అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి | congress mla komati reddy slams uttam survey | Sakshi
Sakshi News home page

అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి

Published Sun, Feb 19 2017 3:09 PM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM

అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి - Sakshi

అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి

నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీకి కావాల్సింది సర్వేలు కాదని...ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు.

('కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను' )

నకిరేకల్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఉత్తమ్‌ సర్వే చెప్పడం వల్లే తీవ్రంగా స్పందించానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే మొదటి సీటే నకిరేకల్ అని స్పష్టం చేశారు. తన వెనుక ఎవరు లేరని, తనపై విమర్శలు హాస్యాస్పదమని కొట్టిపడేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటున్న వారికి అనుభవం లేదని కోమటిరెడ్డి అన్నారు.

( నేను సీఎం అయ్యేది ఖాయం! )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement