సిరాజ్‌ మ్యాచ్‌ ఫీజులో కోత | Mohammed Siraj And Travis Head Penalised For Breaching The ICC Code If Conduct, More Details Inside | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ మ్యాచ్‌ ఫీజులో కోత

Published Tue, Dec 10 2024 4:53 AM | Last Updated on Tue, Dec 10 2024 9:22 AM

Mohammed Siraj, Travis Head penalised by ICC

ట్రవిస్‌ హెడ్‌కు డీమెరిట్‌ పాయింట్‌

భారత్, ఆసీస్‌ క్రికెటర్ల అనుచిత ప్రవర్తనపై ఐసీసీ చర్యలు

అడిలైడ్‌: మైదానంలో భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్‌ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్‌ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్‌ వైపు నడిచాడు. 

మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్‌ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. 

పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్‌ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్‌ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్‌ పాయింట్లకు గురైతే మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్‌ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు.  

సిరాజ్‌...ఏమైనా పిచ్చిపట్టిందా? 
సిరాజ్‌ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్‌ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్‌ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో  అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్‌ లేదంటే 10 పరుగుల లోపు అవుట్‌ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement