రకటించింది. ‘దశాబ్దపు వన్డే క్రికెటర్’ కూడా అతనే కావడం మరో విశేషం. ఈ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్లు)లో విరాట్ 66 సెంచరీలు సాధించాడు. అలాగే 94 ఫిఫ్టీలు ఉన్నాయి. 56.97 సగటుతో 20,396 పరుగులు చేశాడు. మొత్తం 70కి మించి ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో కోహ్లినే అగ్రగణ్యుడని ఈ గణాంకాల ద్వారా ఐసీసీ ప్రకటించింది. ఇందులో పోటీపడిన అశ్విన్, రూట్ (ఇంగ్లండ్), సంగక్కర (శ్రీలంక), స్మిత్ (ఆస్ట్రేలియా), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), కేన్ విలియమ్సన్ (కివీస్) అతని నిలకడ ముందు వెనుకబడ్డారు. ప్రత్యేకించి వన్డేల్లో 61.83 సగటుతో 12,040 పరుగులు, 39 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు చేయడం ద్వారా కోహ్లి ‘దశాబ్దపు వన్డే క్రికెటర్’గానూ ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలోనూ దశాబ్దపు క్రికెట్ జట్లలో ఉన్న ఏకైక ఆటగాడు కూడా కోహ్లినే! ఓవరాల్‌గా అతని కెరీర్లో 70 శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా స్టార్ స్మిత్ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్‌గా నిలిచారు. గత పదేళ్ల కాలంలో స్మిత్ 69 టెస్టులు ఆడి 65.79 సగటుతో 7,040 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. రషీద్ ఖాన్ 48 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు తీశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్ ద్వారా ఈ అవార్డీలను ఎంపిక చేశారు. ఈ ఓటింగ్‌లో 53 లక్షల మంది పాల్గొన్నారు. మహిళల్లో ఎలీస్ పెర్రీ బెస్ట్... మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అందుబాటులో ఉన్న మూడు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. 30 ఏళ్ల ఎలీస్ ఈ దశాబ్దపు ఉత్తమ మహిళా క్రికెటర్, ఉత్తమ వన్డే క్రికెటర్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఎంపికైంది. గత పదేళ్ల కాలంలో ఎలీస్ పెర్రీ 73 వన్డేలు ఆడి 2,621 పరుగులు చేసి 98 వికెట్లు తీసింది. 100 టి20 మ్యాచ్‌లు కూడా ఆడిన ఆమె 1,155 పరుగులు చేసి 89 వికెట్లు పడగొట్టింది. మరోవైపు ఆరు టెస్టుల్లో బరిలోకి దిగి 453 పరుగులు చేసింది. ఇందులో ఒక డబుల్ సెంచరీ, సెంచరీ, అర్ధ సెంచరీ ఉన్నాయి. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్ క్రీడలోనూ ఎలీస్ పెర్రీకి ప్రవేశం ఉంది. ఆమె ఆస్ట్రేలియా మహిళల ఫుట్‌బాల్ జట్టుకు 18 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి మూడు గోల్స్ కూడా చేసింది. -
ఐపీఎల్లో పది జట్లు
అహ్మదాబాద్: ఏటికేడు ఆదరణలో ఆకాశాన్ని తాకేందుకు పోటీపడుతున్న ఐపీఎల్‌ను మళ్లీ పది జట్లతో విస్తరించేందుకు బోర్డు అమోదం తెలిపింది. 2011లో లీగ్‌లో పది జట్లు ఆడాయి. కొచ్చి టస్కర్స్ కేరళ, పుణే సహారా వారియర్స్ జతకలిశాయి. కానీ మరుసటి ఏడాదికే కొచ్చి కథ ముగిసిపోగా తర్వాత 9 జట్లకు పరిమితమైంది. కొన్నేళ్ల తర్వాత పుణే తప్పుకోవడంతో తదనంతరం 8 జట్లతో ఐపీఎల్ స్థిరపడింది. అయితే మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా... 2022 నుంచి 10 జట్లతో నిర్వహించాలని ఏజీఎంలో నిర్ణయించారు. గురువారం ఇక్కడ జరిగిన 89వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలకాంశాలపై చర్చించిన బోర్డు ప్రపంచకప్ ఆతిథ్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదని... పన్ను మినహాయింపులకు మరో ప్రత్యామ్నాయం చూపింది. దేశవాళీ ఆటగాళ్లను ఆదుకోవాలని, మహిళల క్రికెట్లో మరిన్ని వయో విభాగం టోర్నీలను జతచేయాలని నిర్ణయించింది. బోర్డులో రాజీవ్ శుక్లా తిరిగి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఒలింపిక్స్‌కు సరే కానీ... ఒలింపిక్స్ ఆడితే ఐఓఏ గొడుగు కిందకు రావాలి... స్పోర్ట్స్ కోడ్‌ను అనుసరించాలి... ఇవన్నీ బోర్డు స్వయంప్రతిపత్తికి ఇబ్బందికరమని భావించిన బీసీసీఐ... విశ్వక్రీడల్లో టి20 క్రికెట్‌పై ఆసక్తి కనబరచలేదు. అయితే ఈ సమావేశంలో అనూహ్యంగా బోర్డు ఒలింపిక్స్‌కు జై కొడుతూనే... ఈ అంశంలో మాకు మరింత సమాచారం, స్పష్టత కావాలని ఐసీసీని కోరింది. అన్ని అనుమానాలు నివృత్తి అయితే ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అంతా బీసీసీఐ అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టి20 మెరుపుల్ని చూడొచ్చు. బోర్డు స్వతంత్రతకు భంగం కలగనంత వరకు ఒకే కానీ తప్పనిసరిగా ఐఓఏ ఆజమాయిషీలో ఉండాలంటే కుదరదని ఏజీఎంలో పాల్గొన్న రాష్ట్ర సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఐసీసీ ఆదాయం నుంచి... ప్రపంచకప్ ఆతిథ్య దేశం నుంచి పన్ను మినహాయింపులు కావాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పట్టుబడుతోంది. లేదంటే వేరే దేశానికి మెగా ఈవెంట్‌ను తరలించక తప్పదని చెప్పింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపారు. ఆతిథ్యం వదులుకోం... అలాగే ఐసీసీని నష్టపరచమనే విధంగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మినహాయింపు పొందితే సరే! లేదంటే ఏటా ఐసీసీ నుంచి భారత్‌కు వచ్చే 390 మిలియన్ డాలర్లు (రూ.2868 కోట్లు) ఆదాయ పంపిణీ నుంచి 123 మిలియన్ డాలర్లు (రూ. 904 కోట్లు) మినహాయించుకోవాలని ఏజీఎంలో నిర్ణయించారు. క్రికెటర్లకు పరిహారం కోవిడ్ మహమ్మారి వల్ల దేశవాళీ క్రికెట్ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కుర్రాళ్లకు ప్రతిభ కనబరిచే వేదిక లేక డీలా పడిపోయారు. మ్యాచ్ ఫీజుల రూపేణా ఆదాయాన్ని కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవాళీ క్రికెటర్లలో స్థైర్యాన్ని నింపేందుకు బోర్డు వారందరికీ పరిహారం ఇవ్వాల ని నిర్ణయించింది. మహిళా క్రికెటర్లకు కూడా ఈ మేరకు పరిహారం అందనుంది. అలాగే మహిళల క్రికెట్లో ఒకటి అరా టోర్నీలు కాకుండా సీనియర్, జూనియర్ స్థాయిల్లో మరిన్ని వయో విభాగం టోర్నమెంట్లు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. భారత సీనియర్ మహిళల జట్టుకు వచ్చే ఏడాది రెండు సిరీస్‌లను ఏర్పాటు చేశారు. 60 ఏళ్లదాకా అంపైరింగ్ బీసీసీఐ అంపైర్ల పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచారు. ఇప్పటిదాకా 55 ఏళ్ల వరకు అంపైర్లు, స్కోరర్లుగా పనిచేసి రిటైర్ అయ్యేవారు. ఇకపై వీరంతా 60 ఏళ్ల దాకా విధులు నిర్వహించవచ్చు. గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ కేవీపీ రావుపై బోర్డు వేటు వేసింది. కరోనా పరిస్థితుల్లో మూలన పడిన టోర్నీల విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించడంతో ఆయన్ని రాజీనామా చేయాల్సిందిగా బోర్డు ఆదేశించింది. -
ఐపీఎల్ జట్లు... టి20 ప్రపంచకప్... ఒలింపిక్స్!
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఐపీఎల్లో అదనపు జట్లు 2022 ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్‌తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు. పన్ను రాయితీలపై ఎలా? 2021లో భారత్‌లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్‌కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌కు నో 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్... ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్‌గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
ఇలా బౌల్ చేశామనుకుంటారు.. కానీ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోషల్ మీడియాలో షేర్ చేసిన మీమ్ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. బ్యాట్స్‌మెన్ బౌలింగ్ విధానం గురించి చేసిన చేసిన కంపేరెటివ్ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బ్యాట్స్‌మెన్ ఎలా బౌల్ చేయాలనుకుంటారు, వాస్తవానికి వాళ్ల బౌలింగ్ ఎలా ఉంటుంది అన్న పోలికతో ఈఫిల్ టవర్‌ను, ఎలక్ట్రిసిటి ట్రాన్స్మిషన్ టవర్ ఫొటోలను షేర్ చేసింది. అయితే కొంతమంది మాత్రం.. ‘‘ఐసీసీ ఇలా పనిచేయాలనుకుంటుంది, కానీ దాని పనితీరు ఇలా ఉంటుంది’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా లాక్డౌన్ వేళ ఐసీసీ పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన ఐసీసీ.. ‘హెయిర్ అప్రిసియేషన్ డే’ అంటూ కామెంట్‌ను జతచేసింది. ఇలాంటి మరెన్నో హిలేరియస్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతూనే తమ అప్డేట్స్ను పంచుకుంది. (చదవండి: ఆ టోర్నీ షెడ్యూల్లో మార్పులేదు: ఐసీసీ) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాశలో మునిగిపోయిన క్రికెట్ ప్రేమికులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే జింబాబ్వే పాకిస్తాన్లో పర్యటిస్తుండగా, త్వరలోనే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్ మొదలుకానుండటంతో రసవత్తర పోటీని వీక్షించేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. నవంబరు నుంచి జనవరి వరకు సాగే సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న జట్టు మ్యాచ్ సన్నాహకాల్లో మునిగిపోయింది. 3 వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా క్రికెట్‌కు ఆటంకం కలిగినా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జూన్‌లోనే దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు వరుస మ్యాచ్‌లు వీక్షించే అవకాశం లభించింది.(చదవండి: ఐపీఎల్ 2020: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) How batsmen think they bowl How batsmen bowl pic.twitter.com/SxUjEYRCJQ — ICC (@ICC) November 15, 2020 -
ఆటకు శామ్యూల్స్ టాటా
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనతోనే విండీస్ రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు కూడా లభించాయి. శామ్యూల్స్ కెరీర్లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో శామ్యూల్స్ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు. -
రైట్ ఆర్మ్ క్విక్ బౌలరా.. కోహ్లి ఏంటిది!
దుబాయ్ : విరాట్ కోహ్లి.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. కానీ ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన ఆర్సీబీ శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఎలాగైనా ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని ఆర్సీబీ భావిస్తుంది. (చదవండి : 'ప్లే ఆఫ్ ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తుంది') ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. ఐసీసీ తమ ట్విటర్లో ఒక వినూత్న వీడియోతో ముందుకొచ్చింది. ఇప్పటితరం మీ ఫేవరెట్ సూపర్‌స్టార్ ఆటగాళ్లు అండర్ 19 ప్రపంచకప్‌లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూడండి. అలాగే మీరు ఇష్టపడే ఆటగాడు ఎవరో కూడా చెప్పండి అంటూ పేర్కొంది. కాగా అప్పటి అండర్-19 టీమిండియా జట్టుకు అప్పటి యంగ్ విరాట్ కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా..' హాయ్ .. దిస్ ఈజ్ విరాట్ కోహ్లి.. కెప్టెన్.. రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. రైట్ ఆర్మ్ క్విక్ బౌలర్.. మై ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ హర్షలే గిబ్స్' అంటూ ముగించాడు. (చదవండి : ‘ఇండియా కంటే ఐపీఎల్ ఆడటమే ముఖ్యమా?!’) Remember how your favourite superstars looked like as teenagers? 👦 Presenting the 2008 U19 @cricketworldcup introductions 📽️ Which one’s your favourite? 😄 pic.twitter.com/Sk4wnu4BNs — ICC (@ICC) November 4, 2020 అయితే విరాట్ కోహ్లి బౌలింగ్ డిస్క్రిప్షన్పై నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. కోహ్లి తన బౌలింగ్ శైలిని రైట్ ఆర్మ్ బౌలర్ అని చెప్పాల్సింది పోయి.. రైట్ ఆర్మ్ క్విక్ బౌలర్ అని చెప్పడం ఏంటంటూ ట్రోల్ చేశారు. ఇలాంటి బౌలింగ్ శైలి కూడా ఉంటుందా.. ఏదైనా మా కోహ్లికే సాధ్యం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వీడియోలో ఇప్పటి ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు రవీంద్ర జడేజా(టీమిండియా), మనీష్ పాండే( టీమిండియా), కీరన్ పావెల్( వెస్టిండీస్), జేమ్స్ పాటిన్సన్(ఆస్ట్రేలియా), ఇమాద్ వసీమ్(పాకిస్తాన్), డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), వేన్ పార్నెల్(దక్షిణాఫ్రికా) తదితరులు తమను తాము పరిచయం చేసుకున్నారు. కాగా 2008 అండర్ 19 ప్రపంచకప్‌ను కోహ్లి సారధ్యంలోని టీమిండియా గెలుచుకుంది. ఈ ప్రదర్శనతోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లికి అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. (చదవండి : 'ధోని ఇంపాక్ట్ ఎంత అనేది అప్పుడు తెలిసింది') Right arm quick bowler 🙈🤣🤣@imVkohli 😍 pic.twitter.com/324SMTMKOA — Suman Singh (@Suman_Singh15) November 4, 2020 This man 😍😍😍 pic.twitter.com/bKlxxvKWRi — ABDULLAH NEAZ (@abdullah_neaz) November 4, 2020 -
షకీబుల్ హసన్‌కు ఊరట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌కు నేటితో ఊరట దక్కనుంది. అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్ముదుల్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల షకీబ్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా గతేడాది అక్టోబర్ 29న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. రెండు సంవత్సరాలలో ఒక ఏడాది క్రికెట్ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. నేటితో ఏడాది నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్ మళ్లీ క్రికెట్ మొదలుపెట్టే చాన్స్ ఉంది. -
ఐసీసీ చైర్మన్ బరిలో ఇద్దరే!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసు నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్), ఇమ్రాన్ ఖాజా (సింగపూర్)ల మధ్య పోటీ ఏర్పడింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇద్దరి నుంచే ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశముంది. కాగా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేకు బీసీసీఐ మద్దతు ఇస్తుంది. భారత బోర్డుతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా బార్క్లే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాక్ బోర్డు (పీసీబీ) సహా ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ ఇంద్ర నూయి, పలు బోర్డులు ఇమ్రాన్ ఖాజాకు మద్దతు పలుకుతున్నాయి. బార్క్లేకు ఐసీసీ శాశ్వత సభ్యదేశాల మద్దతు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో ఉండటం తో వారి ఓటు పరిగణించేది లేనిది ఇంకా స్పష్టమవ్వలేదు. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఇమ్రాన్ ఖాజానే తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎందుకనో ఈసారి ఐసీసీ స్పష్టమైన వైఖరి కాకుండా గోప్యత పాటిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ సాధారణ మెజారిటీతో ముగిస్తారా? లేదంటే 3/4 మెజారిటీతో నిర్వహిస్తారో చెప్పనే లేదు. ఐసీసీ అధికారిక వెబ్సైట్లో స్ట్రక్చర్ పేజీని ఉన్నపళంగా ఎందుకు మార్చారో తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెబుతున్నా... జాబితాను మాత్రం ప్రకటించడం లేదు. -
ప్రమాదంలో దక్షిణాఫ్రికా క్రికెట్!
కేప్‌టౌన్: బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) మరో ప్రమాదంలో పడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు క్రీడా మంత్రి నాతి మెథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో సీఎస్ఏకు సహకరించేందుకు పలుమార్లు సమావేశమైనప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదని మెథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సీఎస్ఏ పాలనలో స్థిరత్వం తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వారి నుంచి సహకారం అందలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక వారితో ఎటువంటి సంప్రదింపులు చేయదల్చుకోలేదు’ అని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా తమ వాదనలు వినిపించాలని క్రికెట్ అధికారులకు మెథ్వీ అక్టోబర్ 27 వరకు గడువునిచ్చారు. -
అక్టోబర్ 18 వరకు నామినేషన్లు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ పదవి కోసం నామినేషన్లు వేసేందుకు ఈ నెల 18ని తుది గడువుగా విధించింది. అయితే గతంలో ప్రతిష్టంభనకు కారణమైన కీలక నిబంధన విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఐసీసీ దీనిని ప్రకటించడం ఆసక్తికరం. ప్రస్తుతం ఐసీసీలో 17 మంది బోర్డు సభ్యులకు ఓటు హక్కు ఉంది. నిబంధనల ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే కనీసం 11 లేదా 12 మంది సభ్యుల మద్దతు అవసరం. కొన్ని దేశాలు మాత్రం సాధారణ మెజార్టీ ప్రకారం... అంటే ఎక్కువ మంది ఎవరికి మద్దతు పలికితే వారిని ఎంపిక చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏకగ్రీవం సాధ్యం కాకపోతే ఎన్నికను ఎలా నిర్వహిస్తారనేది చూడాలి. -
మెగ్ లానింగ్ మళ్లీ నంబర్‌వన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకిన మెగ్ లానింగ్ 749 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణించిన లానింగ్... సెంచరీతో సహా మొత్తం 163 పరుగులు చేసి సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది. నంబర్‌వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకోవడం లానింగ్‌కు ఇది ఐదోసారి. అంతేకాకుండా ఆమె టాప్ ర్యాంకులో 902 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. లానింగ్ తొలిసారి 2014లో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్, అలీసా హీలీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (732 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో... సారథి మిథాలీ రాజ్ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్పిన్నర్ జెస్సికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే, దీప్తి శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతుంది. భారత్ రెండో స్థానంలో ఉంది. -
ఐసీసీ సిబ్బందికి కరోనా
న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దుబాయ్‌లో ఉన్న ఈ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి కోవిడ్–19 పాజిటివ్ రావడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిబంధనల ప్రకారం కొన్ని రోజులు కార్యాలయం మూసి వేయనున్నారు. కార్యాలయ సిబ్బంది ఇంటి నుంచే పనిచేస్తారు. దుబాయ్‌లో ఉన్న ఆరు ఐపీఎల్ జట్లు ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే అకాడమీకి, ఐసీసీ కార్యాలయం మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సమాచారం. -
ఐసీసీలోనూ భారత్–పాక్ గొడవ
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌ను ఎంపిక చేసే విషయంపై సోమవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీనికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్ బోర్డుల మధ్య సయోధ్య లేకపోవడమేనని తెలిసింది. ఓటు హక్కు ఉన్న సభ్య దేశాల్లో మూడింట రెండొంతల మెజార్టీ ప్రకారం చైర్మన్‌ను ఎన్నుకోవాలని పాకిస్తాన్, దానికి మద్దతిస్తున్న దేశాలు చెబుతుండగా... ఎన్నికలు నిర్వహించాలని, సాధారణ మెజార్టీ ప్రకారమే ఎంపిక జరగాలని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్‌కు మద్దతునిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీలో 17 సభ్య దేశాలకు ఓట్లు ఉన్నాయి. పాక్ చెబుతున్నదాని ప్రకారం కనీసం 12 దేశాలు కొత్త చైర్మన్ కోసం మద్దతివ్వాల్సి ఉంటుంది. అదే ఎన్నిక జరిగితే గెలుపు కోసం 9 ఓట్లు చాలు. దురదృష్టవశాత్తూ ఏ పద్ధతి అనుసరించాలనేదానిపై ఐసీసీలోనే స్పష్టత లేకపోవడమే సమస్యగా మారింది. ‘ప్రస్తుతం ఇది భారత్, పాక్ మధ్య పోరుగా మారింది. దీనిపై ఏదో ఒక తీర్మానం చేసి త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు అభిప్రాయ పడ్డారు. ఈ అంశంపై మున్ముందు ఐసీసీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. -
ఏకాభిప్రాయం కుదర్లేదు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. చైర్మన్ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియను ఖరారు చేసే ఏకైక ఎజెండాతో సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. దాంతో చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణం. 17 మంది సభ్యులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వెల్లడించారు. చైర్మన్ పదవి కోసం తాను బరిలో ఉన్నానా లేదా అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఈ పదవిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొలిన్ గ్రేవ్స్ (ఇంగ్లండ్), డేవ్ కామెరాన్ (వెస్టిండీస్)లకు కొందరినుంచి మద్దతు లభిస్తున్నా... వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య కూడా అలాగే ఉంది. చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తే సభ్య దేశాల మధ్య అనవసరపు భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని... అలా జరగకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోందనేది సమాచారం. -
భారత్‌లోనా...ఆస్ట్రేలియాలోనా...
