Disciplinary actions
-
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
తృణమూల్‌లో ట్వీట్ చిచ్చు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్ హకీమ్ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్నుంచి ఎవరో ఇదే ఈ్వట్ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలపై నేడు భేటీ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. -
తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌లో రాణిస్తున్న ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇందుకు కారణం గతంలో అతను చేసిన ఫ్రస్ట్రేషన్ ట్వీట్లే. లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రాబిన్సన్ 2012-13లో తన ట్విట్టర్ అకౌంట్లో జాత్యాంహకార, సెక్సీయెస్ట్ ట్వీట్లు చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాగా, న్యూజిలాండ్ సిరీస్‌కు రాబిన్సన్ ఎంపిక కాగానే కొందరు అప్పటి ట్వీట్లను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద రచ్చే అయ్యింది. ఇక జూన్ 3న ప్రారంభమైన తొలి టెస్ట్(మ్యాచ్ డ్రా అయ్యింది)కి ముందే ఈ వివాదంపై స్పందించిన రాబిన్సన్.. ‘‘నేను చేసిన పనికి బాధపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను’’ అని రాబిన్సన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. నా కెరీర్ అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఆ ట్వీట్లు చేశా, ఇంగ్లీష్ కౌంటీ యార్క్‌షైర్ నన్ను యుక్తవయసులో తరిమేసింది. ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ప్రజలకు, నా సహచర ఆటగాళ్లకు.. అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’’ అని రాబిన్సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే.. న్యూజిలాండ్‌తో గత బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో ఇంగ్లండ్ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన రాబిన్సన్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్‌పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు ‘రేసిజం కామెంట్లను ఏమాత్రం సహించబోము’’ అని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాబిన్సన్పై క్రమశిక్షణ చర్యల కింద ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఈ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ కెరీర్ సంగ్ధిగ్దంలో పడినట్లయ్యింది. చదవండి: ఏడేళ్ల గ్యాప్ తర్వాత టెస్ట్ -
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్ రూల్–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల కోసం 2017–18లో జరిపిన ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లడంపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శాఖాపరమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారనే ఆరోపణలూ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. 15 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలంది. లేనిపక్షంలో సంబంధిత అధికారి ఎదుట హాజరై తన వాదన వినిపించాలని సూచించింది. అలా చేయని పక్షంలో ఈ అభియోగాలను అంగీకరించినట్లుగా భావించి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’ -
ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు
న్యూఢిల్లీ: గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని లోక్‌సభ సాక్షిగా దేశభక్తుడని కొనియాడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను రక్షణ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్టుగా పార్టీ కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ దఫా పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో దుమారం ప్రజ్ఞా గాడ్సే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఆరెస్సెస్, బీజేపీ మనసులో ఉన్న మాటలనే ప్రజ్ఞా బయటకు చెప్పిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. స్పీకర్ ఆమె వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. ఇక దీనిపై సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజ్ఞా ఒక ఉగ్రవాది: రాహుల్ అంతకు ముందు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞాపై విరుచుకుపడ్డారు. ఆమెని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ‘ఒక ఉగ్రవాదైన ప్రజ్ఞా మరో ఉగ్రవాది గాడ్సేని దేశభక్తుడని చెబుతోంది. భారత పార్లమెంటులోనే ఇదో దుర్దినం. ఆమె వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్ అసలు సిసలు ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రజ్ఞాను జాతి క్షమించదని ఆమెను బీజేపీ ఎప్పుడు పార్టీ నుంచి తరిమేస్తుందని ప్రశ్నించారు. -
రమణ దీక్షితులుపై క్రమశిక్షణా చర్యలు: కేఈ
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు ఇటీవల చాలా తప్పులు చేశారని చెప్పారు. ఒక ప్రధాన అర్చకుడు రాజకీయాలు మాట్లాడటం ఆలయ నియమాలకు విరుద్ధమన్నారు. ఇంతవరకూ రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు.ఇప్పుడు హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తున్నందున ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాలపై తనిఖీకి ఆదేశిస్తామన్నారు. డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తామన్నారు. -
‘దంగల్’ సిస్టర్స్‌పై వేటు
న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్ఐ వీరి మీద వేటు వేసింది. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్ అయిన మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌తో చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీత కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూఎఫ్ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చర్యల వల్ల ఫోగట్ సిస్టర్స్ ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూఎఫ్ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్ సిస్టర్స్ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చెప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్ సింగ్ తెలిపారు. ఫోగట్ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ కడియాన్పైనా కూడా డబ్ల్యూఎఫ్ఐ నిషేధం విధించింది. నిషేధం గురించి నాకేం తెలియదు : బబిత అయితే ఈ విషయం గురించి బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్ఐ నాపై వేటు వేసిన సంగతి నాకు తెలియదు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు నాకు రాలేదు. నేను నేషనల్ కాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకాలి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యూఎఫ్ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్ క్యంప్కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియద’ని చెప్పారు. గీతా ఫోగట్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. -
అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది సర్వేలు కాదని...ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు. ('కోమటిరెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్తాడనుకోను' ) నకిరేకల్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఉత్తమ్ సర్వే చెప్పడం వల్లే తీవ్రంగా స్పందించానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే మొదటి సీటే నకిరేకల్ అని స్పష్టం చేశారు. తన వెనుక ఎవరు లేరని, తనపై విమర్శలు హాస్యాస్పదమని కొట్టిపడేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటున్న వారికి అనుభవం లేదని కోమటిరెడ్డి అన్నారు. ( నేను సీఎం అయ్యేది ఖాయం! ) -
పోలీస్ అయితే ఏంటీ?
► 200 మంది పోలీసులపై హెల్మెట్ కేసులు ► సిఫార్సులు తెస్తే ► క్రమశిక్షణ చర్యలు చెన్నై నలుమూలలా సుమారు 120 సెంటర్ల వద్ద కాపుకాసి మరీ ద్విచక్రవాహనదారులను పట్టుకుని కేసులు పెడుతున్నారు. చెన్నైలో సగటున రోజుకు మూడువేల కేసులు నమోదు అవుతున్నాయి. హెల్మెట్ కేసులపై రోజూవారి నివేదికలు ఇవ్వాలని చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, పోలీస్‌శాఖలోని కొందరు విధులకు వచ్చేటప్పుడు, విధుల నుంచి ఇంటికి వె వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో హెల్మెట్ ధరించని పోలీసు సిబ్బంది, పట్టుబడిన వారిని విడిపించాల్సిందిగా సిఫార్సులు చేసే అధికారులు, ఏ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగాన్ని ఆదేశించారు. ఎక్కువ శాతం మంది పోలీసులు హెల్మెట్ ధరించకుండా వెళుతున్నట్లు అదనపు నిఘాలో తేలింది. అలాగే కేసులు లేకుండా విడిపించాలని సైతం కొందరు అధికారులు సిఫార్సులు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. చట్టాని ధిక్కరించే వారు పోలీసులైనా సరే వదలవద్దని కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక హెల్మెట్ కేసుల నుంచి విముక్తికి సిఫార్సు చేసే పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ జార్జ్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్రవాహనదారులపై నిఘా పెంచగా రెండు వారాల్లో 200 మంది పోలీసులు పట్టుబడ్డారు. ముఖ్యంగా దక్షిణ చెన్నైలో 50 మంది పోలీసులు దొరికారు. వీరందరిపైనా కేసులు బనాయించడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ విభాగ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చెన్నైలో రెండు నెలల క్రితం 40 శాతం మంది ద్విచక్రవాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించేవారని చెప్పారు. తనిఖీలు పెరిగిపోవడంతో హెల్మెట్ ధరించే వారు 85 శాతానికి పెరిగారని, ఇది సంతోషించదగిన పరిణామమని తెలిపారు. నెలరోజులుగా రోజుకు ఆరువేల హెల్మెట్ కేసులు నమోదవుతుండగా, హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరగడంతో కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతూ రోజుకు మూడు వేలకు చేరుకున్నాయని చెప్పారు. హెల్మెట్ వాడకంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని, పోలీసు శాఖలో ఉంటూ హెల్మెట్ ధరించక పోవడాన్ని మరింత తీవ్రంగా పరిగణిస్తూ శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. కేసులు నమోదైన పోలీసులు ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
ఎస్కేయూ ఉద్యోగులకు మెమోలు జారీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని 77 మంది ఉద్యోగులకు మూకుమ్మడిగా మెమోలు జారీ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం వర్సిటీ పాలకభవనం బంద్ చేయించారు. దీంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ మెమోలు జారీ చేశారు. వర్సిటీలోని ఫైనాన్స్, ఇంజినీరింగ్, సీడీసీ డీన్, యూజీసీ డీన్, ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్, అకడమిక్ డీఆర్లు ఆయా విభాగాల్లోని ఉద్యోగులందరితో వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నకిలీ బదిలీ సర్టిఫికెట్లతో కోర్సుల్లో అడ్మిషన్ పొందిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు సురేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేసిన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సి.నరసింహారెడ్డి, నాయకుడు వై. భానుప్రకాష్‌రెడ్డి, పరిశోధక విద్యార్థి జి.జయచంద్రారెడ్డిలను సస్పెండ్ చేయాలని రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్‌కు సిఫార్సు చేశారు. ఇదే విషయంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డిపై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఏ తప్పూ చేయకపోయినా చర్యలు తీసుకోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎస్కేయూ ఉన్నతాధికారుల నిరంకుశవైఖరికి నిరసనగా సోమవారం నుంచి ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనబాట పట్టనున్నారు. -
టెన్త్ పరీక్షలు పూర్తి...
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 42,169 మందికి గాను 42,059 హాజరుకాగా 110 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ పరీక్షలకు గాను 1459 మందికి గాను 1369 మంది హాజరుకాగా 90 మంది పరీక్షలకు హాజరుకాలేకపోయారు. బుధవారం జరిగిన పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు బృగుమాహర్షి బీహెచ్‌ఇఎల్‌లోని జ్యోతి విద్యాలయంలోని రెండు పరీక్ష కేంద్రాలను, బెల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని, సెయింట్ ఆంథోని హైస్కూల్ అర్సి పురం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జ్యోతి విద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోని హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నాత బాలుర పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ రావు పరిశీలించారు. సెయింట్ ఆంధోని హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమిల్ నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోని తీసుకొచ్చినందుకు గాను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలిక విద్యాలయంలో పాఠశాల భవనం పనులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని అందుకు పనులు నిలిపివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాంట్రాక్టర్‌కు సూచించగా తాను పనులు నిలిపేది లేదన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష సమయంలో పనులు నిర్వహించడం వల్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఒక దశలో కాంట్రాక్టర్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు సమాచారం అందించడంతో వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. పలు పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్లకు జిల్లా విద్యాశాఖ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులపై ఫొటోలు పెట్టుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సరితా దేవిపై సస్పెన్షన్
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అనూహ్య నిర్ణయం న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది. వీరందరూ ఎలాంటి టోర్నమెంట్లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది నిర్ధారించలేదు. ఈ కేసును సమీక్షించాలని ఏఐబీఏ తమ క్రమశిక్షణ కమిటీని కోరడంతో... కొరియాలో జరగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరెవరూ పాల్గొనేందుకు వీలులేకుండా పోయింది. జరుగుతున్న పరిణామాలు తన దృష్టికి రాలేదని సరిత వెల్లడించింది. ఏఐబీఏ నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటానని తెలిపింది. మరోవైపు ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని కోచ్ సంధు అన్నారు. ‘ఏఐబీఏ నుంచి నోటీసు వచ్చింది. ఏడు రోజుల్లో దీనికి సమాధానం ఇవ్వాలి. దీని కోసం సిద్ధమవుతున్నాం’ అని సంధు పేర్కొన్నారు. నేపథ్యమిది మహిళల 60 కేజీల సెమీస్ బౌట్లో అద్భుతమైన ప్రదర్శన చూపిన సరితను కాకుండా జీ నా పార్క్ (కొరియా)ను రిఫరీలు విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై కలత చెందిన భారత బాక్సర్ పొడియం వద్ద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. మొదట తనకు లభించిన కాంస్య పతకాన్ని మెడలో వేసుకునేందుకు అంగీకరించని ఆమె... దాన్ని చేతితో తీసుకొని కన్నీళ్ల పర్యంతమవుతూ పార్క్ మెడలో వేసి వచ్చింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ మొత్తం ఉదంతంపై సరిత ఏఐబీఏకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పింది. నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోండి: శర్బానంద బాక్సర్ సరితా దేవిపై విధించిన నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్... భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆదేశించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఫోరం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘బాక్సర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించా. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఎంతవరకైనా వెళ్లండని చెప్పా’ అని మంత్రి పేర్కొన్నారు. -
అధికార ప్రతినిధిగా థరూర్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను పొగిడిన మాజీ మంత్రి శశిథరూర్‌పై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను తక్షణం అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చేసిన సిఫార్సుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం తెలిపారు. శశిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేరళ పీసీసీ ఫిర్యాదు చేసిందని పార్టీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేదీ విలేకరులకు తెలిపారు. మోదీని శశి కీర్తించడం కేరళ కాంగ్రెస్ కార్యకర్తల్ని బాధించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని ద్వివేదీ వెల్లడించారు. అయితే శశి పార్టీలోనే కొనసాగుతారని పార్టీ ప్రతినిధి శోభా ఓజా తెలిపారు. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆయన ఇంకా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధిష్టానం చర్యల్ని క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఆహ్వానిస్తున్నానని శశిథరూర్ చెప్పారు. -
సభలో ఆస్తుల రచ్చ
-వెల్లడించని అధికారులపై సభ్యుల ఆగ్రహావేశాలు - చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆస్తుల వివరాలను వెల్లడించని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేఏఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభకు తెలిపారు. ఇప్పటికే అలాంటి అధికారులకు నోటీసులను జారీ చేశామని చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరూ ఏటా డిసెంబరు 31లోగా ప్రభుత్వ నిర్ణీత నమూనాలో స్థిరాస్తి వివరాలను సమర్పించాల్సి ఉందని వెల్లడించారు. కేఏఎస్ అధికారులు మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 216 మంది ఐఏఎస్ అధికారులకు గాను 214 మంది, 143 మంది ఐపీఎస్ అధికారులకు గాను 113 మంది ఆస్తి వివరాలను సమర్పించారని తెలిపారు. 146 మందికి గాను 29 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఇంకా తమ స్థిర, చరాస్తుల వివరాలను సమర్పించ లేదని చెప్పారు. అలాగే 285 మంది కేఏఎస్ అధికారులకు గాను 184 మంది వివరాలు వెల్లడించ లేదని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఆస్తి వివరాలను సమర్పించని 14 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టామని, ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేశామని వివరించారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా సభ్యులు మాట్లాడుతూ, ఆస్తుల వివరాలను వెల్లడించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ అధికారుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే వారే ఆస్తుల వివరాలను వెల్లడించక పోవడం వారి అవిధేయతను చాటుతోందని తూర్పారబట్టారు. బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన సభ్యులు కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని సీఎంను కోరారు.