దుబాయ్: కరోనా కారణంగా వాయిదా పడిన టి20 ప్రపంచకప్‌లను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాటి వేదికలను మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పుడు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు ఐసీసీ ఉన్నతస్థాయి అధికారుల బృందం సమావేశమవుతోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 2021, 2022లలో రెండు టి20 వరల్డ్ కప్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే దేనిని ఎవరు నిర్వహించాలనేదానిపై స్పష్టత రాలేదు. తమ దేశంలో జరగాల్సిన 2020 టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది అవకాశం తమకే ఇవ్వాలని ఆస్ట్రేలియా కోరుతుండగా... పాత షెడ్యూల్ ప్రకారం 2021 టి20 ప్రపంచకప్ అవకాశం తమకే ఇచ్చి 2022 కోసం ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాలని భారత్ వాదిస్తోంది. 2023లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉన్నందున సంవత్సరం వ్యవధిలో రెండు మెగా ఈవెంట్ల నిర్వహణ సమస్యలతో బీసీసీఐ తమ వాదనను ఐసీసీ ముందు ఉంచుతోంది. వరుసగా రెండేళ్లు రెండు పెద్ద టోర్నీల ఆతిథ్యం ఏమాత్రం బాగుండవని, ప్రేక్షకుల ఆసక్తే తగ్గడమే కాదు... బోర్డు నిర్వహణా శక్తికి కత్తిమీద సాములాంటిదేనని బీసీసీఐ చెబుతోంది. -
'ఫ్రీ బాల్ అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలి'
ముంబై : క్రికెట్లో ఫ్రీ బాల్ నిబంధన తేవాల్సిన అవసరముందని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బౌలర్ బంతిని వదిలే లోపలే నాన్ స్ట్రయికర్క్రీజును వదిలి ముందుకు వెళితే పరుగు పూర్తి చేసేందుకు అనుమతించకూడదని సూచించాడు.అలా కాకుంటే తర్వాతి బంతిని ఫ్రీబాల్గా ప్రకటించేలా నిబంధన తేవాలని పేర్కొన్నాడు. దీనర్థం ఏంటంటే ఒకవేళ ఫ్రీబాల్‌కు పరుగు చేసినా అది లెక్కలోకి రాదని అశ్విన్ వెల్లడించాడు.(ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..) దీనిపై అశ్విన్ వరుస ట్వీట్లను సంధించాడు. 'ఒకవేళ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ రెండు అడుగులు ముందుకు వెళ్లి.. దానివల్లే రెండు పరుగులు పూర్తి చేయగలిగితే మళ్లీ అదే బ్యాట్స్‌మన్ స్ట్రయికింగ్‌కు వస్తాడు. ఆ తర్వాతి బంతికి అతడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే ఐదు లేదా ఏడు పరుగులు సమర్పించుకున్నట్టే. ఒకవేళ ఒక పరుగే వస్తే.. కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రయిక్‌లోకి వచ్చి డాట్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ నాన్ స్ట్రయికర్ ముందుకు వెళితే రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉంటుంది కదా అని యూజర్ అడిగిన ప్రశ్నకి అశ్విన్ స్పందించాడు. ' ముందుకు వెళ్లడాన్ని అనుమతించకపోయే బదులు.. ఆ తర్వాతి బంతిని బౌలర్‌కు ఫ్రీబాల్గా ఇవ్వాలి. ఇదే కాస్త న్యాయంగా ఉంటుంది' అని అశ్విన్ సమాధానమిచ్చాడు. కాగా గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ మన్కడింగ్ విధానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను అవుడ్ చేయడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్నోబాల్ నిర్ణయాన్ని ఐసీసీ థర్డ్ అంపైర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఫ్రీ బాల్ నిబంధనను తెర మీదకు తీసుకువచ్చాడు. -
టెస్టు చాంపియన్‌షిప్ వాయిదా తప్పదేమో
న్యూఢిల్లీ: కరోనాతో టెస్టు చాంపియన్ ఎవరనేది వచ్చే ఏడాది తేలకపోవచ్చు. టి20 ప్రపంచకప్‌పైనే కాదు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)పైనా వైరస్ ప్రభావం పడింది. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ అన్నారు. మహమ్మారి వల్ల పలు దేశాల మధ్య టెస్టు సిరీస్‌లు జరగకపోవడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. ‘ఇప్పటికే చాలా సిరీస్‌లు వాయిదా పడ్డాయి... ముందు ముందు ఇంకెన్ని సిరీస్‌లపై దీని ప్రభావం వుంటుందో చెప్పలేం. ఏదేమైనా ఈ సిరీస్‌ల రీషెడ్యూలుపైనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆధారపడింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌లో ఫైనల్ కష్టమే’ అని అలార్డీస్ అన్నారు. -
‘వరల్డ్ కప్ సూపర్ లీగ్’ వచ్చేసింది...
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తరహాలో వన్డేల్లో కూడా పాయింట్ల పద్ధతిలో టోర్నీ తీసుకురావాలని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తోంది. గతంలోనే ప్రకటించి కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గినా... ఇప్పుడు టోర్నీ జరగడం ఖాయమైంది. ఈ నెల 30నుంచి ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ ’ పేరుతో జరిగే ఈ ఈవెంట్... టి20ల మెరుపులతో ప్రభ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా నిలబెట్టగలదని ఐసీసీ ఆశిస్తోంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిర్వహణపై సందేహాలు ఉండటంతో కొంత కాలం క్రితం ఈ టోర్నీపై ప్రణాళిక రూపొందించి కూడా ఐసీసీ వెనక్కి తగ్గింది. కోవిడ్–19 నేపథ్యంలో పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. అయితే 2023 ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ అక్టోబర్–నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. టోర్నీ ఎప్పటినుంచి... జూలై 30 నుంచి ఇంగ్లండ్–ఐర్లాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్ కప్ సూపర్ లీగ్ మొదలవుతుంది. ఇందులో భాగంగా జులై 30, ఆగస్టు 1, ఆగస్టు 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. పాల్గొనే జట్లు మొత్తం 13 టీమ్‌లు సూపర్ లీగ్‌లో ఆడతాయి. ర్యాంకింగ్ ప్రకారం టాప్–12 జట్లతో పాటు 2015–17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ 13వ జట్టు. టోర్నీ ఫార్మాట్ వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో (ఇంకా కటాఫ్ తేదీ ఖరారు కాలేదు) ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి. తర్వాత ఏమిటి... పాయింట్లపరంగా టాప్–7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్ టాప్–7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్ దక్కుతుంది. మిగిలిన జట్లు ఏం చేస్తాయి... నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్ జట్లతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్–2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. మూడో కంటికే ‘నోబాల్’ వన్డేలు, టి20ల్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రను మరింత తగ్గించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో అడుగు వేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఫ్రంట్ ఫుట్ నోబాల్‌లను పర్యవేక్షించే అ«ధికారం పూర్తిగా థర్డ్ అంపైర్లకే అప్పజెప్పారు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లే నో బాల్‌ను ప్రకటిస్తారు. అయితే కొన్నాళ్ల క్రితం భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో అదనంగా మూడో అంపైర్ కూడా ఒక కన్నేసి ఉంచేలా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సాంకేతికంగా అది సరైనదిగా అనిపించడంతో ఇప్పుడు పూర్తిగా ‘మూడో కంటి’కే ఈ నిర్ణయాధికారం కట్టబెట్టారు. ఇకపై ఫీల్డ్ అంపైర్లు ఫ్రంట్ ఫుట్ నోబాల్ ప్రకటించడానికి వీల్లేదు. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. -
2021లో 20–20 ప్రపంచకప్
అనూహ్యం ఏమీ లేదు. అంతా అనుకున్నదే జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా దెబ్బకు ఆటలు జరిగే అవకాశం లేని స్థితిలో ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీ అసాధ్యమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తేల్చేసింది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు కారణంగా ప్రభావం పడే మరో రెండు వరల్డ్‌కప్ తేదీలను కూడా ఐసీసీ కొత్తగా ప్రకటించింది. దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను నిరాశపరిచే వార్త. 2020 సంవత్సరంలో 20–20 వరల్డ్‌కప్‌ను వీక్షించే ఆనందం దూరమైనట్లే. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 ప్రపంచకప్ టోర్నీ వాయిదా పడింది. కరోనా దెబ్బకు అంతా తల్లడిల్లుతున్న దశలో ఒక మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీని సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక 2021లో ఇదే తేదీల్లో పొట్టి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నవంబర్ 14న ఫైనల్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 2021లోనే మరో టి20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉంది. దానిని ఇప్పుడు 2022కు వాయిదా వేశారు. 2023లో భారత్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్‌కప్ మాత్రం అదే ఏడాది కొత్త తేదీల్లో నిర్వహిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో... కరోనా వల్ల దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆస్ట్రేలియాలో కోవిడ్–19 కేసులు సోమవారం 12 వేలు దాటాయి. తీవ్రత తగ్గించేందుకు అక్కడ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. టోర్నీ నిర్వహణకు సహకరించడం కష్టమేనంటూ గతంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం పరోక్షంగా చెప్పగా... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా మే నెలలోనే తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయినా సరే ఐసీసీ వేచి చూసే ధోరణిని అవలంభించింది. గతంలో జరిగిన రెండు ఐసీసీ సమావేశాల్లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సాగదీసి చివరకు ఇప్పుడు ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్–వెస్టిండీస్ సిరీస్ తరహాలో బయో బబుల్ సెక్యూరిటీతో టోర్నీ జరపవచ్చా అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ద్వైపాక్షిక సిరీస్ వరకు ఏదోలా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నా... ఒక ఐసీసీ ఈవెంట్ విషయంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 16 జట్లను రెండు వారాల ముందు నుంచి ఐసోలేషన్‌లో ఉంచడం, ఇతర ఏర్పాట్లు, సౌకర్యాలు అందించడం అసాధ్యమని అర్థమైంది. భారత్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. పైగా ప్రేక్షకులు లేకుండా ప్రపంచకప్ జరపాలనే ఆలోచనను ఆస్ట్రేలియాలో అభిమానుల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు దాదాపు అందరూ వ్యతిరేకించారు. దాంతో ఈ ఏడాదికి వరల్డ్‌కప్ మాటను పక్కన పెట్టేయాలని ఐసీసీ అభిప్రాయానికి వచ్చింది. ఐపీఎల్ రెడీ... ఐసీసీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్న బీసీసీఐకి 2020లో ఐపీఎల్–13 సీజన్ కోసం మార్గం మరింత సుగమమైంది. వరల్డ్‌కప్ జరగాల్సిన తేదీల్లోనే లీగ్‌ను నిర్వహించే విధంగా బోర్డు ప్రణాళికలు రూపొందించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక యూఏఈ లేదా మరో వేదికను ఖరారు చేయడమే తరువాయి. శుక్రవారం జరిగిన బీసీసీఐ సమావేశంలో దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఎవరు నిర్వహిస్తారు...? ఐసీసీ 2020 టి20 ప్రపంచ కప్‌ను 2021లో... 2021లో జరగాల్సిన టోర్నీని 2022లో నిర్వహిస్తామని తేదీలతో సహా స్పష్టంగా ప్రకటించింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2023 వన్డే వరల్డ్‌కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. సంవత్సరం విషయంలో ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ తేదీలు మారాయి. భారత్‌లో ఫిబ్రవరి–మార్చి మధ్య ఈ టోర్నీ జరగాలి. అయితే రెండు ఐసీసీ టోర్నీల మధ్య ఉండాల్సిన కనీస అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నవంబరుకు మార్చారు. ఇది భారత్‌లోనే జరుగుతుందని స్పష్టతనిచ్చిన ఐసీసీ... రెండు టి20 వరల్డ్‌కప్‌ల విషయాన్ని మాత్రం దాటవేసింది. పాత షెడ్యూల్ ప్రకారం 2021లోనే టి20 ప్రపంచకప్ నిర్వహించాలని, అవసరమైతే ఆస్ట్రేలియా 2022లో నిర్వహించాలని భారత్ కోరుకుంటుండగా... ఆస్ట్రేలియా మాత్రం తమ వద్దనుంచి వాయిదా పడింది కాబట్టి వచ్చే టోర్నీ ఆతిథ్య బాధ్యత తమదేనని గట్టిగా చెబుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కూడా ఐసీసీ కూడా వేదిక విషయంలో తొందరపడదల్చుకోలేదు. కివీస్‌లోనే మహిళల వరల్డ్‌కప్... వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఐసీసీ తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే 2021లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతుందని స్పష్టం చేసింది. నామినేషన్లపై నిర్ణయం లేదు... శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంతో ఖాళీగా ఏర్పడ్డ ఐసీసీ ఇండిపెండెంట్ చైర్మన్ పదవి కోసం ఇంకా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాలేదు. సోమవారం నిర్వహించిన సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబోయే కొత్త ఐసీసీ చైర్మన్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయక కుదరపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. టోర్నీ పేరు తేదీలు ఫైనల్ వేదిక టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ 2021 నవంబర్ 14 ప్రకటించలేదు టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ 2022 నవంబర్ 13 ప్రకటించలేదు వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్–నవంబర్ 2023 నవంబర్ 26 భారత్ -
టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే
దుబాయ్: టి20 ప్రపంచకప్ వాయిదాపై అధికారిక ప్రకటన వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తమ కార్యాచరణ ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పకనే చెబుతోంది. మెగా ఈవెంట్ వాయిదాపై నేడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తుందని బోర్డు ఆశిస్తోంది. రెండు నెలలుగా పలుమార్లు సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండానే నాన్చుతూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆతిథ్య ఆస్ట్రేలియా తమ దేశం లో మెగా ఈవెంట్ నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసింది. దీంతో ఐసీసీ వాయిదా ప్రకటన తప్ప చేయగలిందేమీ లేదు. సోమవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయం వెలువడితే ఆ మెగా ఈవెంట్ షెడ్యూల్ సమయాన్ని ఐపీఎల్–13కు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ ప్రణాళికతో ఉంది. కుదించైనా నిర్వహించాలనేదే లక్ష్యం... షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆసీస్‌లో ప్రపంచకప్ ఈవెంట్ జరగాలి. ఇప్పుడీ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పష్టంగా చెప్పాడు కూడా! ఈసారి ఐపీఎల్ విదేశాల్లోనే జరుగుతుందని ‘దాదా’ ఇదివరకే స్పష్టతనిచ్చాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆసియా కప్ రద్దు ప్రకటనను ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఐపీఎల్ తంతు కోసమే! ఈసారి లీగ్ జరగకపోతే బోర్డుకు రూ. 4000 కోట్ల నష్టం వస్తుంది. వైరస్ ఉధృతి వల్లే బయట... దేశంలో రోజురోజుకీ వైరస్ విజృంభిస్తోంది. బీసీసీఐ సమావేశానికి ముందు రోజే 10 లక్షల మార్క్‌ను దాటింది. దీంతో భారత్‌లో లీగ్‌కు అవకాశమే లేదని గ్రహించిన బీసీసీఐ విదేశీ ఆతిథ్యంపై తెరవెనుక పనులు చకచకా చక్కబెట్టెస్తోంది. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘తొలి అడుగు ఆసియా కప్ వాయిదాతో పడింది. ఇక టి20 మెగా ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వస్తే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఐసీసీ ప్రకటన రావాలి’ అని అన్నారు. నేడు జరిగే ఐసీసీ సమావేశంలో స్వతంత్ర చైర్మన్ ఎన్నికపై కూడా చర్చించే అవకాశముంది. -
శశాంక్ భారత క్రికెట్‌ను దెబ్బతీశారు!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు వ్యవహరించిన శశాంక్ మనోహర్ భారత్ క్రికెట్‌ను బాగా దెబ్బతీశారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ దుయ్యబట్టారు. భారతీయుడై ఉండి తన గొప్పల కోసం మన బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకిగా పనిచేశారని ఆరోపించారు. తను ఎలాగూ మళ్లీ బీసీసీఐలో క్రీయాశీలం కాలేనని భావించే... చేయాల్సిన నష్టమంతా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ‘నేను కచ్చితంగా చెప్పగలను... శశాంక్ బీసీసీఐ ప్రతిష్టను భ్రష్టు పట్టించారు. పలుకుబడిని పాతాళానికి తీసుకెళ్లారు. బోర్డు, భారత ప్రయోజనాలకు పాతరేశారు. ఇలాంటి వ్యక్తి పదవి నుంచి దిగిపోవడం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అధికారికి సంతోషం కలిగించే అంశం. ఆయన భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసి ఒకప్పుడు ఐసీసీని శాసించే స్థితిలో ఉన్న బీసీసీఐని ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేశారు. చెప్పుకోలేనంత నష్టాలెన్నో చేసి అన్ని రకాలుగా బోర్డుకు కీడు తలపెట్టారు’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్ వ్యాఖ్యలతో మాజీ కార్యదర్శి నిరంజన్ షా కూడా ఏకీభవించారు. -
పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం వెల్లడించింది. శశాంక్ మనోహర్ వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు.. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా చైర్మన్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని మాట్లాడుతూ.. చైర్మన్‌గా తమను ముందుండి నడిపించిన శశాంక్ మనోహర్‌కు ఐసీసీ బోర్డు, సిబ్బంది, మొత్తం క్రికెట్ కుటుంబం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాన్నారు. మనోహర్ శశాంక్, ఆయన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా.. శశాంక్ సైతం మనోహర్‌పై ప్రశంసలు కురిపించారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అమోఘమని. ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. కాగా వారం రోజుల్లోగా శశాంక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసీబీ మాజీ చైర్మన్ కోలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చైర్మన్‌గా శశాంక్ ఎన్నికైన నాటి నుంచి బీసీసీఐకి ఐసీసీతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.(శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ ఆగ్రహం) -
‘ఎలైట్ ప్యానెల్’లో నితిన్
దుబాయ్: భారత అంపైర్ నితిన్ నరేంద్ర మేనన్‌కు అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అగ్రశ్రేణి అంపైర్ల జాబితా అయిన ‘ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్’లో ఆయనకు చోటు దక్కింది. భారత్ నుంచి గతంలో ఇద్దరు మాత్రమే ఎలైట్ ప్యానెల్ అంపైర్లుగా వ్యవహరించారు. శ్రీనివాసన్ వెంకట్రాఘవన్ (2002–04), సుందరం రవి (2010–19) గతంలో ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు చెందిన నైజేల్ లాంజ్ స్థానంలో 36 ఏళ్ల నితిన్ ప్యానెల్లోకి వచ్చారు. ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్, రంజన్ మదుగలే, డేవిడ్ బూన్, సంజయ్ మంజ్రేకర్‌ల బృందం నితిన్‌ను ఎంపిక చేసింది. 12 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఇప్పుడు అందరికంటే పిన్న వయస్కుడు నితిన్ కావడం విశేషం. ఇండోర్‌కు చెందిన నితిన్ మధ్యప్రదేశ్ జట్టు తరఫున 2 దేశవాళీ వన్డేలు ఆడారు. 2017లో అంతర్జాతీయ అంపైర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. తన మూడేళ్ల అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్లో ఆయన 3 టెస్టులు, 24 వన్డేలు, 16 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 10 మహిళల టి20 మ్యాచ్‌లకు కూడా పని చేశారు. ఏడాది కాలంగా ఆయన పనితీరు చాలా బాగుండటాన్ని ఐసీసీ గుర్తించింది. మరోవైపు అందరికంటే ఎక్కువగా 36.2 శాతం తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన నైజేల్ లాంజ్ చోటు కోల్పోవాల్సి వచ్చింది. తనకు ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నితిన్... మరింత సమర్థంగా పని చేసి అంపైరింగ్‌పై విశ్వాసం పెరిగేలా చేస్తానని అన్నారు. -
‘నల్లవారిని’ నిరోధించేందుకే...
సెయింట్ లూసియా: ప్రపంచ క్రికెట్లో నల్లజాతి ఫాస్ట్ బౌలర్లు తమ వేగంతో చెలరేగిపోతున్న సమయంలో వారిని అడ్డుకునేందుకే బౌన్సర్ల నిబంధనలో మార్పులు తెచ్చారని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ఇతర దేశాల పేసర్లు బౌన్సర్లు వేసినా ఎవరూ పట్టించుకోలేదని, నల్లవారిని మాత్రం కట్టి పడేశారని అతను పరోక్షంగా తమ విండీస్ జట్టు గురించి అన్నాడు. ప్రపంచ క్రికెట్‌పై వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలపాటు వారు తమ భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొట్టి ఆటపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత విండీస్ జోరు తగ్గింది. ‘ఒక ఓవర్‌కు ఒక బౌన్సర్ మాత్రమే’ అనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1991లో తీసుకొచ్చింది. యాదృచ్ఛికం కావచ్చు కానీ అప్పటినుంచే విండీస్ క్రికెట్ పతనం ప్రారంభమైంది. ‘ఫైర్ ఇన్ బేబీలాన్ డాక్యుమెంటరీని చూడండి. జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ తదితరులంతా కూడా బౌన్సర్లతో చెలరేగిపోయారు. అమిత వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ శరీరంపై దాడి చేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఆ తర్వాత నల్లవారి జట్టు అదే తరహా దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పుడే బౌన్సర్ల గురించి వారికి ఈ తరహా ఆలోచన వచ్చి ఉంటుంది. నల్ల జట్టును కట్టడి చేయాలనే కొత్త నిబంధన తెచ్చి ఉంటారు. నేను చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు గానీ నాకు మాత్రం అలాగే అనిపించింది’ అని స్యామీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
‘ఆయన కావాలనే చేస్తున్నారు’
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టి20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఆయనే కారణమని బీసీసీఐ భావిస్తోంది. భారత బోర్డు ఐపీఎల్ నిర్వహించుకోవడం లేదా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా కావాలనే మనోహర్ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టి20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు’ అని సదరు అధికారి అన్నారు. -
ఎటూ తేల్చలేదు
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఎటూ తేల్చలేకపోయింది. ప్రపంచకప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. టి20 ప్రపంచకప్‌తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్ కప్‌లను షెడ్యూల్ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది. కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పింది. ‘ప్రస్తుతం ఉన్న స్థితిలో క్రికెట్‌కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో క్రికెటర్లతో పాటు ఇందులో భాగస్వాములుగా ఉండే అనేక మందిని పరిగణలోకి తీసుకోవాలి. ఇంత కీలక అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఒకేసారి ఉంటుంది. కాబట్టి సభ్యులు, ప్రసారకర్తలు, ప్రభుత్వాలు, ఆటగాళ్లు అందరితో చర్చించిన తర్వాతే దానిని ప్రకటిస్తాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని స్పష్టం చేశారు. మరోవైపు ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ కోసం పన్నుల మినహాయింపునకు సంబంధించిన తమ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి డిసెంబర్ 2020 వరకు గడువు పొడిగించినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది. మహిళల ముక్కోణపు టోర్నీకి ఈసీబీ ప్రయత్నాలు సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రయత్నిస్తోంది. మహిళల ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోన్న ఈసీబీ... ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి, క్రికెట్ దక్షిణాఫ్రికాలతో సమాలోచనలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహిళల అంతర్జాతీయ పోటీలు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ అన్నారు. -
‘కరోనా సబ్‌స్టిట్యూట్’కు అనుమతి
దుబాయ్: కోవిడ్–19 నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించేందుకు చేసిన ప్రతిపాదనలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పచ్చ జెండా ఊపింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంగళవారం ప్రకటించింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే మైదానంలో మరికొన్ని సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అనిల్ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. మరోవైపు వచ్చే 12 నెలలపాటు ఆటగాళ్లు ధరించే దుస్తులకు సంబంధించి కూడా ఐసీసీ ఒక సడలింపు ఇచ్చింది. స్పాన్సర్షిప్కు సంబంధించి ఇప్పటికే అనుమతించిన మూడు లోగోలతో పాటు ఇకపై ఛాతీ భాగంలో కూడా అదనంగా 32 చదరపు అంగుళాలకు మించకుండా మరో లోగోను ప్రదర్శించుకునేందుకు వీలుంది. ఐసీసీ ఆమోదించిన ప్రధాన అంశాలను చూస్తే... 1. కోవిడ్–19 రీప్లేస్మెంట్ టెస్టు మ్యాచ్ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపిస్తే కన్కషన్ సబ్‌స్టిట్యూట్ తరహాలోనే అతని స్థానంలో మరొకరిని రిఫరీ అంగీకారంతో ఆడించుకోవచ్చు. అయితే ఈ నిబంధన వన్డే, టి20ల్లో వర్తించదు. 2. ఉమ్మి వాడకుండా నిషేధం ఏ బౌలర్ కూడా బంతి మెరుపు పెంచేందుకు సలైవాను వాడరాదు. ఆటగాళ్లు దీనికి అలవాటు పడే వరకు అంపైర్లు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఆ తర్వాత హెచ్చరించడం మొదలవుతుంది. రెండు హెచ్చరికల తర్వాత కూడా అదే చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. ఉమ్మి వాడినట్లు అంపైర్లు గుర్తిస్తే ఆ బంతిని వేసే ముందే తుడిచేయాలని వారు ఆదేశించగలరు. 3. తటస్థ అంపైర్లు రద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన తటస్థ అంపైర్లకు బాధ్యతలు ఇవ్వడం కష్టం కాబట్టి ఆయా క్రికెట్ బోర్డులకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ అంపైర్లే మ్యాచ్ విధులు నిర్వర్తిస్తారు. 4. అదనపు డీఆర్ఎస్ రివ్యూ స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉంటే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి అదనంగా మరో రివ్యూను ఇస్తారు. దీని ప్రకారం టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండుకు బదులుగా 3 రివ్యూలు ఉంటాయి. వన్డే, టి20ల్లో ఒకటినుంచి రెండుకు పెంచారు. టి20 ప్రపంచ కప్ జరిగేనా! ఆస్ట్రేలియా వేదికపై ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. నేడు జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. నిజానికి మే 28న జరిగిన సమావేశంలోనే ఈ అంశాన్ని తేల్చేస్తారని భావించినా... ఐసీసీ అజెండాలోని అన్ని అంశాలపై నిర్ణయాన్ని జూన్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచకప్ సాధ్యం కాకపోతే ఒక ఏడాది దానిని వాయిదా వేసి భారత్‌లో జరగాల్సిన 2021 వరల్డ్ కప్‌ను కూడా మరో సంవత్సరం వెనక్కి జరిపే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ప్రపంచకప్ జరిగే అవకాశం లేకపోతే అవే తేదీల్లో ఐపీఎల్‌ను నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒక సీనియర్ అధికారి స్పందిస్తూ ఐసీసీ ముందుగా దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తే ఆపై తాము ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్ పదవి గురించి కూడా ఈ సమావేశం ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త చైర్మన్ ఎంపిక కోసం నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అనేదానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు. శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసిపోగా... ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా రేసులో ఉన్నాడు. -
భిన్నత్వం లేకుంటే క్రికెట్టే లేదు: ఐసీసీ
దుబాయ్: పోలీసుల అకృత్యానికి బలైన నల్లజాతి అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ గొప్పతనాన్ని చాటిచెప్పేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులోని వైవిధ్యాన్ని ఈ వీడియో ప్రస్ఫుటం చేస్తోంది. వేర్వేరు జాతులకు చెందిన ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టు సమష్టిగా ఆడి గతేడాది న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్ కలను ఎలా సాకారం చేసుకుందో ఈ వీడియో చూపిస్తోంది. బార్బడోస్ మూలాలున్న జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన సూపర్ ఓవర్‌తో ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచకప్ అందించిన క్షణాలు ఈ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. దీనికి ‘భిన్నత్వం లేకుంటే క్రికెట్టే లేదు’ అనే వ్యాఖ్యను ఐసీసీ జోడించింది. వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్‌లో, టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌లో... స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లకు పాకిస్తాన్లో, ఓపెనర్ జేసన్ రాయ్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. వివక్షకు గురవుతోన్న నల్లజాతి క్రికెటర్లకు మద్దతుగా ఉండాలని వెస్టిండీస్ క్రికెటర్లు గేల్, స్యామీ ఇటీవలే ఐసీసీని కోరారు. -
టీ20 ప్రపంచకప్ వాయిదా? రేపు క్లారిటీ!
దుబాయ్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్‌లో జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఐసీసీ వర్గాలు అందించిన అనధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచకప్ నిర్వహణకు ఆసీస్ కరోనా నిబంధనలు ప్రతిబంధకంగా మారినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ పర్యాటక వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేయడం, సెప్టెంబర్ వరకు ఆసీస్‌లో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా కనిపించకపోవడం, ఆటగాళ్ల క్వారంటైన్ వంటి తదితర కారణాలతోనే ఈ మెగా టోర్నీ వాయిదా పడే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచశ్రేణి, మాజీ ఆటగాళ్లు సైతం ప్రస్తుత తరుణంలో ప్రపంచకప్ కంటే ఐపీఎల్ టోర్నీనే ఉత్తమమని సూచిస్తుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన గురువారం వెలువడే అవకాశం ఉంది. చదవండి: 'భజ్జీ ! మెల్లిగా.. బిల్డింగ్ షేక్ అవుతుంది' 'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు' T20 World Cup is likely to be postponed till 2022, no official announcement yet: ICC sources pic.twitter.com/NNkfceZsS2 — ANI (@ANI) May 27, 2020 -
‘ఐసీసీ ఆందోళన వారి గురించే’
దుబాయ్: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న వేళ క్రికెట్ పునరుద్దరించాలిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు వెంటనే మైదానంలోకి దిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేదానిపై ఐసీసీ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో బౌలర్ల గురించే ఐసీసీ ఆందోళన చెందుతోంది. ‘లాక్డౌన్ విరామంలో అనేక మంది ఆటగాళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామాలకే కొంత మంది ఆటగాళ్లు పరిమితమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి దిగితే గాయాలబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలర్ల గురించే మాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. ఈ విరామం తర్వాత బౌలర్లకు సరైన శిక్షణ లేకుండా క్రికెట్ ఆడితే గాయాలబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వారు టెస్టు క్రికెట్‌కు సంసిద్దం కావాలంటే కనీసం రెండుమూడు నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలంటే మూడు నుంచి నాలుగు వారాల సన్నాహక శిబిరాల్లో పాల్గొనాలి’ అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్, మైదానంలో భౌతిక దూరం, ఒకరి వస్తువులు మరొకరు వాడొద్దనే నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’ నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్ -
షెడ్యూల్ ప్రకారమే టి20 ప్రపంచకప్
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 తీవ్రత ఇంకా తగ్గకపోయినా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయం లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశాభావంతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 18 నుంచి) పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఇందులో చర్చ జరిగింది. ప్రధానంగా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో పాటు 2021లో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్ తేదీలను కూడా మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైందని ఐసీసీ వెల్లడించింది. అయితే 2023 వరకు నిర్దేశించిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ)లో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉందని ఐసీసీ పేర్కొంది. దీనిపై మళ్లీ సమీక్షించిన అనంతరం కోవిడ్–19 కారణంగా ఎంత క్రికెట్ నష్టపోయామో మళ్లీ అదంతా జరిగేలా ఐసీసీ ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను కొనసాగించాలా లేదా అనే అంశంతో పాటు ప్రతిపాదిత క్రికెట్ వరల్డ్ సూపర్ లీగ్‌ను మొదలు పెట్టాలా లేదా అనే అంశంపై కూడా తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని వ్యాఖ్యానించారు. -
క్రికెట్ ఎలా కొనసాగాలి!
దుబాయ్: మార్చి 13న సిడ్నీలో ప్రేక్షకులు లేకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. అంతే... ఆ తర్వాత కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. కొంత ఎక్కువ, కొంత తక్కువగా తేడా ఉన్నా... మొత్తంగా వివిధ క్రికెట్ బోర్డులకు ఆర్థికపరంగా భారీ దెబ్బ పడింది. కోవిడ్–19 తాజా పరిణామాల నేపథ్యంలో క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించి చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఆన్లైన్ ద్వారా గురువారం జరిగే ఈ భేటీలో 12 శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొంటారు. అర్ధంతరంగా ఆగిపోయిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కొనసాగింపు, వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రతిపాదిత వన్డే సూపర్ లీగ్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆగిపోయిన వివిధ సిరీస్‌ల కోసం కొత్త తేదీలు ఖరారు చేయడం లేదా రద్దుపై తగిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరీస్‌ల రద్దుతో ఆర్థికపరంగా వివిధ బోర్డులను ఆదుకునే విషయంపై కూడా మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణ అంశమే ప్రధాన ఎజెండా కావచ్చు. ‘కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను కాపాడుకోవడమే ప్రస్తుతం మా అందరి లక్ష్యం. కాబట్టి భేషజాల కోసం, సొంత బోర్డుల ఎజెండా కోసం మాత్రమే కాకుండా మళ్లీ క్రికెట్ జరిగి అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం కీలకం’ అని ఐసీసీ సీనియర్ అధికారొకరు వెల్లడించారు. -
సరైన సమయంలో చెబుతాం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే పొట్టి ప్రపంచకప్‌పై తొందరపడాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వ్యాఖ్యానించింది. కోవిడ్–19 రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన ఈవెంట్‌పై ఇప్పుడే నిర్ణయానికి రాలేమని... దీనికి చాలా సమయముందని, కాబట్టి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ‘ఐసీసీ ఈవెంట్ల కోసం మా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం కూడా బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ఆలోచించాల్సిన అవసరముంది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. -
వన్డే ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు అర్హత
దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2017 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయా జట్ల మధ్య జరగని సిరీస్‌లకు సంబంధించి అన్ని జట్లకు సమంగా పాయింట్లు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి నేరుగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో న్యూజిలాండ్ పాల్గొంటుంది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి. -
90 లక్షలు!
దుబాయ్: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్‌పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను భారత్‌లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్‌ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్‌ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. ఐఎస్ఎల్కు పెరిగిన వీక్షకులు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్ఎల్ (2019–20) సీజన్‌ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్‌తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్‌ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా ఈ సీజన్‌ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్‌స్టార్, జియో టీవీ డిజిటల్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్‌కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్‌సీను కోల్‌కతా ఓడించింది. -
ఐసీసీ చాలెంజ్: కోహ్లిని కనిపెట్టగలరా?
లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉండి బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విసిరిన ఛాలెంజ్‌పై ఓ లుక్కేయండి. క్రికెటర్ కేఎల్ రాహుల్ ఉన్న ఫోటో కొలైడ్లో విరాట్ కోహ్లిని గుర్తించగలరా అంటూ ఐసీసీ బుధవారం క్రికెట్ అభిమానులకు ఓ సరదా ఛాలెంజ్ విసిరింది. చూడగనే అసలు విరాట్‌కోహ్లీ ఫోటో ఇందులో ఉందా? ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారేమో అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే విరాట్ కోహ్లిని మీరు కనిపెట్టొచ్చు. ఐసీసీ బుధవారం ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇది తెగ వైరల్ అవుతుంది. మేం కనిపెట్టేశాం అంటూ ఇప్పటికే కొంత మంది అభిమానులు విరాట్ ఉన్న విజువల్‌ను గుర్తించగలిగారు. ఏంటీ... మీరు ఇంకా కనిపెట్టలేదా? చివరి నుంచి 3వ వరుసలో విరాట్ కోహ్లి ఫోటో ఉంది చూడండి. -
ప్రపంచ కప్ అర్హత టోర్నీలు వాయిదా
దుబాయ్: కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో జరిగే టి20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఈవెంట్లకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30లోపు జరగాల్సిన అన్ని అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో పాటు శ్రీలంక వేదికగా జరగాల్సిన 2021 మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను అనుకున్న తేదీల్లో జరపాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రిస్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఏప్రిల్‌లో ఆరంభం కావాల్సిన ట్రోఫీ టూర్‌ను కూడా ఐసీసీ వాయిదా వేసింది. -
‘నా ప్రయాణం ముగిసింది’.. దరిద్రం పోయింది
దుబాయ్: ఐసీసీ స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం వచ్చే ఏడాది మేతో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్న ఆయన మరోమారు ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు ప్రకటించారు. అయితే ఐసీసీ డైరెక్టర్లు మాత్రం శశాంక్ మనోహర్‌నే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై అతడు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఐసీసీ ఆగ్రపీఠాన్ని అధిష్టిస్తున్నానని మరో రెండేళ్లు కొనసాగలేనని డైరెక్టర్లకు తేల్చిచెప్పినట్లు మనోహర్ పేర్కొన్నారు. ‘మరో రెండేళ్లు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగడానికి సిద్దంగా లేను. అయితే మెజారిటీ డైరెక్టర్లు పదవిలో కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నారు. మే వరకే నేను ఆ పదవిలో కొనసాగుతాను. జూన్ తర్వాత ఐసీసీ చైర్మన్‌గా నేను ఉండదల్చుకోలేదని వారికి తేల్చిచెప్పాను. దీనిపై చాలా స్పష్టతతో ఉన్నాను. ఐసీసీ చైర్మన్‌గా నా ప్రయాణం వచ్చే ఏడాది మేతో ముగియనుంది’ అంటూ శశాంక్ మనోహర్ పేర్కొన్నారు. ఇక 2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పదవిని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు రెండు పర్యాయాలు శశాంక్ మనోహరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు కత్తెర వేశారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని శశాంక్ మనోహర్ సమూలంగా మార్చివేశారు. బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను రద్దుచేశారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దుచేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను కూడా భారీగా తగ్గించారు. దీంతో అప్పటివరకు ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించిన బీసీసీఐని ఏకాకి చేయడంలో శశాంక్ మనోహర్ కీలకపాత్ర పోషించారు. శశాంక్ మనోహర్ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టడం ప్రారంభించాయి. ఇక వచ్చే ఏడాది మేతో శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటం, మరలా కొనసాగేందుకు అతడు అయిష్టత వ్యక్తం చేస్తుండటం బీసీసీఐకి పరోక్షంగా ఎంతో లాభిస్తుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. బీసీసీఐకి పట్టిన దరిద్రం పోయిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి మంచి రోజులు రాబోతున్నాయని మరికొంత మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త చైర్మన్ ఎన్నిక వరకు దీనిపై స్పందించ కూడదని బీసీసీఐ భావిస్తోంది. -
భారత్-వెస్టిండీస్ సిరీస్‌లో కొత్త రూల్
హైదరాబాద్ : గత కొంత కాలంగా ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్‌ను గుర్తించడంలో పదేపదే విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్ అంపైర్‌కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది. భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌లలో దీనిని ట్రయల్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం జరిగే భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే తొలి టీ20 నుంచే ఈ కొత్త నిబంధనకు అంకురార్పణ జరగనుంది. ఈ సిరీస్‌లతో పాటు కొన్ని నెలలు ఈ నిబంధనను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ నిబంధన ప్రకారం థర్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ బాల్ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్‌అంపైర్‌తో చర్చించకుండా ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్ ఔటైన బంతి నోబాల్ అని థర్డ్ అంపైర్ ప్రకటిస్తే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే కొనసాగుతాయి’అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా నో బాల్స్ అంశంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 21 ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు. దీంతో అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తాయి. సెకన్ కాలంలో నోబాల్, బాల్ లెంగ్త్, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటివి గమనించడం కష్టతరంగా మారిందని అంపైర్లు వాపోయారు. దీంతో ఈ బాధ్యతను థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని పలువురు సూచించారు. దీంతో నోబాల్ అంశాన్ని కొన్ని నెలల పాటు థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని ఐసీసీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ ఆసీస్ అంపైర్ సైమన్ టఫెల్ పెదవి విరిచాడు. ఇప్పటికే డీఆర్ఎస్, రనౌట్స్ వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న థర్డ్ అంపైర్లపై ఈ నిబంధన మరింత భారం పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మరో ప్రత్యామ్నాయం చూస్తే బెటర్ అని సూచించాడు. ఇక ఈ ట్రయల్స్ విజయవంతం అయితే భవిష్యత్‌లో నోబాల్స్‌కు సంబంధించి పూర్తి బాధ్యతలు థర్డ్ అంపైర్‌కే అప్పగించే అవకాశం ఉంది. -
భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలైట్ ప్యానల్లో చేరేందుకు భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుందని రిటైర్డ్ అంపైర్ సైమన్ టౌఫెల్ అన్నాడు. మంగళవారం ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నాడు. ‘ప్రపంచ స్థాయి అంపైర్ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్‌లో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించాం. ఎలైట్ ప్యానల్లో అడుగుపెట్టడానికి భారత్ నుంచి అంపైర్ ఎస్.రవికి కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలి. భారత్‌కు అంపైర్లు అవసరం. దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయంపైనా దృష్టి పెట్టాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్ల కోసం ప్రత్యేకంగా మేనేజర్లు, కోచ్‌లు, ట్రైనర్లను నియమించాలి’అని పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఎలైట్ ప్యానల్లో 2015లో చోటు దక్కించుకున్న రవి విధుల్లో పదే తప్పులు చేస్తుండడంతో ఈ ఏడాది మొదట్లో తొలగించారు. రవి యాషెస్ సహా 33 టెస్ట్‌లు, 48 వన్డేలు, 18 టీ20లకు అంపైర్ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 15 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 2004 నుంచి 2008 వరకు నంబర్ వన్ అంపైర్‌గా కొనసాగిన ఈ 48 ఆస్ట్రేలియన్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా సేవలందించాడు. -
వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి, బుమ్రా టాప్
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నెం-1గా, ఆల్ రౌండర్ల విభాగంలో భారత్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 895 పాయింట్లతో కోహ్లి మొదటిస్థానంలో ఉండగా.. 863 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో 797 పాయింట్లతో బుమ్రా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా నెం.2 ర్యాంకులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ 319 పాయింట్లతో నెం.1 ర్యాంకులో నిలవగా, ఆఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండవ స్థానంలో నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు.. తర్వాత ఆ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ సిరీస్ తర్వాత డిసెంబర్లో వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ-20సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
ఐసీసీ తీసుకున్న ఆ నిర్ణయం సూపర్: సచిన్
ముంబై: క్రికెట్లో సూపర్ ఓవర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ప్రపంచకప్ సెమీస్, పైనల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడిస్తామని ఐసీసీ సోమవారం స్పష్టం చేసింది. బోర్డు మీటింగ్‌లో పలు చర్చల అనంతరం ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ టై అయితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు. అయితే, ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడించాలని ఇంతకుముందే సూచించిన సచిన్.. నిబంధనలో సవరణ చేసినందుకు ట్విట్టర్ వేదికగా ఐసీసీని ప్రశంసించారు. ‘సూపర్ ఓవర్లు చాలా ముఖ్యం. రెండు జట్ల స్కోర్లు టై అయినపుడు ఫలితాన్ని నిర్ణయించడంలో ఇదే సరైన మార్గం. ఐసీసీకి ధన్యవాదాలు’ అని సచిన్ అభినందించాడు. ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీ లు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ను నిర్వహించాలని మాజీ క్రికెటర్లు చాలా మంది సూచించారు. ఇందులో సచిన్ కూడా ఉన్నాడు. దీంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సూపర్ ఓవర్ నిబంధనలపై ఐసీసీ ఓ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్ లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. -
ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్..
దుబాయ్: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా! న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య హోరాహోరీ పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇదీ ‘టై’ కాగా బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతను చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగు వేసింది. తాజాగా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ ‘టై’ అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని నిర్ణయించింది. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. కానీ... ఆ సూపర్ ‘టై’ అయితే మ్యాచ్‌ను ‘టై’గా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. జింబాబ్వే, నేపాల్ జట్లపై విధించిన నిషేధాన్ని కూడా ఐసీసీ ఎత్తేసింది. మహిళల మెగా ఈవెంట్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. టి20 ప్రపంచకప్ విజేతకు 10 లక్షల డాలర్లు (రూ.7 కోట్లు), రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3.5 కోట్లు) ఇస్తారు. వన్డే ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీని 3.5 మిలియన్ డాలర్లు (రూ.24.8 కోట్లకు) పెంచింది. 2021 నుంచి అండర్–19 మహిళల టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. -
ధనంజయపై నిషేధం
దుబాయ్: శ్రీలంక ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అకిల ధనంజయపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏడాది నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలే దీనికి కారణమని పేర్కొంది. స్వతంత్ర విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. గత నెలలో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగస్టు 29న చెన్నైలో విచారణకు హాజరయ్యాడు. అందులోనూ సందేహాస్పదంగా తేలడంతో నిషేధం తప్పలేదు. గతేడాది నవంబర్లోనే ధనంజయ సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. లోపాలను దిద్దుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దానిని ఎత్తివేశారు. రెండేళ్ల వ్యవధిలో యాక్షన్‌పై రెండుసార్లు సందేహాలు రావడంతో నిషేధం తప్పనిసరైంది. ఈ గడువు తర్వాత తన బౌలింగ్ శైలి పరిశీలనపై ధనంజయ ఐసీసీని ఆశ్రయించవచ్చు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి సచిన్ టెండూల్కర్
లండన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా పేసర్ క్యాథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్లకు సైతం ఈ గౌరవం లభించింది. లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరి పేర్లను జాబితాలో చేర్చారు. టెస్టులు (200 మ్యాచ్‌లు 15,921 పరుగులు), వన్డే (463 మ్యాచ్‌లు 18,426 పరుగులు)ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సచిన్... భారత్ నుంచి ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’ ఘనత అందుకున్న ఆరో క్రికెటర్. అతడి కంటే ముందు బిషన్ సింగ్ బేడీ (2009), సునీల్ గావస్కర్ (2009), కపిల్ దేవ్ (2010), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018)లకు చోటుదక్కింది. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై అయిదేళ్లు పూర్తయినందున సచిన్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అర్హత లభించింది. అతడు 2013 నవంబరులో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ‘తరతరాలుగా ఎందరో క్రికెటర్లను వరించిన ఈ ఘనత నాకు గౌరవప్రదమైనది. వారంతా ఆటను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రయత్నించారు. అందులో నా పాత్ర కొంత ఉన్నందుకు సంతోషం’ అని సచిన్ పేర్కొన్నాడు. ‘ఈ ముగ్గురూ అత్యున్నత ఆటగాళ్లు. వారికి 2019 హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఐసీసీ తరఫున వారికి అభినందనలు’ అని ఐసీసీ సీఈవో మను సాహ్ని పేర్కొన్నాడు. ► అలెన్ డొనాల్డ్... దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్‌గా దశాబ్దం పాటు సేవలందించాడు. గొప్ప బ్యాట్స్‌మెన్‌ను సైతం ఇబ్బంది పెట్టే బౌలర్‌గా పేరుగాంచాడు. 2004లో రిటైరయ్యాడు. 72 టెస్టుల్లో 330, 164 వన్డేల్లో 272 వికెట్లు పడగొట్టాడు. సఫారీ జట్టు అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంలోనే బలమైనదిగా నిలవడంలో డొనాల్డ్ కీలక పాత్ర పోషించాడు. ► హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎక్కిన 8వ మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్. ఆస్ట్రేలియాకు 16 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆమెకు వేగవంతమైన బౌలర్‌గా పేరుంది. వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టిన ఫిట్జ్ రెండేళ్ల క్రితం వరకు ఆ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఆసీస్ మహిళల జట్టు 1997, 2005 ప్రపంచ కప్‌లు గెలవడంలో ప్రధాన భూమిక ఈమెదే. 2012– 15 మధ్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫిట్జ్... తమ దేశానికి వన్డే ప్రపంచ కప్, రెండు టి20 ప్రపంచ కప్‌లు దక్కడంలో పాలుపంచుకుంది. -
ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఆమోదముద్ర వేసింది. వార్షిక సమావేశంలో భాగంగా ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కేవలం టెస్టుల్లోనే అమలు చేయాలని భావించినా.. మెజారిటీ సభ్యుల విన్నపం మేరకు అన్ని ఫార్మట్లకు వర్తింపచేస్తూ నిబంధనలను రూపొందించింది. దీనిపై పూర్తి అధికారం మ్యాచ్ రిఫరీకే ఉంటుందని ఐసీసీ తేల్చిచెప్పింది. మ్యాచ్ మధ్యలో ఏ జట్టైతే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కోరుతుందో.. ఆ జట్టు డాక్టర్ చేత ఆటగాడి గాయానికి సంబంధించిన వివరాలతో కూడిన రిపోర్టును మ్యాచ్ రిఫరీకి అందజేయాలి. రిఫరీ ఆమోదం తెలిపాకే కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి లభిస్తుంది. ఇక ఈ విధానం యాషెస్ సిరీస్ నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేసి, దేశవాళీ క్రికెట్లో అమలు చేసి విజయవంతం అయ్యాకే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశపెడుతున్నామని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఐసీసీ ఆమోదం తెలపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఆనందం వ్యక్తం చేశాయి. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. -
ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్ నుంచే అమలు!
లండన్: ఈ నెల చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో 2017 నుంచే సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్ షిప్’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్ సిరీస్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని అనుకుంటోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ వార్షిక సమావేశంలో చర్చించనుంది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా తలకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
భారత్‌ను ఓడించడం కష్టం
సాక్షి, ముంబై : రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోందని పేర్కొ న్నారు. ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లా డారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సైతం పటిష్ఠంగా ఉన్నాయని డేవ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో జరిగే ఈ ప్రపంచకప్‌లో 1992లో మాదిరి రౌండ్ రాబిన్ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రపంచ విజేత ఎవరో ఊహించడం కష్టం. నిజం చెప్పాలంటే భారత్ అత్యద్భుతంగా ఆడుతోంది. ఈ మధ్య కాలంలో టీమిండియాలో మెరుగు దలను చూస్తుంటే ఆ జట్టును ఓడించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా సైతం అదరగొడు తోంది. ’ అని రిచర్డ్సన్ తెలిపారు. ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో స్నేక్ పద్ధతిని అనుసరించడంతోనే లీగ్ దశలో భారత్, పాక్ తలపడే అవకాశం రాలేదని డేవ్ అన్నారు. ర్యాంకుల ప్రకారం వరుసగా ఒక్కో జట్టును రెండు గ్రూపుల్లో అమర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బహుశా ఈ రెండు జట్లు సెమీస్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుందన్నారు. -
పాక్ కెప్టెన్‌పై వేటు
దుబాయ్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిబంధనావళిని అతిక్రమించిన సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు దూరమవనున్నాడు. దీంతో పాక్ సీనియర్ ఆటగాడు షోయాబ్ మాలిక్ తాత్కాలిక సారథిగా వ్యహరించనున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, కుటుంబం సభ్యులపై గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది. (‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’) అసలేం జరిగిందంటే..? డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో క్రీడా సూర్తిని మరిచి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడటం స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. (పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!) దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
కోహ్లికి సముచిత గౌరవం!
క్రికెట్ ప్రపంచంలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత స్టార్ విరాట్ కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సముచిత రీతిలో గౌరవించుకుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు సాధిస్తున్న విరాట్‌ను మూడు ప్రధాన అవార్డులకు ఎంపిక చేసి అవార్డుల విలువను పెంచింది. టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించడంతో రెండు ఫార్మాట్లలోనూ ఉత్తమ క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి సహజంగానే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మరో సందేహం లేకుండా టెస్టు, వన్డే జట్లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దుబాయ్: 13 టెస్టుల్లో 55.08 సగటుతో 5 సెంచరీలు సహా 1322 పరుగులు... 14 వన్డేల్లో ఏకంగా 133.55 సగటుతో 6 సెంచరీలు సహా 1202 పరుగులు... వీటికి అదనంగా 10 అంతర్జాతీయ టి20ల్లో కలిపి 211 పరుగులు... ఈ అద్భుత గణాంకాలు 2018ని కోహ్లినామ సంవత్సరంగా మార్చేశాయి. అతడిని ప్రతిష్టాత్మక అవార్డులకు అర్హుడిగా చేశాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన 2018 వార్షిక పురస్కారాల్లో విరాట్ కోహ్లి మూడు ప్రధాన అవార్డులకు ఎంపికయ్యాడు. అన్ని ఫార్మాట్లలో చెలరేగినందుకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) వరుసగా రెండో ఏడాది కోహ్లిని వరించింది. 2017లో కూడా అతను ఇదే అవార్డు సాధించాడు. ఇప్పుడు టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులనూ కోహ్లినే గెలుచుకున్నాడు. ఐసీసీ చరిత్రలో ఒకే ఏడాది మూడు ప్రధాన అవార్డులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలవడం విశేషం. గత ఏడాది భారత జట్టు ఉపఖండం బయటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటాన్ని బట్టి చూస్తే కోహ్లి సాధించిన ఘనత అసమానం. రెండు ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లలో కూడా కోహ్లి నంబర్‌వన్‌గా 2018ని ముగించాడు. మాజీ క్రికెటర్లు, సీనియర్ జర్నలిస్ట్‌లు, విశ్లేషకులతో కూడిన 36 మంది సభ్యుల ఎంపిక ప్యానెల్ ఏకగ్రీవంగా కోహ్లికి ఓటు వేసింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ద ఇయర్, వన్డే టీమ్ ద ఇయర్లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పంత్ సూపర్... టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు. ఇందులో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో చేసిన సెంచరీ సైతం ఉంది. అతను 40 క్యాచ్‌లు అందుకోవడం అవార్డు ఎంపికకు కారణమైంది. ఇదే ప్రదర్శనతో ఐసీసీ టెస్టు జట్టు కీపర్‌గానూ పంత్ ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు స్థానం లభించింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఫించ్ ఫటాఫట్... హరారేలో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్‌పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్–19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది. ►1 ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని రెండోసారి నెగ్గిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతేడాది కూడా కోహ్లికి ఈ అవార్డు లభించింది. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016) ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు. ►1 ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికైన తొలి భారత క్రికెటర్ కోహ్లినే. ధోనికి (2008, 2009) రెండుసార్లు ఈ అవార్డు వచ్చింది. ►5 ఐసీసీ ‘టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన ఐదో భారత క్రికెటర్ కోహ్లి. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), గంభీర్ (2009), సెహ్వాగ్ (2010), అశ్విన్ (2016) ఈ ఘనత సాధించారు. చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సంవత్సరం మొత్తం చేసిన కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు ఇది. వ్యక్తిగతంగా చాలా గొప్పగా అనిపిస్తుండటమే కాదు... నేను బాగా ఆడుతున్న సమయంలోనే జట్టు కూడా మంచి ఫలితాలు సాధించడం పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందరో ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై ఆడుతున్నప్పుడు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం అంటే ఒక క్రికెటర్‌గా ఇది నేను గర్వపడే క్షణం. ఈ రకమైన ప్రోత్సాహం ఇదే ఘనతను పునరావృతం చేసేందుకు కావాల్సిన స్ఫూర్తినందిస్తుంది. క్రికెట్ ప్రమాణాలను నిలబెట్టేందుకు, మరింత నిలకడగా రాణించేందుకు ఇలాంటివి అవసరం. – కోహ్లి, భారత కెప్టెన్ -
కోహ్లినే సారథి.. పంత్‌కు భలే అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ అరంగేట్ర ఏడాదే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన పంత్.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ‘ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’లో పంత్ చోటు దక్కించుకున్నాడు. 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ టెస్టు జట్టులో చోటు కల్పించింది. దీనికి సంబంధించి ఐసీసీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇక టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018 జట్టుకు ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లినే సారథిగా ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో మరో భారత ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. కాగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చటేశ్వర పుజారాకు అవకాశమివ్వకపోవడం గమనార్హం. టెస్టు జట్టులో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్(న్యూజిలాండ్), కరుణరత్నే (శ్రీలంక), కగిసో రబడా(దక్షిణాఫ్రికా), నాథన్ లియోన్(ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), మహ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)లు చోటు దక్కించుకున్నారు. అయితే ఇంగ్లండ్ టెస్టు సారథి జోయ్ రూట్‌తో పాటు మరే ఇతర బ్రిటీష్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో కోహ్లి, పంత్, బుమ్రా, పుజారా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్న కోహ్లి.. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు రాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పుజారా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్‌పై చివరి టెస్టుల్లో శతక్కొట్టిన పంత్ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లోనూ కోహ్లినే కింగ్ ‘ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’కు కూడా విరాట్ కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక వన్డే జట్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాలు చోటు లభించింది. బెయిర్‌స్టో, జోయ్ రూట్, బట్లర్, బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), ముస్తఫిజుర్ రహ్మాన్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (ఆఫ్గనిస్తాన్)లు ఐసీసీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. It's time to reveal the ICC Test Team of the Year 2018! Press START to play! 🏏🎮 ➡️ https://t.co/ju3tzAxwc8#ICCAwards 🏆 pic.twitter.com/EowPQ14t2a — ICC (@ICC) 22 January 2019 Presenting the ICC Men's ODI Team of the Year 2018! 🏆 🇮🇳 @ImRo45 🏴 @jbairstow21 🇮🇳 @imVkohli (c) 🏴 @root66 🇳🇿 @RossLTaylor 🏴 @josbuttler (wk) 🏴 @benstokes38 🇧🇩 @Mustafiz90 🇦🇫 @rashidkhan_19 🇮🇳 @imkuldeep18 🇮🇳 @Jaspritbumrah93 ➡️ https://t.co/EaCjC7szqs#ICCAwards 🏆 pic.twitter.com/dg64VGuXiZ — ICC (@ICC) 22 January 2019 -
పండగ చేసుకుంటున్న ధోని అభిమానులు
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారిక ట్విటర్ ఆకౌంట్ కవర్ ఫోటోగా ధోని చిత్రాన్ని పెట్టుకుంది. ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో ధోని అద్భుత ఆటతీరుకు గుర్తుగా ఐసీసీ ట్విటర్లో ధోని కవర్ ఫోటో పెట్టినట్టు వివరించింది. దీంతో జార్ఖండ్ డైనమెట్ అభిమానులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ట్విటర్‌కు సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా గొప్ప వ్యక్తి ఫోటోను ఐసీసీ తన ట్విటర్ కవర్ ఇమేజ్‌గా పెట్టుకుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఐసీసీ ధోని ఆటను గుర్తించిందని.. కానీ విమర్శకులు గర్తించారో లేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లి సేన ఆస్ట్రేలియాపై చారిత్రక వన్డే సిరీస్ గెలవడంతో ధోని కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. వరుస మూడు ఆర్దసెంచరీలతో అదరగొట్టిన ధోని ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కూడా కైవసం చేసుకున్నాడు. ఆసీస్‌పై ధోని ఆడిన అద్వితీయమైన ఆటతీరుతో రిటైర్మెంట్ తీసుకోవాలంటూ విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించాడు. 37ఏళ్ల ఈ వెటరన్ ఆటగాడు ఇప్పటివరకు 335 వన్డేల్లో 50కి పైగా సగటుతో 10,366 పరుగులు చేశాడు. ఇందులో పది శతకాలు, 70 అర్ద సెంచరీలు ఉన్నాయి. కీపింగ్‌లోనూ ఎదురు లేని ధోని ఇప్పవటివరకు వన్డేల్లో 311 క్యాచ్‌లు, 117 స్టంపింగ్స్ చేశాడు. ఇక ఆసీస్ పర్యటన విజయవంతంగా ముగించుకున్న టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. కివీస్ పర్యటనలో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. -
‘టెన్ ఇయర్ చాలెంజ్’.. ఐసీసీ ట్వీట్ వైరల్
ప్రతీ ఒక్కరికీ గడిచిన క్షణాలను నెమరువేసుకోవడం ఓ సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. ఐస్ బకెట్, కికీ, ఫిట్నెస్, తదితర చాలెంజ్‌లు ప్రపంచాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే ‘టెన్ ఇయర్ చాలెంజ్’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేయాలి. ఇక ఇప్పటికే సినీతారలు, నెటిజన్లు తమ ఫోటోలను షేర్ చేస్తూ, పదేళ్లలో తమ జీవితంలో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా తమ సన్నిహితులకు, స్నేహితులకు చాలెంజ్ విసురుతున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కూడా ‘టెన్ ఇయర్ చాలెంజ్’ను స్వీకరించి తమ అధికారిక వెబ్ సైట్లో పలు ఫోటోలను షేర్ చేసింది. పదేళ్ల క్రితం నాటి క్రికెట్ అనుభూతులను గుర్తు చేస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పదేళ్ల క్రితం అంటే 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా.. 2019లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ షేర్ చేసింది. 2009లో టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చందర్‌పాల్ ఉండగా, ప్రస్తుతం టీమిండియా సారథి విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ టాప్ ప్లేస్‌లో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఐసీసీ చేసిన ట్వీట్ చూసి పదేళ్ల క్రితం క్రికెటర్లను గుర్తు చేసుకుంటున్నామని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. The @MRFWorldwide ICC Test Batting Rankings, then and now!#2009vs2019 #10YearChallenge pic.twitter.com/7OcV2zEteV — ICC (@ICC) 16 January 2019 The @MRFWorldwide ICC Test Bowling Rankings, then and now!#2009vs2019 #10YearChallenge pic.twitter.com/B519NAinN8 — ICC (@ICC) 16 January 2019 -
పాక్ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్
లండన్: పాకిస్థాన్ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్ వాచ్‌లతో ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్ హసన్ అలీ మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు ఇంగ్లాండ్ టూర్లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిటెస్ట్ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్ టీమ్‌కు ఆదేశాలు అందాయి. పాక్ టీమ్ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్లో స్మార్ట్ వాచ్‌ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్(కమ్యూనికేషన్‌కు సంబంధించి) డివైజ్‌లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడటం, పాక్ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. The ICC has confirmed that smart watches are not allowed on the field of play or areas designated as the Player and Match Officials Area (PMOA).https://t.co/MAv4mRNAqv pic.twitter.com/tYgDi1LJwn — ICC (@ICC) 25 May 2018 -
టీ20ఫార్మాట్లో చాంపియన్స్‌ట్రోఫీ!
సాక్షి, స్కూల్‌ఎడిషన్: భారతగడ్డపై 2021లో జరిగే చాంపియన్స్‌ట్రోఫీని పొట్టిఫార్మాట్లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వన్డే ఫార్మాట్ కన్నా టీ20 మ్యాచ్‌లుగా టోర్నీని జరిపితే మరింత లాభదాయకంగా ఉంటుందని ఐసీసీ ఆలోచనగా ఉంది. మరోవైపు కేంద్రప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు రాకపోతే ఈ టోర్నీని 2021లో భారతగడ్డపై నిర్వహించడం సందేహంగా మారనుంది. ప్రపంచశ్రేణి టోర్నీ అయిన చాంపియన్స్‌ట్రోఫీని భారత్‌లో నిర్వహించడం ద్వారా పలు పన్ను మినహాయింపుల్ని ఐసీసీ కోరుతుంది. అయితే ఈ విషయంపై కేంద్రంతో బీసీసీఐ చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని ఐసీసీ కోరుకుంటోంది. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే వచ్చే ఎడిషన్‌ను ఇతర దేశాల్లో నిర్వహించే అంశంపై ఐసీసీ కసరత్తు చేస్తోంది. భారత్‌కు చెందిన టైమ్జోన్లోనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలలో చాంపియన్స్‌ట్రోఫీని నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదాయ పంపిణీపై ఐసీసీపై గుర్రుగా ఉన్న బీసీసీఐకి తాజా పరిణామాలు మరింత ఆజ్యం పొస్తాయనడంలో సందేహంలేదు. పన్ను మినహాయింపులకు నో.. మరోవైపు భారతగడ్డపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు కేంద్ర ప్రభుత్వం పన్నుమినహాయింపులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఈక్రమంలో మినహాయింపులపై ఐసీసీ, టోర్నీ ప్రసారదారు స్టార్ నెట్వర్క్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం తిరస్కరించింది. దీంతో మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం టీడీఎస్‌గా కేంద్రానికి స్టార్ నెట్వర్క్ చెల్లించింది. మరోవైపు ఐసీసీకి ఇవ్వాల్సిన మొత్తంలో ఈ మేరకు కోత విధించింది. అనంతరం టోర్నీకి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఐసీసీకి భారత ఆదాయపన్నుశాఖ తెలిపింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఐసీసీ స్పందన లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు గతేడాది భారత్‌లో నిర్వహించిన ఫిపా అండర్–17 ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపులిచ్చి తమకు ఇవ్వకపోవడంపై ఐసీసీ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దీంతో చాంపియన్స్ట్రోఫీతోపాటు భవిష్యత్తులో ప్రపంచకప్‌లు భారతగడ్డపై నిర్వహించడ సందిగ్ధంలో పడినట్లయ్యింది. దాల్మియాకు గుర్తుగా.. మరోవైపు ఈ టోర్నీ ఫార్మాట్‌ను మార్చడం బీసీసీఐకి సుతారమూ ఇష్టం లేదు. దివంగత బోర్డు ఆధ్యక్షుడు జగ్మోహన్దాల్మియా విజన్‌కు గుర్తుగా రూపొందించిన ఈ టోర్నీలో మార్పులకు బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో ఐసీసీ ప్రతిపాదనకు మెగ్గు చూపేదీ లేదని బోర్డు వర్గాలు ఈ సందర్భంగా పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు బోర్డుకు దాల్మియా చేసిన సేవలకుగాను వచ్చే ఎడిషన్ ఫైనల్‌ను దాల్మియ సొంతగడ్డ కోల్‌కతాలో నిర్వహించాలని బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. -
కొత్త కుంపటి సాధ్యమా?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పోటీగా ఒక కొత్త సంస్థ తయారు కాబోతోందని, ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఒక కంపెనీ పేరును రిజిస్టర్ చేసి క్రికెటర్లను సంప్రదిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ క్రికెట్లీగ్ (ఐసీఎల్) నిర్వహించిన సుభాష్ చంద్ర దీని వెనక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్లో అత్యంత శక్తివంతమైన ఐసీసీ, బీసీసీఐలని కాదని కొత్త కుంపటి సాధ్యమేనా? సాక్షి క్రీడావిభాగం : ప్రస్తుతం క్రికెట్‌ను పూర్తిగా నియంత్రిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో కీలకం. మిగిలిన టెస్టు దేశాల దగ్గర పెద్దగా ఆదాయం, పవర్ లేదు. కాబట్టి ఈ మూడు దేశాలదే పూర్తిగా ఐసీసీలో ఇష్టారాజ్యం. పాకిస్తాన్‌తో పాటు దక్షిణాఫ్రికా లాంటి క్రికెట్ బోర్డులకు ఇది పెద్దగా రుచించని అంశం. అయినా ఐసీసీతో జగడానికి దిగలేరు. కారణం... ఆ దేశాల్లో ఉన్న మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం స్వల్పం. ఐసీసీ నుంచే వాటా రావాలి. కాబట్టి మిగిలిన దేశాలన్నీ ఐసీసీ ఏం చెప్పినా తలూపడం తప్ప మరేం చేయలేవు. క్రికెట్ చాలా పెద్ద వ్యాపారం. ప్రతి ఏటా వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. టీవీల ద్వారా వచ్చే ఆదాయం ఒక్క ఐసీసీకే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల పైన ఉంటుంది. మిగిలిన దేశాలన్నీ వాళ్ల క్రికెట్‌ను భారీ రేట్లకే అమ్ముకుంటాయి. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ ప్రసారం కోసం టీవీ సంస్థలు బాగా పోటీ పడతాయి. ప్రస్తుతం స్టార్ సంస్థ భారత్‌లో అన్ని మ్యాచ్‌లతో పాటు ఐసీసీ మ్యాచ్‌ల ప్రసార హక్కులను తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క ఐపీఎల్ మినహా ప్రధాన క్రికెట్ అంతా స్టార్ గ్రూప్ దగ్గరే ఉంది. 2018 నుంచి ఐపీఎల్ కూడా స్టార్ ఖాతాలోకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతగా గుత్తాధిపత్యం ఒక్క సంస్థకే ఉంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి. దీంట్లోంచి పుట్టిన ఆలోచన రెబల్ లీగ్. అంత సులభం కాదు... ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం కొత్త సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుని ఒక టి20 లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ముందు క్రికెటర్లు అంగీకరించాలి. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రస్తుత జాతీయ జట్లలో ఉన్న క్రికెటర్లు ముందుకు రావాలి. ధోని, కోహ్లి, స్మిత్, వాట్సన్, మెకల్లమ్, గేల్... ఇలా పెద్ద ఇమేజ్ ఉన్న క్రికెటర్లు భారీ సంఖ్యలో కొత్త సంస్థతో చేరాలి. ఏ క్రికెటర్ అయినా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ దేశ బోర్డు నుంచి వేటు పడుతుంది. అయినా సిద్ధమై భారీ మొత్తానికి ఆశపడి ముందుకు వచ్చినా కొత్త కుంపటి ఎంతకాలం ఉంటుందనే సందేహం వస్తుంది. కాబట్టి క్రికెటర్లు అంత తొందరగా రిస్క్ చేయరు. గతంలో ఐసీఎల్ సమయంలో డబ్బుకి ఆశపడి కొంతమంది యువ క్రికెటర్లు బయటకు వెళ్లి కెరీర్‌ను కోల్పోయారు. ఇది కొత్తేం కాదు... క్రికెట్ పాలకులకు పోటీగా కొత్తగా టోర్నీలు నిర్వహించడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1970వ దశకంలో వరల్డ్ సిరీస్ క్రికెట్ నిర్వహించారు. అలాగే 2007 నుంచి 2009 వరకు ఐసీఎల్ నిర్వహించారు. కానీ ఇవేవీ మార్కెట్లో నిలబడలేకపోయాయి. నిజానికి 2007లో సుభాష్ చంద్ర ఐసీఎల్ ప్రారంభించినప్పుడు... భారత్‌లో అదే మొదటి టి20 లీగ్. తొలి ఏడాది ఈ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. నిజానికి పెద్ద పేరున్న క్రికెటర్ల సంఖ్య స్వల్పంగానే ఉన్నా ఆదరించారు. అయితే 2008లో బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభించింది. ఐసీఎల్, ఐపీఎల్ రెండూ ఒకే మాదిరి లీగ్‌లు. ఐపీఎల్ అధికారిక లీగ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లంతా ఇందులో ఆడేందుకు క్యూ కట్టారు. దీంతో ఈ లీగ్ సూపర్ హిట్టయింది. పెద్ద క్రికెటర్లు ఉన్న లీగ్ అందుబాటులోకి రావడంతో సహజంగానే ఐసీఎల్పై ఆసక్తి తగ్గిపోయింది. క్రమంగా ఆ లీగ్ కనుమరుగైంది. ఎంతమంది వస్తారు? ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లోని టి20 లీగ్‌ల ద్వారా పెద్ద క్రికెటర్లందరికీ భారీగా ఆదాయం వస్తోంది. లీగ్‌లు, ఎండార్స్మెంట్లు కలిపి సాధారణ క్రికెటర్ కూడా ఏడాదికి నాలుగైదు కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి. ఒకవేళ కొత్త సంస్థ 10 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు ముందుకొచ్చినా క్రికెటర్లు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ కెరీర్ చివరి దశలో ఉన్న వాళ్లు ముందుకొచ్చినా... యువ క్రికెటర్లు ఆసక్తి చూపించకపోవచ్చు. స్టార్ క్రికెటర్లు లేకుండా ఏ లీగ్ కూడా ముందుకు సాగదు. సుదీర్ఘ ప్రక్రియ... ఒకవేళ ఎవరైనా ఐసీసీకి పోటీగా కొత్త సంస్థను ప్రారంభించాలంటే చాలా సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఇది సాధ్యం కాదు. ఇదో సుదీర్ఘ ప్రక్రియ. ప్రతి దేశంలోనూ సొంత స్టేడియాలు కావాలి. ప్రతిదేశంలో తమ ప్రతినిధులు ఉండాలి. ప్రతి రాష్ట్రంలోనూ క్రికెటర్లను తయారు చేయాలి. వీళ్లందరికీ సుదీర్ఘ కాలం ఆర్ధిక భద్రత కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. క్రికెట్ మార్కెట్ మీద ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన ఆలోచన కాదు.